యువకవి, కవిసంగమం, కవితా పత్రికలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అనిల్ డాని నీల నవలపై చేసిన విమర్శనాత్మక సమీక్ష
****************************
నీల – ఎట్టకేలకి పూర్తి చేశా. తానా బహుమతి పొందిన నవలలో ఒకటి నీల. కొంచం పెద్ద నవల – దాదాపు 500 పైగా పేజీలు. నీల అనే ఒక సాధారణ అమ్మాయి, ఏలూరు జూట్ మిల్లు కార్మికురాలి కూతురు. సాధారణంగా దిగువ మధ్య తరగతి కుటుంబం ఎలా ఉంటుందో అలాంటి జీవితం, కుటుంబం అంటేనే ఒడిదుడుకులని మధ్యతరగతి పిల్లలకి ఓపికగా కూర్చొబెట్టి ఎవరూ చెప్పనక్కరలేదు జీవితమే అంతా నేర్పిస్తుంది. చాలీ చాలని అన్నం తాగుబోతు నాన్న , అమ్మది మరో కధ, అసలు నీల చుట్టురా కొన్ని వలయాలు ఉంటాయి వాటిని చాలా నేర్పుగా నీల ఎలా విడదీసుకుంది అనేది ఈ నవల చెప్పింది. చాలా ధైర్యవంతురాలు నీల , అలాంటి ధైర్యవంతురాలైన స్త్రీ పాత్రలు చాలా ఉంటాయి వాటిలో కొన్ని నిజ జీవితంలో మనకీ ఎదురౌతాయి. వాట్లిలో ఆరంజ్యోతి అనే పాత్ర చాలా ఉదాత్తమైనది , అలాగే సంపూర్ణ అనే పాత్ర చాలా క్లిష్టమైన పాత్ర అవసరం ఏమైనా చేయిస్తుంది అని చెప్పే పాత్ర , ఇంక నీల తల్లి చంద్రకళ కొంచం ఆసక్తి కలిగిస్తుంది, ఆమే తప్పు చేసిందా లేదా అనే విషయం రచయిత కూడా స్పష్టంగా చెప్పలేదు, కాని ఆ పాత్ర మీద చాలా సానుభూతి ఉంటుంది. ఇంక సరళ చాల విచిత్ర మనస్తత్వమైన పాత్ర ప్రసాద్ అనబడే ఒకానొకప్పటి నీల భర్త తో ఆమె సంబంధం అదే సమయంలో నీలతో తన ప్రవర్తన ఇలాంటివి కొన్ని ఆమె పాత్రని సూచిస్తాయి, అలాగే లాయర్ వసుంధర పాత్ర కూడా చర్చించుకోవాలి నీల కి అండగా నిబడడం లో చాలా ముఖ్య భూమిక ఆమెది .
ఇంక ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినది రెండు పాత్రలు ఒకటి. పరదేసి రెండోది సదాశివ , మొదటి వ్యక్తి ని నీల వద్దనుకుంటుంది , రెండొ వ్యక్తితో అతను అడగగానే సహజీవనానికి ఒప్పుకుంటుంది, ఇక్కడ మరో స్త్రీ మూర్తి “పాష్టరమ్మ” అనబడే పాత్ర ని గురించి మాట్లాడాలి ఆమె తన గురించి కన్నా నీల గురించే ఎక్కువ తాపత్రయ పడుతుంది, నీల సహజీవనం అనే సూత్రీకరణకీ తాను అస్సలు ఒప్పుకోదుకాని నీల ఒప్పిస్తుంది , సదా ఇంటి మనుషుల నడవడికని చూసి నీల ని సమర్దిస్తుంది. నీల ఒక సామాజికం గా జరిగిన మార్పులని ప్రస్తావిస్తూ సాగిన నవల , దళితుల జీవితాలు , అలాగే మత్స్యకారుల జీవితాలు అందులోని లోటుపాట్లు కొంచం విపులంగానే చెప్పారు రచయిత.
పెద్ద నవల కావడంతో లోపలికి పోవడానికి మనకి కొంత సమయం పడుతుంది , కాని వెళ్లిన తరవాత మరలా బయతకి రాబుద్ది కాదు ఆ పాత్రల మధ్యనే తిరుగుతూ ఉంటాం. కొంత నిడివి తగ్గినా బావుండేది అని కూడా అనిపిస్తుంది,కాని దాదాపు మూడు దశాబ్దాల స్తితిగతులని వర్ణించాలంటే రచయితకీ ఆ మాత్రం స్పేస్ ఉండాలేమొ అని కూడా అనిపిస్తుంది , అవడానికి నవల అయినా రచయితలోని కవయిత్రి చాలా సార్లూ బయటకి వచ్చి మనల్ని అబ్బుర పరుస్తుంది చాలా కవిత్వాన్ని అలవోకగా ఈ నవలలోకి ఒంపేశారు జాజిమల్లి గారు ఒక రకంగా అది నవలలోని మూడ్ ని ఆఫ్ కాకుండా చేస్తుంది ఉదాహరణలు ఇవ్వాలంటే మరలా ఇంకో నవల రాయాలి .
అంతా బాగానే ఉందా అంటే కొంత భాగం లేదనీ చెబుతాని నా మొదటి కంప్లైంట్ స్టాలిన్ సూర్యం పాత్రని అలా మధ్యలో వదిలేయడం నీల అతడినీ చివరివరకూ హీరోలానే చూస్తుంది. ఇంకపొతే ఆటోరాజు చంద్ర కళ మధ్యన బంధం ఎలా మొదలైందో అని పాఠకుడు కాస్త ఆలొచనలో పడతాడు , స్త్రీల మీద పాజిటీవ్ ఒపీనియన్ ఉన్నవాళ్లకి కొన్ని స్త్రీ పాత్రలు ఆలోచనని రేకెత్తిస్తాయి నీల కూడా కొన్ని సార్లు బేలగా మారుతుంది ముఖ్యంగా పరదేసీ పరిచయం అప్పుడు ఆమె పాత్ర ఎందుకో ఇంకా కొంచం బలంగా ఉంటే బావుండు అనిపించింది అలాగే వసుంధర గారి దగ్గర ఉన్నప్పుడు పరిచయం అయిన సదా వారిద్దరి అనుబంధం గురించి చెప్పినప్పుడు పరదేశి వద్ద చేసిన ఒప్పందం గురుతొచ్చి మరలా తనకి తాను పునరాలోచనలో పడుతుంది ఇది కొంత సంక్లిస్టమైన అంశం (పాఠకులకి చదివితేనే తెలుస్తుంది) ఇంక పూర్తిగా విస్మరింపబడిన పాత్ర “మినో” నీల కూతురు . నీల జీవితం అన్ని మలుపులు తిరుగుతున్నా కూతురి ప్రస్తావన చాల అతి తక్కువ సందర్భాల్లో వస్తుంది సాధారణంగా తల్లి హృదయం అలా ఆ పిల్లని చూస్తూ ఊరుకోలేదు కదా కాని మరెందుకో మినో ఆఖర్లో వచ్చి ఈ తరం ప్రతినిధిగా ఎదో కొంచం హడావుడి చేస్తుంది తప్ప మిగతా ఎక్కడా కనపడదు . కవర్ పేజీ కూడా ఇంకాస్త శ్రద్ద తీసుకుంటే బావుండు అనిపించింది.
ఏది ఏమైనా అసలు సాహిత్యమే లేదు ఇంకా నవలలు చదవడం ఎక్కడా అని వాదించే వారికి ఈ తానా బహుమతి నవలలు చూపించాలి ఎంత గొప్ప థీం తో ఎంపిక చేసారు ఇవి తప్పక చదవాల్సిన నవలలు చదివి సామాజిక మార్పుల గురించి చర్చించాల్సిన నవలలు రచయితలకి గొప్ప పేరు ప్రఖ్యాతలు రావాలి ఈ నవలల వలన అని ఆశిస్తూ .. రచయితలకి నా అభినందనలు