అక్కడన్నీ మగబోర్డులే

మనసంతా హయిగా...నాకు నచ్చే ప్రోఫెసర్.కాత్యాయినీ విద్మహే

నవంబర్ 15,16 తేదీల్లో నాగార్జున విశ్విద్యాలయం , గుంటూరు లో ‘మనలోమనం’ రచయిత్రుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. కోస్తాంధ్ర , బిసి, క్రైస్తవ మైనార్టీ స్త్రీల సాహిత్యం’ పై 25 కి పైగా రచయిత్రులుమాట్లాడారు. ఆ వివరాలన్నీ వివిధ పత్రికలకి పంపిన సమీక్షల్లో వస్తాయి కాబట్టి సదస్సులోనాకు బాగ గుర్తుండిపోయిన విషయాల్లో కొన్నింటిని మీతో పంచుకుంటాను.

సదస్సు పూర్తి వివరాలకు ఈ లింకు క్లిక్ చెయ్యండి.

నవంబర్ 15,16 తేదీల్లో జరిగిన గుంటూరు  ‘మనలోమనం’ రచయిత్రుల రాష్ట్ర స్థాయి సదస్సు

11 thoughts on “అక్కడన్నీ మగబోర్డులే

 1. మల్లీశ్వరిగారూ ఆడ స్టూడెంట్‌ను ఏమని పిలుస్తారో తెలుసుకోవాలని వుంది. అట్లాగే కథాజగత్‌కు మీరొక మంచి కథను పంపండి. వివరాలకు http://www.kathajagat.com/ చూడండి.

 2. సీబీ రావు గారూ! రేడికల్ ఫెమినిష్టులు / పురుషద్వేషులు అంటే ఎవరని అడిగారు కదా? ఇదిగోండి ఒక నమూనా!

  అంతే కాదండోయ్ … మచ్చుకి రెండు ఝలకులు:

  * హిందువులని కించపరిచే హక్కు మిగిలినవారికి ఉంది గానీ, అసహనం వ్యక్తం చేసే హక్కు మాత్రం హిందువులకు లేదు

  * సైన్ బోర్డులలో కూడా లింగ భేదాలు ఉంటాయి ( ఒక్క ఏ బీ వీ పీ బోర్డులోనే విద్యార్ధి అని ఉంది. కమ్యూనిష్టు ముఠాలకి ఆ గ్రూపంటే కోపం కదా, దానిని డైరెక్టుగా చెప్పలేక ఇలా అంటున్నారా కొంపదీసి? అన్నట్టు విద్యార్ధి అనే మాట స్త్రీలకి కూడా వర్తిస్తుమంది కదా?)

  • మలక్ పేట రౌడీ గారూ,
   మగ బోర్డు అన్నది ఒక ఇమేజరీ తప్ప అది రాడికల్ ఫెమినిజానికో, పురుష ద్వేషానికో నమూనా కాదు. అయినా విషయాన్ని ‘out of context’ చూస్తే అసలు విషయం తప్ప అవసరం లేనివి చాలా కనపడతాయి
   మల్లీశ్వరి

 3. Hmm… Out of context?

  నాకయితే అది జోకులా అనిపించలేదు – May be I misunderstood it. If I am really wrong then I take my words back – Sorry about that!

  కానీ మెజారిటీ మైనారిటీ విషయంలో మాత్రం I stand my ground. Your Bias is very open!

  అవసరం అనవసరం అనేమాట మీరు లేవదిశారు కాబట్టి సమాధానం చెప్తున్నా. మీ పోస్టులో అసలు జనాలకి అవసరమైన content ఎంత ఉందంటారేమిటి?

 4. నాకయితే ఎమీ అర్ధం కాలేదు.. మగ బోర్డులు ఎమిటొ.. అసహనం అసలు ఎవరు వ్యక్తపరిచారొ..మెజార్టి మతస్తుల నైతిక హక్కులు ఎవరు నిర్ణయితున్నారో.. అసలు ఇదయితే అస్సలు అర్దం కాలేదు “మెజార్టీ మతస్థులు మైనార్టీ మత స్త్రీలపై దాడులు” .. ఇలాంటి క్లాసిఫికేషన్ దాడులు ఇప్పటివరకూ వినలేదు.. ఎంటొ మొత్తం కంఫ్యుజన్..

 5. మలక్ పేట్ రౌడీ!:-)!

  మల్లీశ్వరిగారు,
  కొన్ని సందేహాలు ! అడుగుతున్నాను,

  1.విద్యార్థిని అనే మాటకు ఇంగ్లీషులో ఏదైనా అనువాదం ఉందా? విద్యను అర్థించేవారెవరైనా విద్యార్థులే అవుతారుగా! ఇక్కడ కూడా లింగ భేదాలా? ఈ లెక్కన అవి ఏ రకంగా “మగ బోర్డులు” అవుతాయి?

  2. ఎక్కడికెళ్ళినా “కేవలం ” జెండర్ గురించి మాట్లాడ్డమే స్త్రీవాదమా?

  3.సాహిత్యం అంటే ఏమిటి?

  4.మ తపరమైన కీర్తనలు,స్తోత్రాలు సాహిత్యం అవుతాయా? కానట్లయితే మరి ఏది సాహిత్యం? అయినట్లయితే వాటిని ఇంతకుముందే ఎవరో ఒకరు సృష్టించే ఉంటారు కాబట్టి మళ్ళీ వాటిని చర్చిందేందుకు సెమినార్లు జరగాలా?

  5. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థినుల అవగాహనా రాహిత్యాన్ని తొలగించే దిశగా,ఆ బోర్డుల ను సవరించడానికి మీరేమైనా సూచనలు చేశారా? చేస్తే student అన్న మాటకు ఆడ మగ ఇద్దరికీ వర్తించే మాట ఏమై ఉంటుంది?

 6. అమ్మా

  సమానత్వం కోరుకుంటూన్న ,విశ్వసిస్తున్న నువ్వు .ఇలా అసహనాలలో కూడా మెజారిటీవారు భరించాలా ?మైనార్టీవారు బహరించాలా అనే సిద్దాంతాలు ప్రతిపాదించటం చిత్రంగా వుంది. ఏమైనా చదవెయ్యకముందు కాకరగాయ ని పిలచేవాల్లు చదవేశాక కీకరగాయన అన్నట్లు గాలేదూ !?

 7. నేను ఆరు ఏడు తరగతులు కళ్యాణదుర్గం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివాను. పేరుకు బాలికల పాఠశాల కానీ ఆరు ఏడు తరగతులు మాత్రం కోఎడ్యుకేషన్. అప్పుడు మాకు అందరూ ఉపాధ్యాయినులే ఉండేవారు ఒక్క హిందీ మేష్టారు తప్ప. ఆయన పేరు ఏమిటో ఇప్పుడు మరిచిపోయానుగానీ ఆయనను ఎవరైనా టీచర్ అని సంబోధిస్తే ఎక్కడలేని కోపం వచ్చేది. ఆయన క్లాసులో అటెండెన్సు పలికేటప్పుడు ఎవరైనా ప్రజెంట్ టీచర్ అన్నారంటే ఇక వాళ్ళ వీపు చిట్లిపోయేటట్లు కొట్టేవారు. టీచర్ అనేది కామన్ జెండర్ అని మగ ఆడ ఉపాధ్యాయులనెవరినైనా టీచర్ అని సంబోధించ వచ్చని మాకు తెలిసినా ఆయనకు తెలిసేటట్లు చెప్పడానికి మేము సాహసించలేక పోయాము. మగబోర్డుల గురించి చదివినప్పుడు ఎందుకో ఈ సంగతి జ్ఞాపకం వచ్చింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s