అరవై ఏళ్ల గర్భం

 

అరవై ఏళ్ల గర్భాన్ని

ఓపికగా మోస్తోంది తెలంగాణ

ఎన్ని నొప్పులు పడినా సరే 

బిడ్డ దక్కితే చాలు. 

34 thoughts on “అరవై ఏళ్ల గర్భం

  1. ఒకప్పుడు, “సందుకో రాష్ట్రమా” అని అయిష్టపడ్డ వాడినే, నేను కూడా, తెలంగాణా విషయంలో.
    తర్వాత కాలంలో, పుస్తకాలు చదివీ, వ్యాసాలు చదివీ, ఈ సమస్య పూర్వాపరాలు తెలుసుకునీ, నా అభిప్రాయం మార్చుకున్నాను. ఈ విభజన వల్ల, తెలంగాణా ప్రజల జీవితాలేమీ గొప్పగా అయిపోవు గానీ, ఇచ్చిన వాగ్ధానాలు అమలు చెయ్యకుండా చేస్తున్న అన్యాయాలు మాత్రం పోతాయి.

    ఈ తెలంగాణా విషయాన్ని, “గర్భం” తో పోలుస్తూ, రాసిన కవిత్వం నాకు నచ్చలేదు. ప్రకృతికి సంబంధించిన విషయం వేరే, సమాజానికి సంబంధించిన విషయం వేరే. ప్రకృతి కష్టం ఎప్పటికీ పోదు. సమాజ కష్టం అలా కాదు. బహుశా నాకు కవిత్వ జ్ఞానం తక్కువ కావడం వల్ల కామోసు, ఇలాంటి కవిత్వాలు నాకు నచ్చక పోవడానికి కారణం. అయినప్పటికీ, ఏదో ఒకటి అనిపించకపోవడం జరగదు కదా?

    “గర్భం” బదులు, కష్టపడి చదివి, పరీక్ష రాయడం, పాసవడం లేదా ఫెయిలవడం (ఎందుకంటే, పరీక్ష పేపరు చాలా కఠినంగా ఇవ్వడం వల్ల), లేదా, తమకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించడం, తమ హక్కుల కోసం తాము పోరాడ్డం లాంటి కవిత్వాలు కొంచెం అర్థవంతంగా అనిపిస్తాయి నాకు. అయినా, కవిత్వం గురించి నాకు పెద్ద తెలియదు లెండి.

    “తెలంగాణా” రాష్ట్రం తప్పకుండా వస్తుంది ఒక రోజు. దానికి నా సపోర్టు వుంది.

    పాఠకుడు

    • ప్రకాష్ గారూ,
      జై తెలంగాణా
      కె క్యూబ్ వర్మ గారూ,
      ఉద్యమం తీవ్రంగా ఉంది కదా విజయం సాధిస్తుంది.
      మౌళీ,
      మళ్ళీ చర్చ మొదలుపెట్టేలా ఉన్నారు.
      గుడిపాటి గారూ,
      తెలంగాణా గురించి రాసాననా మొదటి సారి నా బ్లాగ్ లో కామెంట్ పెట్టారు?చాలా సంతోషం.
      విజయా,
      థాంక్ యూ,
      పాఠకుడు గారూ,
      ఇది ఒక వ్యక్తీకరణ అనుకున్నా…మీరు చెప్పిన ఆలోచన కొత్త గానూ అర్ధవంతం గానూ ఉంది.కానీ కవిత్వం అలా పరిధుల్లోకి ఒదుగుతుందా ఏమో…నాకు కూడా కవిత్వ రచన మీద పెద్దగా అవగాహన లేదు.
      అఫ్సర్ గారూ,
      మీరు కవులు,విమర్శకులు కదా పాఠకుడి గారి అభిప్రాయం మీద మీ అవగాహన తెలుసుకోవాలని ఉంది.

  2. Vijayakumar Koduri:
    కవిత లో MALLESHWARI గారు చూపించిన concern కట్టిపడేసింది నన్ను…తన బ్లాగ్ లోని ఈ కవిత కింద ఎవరిదో వొక పోస్ట్ వుంది వర్మ గారూ
    “baby is ready to be delivered ) to be accepted without hyd (hands)
    also you got to explain why they deserve హైదరా…బాద్”

    సో..’సమైఖ్య ఆంధ్ర వుండాలి’ అంటే …FACT BEHIND THE SLOGAN ఇదన్న మాట….
    who deserves hyderabad? సరే…కాసేపు telangana does not deserve Hyderabad అనుకుందాం …
    హైదరాబాద్ ఇవ్వద్దులెండి….ఇంతకీ, తెలంగాణా కి ఇవ్వని హైదరాబాద్ ని ఏం చేయాలి ?….చాలా మంది (non-telangaanaa) చెబుతున్న సమాధానం …’కేంద్ర పాలిత ప్రాంతం’.[KPP]…అంటే…తె​లంగాణా రాష్ట్రం అడిగారు కాబట్టి తెలంగాణా వాళ్లకు ఈ శాస్తి జరగవలసిందే అనుకోవదమా …. లేక …హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారితే తెలంగాణా వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టొచ్చు అనుకోవదమా?…
    చుట్టూ తెలంగాణా జిల్లాలతో వున్న హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి ‘ఆ విధంగా ముందుకు సాగిపోవడం’ సాధ్యమయ్యే పనేనా?….. ఎందుకీ మాట అడగవలసి వొస్తున్నదంటే, ఇంత దూరం వొచ్చాక కూడా…ఇంకా ఈ ‘పుండు మీద కారం చల్లడం’ లాంటి మాటలు ఏమి సాధించడానికి?.. దాని బదులు రాష్ట్ర విభజన వీల్లేదనే మాట మీదే వుండడం గౌరవప్రదం….అలాగని తెలంగాణా వైపు నుంచి వొస్తున్న మాటలన్నీ గౌరవప్రదంగా ఉన్నాయనడం లేదు…కాకపోతే తెలంగాణా లో ఇన్నేళ్ళుగా ఉద్యమం చేసినా సాధించుకోలేకపోతున్నామన్న ఉక్రోషం వుంది..
    హైదరాబాద్ విషయమే వొస్తే… కొందరు non-telangaanaa వాళ్ళ కోరిక మేరకు దానిని KPP గా పెట్టేతట్టయితే…దాని సరిహద్దులు ఏమిటి? ….మేధావులు కొందరు చాలా సింపుల్ గా ‘గ్రేటర్ హైదరాబాద్’ అంటారు…అంటే అర్థం ఏమిటి?….తెలంగాణా పది జిల్లా లలో 50% ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ పేర KPP చేసి …తెలంగాణా ఇచ్చామని చెబుతారన్న మాట …’నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం’ అని వొక మాట వుంది….
    ఇష్టం లేని వాళ్ళు హుందాగా ‘తెలంగాణా ఇవ్వడానికి ససేమిరా అంగీకరించం’ అని హుందాగా చెప్పండి…..వొక అడుగు ముందుకు వేయాలనుకుంటే విభజన కు సంబంధించిన సందేహాలు, భయాలూ వగైరా అయినా చెప్పండి …

    idi facebook lo ee post daggara vijaykumar gaaru unchina comment…

      • హైదరాబాదు గురించి, రంగనాయకమ్మ గారు, ‘ఆంధ్ర జ్యోతి’ డైలీ, డిశంబరు 15, 2009 నాడు రాసినది:

        “‘హైదరాబాదుని తెలంగాణాకి ఇవ్వాలా, లేదా’ అనేది కూడా ఒక మెలిక. హైదరాబాదు, తెలంగాణా ఊరు. అది తెలంగాణాలో భాగం. తెలంగాణా ఊరుని, తెలంగాణా నించి విడదియ్యాలా? ఎందుకు? “మా ఆస్తుల్ని తెలంగాణా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది” అంటారు ఆంధ్రా బూర్జువాలు. అయితే, మీరు ఇన్నాళ్ళూ తెలంగాణాని ఇబ్బంది పెట్టారని అర్థమే కదా?

        “హైదరాబాదుని, ఆంధ్రకీ ఇవ్వకుండా, తెలంగాణాకీ ఇవ్వకుండా, కేంద్రం పాలనలో పెడితే బాగుంటుందా?” అని ఒక తెలంగాణా ప్యూనుతో అంటే, అతను తెల్లబోయి, “గా సంగతులు నాకు తెల్వది. అరె, హైద్రాబాద్‌ లేకుంటే ఇంక తెలంగాన ఏముంటదమ్మా?” అన్నాడు. ఇందులో న్యాయం లేదా?

        “హైదరాబాదుని మేం అభివృద్ధి చేశాం” అంటారు ఆ ఆంధ్రా బూర్జువాలే. వాళ్ళు అభివృద్ధి చేసుకున్నది, వాళ్ళ ఫాక్టరీల్నీ, వాళ్ళ కంపెనీల్నీ, వాళ్ళ వ్యాపారాల్నీ. అదంతా వాళ్ళు లాభాల కోసం గానీ, ఇంకెవరి కోసమో కాదు. ఏ పట్టణంలో రోడ్లని వెడల్పు చేసినా, ఎన్ని ఫ్లైవోవర్లు నిర్మించినా, అదంతా వారి బిజినెస్‌ల సదుపాయాల కోసమే. హైదరాబాదులో జనాభా పెరిగిందంటే, గ్రామాల్లో బతికే మార్గాలు లేక, ఇక్కడ పెరిగే ఫాక్టరీల్లో, కంపెనీల్లో, ఆఫీసుల్లో, చాకిరీలు చెయ్యడానికి రావడం వల్లే. కాబట్టి, అభివృద్ధి అనేది, ఎవరి కోసం వాళ్ళు చేసుకునేదే. అయినా, తెలంగాణా వస్తే, ఆ అభివృద్ధికేం హాని జరుగుతుంది? తెలంగాణా ఉద్యమకారులు, కమ్యూనిస్టు విప్లవకారులు కారు. వీరు కూడా అచ్చు ఆంధ్రా బూర్జువాల్లాంటి బూర్జువాలే. ఏ బూర్జువాలకైనా, ఆస్తి చాలా పవిత్రం. వారు ప్రాణాలైనా వదిలి, ఆస్తుల్ని రక్షిస్తారు. స్వంత ఆస్తుల్నే కాదు, పరుల ఆస్తుల్ని కూడా. కాకపోతే, ‘జాగో, భాగో’ నినాదాలు తాత్కాలిక డాంబికాలే.”

        పాఠకుడు

  3. జాజిమల్లి గారు,

    హ్మ్.. హైదరాబాదు లేకు౦డా అన్న స్థితి ని చేతులు లేకు౦డా అని పోల్చి, నా మద్దతును కూడా హైదరాబాదు ,తెల౦గాణాకే చె౦దాలని చెప్పాను కదా . కాకు౦టే సమైక్యవాదులకి కారణాలు కావాలి కాబట్టి నా ప్రశ్న!

    పైన Vijayakumar Koduri, సామాన్యుడుగారి అభిప్రాయ౦ తో పూర్తిగా ఏకీభావ౦ ఉ౦ది కాని సమైక్యవాదుల వాదనపైనే చర్చ జరగాల్సి ఉ౦ది. వారిని ఒప్పి౦చాకే కదా ప్రత్యేకరాష్ట్ర౦ ఏర్పడే వీలున్నది.

    నా అభిప్రాయ౦ ఈ టపా ద్వారా: http://teepi-guruthulu.blogspot.com/2011/07/blog-post_03.html

    • శ్రీనివాస్,
      బ్లాగ్ ఓపెన్ చేసినట్టున్నావ్…
      తెలంగాణా మీద డిబేట్ చేస్తున్న బ్లాగ్స్ చాలా ఉన్నాయి…బుక్స్ చాలా ఉన్నాయి.పైపై వాదాలు వద్దు.కొంచెం స్టడీ చేయి.అపుడు మాట్లాడదాం.ఒకప్పటి నా స్టూడెంట్ వే కదా అని ఈ సలహా…

  4. హైదరాబాద్ ఏ ఒక్కరి సోత్తూ కాదురా బయ్… ఇది అందరి ఉమ్మడి సోత్తు,

    జై సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్… జై తెలుగు సీమ

    ఏమి సాదించారో తెలియని ఆవేశపూరితులైన విద్యార్ధులు, మరెందరో ఆమాయక ప్రజల తాత్కాలిక ఆనందాన్ని గమనిస్తున్న సామాన్యుడి గుండె ఘోషయిది.
    రేపు ఊదయం చాల మాములుగానే తెల్లారుతుంది, రోడ్ల పై అవే గోతులు, నగరంలో అవే ట్రాఫిక్ కష్టాలు, ఇదే విద్యార్ధులు మరల ఊద్యోగాల వేటలో కంపనీలకు బయోడేటాలను పంపుతుంటారు. మరి ఏమిటి

    తెలంగాణా ప్రతిఫలం ? ఇది కాదు ఇందుకు వంద రెట్లు బిన్నంగా వుంటుంది అని ఒక్కరైనా భరోసా ఇవ్వగలరా ?
    తామరతంపరగా పెరిగిన రాజకీయ రాబందులకు నాలుగు కొత్త కొలువులు వస్తాయి. ఒక ముఖ్యమంత్రి పదవి మరికొన్ని మంత్రి పదవులు వస్తాయి. స్వార్ధపూరితులైన ప్రతి రాజకీయ నాయకులకు ఒక

    అవకాశం పెరుగుతుంది. అంతకు మించి సంబర పడుతున్న లక్షలాది మంది సంతోషానికి అర్ధం లేదు. ప్రజల తీర్పుకంటే స్వార్ధపరులయిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల దీక్ష గొప్పదని ఈ పరిణామాలు చెబుతున్నాయి.

    నిన్నగాక మొన్ననే జరిగిన ఎన్నికలలో ప్రజలు తెలంగాణకు మొగ్గు చూపలేదు. సమైక్యవాదనకే నిబద్దతతో నిల్చిన ఒక్క కారణంతో అనేక ఆరోపణలు వున్నా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి మద్దతు ఇచ్చారు.

    నిజానికి ఎవరు ఆంధ్రులు? ఎవరు తెలంగాణావారు ? 400 ఏళ్ల క్రితం ముస్లిం దండ యాత్ర పలితంగా ఏర్పడిన హైదరాబాద్ రాజ్యం లోని తెలుగుపరగణానే తెలంగాణా. ప్రతి ఒక్కడుతెలుగువారే.ఇది మొత్తం

    తెలుగు సీమ. ప్రతి తెలంగాణా వ్యక్తికి ఆంధ్ర నుండి కనీసం ఒక ఆప్తమిత్రుడున్నాడు ఆలాగే ప్రతి ఆంధ్ర వ్యక్తికి తెలంగాణాలో కనీసం ఒక ఆప్తమిత్రుడున్నాడు. అంత ఎందుకు ఈ రోజు ఒకే కుటుంబంలో రెండు

    ప్రాంతాల నుండి వ్యక్తులున్న కుటుంబాలు లెక్కలేనన్ని. ఆత్మగౌరవ నినాదంతో ఎగసిపడిన యన్.టి.ఆర్ ను గుర్తుచేసుకొని గర్వపడనివాడు, దేశానికీ ప్రధాని అయిన మొట్ట మొదటి తెలుగు వాడుగా మన

    పీ.వీ నీ తలచుకొని ఉప్పొంగని గుండె ఈ రాష్ట్రంలో లేదు. ఒకరినొకరు ఎన్నడు ఏ సందర్బంలోను అవమానపర్చుకోలేదు అంతగా కలిసిమెలసి జీవనం సాగిస్తున్నాము.

    రెండవ ప్రపంచ సంగ్రామ సమయంలో విడిపోయిన బెర్లిన్ నగరం మరల కలసిన దశాబ్ద సంబరాలను ఈమధ్యే అందరం చూసాము….కలయిక ఎవరికైన ఆనందమే…విడిపోవడం

    ఆవమానం….అంతకుమించిన బాధ. ఆయినా ఈ రాజకీయ నిరుద్యోగుల గాలానికి మనం అమాయక చేపల్లా చిక్కాము. తెల్లవారితే వున్న సమస్యల్లో ఒక్కటైనా తీర్చలేని తెలంగాణా ఎందుకో ఆర్ధం కాని

    సామాన్యులు అనేకమంది వున్నారు. రోడ్దేక్కే అర్హతే ఊధ్యమానికి కొలబద్దైతే ఎన్నికల ప్రక్రియకు అర్ధం లేదు.

    ఆమాయకులైన ప్రజలను రెచ్చగొట్టే ప్రక్రియ జరుగుతున్నపుడు మఅంచి చెడులను వివరంగా చెప్పాల్సిన రాజకీయ పార్టీలు ఘోరంగా విఫలం అవుతున్నాయి. ప్రతి పార్టీ ఇదివో సున్నితమైన సమస్య అంటూ

    రెండువైపుల చర్చలకు రాకుండా చేస్తున్నాయి. మరికొంత మంది ఆంధ్ర నాయకులు తమ పదవులకోసం స్వార్ధపూరితమైన స్వరముతో జైఆంధ్ర అంటూ పల్లవి ఆలపిస్తున్నారు.

    నాలాగే ఆవేదనతో రగిలే గుండెలు ఇప్పడు తెలంగాణా కోరుకుంటున్న వారికంటే ఎక్కువే. కాని జీవితంలో పెరిగిన ధరలతో, నిరంతర సమస్యలతో పోరాడే ఓపిక మాకు లేదు. ఈ దేశంలో మా ఘోష వినిపించే

    రాజకీయ నాయకులే లేరా ? మేము సామాన్యులం .. కానీ బలం ఏమిటో రెఫరెండం పెడితే తెలియజేస్తాం.కనీసం తెలంగాణా విషయంలోనైన రెఫరెండం పెట్టాలని మా ఆకాంక్ష. ఈ రాష్ట్రము తెలుగువారిది ఏ

    రాజకీయనాయకుడి మొండితనానికి తెగే గడ్డ కాదు అని మా అభిప్రాయాని తెలియజేయుటకు ప్రతిఒక్క తెలుగువాడు ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలి అని నా ప్రార్ధన.

    ఆంద్ర రాష్ట్ర ( తెలుగు సీమ) సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు
    ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.

    పొట్టి శ్రీరాములు కార్యదీక్షను చూసి గాంధీజీ ఇలా అన్నాడు: “శ్రీరాములు వంటి దీక్షాపరులు మరో పదిమంది ఉంటే, ఏడాదిలో స్వాతంత్ర్యం సాధించవచ్చు” కాని కే.సీ.ఆర్ లాంటి మొండి వాళ్ళు వుంటే ఎంతో

    సఖ్యతతోవున్న కుటుంబాన్నైనా విడదీయచ్చు. ప్రజలందరూ ఆలోచించండి.
    జై సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్… జై తెలుగు సీమ

    • సుబ్బు గారు, “హైదరాబాద్ ఏ ఒక్కరి సోత్తూ కాదురా బయ్… ఇది అందరి ఉమ్మడి సోత్తు, ” అని రాశారు. ఇది నిజం కాదు. తెలంగాణా, ఆంధ్రా కలిసి వుండని రోజుల్లో, అంటే, ఆంధ్రా మద్రాసు రాష్ట్రంతో కలిసి వుండే రోజుల్లో, హైదరాబాదు తెలంగాణాలో భాగమే. అది వారి ఊరే. అప్పట్లో, తెలంగాణా వేరేగా వుండేది.

      కలిసి వుందామనుకున్న రోజుల్లో, తెలంగాణా పెద్దలు ఒప్పుకోలేదు. ఆంధ్రా పెద్దలు అనేక వాగ్ధానాలు చేశారు. అప్పుడు తెలంగాణా పెద్దలు ఒప్పుకుని కలిశారు. ఆ షరతుల్లో, ఇష్టం లేకపోతే, విడిపోవచ్చనేది ఒక షరతు. అలా కలిశాక మాత్రమే, హైదరాబాదు ఉమ్మడి సొత్తయింది. అప్పటి వరకూ ఉమ్మడి సొత్తు కాదు. అప్పట్నించీ, ఆంధ్రా బూర్జువాలు, తమ లాభాల కోసం, హైదరాబాదుని అభివృద్ధి చేశారు.

      విడిపోదాం అనుకుంటున్న వాళ్ళని, ప్రేమతో, కొత్త వాగ్ధానాలతో కలిసి వుండేలా చేయగలరేమో గానీ, ఇలా ఆవేశ పూరితంగా విరుచుకు పడుతూ కాదు. విడిపోయే వాళ్ళని కలిసి వుండాలని శాసించే హక్కు ఎవరికీ లేదు. తమ తప్పులు ఒప్పుకుని, తమ పాత వాగ్ధానాలు తప్పకుండా అమలు చేస్తామని కొత్త వాగ్ధానాలు చేసి, తెలంగాణా వాదులని ఒప్పించచ్చేమో గానీ, సుబ్బు గారి మోసపూరిత, ఆవేశ పూరిత మాటలతో కాదు.

      రాజకీయ నాయకుల దోపిడీలు లేనివెక్కడా? ఆంధ్రాలో లేవూ? అవే రేపు, తెలంగాణా విడిపోయేక కూడా, తెలంగాణాలో కూడా వుంటాయి. అందుకని, విడిపోవద్దు అనే హక్కు ఎవరికీ లేదు. తెలంగాణా విడిపోవడం వల్ల, వాళ్ళ నీళ్ళు వాళ్ళకుంటాయి. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకుంటాయి. అంత వరకూ వాళ్ళకి న్యాయం జరుగుతుంది.

      ఇక సుబ్బు గారి అమాయకపు వాక్యాలకి జవాబు అవసరం లేదు. అసలు సమస్యని స్పర్శించకుండా, ఏదో రాసుకు పోతూ వుంటే, ఏమీ లాభం లేదు.

      పాఠకుడు

  5. సీమాంధ్రులు వాస్తవాలు మరిచి మాట్లాడొద్దు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడక ముందు వారి పరిస్థితి ఏంటో ఓ సారి గుర్తుంచుకోవాలి..రాజధాని పెట్టుకోవడానిక వసతులు లేక డేరాలు వేసుకున్న నిజాలను ఎలా మర్చిపొయిన్రు. సీమాంధ్రులు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినం అంటున్న మాటలు అవాస్తవం. చరిత్ర పేజీలు తిరిగేసి మాట్లాడితే మంచిది. ఊరికే పైపై మాటలు రాయొద్దు. ప్రతీ దానికి సీమాంధ్రులు పొట్టి శ్రీరాములు అంటరు. పొట్టి శ్రీరాములుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానిక ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయినా మీతో కలిసి ఉండాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. విడిపోతాం అంటే కలిసుంటాం అనడమేంటీ..?

  6. కలిసుండీ, కలిసిపోలేకుంటే
    విడిపోవడం మంచిది….!
    విడిగావుండీ, విడిపోలేకుంటే
    కలిసిపోవడం మంచిది…!!

    ఎటూతేలక, స్పష్టత లేక,
    భవిత తెలీక, పరిణితి లేక,
    విషయం తెలిసీ, వివరణ లేక,
    నిజాలు తెలిసీ, నిగ్గు తేల్చక,

    అగమ్యపయనం-ఎడారియానం
    ఎండమావి తో తీరదు దాహం!!
    మనసులనెరిగీ, పెద్దల అహము!
    ముందుతరాలకి తీరని ద్రోహం !!!

    -సత్య

  7. మల్లీశ్వరి గారూ! తెలంగాణ విషయం లో మీ స్పందనకు కృతజ్ఞతలు. చాలా మంది అనుకుంటున్నట్టు తెలంగాణ కోరడమంటే, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడమనే కాదు. సృజనకారులుగా మనమంతా స్వప్నిస్తున్న రేపటి దేశానికి దిశా నిర్దేశం చేసే సామాజికన్యాయ వ్యవస్థను, గ్లోబలీకరణానికి పరిష్కారంగా నిలిచే ప్రపంచానికి దిక్సూచిని ఆశించడం. ఐతే మనంకలలు కన్నంత సులువు కాదిది. ఐనా ఉద్యమ ఉధృతిలో ఆశయదీపం జ్వాజ్వల్యమానంగా వెలుగుతూనే ఉంది. అడ్డంకులు కాబోయే స్వార్థపరులూ పురుగుల్లా మాడిపోతారనీ తలుద్దాం. దయచేసి తెలుగువాళ్లంతా సహృదయంతో ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిద్దాం.

  8. శ్రీ పాఠకుడు గారికి “ఆంధ్రా పెద్దలు అనేక వాగ్ధానాలు చేశారు. అప్పుడు తెలంగాణా పెద్దలు ఒప్పుకుని కలిశారు. ఆ షరతుల్లో, ఇష్టం లేకపోతే, విడిపోవచ్చనేది ఒక షరతు” అని రాసారు.పెద్దమనుషుల ఒప్పందం wikipedia link ఇస్తున్నా.మీరు చెప్పిన ఒప్పందం ఉందేమో చూడండి..http://en.wikipedia.org/wiki/Gentlemen%27s_agreement

  9. శ్రీ అంజిబాబు గార్కి” రాజధాని పెట్టుకోవడానిక వసతులు లేక డేరాలు వేసుకున్న నిజాలను ఎలా మర్చిపొయిన్రు” అన్నారు..పుట్టగానే ఎవరూ పరిగెత్తరు.1953 october లో ఆంధ్ర ఏర్పడింది.అయినా రాజధానిగా కర్నూలుని అబివృద్ధి చేసేంతలో ఈ లోగా విశాలాంద్ర ఉద్యమం బయలుదేరడంతో అప్పటి పరిస్థితుల్లో హైదరాబాద్ రాజధాని కాగలదేమోని ముందే ఊహించడంతో కర్నూలు లోమీరన్న వసతులు కల్పించలేదు(1953 oct లోఆంధ్ర ఏర్పడగా 1955 dec లో hyd state assembly లో విశాలాంధ్ర తీర్మానం పెట్టారు.అంటే అందుబాటులో ఉన్న 2 ఏళ్ళు విశాలాంధ్ర ఏర్పాటు ప్రయత్నాలకే సరిపోయింది). అసలు కర్నూలు రాజధాని గా కొనసాగించి ఉంటే ఇప్పటి hyd assembly కన్నా గొప్ప assembly నే కర్నూలు లో ఉండేది. అసలు ప్రపంచంలో ఏదేశంలోనైనా ఏదైనా కొత్త రాష్ట్రం లేదా ప్రొవిన్స్ కొత్తగా ఏర్పడితే రెడీమేడ్ గా ఒక శాసనసభ,హైకోర్ట్ ఊడిపడవు.ఆ రాష్ట్రం లేదా ప్రొవిన్స్ యొక్క ప్రభుత్వమే కట్టుకోవాలి.(తెలియక పోతే గమనించగలరు).అందరికీ నిజాం వచ్చి కట్టివ్వడు.మీ నిరంకుశ “నిజాం రాజు తరతరాల బూజు అని దాశరధి” అన్నా, వాడు కట్టుకున్న శాసనసభ,హైకోర్ట్ మాత్రం భారత ప్రభుత్వం లాక్కుంటే అవి మీ సొంతమైనట్టు భేషజం పోవడం మీకే చెల్లింది..హైదరాబాద్ సీమాంధ్రులే అబివృద్ధి చేసారని అబద్ధాలడడం నాకు చేతగాదు.కాని ఆ అబివృద్ధి లో దాదాపు 70% సీమాంధ్రులదే.దానికి చరిత్ర పుటలు తిరగెయ్యక్కర్లె.hyd అబివృద్ధి ఎవరి పాత్ర ఎంత అని మన రాష్ట్ర్లానికి చెందనివాడితో బేరీజు వేయించినా చెప్తాడు. హైదరాబాద్ ని పెట్టుబడులు ఆకర్షించే ప్రపంచస్థాయి లో నిలబెట్టిన వాళ్ళలో తెలంగాణ బిడ్డలూ ఉన్నారు.కాని సీమాంధ్రులు వారి కన్నా రెండు రెట్లు ఎక్కువున్నారు

  10. ఇక ప్రవీణ్ శర్మ గారు…అగ్ని పర్వతం,అహంకారం ఏమో అంటున్నారు..అహంకారం ఫీల్ అవడానికి సీమాంధ్రులు వేరే జాతి వాళ్ళో లేక తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో మైనార్టీలో కాదు..తెలంగాణ విడిపోతే ఆంధ్రోళ్ళ కొత్త రాష్ర్టంలో ఆదాయం తగ్గి(hyd ప్రస్తుత ఆదాయం ఇప్పటి రాష్ట్ర ఆదాయంలో దాదాపు సగం,అది గాక కొత్త రాజధాని అభివృద్ధి జరిగేవరకూ పెట్టుబడులు రావు.అది ఎప్పటికి అభివృద్ధి కావాలె?) అభివృద్ది కుంటుపడతుందని ముందుగా గమనించి ఆ అన్యాయాన్ని అడ్డుకొంటున్నారు.తెలంగాణ ఏర్పాటు కోసం సీమాంధ్రుల అబివృద్ధి ని తాకట్టు పెట్ట ఎవడూ ఊరుకోడు..న్యాయమే గెలుస్తది.ఇప్పుడు జరుగుతుంది కూడా అదే..ఇక ఎప్పటికీ ఇదే…ఉమ్మడి రాజధాని అయితేనే తెలంగాణ ముచ్చట…లేకపోతే నిజంగానే ఎప్పటికీ అగ్ని పర్వతాలే.నిజమే కదా అగ్ని పర్వతాలూ అంతే,అప్పుడప్పుడు బద్దలౌతుంటాయి.మళ్ళీ తగ్గుతాయి.మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఏ ముప్పూ ఉండదు.40 ఏళ్ళ సంది బద్దలౌతూనే ఉన్నాయ్.ఆంధ్రోళ్ళు లైట్ తీస్కోవట్ల?

    • ఎందుకమ్మా ప్రవీణ్ అలాంటి http://telanganasolidarity.in/#!/ ..అవి నేను చూడను..సమైక్యాంద్య బ్లాగుల్లో తెలంగాణ వాళ్ళు ఏం రాసినా చూడొచ్చు..కాని తెలంగాణ బ్లాగుల్లో సీమాంధ్రులు సరైన సమాధానం ఇస్తే అని తొలగించేస్తారు.అసలు ఈ జాజిమల్లి లో కూడా నా వ్యాఖ్య ఉంచుతారని ఊహించలే కాని delete చేసేముందైనా చదువుతారని పోస్ట్ చేసా..ఈ http://telanganasolidarity.in/#!/ లాంటివి నేను చూడను.చూసి ఏం రాసినా తొలగిస్తారు కాబట్టి.

      • మౌని గారూ,
        ప్రత్యేక తెలంగాణా పట్ల వ్యతికేకాభిప్రాయాలు ఉన్న వాళ్ళు రాసిన ఏ వ్యాఖ్యనైనా నా బ్లాగ్ లో నేను అనుమతించను అని మీరు పొరబడ్డారు.వివాదాస్పదమైన అంశంలో తప్పనిసరిగా రెండో వాదన ఉంటుంది…అది ప్రజాస్వామికమైన వ్యక్తీకరణగా ఉన్నపుడు ఆ వాదన పట్ల నాకు అంగీకారం లేకపోయినా తప్పనిసరిగా ఏం చెపుతున్నారో వింటాను.నా బ్లాగ్ లో అనుమతిస్తాను.మీ వ్యాఖ్యలు ఆ పరిధిలో ఉన్నాయి కాబట్టే అనుమతించాను. అలా కాకుండా అసభ్యకరమైన డిక్షన్ ప్రగతి వ్యతిరేక భావజాలం వ్యాఖ్యల రూపంలో ఉన్నపుడు మాత్రం డిలీట్ చేసిన సందర్భాలు అనేకం.

  11. మల్లీశ్వరి గారు,
    మీరన్నది నిజమే..పైగా వాదనలో పదును ఉంటేనే కదా..ప్రతివాదన మరింత పదునెక్కుతుంది.ఆ మధనంలో వాస్తవాలు బయటకొస్తాయి.విజ్ఞులు పదునున్న వాదనలని ఎప్పుడూ అనుమతిస్తారు అసభ్యం కానంతవరకు..కాకపోతే నా అంచనా ఎక్కడ తప్పు అయిందంటే పచ్చి తెవాదుల్లో కొంత అయినా నిజాయితీ అశించవచ్చు..కాని సీమాంధ్రులై ఉండి తెవాదాన్ని సమర్థించేవాళ్ళు ఖచ్చితంగా ఏదో స్వార్థం ఆశించి ఆ వాదాన్ని సమర్థిస్తారు అని నా అనుభవం..కాబట్టి వాళ్ళ వాదనలో పచ్చి hypocracy ఉంటుంది.మీరు అలాంటి “సీమాంధ్రపు తెవాద మద్దతుదారు” కాబట్టి నా పోస్ట్ డిలీట్ చేస్తారని పొరబడ్డాను.అందరు “సీమాంధ్రపు తెవాద మద్దతుదారులు” అలా కాదని ఇప్పుడు అర్థమైంది..నా వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు కృతజ్ఞతలు

Leave a reply to telugu2008 స్పందనను రద్దుచేయి