నవతరంతో యువతరం

ప్రకటనలు

2 thoughts on “నవతరంతో యువతరం

 1. రచయిత్రి శ్రీమతి మల్లీశ్వరి గారికి,

  నమస్కారములు. మీరు ఇటీవలి కాలంలో నవతరంతో యువతరం పేరుతో విశాఖ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమం గురించి వినియున్నాను. చాలా మంచి ఆలోచనతో మీరు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం. కవులను, కళాకారులను బాలలకు పరిచయం చేయడం, బాక్సైట్ ప్రభావిత ప్రాంతాల్లో చైతన్య యాత్ర నిర్వహించడం మొదలైన విషయాలు రేపటి లక్ష్యానికి ముందుగానే ఒక బాటను వేస్తున్నట్లు నాకు అనిపించింది. ఈ క్రమంలో మీరు అన్యధా భావించకుంటే కొన్ని సూచనలు చేయాలని భావిస్తున్నాను.

  నిజం చెప్పాలంటే.. సామాజిక అంశాల పట్ల బాలలకు చైతన్యం కల్పించడం నేడు అత్యవసరంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన బాధ్యత. కేవలం బాలలను చదువు అనే ఒకే ఛత్రం చాటున మాత్రమే బంధించేయక, వారికీ తమ చుట్టు పక్కల జరుగుతున్న విషయాల పట్ల అవగాహన కల్పించడం, ఆ అంశాల మీద వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనం ముఖ్యంగా తెలుసుకోవడం ఎంతో అవసరం. అందుకు ఇలాంటి కార్యక్రమాల ఆవశ్యకత ఎంతో ఉంది.

  1.పాశ్యాత్య దేశాలతో పోల్చుకుంటే, పాఠశాలల్లో లిటరరీ క్లబ్బులు లేదా స్టోరీ టెల్లింగ్ వర్క్ షాపులు జానపదాలకు, కథలకు ఘనచరిత్ర ఉన్న మన దేశంలో తగ్గుముఖం పడుతున్నాయి. అందుకే మీరు చేస్తున్న కార్యక్రమాల లాంటివే ప్రతి పాఠశాల చేయాల్సి ఉంది. వీలైతే మీరు కొన్ని పాఠశాలలతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు మీకున్న పరిధిలో ప్రతి వారం చేయండి. ప్రతి వారం మీకున్న పరిధిలో నవతరాన్ని యువతరానికి పరిచయం చేయండి

  2. అలాగే సాహిత్య సంఘాలు రెగ్యులర్‌గా నిర్వహించే సభలకు పాఠశాలలు, కళాశాలలను ఎందుకు వేదికగా చేసుకోకూడదు. విద్యార్థులకు సాహిత్యం పట్ల ఈ విధంగా కొంత అవగాహన కల్పించవచ్చు. (అయితే ఎంతవరకు పాఠశాల యాజమాన్యాలు ఇలాంటి విషయాలకు మొగ్గు చూపుతాయన్నది మరో ప్రశ్న. అయితే ఇలాంటి వాటికి మొగ్గు చూపించే యాజమాన్యాల సహాయంతోటే ఏదో ఒక చోట కార్యక్రమం నిర్వహించవచ్చు)

  3. మరీ ముఖ్యమైనది.. పిల్లల్న చైతన్యవంతుల్ని చేయడం. రేపటి పౌరులుగా వారు తీసుకోవాల్సిన బాధ్యతలను గురించి చెప్పడం. అందుకు తగ్గ సాహిత్యాన్ని వారికి అందివ్వడం లేదా వారినే సామాజిక సమస్యలపై స్పందించేలా చేసి, చిన్నారులు రాస్తున్న సాహిత్యాన్ని బ్లాగుల ద్వారా లేదా అంతర్జాలం ద్వారా వెలుగులోకి తీసుకురావడం. ఇలా చేయడం ద్వారా వారికంటూ సమాజం పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. మనమూ ప్రోత్సహించినట్లవుతుంది.

  3.ఇంకా కథల ద్వారా పిల్లలకు సైన్సు బోధించడం, రచయితలే వారానికో గంట విద్యార్థులకు ఏదో ఒక అంశంపై క్లాసు తీసుకోవడం.. ఇలాంటివన్నీ కూడా. అంటే పాఠశాలల్లో క్రీడలకు ఎంత ప్రాధాన్యమిస్తారో.. సాహిత్యానికి అంతే ప్రాధాన్యమివ్వడమన్న మాట.

  ఏదేమైనా.. విద్యాసంస్థలు, సాహిత్య సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో కొంతవరకు కలిసి పనిచేస్తూ, విద్యార్థులకు మంచి పౌరులుగా తీర్చదిద్దడానికి ప్రయత్నించినప్పుడే ఈ లక్ష్యాలు నెరవేరగలవు.
  మీ నవతరంతో యువతరం కార్యక్రమం ఇలాంటి లక్ష్యాలకు ఒక మేలుకొలుపు లాంటిది. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ప్రయోగాత్మకంగా మరిన్ని మంచి కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టవచ్చు

  (నేను కూడా విశాఖ వాసినే. మీలాగే సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న వ్యక్తిని. గతంలో మొజాయిక్ వారు నిర్వహించిన ఓ సభలో మిమ్మల్ని కలవడం జరిగింది. అలాగే జాజిమల్లి పేరుతో మీరు రాసిన బ్లాగు కథల పుస్తకం కూడా నేను చదావాను. మీరు విశాఖలో నిర్వహించిన కార్యక్రమం నాలో కూడా ఏదో తెలియని స్ఫూర్తిని నింపింది. అందుకు ధన్యవాదాలు)

  ఇట్లు మీ భవదీయుడు -కొయిలాడ బాబు, ప్రతిలిపి స్వీయ ప్రచురణల వేదిక, తెలుగు విభాగం, బెంగళూరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s