అర్థవంతమైన సాహిత్య ప్రయోగాల సాహసి ‘అనంతు’, నీల నవలలోని కవిత్వాన్ని ఇలా ఏరి కూర్చారు.
***************
‘నీల’ నవలలో నాకు నచ్చిన కవితలు
………………………………………………….
1
అకస్మాత్తుగా
కాలికింద
పటుక్కున పగిలిన
పిట్టగుడ్డు
మనసు
*
2
లంగాపైని పూలన్నీ
రాలిపడేలా
పరిగెత్తినా
తాళం వేసిన
తలుపులు
పలకవు.
*
3
ఆనందం వంతెన కింద
చీకట్లో
రహస్యంగా
పారే నది
కనిపిస్తోంది
మాటల్లో
*
4
అతని నవ్వు
ఎక్కడెక్కడి పిట్టలో
వచ్చి
చెట్టు మీద వాలితే
వినేంత అందం
*
5
ఆకాశం
క్రిస్మస్ చెట్టు
*
6
ఆమె గొంతులో
కోడిపుంజులు
రివ్వున ఎగిరాయి
*
7
నీడని
నేను నడుపుతున్నానా?
నీడ
నన్ను నడుపుతోందా?
*
8
రుతువులు గడిచాయి
ఏ వర్ణమూ దొరకలేదు
ఒంటరి వర్ణంతో
ఆమె
*
9
ప్రశ్న
మనసులో పుట్టి
మనసులో దాక్కోదు
అది బహిరంగమైనది
బయటికి దూకేయాలనే
తాపత్రయం
*
10
కొన్ని కలలు
మనసుని
ఎంత ఉదారంగా
మార్చాయో
కొలవడం
ఎలా సాధ్యం?
*
11
కలలో
ఆమె వ్యవహారం
చాలా
ఉదారం
*
12
కొందరు
గడుసు చినుకుల మల్లే
గుసగుసగా
దరి చేరకుండా
రాలుతుంటారు
*
13
వాన ఇవ్వని
మబ్బుల సంచారంలో
లోకం
మసకబారుతోంది
*
14
ఈ ఒక్క రాత్రీ
పది రాత్రుల పొడవైపోయి
పది పగళ్ళన్నీ
నిమిషాలలోకి
కురచనైపోతే
ఎంత బాగుండునో
*
15
ఖాళీ చేయి
గాలిలో
ఊగే
పసి కొమ్మ
అచ్చమైన మీ వాక్యాలు ఇవన్నీ.
చదువరి నెమరువేతకే
ఇంత ప్రస్తుతి మీ మన్ననకి సూచి.
వాటినిలా ఏరి కూర్చినందుకు, వజీర్ రెహ్మాన్ ని గుర్తు చేసినందుకు కూడా.
మీరు రాసిన ఇంట్రో నన్ను నేనే ‘శభాష్ బేటా’ అనుకునేలా చేస్తే ఇప్పుడు మీరు వజీర్ రెహ్మన్ ప్రస్తావన, పోలికతో దాన్ని వందింతలు చేసారుగా.