నీల – రవికాంత్ రెడ్డి విశ్లేషణ

న్యాయవాది, మంచి చదువరి, సామాజిక సమస్యలను తార్కికంగా వ్యాఖ్యానించే మాదిరెడ్డి రవికాంత్ రెడ్డి నీల నవలను ఆబ్జెక్టివ్ గా ఎట్లా అర్థం చేసుకోవచ్చో ఈ సమీక్షలో చెపుతున్నారు.

 

**********

ఆడవారికి మాత్రమే అనవసరమైన నీతులు బోధించే కండిషనింగ్ ఉన్న సమాజంలో ఈ నవల దానికి ధిక్కారమే అని చెప్పాలి. ప్రేమ జీవితంలో ఒకసారే కలుగుతుంది అనడం ఎంత ట్రాషో అదే ప్రేమ వల్ల కలిగే పక్షపాతం, దాన్ని కూడా అధిగమించే సహజ కాంప్లెక్సులూ, కర్తవ్యం, జీవితాశయాలు ఇవన్నీ ఆ ప్రేమను ప్రభావితం చేస్తాయనడం కూడా అంతే నిజం. నిజ జీవితంలో Unconditional love అనేది నూటికి 0.1% మాత్రమే ఉంటుంది.

పుస్తకాలనేవి మంచి చెడులు చెప్పడానికి ఉండవు. మంచి చెడులు మనకి మనమే విశ్లేషించుకునే నైపుణ్యాన్ని పెంచడానికి మాత్రమే ఉంటాయి. ఒక పాత్ర సృష్టిలో దాని సామాజిక నేపథ్యం, అది ప్రభావితం చేసే ఆలోచనా తీరు, దాన్ని బట్టి ఆ పాత్ర ప్రవర్తన, నిర్ణయాలు ఉంటాయి. అంతేగానీ, ఆ పాత్ర ఇలా ప్రవర్తిస్తే బాగుంటుంది కదా, అలా ప్రవర్తిస్తే ఈ కష్టాలు ఉండేవి కాదు కదా అని పాఠకులు చెప్పడం బానే ఉంటుంది. కానీ అది పాత్ర ఆత్మని అర్ధం చేసుకున్నట్టు కాదు. ప్రపంచంలోని ఇంత మంది మనుషుల్లో ఒక మనిషి పాత్రని తీసుకుని అల్లిన కధ ఇది. ఆ పాత్ర జీవితంలో ఉండే మార్పులకనుగుణంగా కథను ముందుకు తీసుకుపోయారు రచయిత. అంతేకానీ, దాన్ని ఆదర్శంగా తీసుకుని పాటించమని కాదు. ఉదాహరణకి ఎవరైనా రచయిత వేశ్యావాటికల్లో ఉండే ఒక మహిళ జీవితం గురించి రాయాలనుకుంటే అక్కడి వారి జీవితానికి, మనవాటికి సారూప్యత ఏ మాత్రం ఉండదు. ఆలోచనలు, వారి భాష కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. మనకి చాలా విపరీతంగా అనిపించినవి అక్కడ చాలా మామూలు విషయాలు. అక్కడ కూడా మనం మనకి చాలా తెలుసనేసుకుని మన అమూల్యమైన, విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తాం, ఆ పాత్ర వెనుక జరిగిన రీసెర్చ్ ని, దగ్గరగా చూసిన అనుభవాలను ఏ మాత్రం పట్టించుకోకుండా. మనకి తెలిసిన, మనం ఆలోచనా విధానాలు మాత్రమే ఉన్న మనుషుల గురించే చదువుకుంటూ పోతే వేరేవి తెలిసే అవకాశమే ఉండదు.

నీల చిన్నప్పుడు అనుభవించిన కఠిన పేదరికం మనమెవ్వరం అనుభవించలేదు. రచయిత కూడా అనుభవించి ఉండరు. కానీ అది కళ్ళకు కట్టినట్టు రాయడం లోనే రచయితల నేర్పు కనబడుతుంది. నీల చోళదిబ్బకి తిరిగి వచ్చాక అక్కడి సమస్యలను, ఎదుగుదలనూ తను చదివిన సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తుంది. అలా దేన్నైనా ఎవరి దృష్టి కోణం నుంచి వారు చూస్తారు. మన ఆలోచనలు మారే కొద్దీ ఆ దృక్కోణం కూడా మారుతుంది. కానీ అప్పటికే ముందున్న దృక్కోణం వల్ల తీసుకున్న నిర్ణయాలవల్ల నష్టం జరిగితే కొన్ని సార్లు దాన్ని పూడ్చుకోలేం. అదే జీవితం మనకి నేర్పేది కూడా.

నీల వ్యక్తిత్వం గురించి, ఆ కారెక్టర్ elevation గురించి, పరదేశీతో సంభాషణ వల్ల కలిగిన మానసిక సంఘర్షణ, సంభాషణల్లోని భాష చదివితే పుస్తకం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ముందుముందు ఏం ఉంది అనే ఉత్సుకతని మొదటి నాలుగు పేజీలే క్రియేట్ చేయడం బావుంది.

ఆధునిక ప్రపంచాన్ని తెలుగులో వర్ణిస్తే చదవడం ఇదే మొదటిసారి. చాలా కొత్తగా ఉంది. కొంతమందిని ఊరికే అలా చూస్తూనే జీవితం మీద ఆశ ఎందుకు రెట్టింపవుతుంది, ఇది నాకే అనిపిస్తుందా, అందిరికీనా అనే సందిగ్ధానికి తెర తీసినట్టైంది. కొన్ని వాక్యాలు చదువుతుంటే చాలా ఫ్రెష్ గా, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.”

అనేక చారిత్రక సంఘటనలు జరిగిన కాలంలో కూడా మనుష్యులు ఏవిధంగా ప్రవర్తించేవారు, ఆలోచించేవారు, పద్ధతులు ఎలా ఉండేవి అని చదివినప్పుడు ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేశారు, ఎక్కడ నుంచి చేశారు అనిపించింది.

మన వ్యక్తిగత జీవితాలలో కొన్ని సంఘటనలను మనం అనుభూతించినంతగా వ్యక్తపరచడం తెలియదు. వాటికి చాలా చోట్ల అక్షరరూపం ఉందీ పుస్తకంలో.

నైతిక విషయాలు, విలువలు పోత పోసినట్టుగా ఒకే మూసలో ఉండవు. వాటిని మానవీయ కోణంలో చట్టపరిధిలోనే ఎవరికి వారు నిర్వచించుకోవాలి, దానికి వారి నేపథ్యం అసంకల్పితంగా పని చేస్తూ ఉంటుంది.

సంపూర్ణ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఎదిగిన తీరు అద్భుతం. అది జరిగిన తీరును చాలా సహజంగా తీసుకొచ్చారు. నిర్లక్ష్యం చేసిన శుభాంజలిని రాజకీయ అనామకురాలిని చేయడంలో, రత్నాకర్ ని కూడా మించిపోయి అతన్నే తన చుట్టూ తిప్పుకోవడం, వ్యక్తిగత జీవితాన్నీ, రాజకీయాన్ని వేరు చేసి చూడడంలో ఫక్తు రాజకీయ నాయకురాలి లక్షణాలు కనబడ్డాయి. పులి కడుపున పులే పుడుతుందని సంపూర్ణ పాత్ర చెబుతుంది. ఆమె పైకి వచ్చిన విధానంమీద ఉన్న అభ్యంతరాలుంటే ఉండచ్చు. కానీ విపరీతమైన డబ్బు, చదువు, కుల బలం ఉన్నవారిని రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే అవి ఏమీ లేని వారికి చాలా పరిమితమైన మార్గాలుంటాయి.

ఏ పాత్ర కూడా దాని ప్రభావం అందరికీ అర్ధమయ్యేంత conspicuous గా లేకపోయినా ఒక అంతర్వాహినిలా దాని ప్రాధాన్యం అది సంతరించుకుంది.

నీల ప్రతీ అడుగు, అనుభవించిన ప్రతీ క్షణం కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయేమో కొంతకాలం వరకూ. సదాశివ అంత ఉన్నతంగా ఉండడం ఎలా సాధ్యమో కొంత ఆశ్చర్యానికి గురి చేసినా ఎన్నో చదివి, ఎంతో మందిని చూసిన మనిషి తర్కానికి విలువిచ్చి, విశాలంగా ఆలోచిస్తే అది సాధ్యమే అనిపిస్తుంది.
ఒక కావ్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలన్న తపనతో పోలిస్తే పేజీల సంఖ్య ఎక్కువేమీ కాదు. కల్పిత కధల్లో కనపడినట్టుగా కేవలం కధమాత్రమే రాసుకుపోకుండా ఆయా కాలాల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో జరిగిన సంఘటనలు, పాత్రలమీద వాటి జీవితాలమీద వాటి ప్రభావం ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టుగా కాకుండా విపులంగా చెప్పడం అంకితభావానికి నిదర్శనం.

ఉత్తరాంధ్ర పండగలు, ఆచార వ్యవహారాలు తెలియనివారికి కొత్తగా, ఆహ్లాదంగా ఉంటుంది. తెలుగులో నాకు తెలియని పదాలు చాలా ఉన్నాయనిపించింది.

This is my sixth book in the series. ఇంతకు ముందు నేను ప్రస్తావించిన ఏ రచయితకీ తీసిపోని రచయిత మల్లీశ్వరి గారు. Observation of life, character and the changes in it over the period of life due to changes are outstanding. ఎక్కడా సీరియస్ నెస్ కోల్పోవడం కానీ, బద్ధకించడం గానీ లేకుండా శిల్పాన్ని చెక్కినట్టు చెక్కారు పుస్తకాన్ని. Thanks for giving us this beautiful book.

I need to confess something here. I borrowed this book from a friend. పుస్తకం కొన్ని పేజీలు చదివాక చెప్పేశాను తిరిగివ్వనని.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s