కోరంగి రేవు – బంకోలా నవల

( కోరంగిని చూసొచ్చాక గోపరాజు సుధ  ఉద్వేగ ప్రవాహం ఇలా నన్ను చేరింది…నేను ఇటు మళ్ళించుకున్నాను..థాంక్ యూ సుధా!…)

 

నవంబర్ 6-9 తారీఖుల మధ్య , మాకు తూర్పు గోదావరి వెళ్ళే అవకాశం వచ్చింది . యాత్ర plan చేసుకుంటున్నప్పుడు కోరంగి వెళదాము అనుకున్నాము. కోరంగి రేవుకై , కోటిపల్లి రేవుకై  అనేమాట ఎన్నిసార్లు నోట మెదిలినా కోరంగి ఎప్పుడు ఒక భౌతిక వాస్తవికత కాదు నాకు. అదే సమయంలో విపులలో కపిల కాశిపతి కధ చదివాను. కోరంగోల్లు కనపడ్డారు. కోరంగికి రక్తమాంసాలు రావడం మొదలయ్యింది . మా గూగుల్ ఆ విషయం  ఈ విషయం చెప్పడం మొదలు పెట్టాడు, కోరంగికి ఆత్మ రావడం మొదలైంది. ఇక ప్రాణమున్న కోరంగిని చూడడమే! మల్లీ!  ఏం చెప్పను!  నీళ్ళకి ప్రాణముంటుందని నీకూ తెలుసు కదా ! ఆ ఆత్రేయ గోదావరి, అదే కోరంగి సముద్రంలో కలిసే ముఖద్వారం చూస్తుంటే, ఎంత నిస్సహాయత ! చేతులు చాచి కౌగలించుకోలేను , చాచిన చేతుల్లో వొదిగిపోనులేను ! మాటలతో చెప్తే, ఆ అనుభవమే నీరుకారిపోతుందేమో, నేనే కరిగి నీరై పొతే!  ఒకటే రూపంలో వుండటం ఎంత దౌర్భాగ్యం! నేను నీరు కాగలిగితే  గోదావరిని కానా ! సముద్రాన్ని కానా! మాటలెందుకు పనికొస్తాయి మల్లమ్మా ! అవి ఎన్నైనా నీటి చుక్కలే. నీటి చుక్కలతోటి నదులని, సముద్రాలని నింపాలని చూసినట్టే కదా అనుభవాన్ని మాటల్లో పెట్టటం అంటే!  సైన్స్ ఫిక్షన్ కాకపొతే ఇదంతా ఏమిటి!  ఆ గోదావరి ఏమిటి ఆ మడ అడవులు ఏమిటి, ఆ ముఖద్వారం ఏమిటి! ఇదంతా ఏదో సైన్స్ ఫిక్షన్ నవల, నేను చదువుతున్నాను అంతే ! అదంతా భూమి మీద వున్నదా! ఇంకెవరైనా చెపితే నేను నమ్ముతానా!

ఇంటికి వచ్చాక, వసంత ఇంటర్నెట్లో వెతికి సంపాదించిన బంకోలా నవల ప్రింట్ తీసి చదవడం మొదలు పెట్టాను. బోలెడు నీటి చుక్కలే కాదు, సోషల్ హిస్టరీ డాక్యుమెంటేషన్ అనే నా కోరిక కూడా నెరవేరుతోంది .తెలంగాణ విడిపోకముందు, రాజమెండ్రి కోటిలింగాల రేవులో చీకటి పడుతున్న సమయంలో ఆ చరిత్ర మేష్టారు వెళ్లబోసుకున్న బాధంతా కళ్ళకి కడుతోంది, తెలంగాణకి గోదావరి రాజవంశాలకి వున్న ఇచ్చిపుచ్చుకున్న సంబంధాల గురించీ చెప్పి ఇప్పుడు విడిపోతామా అని ఎంత బాధపడ్డాడో! అంతా హైదరాబాద్ గురించి బాధ పడ్డవాళ్ళే..  కాని ఇచ్చిపుచ్చుకోవడాల గురించి బాధ పడ్డవాళ్ళు లేరు.  ఇప్పుడు మళ్ళీ  బంకోల చదువుతుంటే, నిజాము నవాబులకి  గోదావరి జిల్లాలకి వున్నా సంబంధo అర్ధం అవుతోంది. చాల విషయాలు అరకొరగా రాస్తున్నాను కదా ! కొన్ని నాకు తెలిసినవే వివరంగా రాయాలి.  ఇంకొన్ని మా గూగుల్ని అడిగి clarify  చేసుకోవాలి ! మనసు మాత్రమే  గొప్ప ఫోటోలు తీయగలదు, వీడియోలు తీయగలదు. కళ్ళు మూసుకుంటే ముఖద్వారం , ఎక్కడ ఫ్రేమ్ కట్టిందో!

బంకోలా చదివావా!  గోదావరి జిల్లాల వాళ్ళకి బాగానే తెలుసల్లే వున్నది  ఆ నవల,  ఇప్పటికి నాకు తెలిసే సమయం వచ్చినట్టున్నది. కపిల కాశీపతి కధలు ఇంకేమైనా నీకు తెలుసా ! ఆ కథ చదివాక కూడా ఏమైనా పంచుకోవాలని చాల అనిపించింది. భావాన్ని భాషా పటాటోపం మింగెయ్యకుండా వర్ణనే  కధ కాకుండా కధ ఎలా వుంటుందోనని!

వసంత బంకోలా నవలనే కాదు . సాధు సుబ్రమణ్యశర్మ గారిని పట్టుకోగలిగింది. బంకోలా నవల సంపాదించగలిగాము.  చరిత్రని ముక్కా ముక్కా వెతికి పట్టుకున్నట్టు వున్నది . ఎందుకో ఒకోసారి కళ్ళ ఎదుట వున్నది కూడా చూడలేము . ఒక్కసారి ప్రత్యక్షం అయితే తబ్బిబ్బైపోతాము. నాకు అలాగే వున్నది. ఇంతకీ బంకోల అంటే లైట్ హౌస్   అని అర్ధం  డచ్ భాషలో.

– సుధ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s