స్వర్ణనీల

కిలారి స్వర్ణ – మంచి పాఠకురాలు, సాహిత్య సమీక్షకురాలు, త్వరలో మంచి అనువాద రచనని అందించబోతున్నారు. నీల నవలపై ఈ చిట్టి సమీక్ష చేసారు

 

నీల గురించి ఏం రాయాలి.? కేవలం ప్రేమ కోణాన్ని మాత్రమే స్పృశిస్తాను. 🙂

ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సదా మనుషులను ప్రేమించేవారు, ప్రేమరాహిత్యంలో కొట్టుకుపోతున్నవారూ ఇద్దరూ చదవాల్సిన నవల. రక్తసంబంధీకులే కొట్టుకు చస్తున్న ఈ రోజుల్లో అసలేమాత్రం సంబంధం లేని పైడమ్మ, పాష్టరమ్మల మీద ఏంటా వల్లమాలిన ప్రేమ.? ఎందుకా ప్రేమ? పరదేశి, నీల మద్య వున్న అమలినమయిన ప్రేమ..ఊహించగలమా..? ఇక సదా…ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి అద్భుతమయిన వ్యక్తులు వుంటారా..వుంటారనే నమ్మకం కలిగేలా ఆ అనుభూతిని కలిగేలా రాసిన రచయిత్రికి సదా కృతజ్ఞతలు 🙂. అతి మామూలు మనుషులే అయినా ప్రసాద్ , సరళ ల ప్రేమని కూడా తప్పు పట్టలేం. అది అవసరానికి ఏర్పరచుకున్న బంధం అయినా కూడా.

చిన్న స్పేస్ కోసం ఎంతగానో ఆరాటపడి తన ప్రాణాలే పోగొట్టుకున్న తల్లి గుర్తొచ్చి నీల అనుకునే మాటలు: ” అమ్మా! హాయిగా నచ్చినట్లు వుండు అని చెపాలనిపిస్తుంది “, బాగా నచ్చాయి.

మనుషుల్ని ఎంత చివరి వరకు వెళ్ళి ప్రేమిస్తే, అంతగా వాళ్ళని క్షమించేయొచ్చు. ఇలా ఎంత మంది ఆలోచిస్తారు. మనకి కీడు చేసాడు కాబట్టి..మనం కూడా ఎలాగయినా సరే పగ తీర్చుకోవాల్సిందే అన్నట్టుగా వుంటుంది కొందరి ప్రవర్తన. అలాంటి వాళ్ళకు చెంపపెట్టుగా వుంటుంది ఈ నవల.

సాఫీగా జరిగిపోయే కథ, పుస్తకం చదువుతున్నంత సేపూ ప్రేమవాహినిలో కొట్టుకుపోయేలా మనలందరినీ ఒక అనుభూతికి గురిచేసిన రచయిత్రి జాజి మల్లి గారికి కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే ! ఎక్కడా అసహజత్వం లేకుండా, సున్నితత్వం పోకుండా ప్రేమ మీద నమ్మకాన్ని కలిగించారు. అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. మరమనుషుల్లా బ్రతుకుతున్న వాళ్ళకు ఒక ఆత్మీయ స్పర్శలా, చల్లని చిరుజల్లులా మాత్రం తగులుతుంది !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s