విప్లవ,అస్తిత్వ ఉద్యమాలపై ఆ.సౌమ్య అభిప్రాయాలు

విప్లవ,అస్తిత్వ ఉద్యమాలపై తన స్పందనని తెలియజేసిన ‘వివాహ భోజనంబు'(మాయా శశిరేఖ)

బ్లాగర్  ఆ.సౌమ్య గారికి కృతజ్ఞతలు 

 

1 . నేటి సాహిత్య సందర్భాన్ని మీరెట్లా నిర్వచిస్తారు?

 

 నేడు ప్రజల ఆలోచనలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాహిత్యం లోనూ మార్పులు వస్తూ, ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. 20వ శతాబ్దంలో సాహిత్య స్వరూప స్వభావాల్లో గణనీయమైన మార్పులు రావడం ప్రారంభమయింది. ప్రాచీన సాంప్రదాయ శైలిని దాటి ఆధునిక, అభ్యుదయ, అత్యాధునిక(పొస్త్ మొదెర్న్) విప్లవం, స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీ వాదం ప్రాంతీయ అస్తిత్వవాదాలుగా మార్పుచెందింది. అంతేకాక దేశంలో వస్తున్న ఆర్థిక, రాజకీయ సామాజిక మార్పులను కూడా కలుపుకుంటూ సాహిత్యం ముందుకు నడుస్తొనది. భాష కూడా ఒక వర్గనికి మాత్రమే అర్థమయ్యే స్థాయి నుండి వ్యవహారిక శైలిని సంతరించుకుని సామాన్య ప్రజలకు చేరువయింది. రచనా వస్తువు, శిల్పం కూడా కాలానికనుగుణంగా ఎన్నదగిన మార్పుచెందింది. రచనకి సామాజిక ప్రయోజనం ఉంది అనుకుంటే ఈ మార్పు సహజమైనది,శుభసూచకమైనది కూడాను.

2 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల మధ్యా, అస్తిత్వ ఉద్యమాల్లో వివిధ అస్తిత్వాల మధ్యా –ఐక్యత,ఘర్షణలు ఏ స్థాయిలో ఉన్నాయి?

 

విప్లవ, అస్థిత్వ వాదాలు, ప్రాంతీయ వాదాలు అనేవి సాహిత్యంలో ఒక భాగంలా ఉండాలి కానీ తమ ఆధిపత్యం ప్రకటించుకునే దిశలో ఉండకూడదు. కానీ ఈ సాహిత్యాలలో చాలామేరకు ఆధిపత్య నిరూపణ, ‘మేము ఒక వర్గం’ అని నిరూపించుకోవాలనే దిశలో ముందుకెళ్తున్నట్టు తోస్తున్నాయి. ఆ క్రమములో ఘర్షణల స్థాయి పెరుగుతున్నదని నా అభిప్రాయం. స్వేచ, హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమాలలో కొంత ఆవేశం ఉండడం సహజం. ఆ ఆవేశాన్ని కయ్యానికి కాకుండా పట్టుదలగా మార్చుకునే పద్ధతిని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

3 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల విజయాలనూ వైఫల్యాలనూ తెలుగు సాహిత్య విమర్శ సమర్ధవంతంగా ప్రతిఫలించిందా?

 

 నాకు అంత అవగాహన లేదు.

 4 . విప్లవ సాహిత్యోద్యమానికి అనుబంధంగా విప్లవ సాహిత్య విమర్శ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వచ్చింది.మరి వివిధ అస్తిత్వ

ఉద్యమాలు సొంత సాహిత్య విమర్శను తగినంతగా అభివృద్ధి చేసుకోగలిగాయా?

 

 విప్లవ సాహిత్యోద్యమం ఎదిగినంతగా అస్తిత్వ ఉద్యమాలు ఎదగలేదు. వాటికి రావలసిన ప్రాముఖ్యత, గుర్తింపు ఇంకా రాలేదు. ఉద్యమ చైతన్యం ఉన్నవారు, ఆ వర్గంలో ఉన్నవారు, మరికొందరు తప్ప ఈ ఉద్యమాలపై చిన్నచూపు చూసేవారే ఎక్కువ. ఈ దశలో సొంత సాహిత్య విమర్శ అభివృద్ది చేసుకోవడం కష్టతరం. అది జరగలేదు.

 5 . విప్లవ ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని చెబుతాయి. అవి అభిప్రాయ భేదాల విషయంలో,

విమర్శ విషయంలో ఎంతవరకు ప్రజాస్వామికంగా, సహనంగా ఉండగలిగాయి? ఉన్నాయి ?

 

 నాకు అంత అవగాహన లేదు.

 6 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల ఉజ్జ్వల దశ కొనసాగుతోందా? ముగిసిందా?

 

 ఇతర భాషాసాహిత్యాలతో పోలిస్తే ముఖ్యంగా తెలుగు సాహిత్య ప్రభావం సామాన్య ప్రజలపై అనుకున్న స్థాయి లో లేదు. అందునా అస్తిత్వ ఉద్యామాలపై అవగాహన, వాటి ప్రభావం ఇంకా తక్కువ. ఉజ్జ్వల దశ అన్నది చాలా పెద్ద మాట….ప్రాచీన సాహిత్యనికి వచ్చినంత గుర్తింపు విప్లవ అస్తిత్వ ఉద్యమాలకి ఇంకా రాలేదు. ఈ విషయంలో అస్తిత్వ సాహిత్యం కన్నా విప్లవ సాహిత్యం కొంత మెరుగుగా ఉన్న విషయం వాస్తవం. విప్లవ సాహిత్యోద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్ళగలిగే కొన్ని మధ్యమాలు ఉన్నాయి. కొంత రాజకీయ సహకారం కూడా లభిస్తోంది. కానీ అస్తిత్వ ఉద్యమాలు ఇంకా బాల్య దశలోనే ఉన్నాయి. వాటిని ప్రజలలోకి తీసుకెళ్ళగలిగే మాధ్యమాలు లేవు. అస్తిత్వ ఉద్యమల గురించి అవగాహనే చాలా తక్కువమందికి ఉంది. ఈ ఉద్యమాలు ఇంకా ఎంతో ఎదగాల్సి ఉంది.

7 . విప్లవ సాహిత్యోద్యమం నుంచీ అస్తిత్వ ఉద్యమాల వరకూ అన్నింటినీ సమన్వయ పరిచే సమగ్ర ప్రగతి శీల దృక్పధం

రూపొందవలసిన అవసరం ఉందా? అటువంటి అవకాశాలు ఉన్నాయా?లేదా ఇప్పటికే ఏర్పడిందా?

 

విప్లవ సాహిత్యోద్యమం నుంచీ అస్తిత్వ ఉద్యమాల వరకూ అన్నింటినీ సమన్వయ పరిచే ప్రగతి శీల దృక్పధం “మానవతావాదం”. వ్యక్తివాదం, వర్గవాదం స్థాయినుండి మానవతావాదం రచనలకు ప్రాతిపదిక అయ్యే స్థాయికి ఎదగాలి. భవిష్యత్తులో మానవతావదమే ధ్యేయంగా సాహిత్యరచన కొనసాగుతందని ఆశిస్తున్నాను.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s