భాండాగారం

మనలో మనం ఉత్తరాంధ్ర సదస్సుకిదే మా’ఆహ్వాన పత్రిక’

మనలో మనం ‘ఆహ్వాన పత్రిక’

గత సంవత్సర కాలంగా మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సులలో చివరిదైన ఉత్తరాంధ్ర సదస్సు 2010 ఫిబ్రవరి 27 , 28 తేదీలలో విశాఖపట్నంలో జరగనుంది. సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ ఆంధ్రా యూనివర్సిటి,మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక సంయుక్త అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకి మా పిలుపు. సదస్సు పూర్తి వివరాలకై అహ్వాన పత్రిక లింకులను నొక్కండి.

 

మనలోమనం ఉత్తరాంధ్ర సదస్సుకిదే మా ఆహ్వానం

ఈ సదస్సులో ‘ఉత్తరాంధ్ర,ఆదివాసీ స్త్రీల సాహిత్యం’ఫై చర్చ పత్ర సమర్పణలు జరుగుతాయి. అంతే కాక మనలో మనం వేదిక ఈ సదస్సు లోనే పూర్తి స్థాయి నిర్మాణాన్ని పొందనుంది.కాబట్టి తెలుగు రచయిత్రులందరూ ఈ సదస్సుకు హాజరయి స్త్రీల సాహిత్యాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాం. సదస్సుకి హాజరయ్యే రచయిత్రులందరికీ రెండురోజుల పాటు భోజన,వసతి సదుపాయాలు కల్పించబడతాయి.

ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించగలరు .

ఆచార్య బి.రత్నకుమారి 9866298798

మల్లీశ్వరి

మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక

‘మనలో మనం’ ఉత్తరాంధ్ర సదస్సు 2010 ఫిబ్రవరి 27 , 28 తేదీలలో విశాఖపట్నం లో….

గత సంవత్సర కాలంగా మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సులలో చివరిదైన ఉత్తరాంధ్ర సదస్సు 2010 ఫిబ్రవరి 27 , 28 తేదీలలో విశాఖపట్నంలో జరగనుంది. సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ ఆంధ్రా యూనివర్సిటి,మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక సంయుక్త అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ‘ఉత్తరాంధ్ర,ఆదివాసీ స్త్రీల సాహిత్యం’ఫై చర్చ పత్ర సమర్పణలు జరుగుతాయి. అంతే కాక మనలో మనం వేదిక ఈ సదస్సు లోనే పూర్తి స్థాయి నిర్మాణాన్ని పొందనుంది.కాబట్టి తెలుగు రచయిత్రులందరూ ఈ సదస్సుకు హాజరయి స్త్రీల సాహిత్యాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాం. సదస్సుకి హాజరయ్యే రచయిత్రులందరికీ రెండురోజుల పాటు భోజన,వసతి సదుపాయాలు కల్పించబడతాయి.

ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించగలరు .

ఆచార్య బి.రత్నకుమారి 9866298798

మల్లీశ్వరి 9246616788

మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక

‘మనలో మనం’కు మనోబలాన్ని పెంచిన రాయలసీమ సదస్సు

‘మనలో మనం’కు మనోబలాన్ని పెంచిన రాయలసీమ సదస్సు

ప్రాంతాల వారీగా, అస్తిత్వాల వారీగా స్త్రీల సాహిత్య విమర్శను సమగ్రం చేసుకోవడంలోబాగంగా మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక  జూన్ 27, 28 ,2009 తేదీలలో రాయలసీమ సాహిత్య సదస్సును నిర్వహించింది. విశాఖ పట్నం, వరంగల్ సదస్సుల అనంతరం మరింత స్పష్టమయిన అవగాహనతో మనలో మనం ముందడుగు వేసింది. విశాఖ పట్నం సభ రచయిత్రులలోని సామూహిక కృషి తత్వాన్ని నిరూపించగా ,వరంగల్ సభ విధ్యార్దినులు, పరిశోధకులలోని సాహిత్యాభిలాషను,సాహిత్య సృజనను మెరుగు పరచుకోవడంలో వారికి గల తపననూ వెలికి తీసింది.ఇక రాయలసీమ సదస్సు, రాయలసీమలో అజ్ఞాతంగా ఉన్న అనేక మంది రచయిత్రులను వేదిక పైకి తెచ్చింది.

ఈ సదస్సు పూర్తి వివరాలకై ‘మనలో మనం’కు మనోబలాన్ని పెంచిన రాయలసీమ సదస్సు లింకు క్లిక్ చేయండి

అక్కడన్నీ మగబోర్డులే

మనసంతా హయిగా...నాకు నచ్చే ప్రోఫెసర్.కాత్యాయినీ విద్మహే

నవంబర్ 15,16 తేదీల్లో నాగార్జున విశ్విద్యాలయం , గుంటూరు లో ‘మనలోమనం’ రచయిత్రుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. కోస్తాంధ్ర , బిసి, క్రైస్తవ మైనార్టీ స్త్రీల సాహిత్యం’ పై 25 కి పైగా రచయిత్రులుమాట్లాడారు. ఆ వివరాలన్నీ వివిధ పత్రికలకి పంపిన సమీక్షల్లో వస్తాయి కాబట్టి సదస్సులోనాకు బాగ గుర్తుండిపోయిన విషయాల్లో కొన్నింటిని మీతో పంచుకుంటాను.

సదస్సు పూర్తి వివరాలకు ఈ లింకు క్లిక్ చెయ్యండి.

నవంబర్ 15,16 తేదీల్లో జరిగిన గుంటూరు  ‘మనలోమనం’ రచయిత్రుల రాష్ట్ర స్థాయి సదస్సు

మనలో మనం సదస్సు కు ఆహ్వానం

మనలో మనం సదస్సు కు ఆహ్వానం

 ప్రాంతాలవారీగా , అస్థిత్వాల వారీగా స్త్రీల సాహిత్య చరిత్రను సమగ్రం చేసుకోవడం లో భాగంగా “మనలోమనం” రచయిత్రుల ఉమ్మడివేదిక ఇప్పటివరకు తెలంగాణా,రాయలసీమల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సులను ఏర్పాటు చేసింది. కొత్త తరం రచయిత్రులను గుర్తించి , ప్రోత్సహించింది. అంతే కాక విద్యార్ధినుల్లో  రచనాసక్తి పెంపొందిచేలా కృషి జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇపుడు “మనలో మనం” వేదిక, మహిళాధ్యయన కేంద్రం , నాగార్జున విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో   2009 నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సుని ఏర్పాటుచేస్తోంది.    కోస్తాంధ్ర , వెనుకబడిన తరగతుల , క్రైస్తవ , మైనారిటీ స్త్రీల కు సంబంధించిన సాహిత్యం పై చర్చ , పత్రసమర్పణలు జరుగుతాయి .

సమావేశ స్థలం :

ప్రొ.వి .బాలమోహనదాస్ సెమినార్ హాల్ ,

డైక్మన్   ఆడిటోరియం ,

నాగార్జున విశ్వవిద్యాలయం, 

నాగార్జున నగర్  

 

రచయిత్రులారా ! విస్మరించబడిన మన సాహిత్యచరిత్రను మనమే నిర్మించుకుందాం రండి. మీ రాక ఈ సదస్సుకి బలాన్ని చేకూరుస్తుంది. మరిన్ని ఇతర వివరాలకు…

ఆచార్య తేళ్ళ సత్యవతి     9848531931

డాక్టర్ సమత రోష్ని        9491053654

పుట్ల హేమలత              9441241316

పి. రాజ్యలక్షి                  9440286746

 హేమలత                     9912195330

మనలోమనం

రచయిత్రుల ఉమ్మడి ఐక్య వేదిక