చందుకి ప్రేమలేఖ

 

10593187_339391956211686_6969809013156318554_n

చంద్రమా
నాలుగు రోజులనుంచీ ఒకటే ఆలోచన… ఈ రోజుకి నీకేం బహుమతి ఇవ్వాలా అని. పాతూరి పూర్ణచంద్రరావు,అనూరాధలకి కూడా చెప్పా పెట్టకుండా పద్దెనిమిదేళ్ళ కిందట నన్ను నేనే నీకు జీవితకాలపు బహుమతిగా (జోకులెయ్యకేం.. ప్లీజ్.. ) ఇచ్చుకున్నాక కొత్తగా ఏమివ్వగలనన్న నిస్సహాయత ఒకటి.

అయినా సరే ప్రేమగానో తప్పనిసరిగానో నన్ను నాకు ధారాళంగానే తిరిగి ఇచ్చావు కదా.. అక్కడ నిలబడి ఇట్లా ఆలోచిస్తున్నా.. విను మరీ!

పొరుగింటి మీనాక్షమ్మలాగా ముద్దూముచ్చట్ల గురించీ నగలూ చీరెల గురించీ నిన్ను సాధించి పోసి, అట్లా నీ అహాన్ని సంతృప్తి పరిచే బహుమతిని ఇవ్వాలనే ఉన్నది

రాత్రిళ్ళు ఆలస్యంగా వొస్తేనో ,స్నేహితులూ బంధువులతో గడిపితేనో వందసార్లు ఫోన్ చేసి ‘పెళ్ళాం పిల్లా ఇల్లూ పట్టరా’ అంటూ ఇల్లు పీకి పందిరేసే ప్రేమని బహుమతిగా ఇవ్వాలనే ఉన్నది

చందూ , ఏయ్ఓయ్ ,ఏరా ఒరే అన్న గీర పిలుపులు కట్టిపెట్టి ఒద్దికగా చీర కొసలు వేలికి చుట్టుకుంటూ ,వీలయితే తలుపు చాటు చేసుకు నిలబడి గోముగా ‘ఏవండీ’ అంటూ నాటకీయతని బహుమతిగా ఇవ్వాలనే ఉన్నది

కానీ ఏం చేసేది !
నువ్వు మరీ బంగారు తండ్రివి!

బైటపని , ఇంటిపని , వంటపని ,పిల్లపని ఇష్టంగా చేసే స్వీట్ హొమ్ బుచ్చిబాబువి
ఎవరు సాయానికి పిలిచినా బిరబిరా ప్రవహించి వొంట్లో రక్తాన్ని కూడా తోడిచ్చేసే దానకర్ణుడివి
నవ్వో, దయో, అందమో, కారుణ్యమో పలకరిస్తే చాలు చప్పున కళ్ళు తడిదేర్చుకునే నీటిమేఘానివి

ఇల్లాంటి నీకు నేనేం కానుక చేస్తాను గానీ…
అపుడెపుడో ‘సాయం’కాలం జన సమ్మర్ధంలో ఒక తోవ చేసుకుని నేను నీ భుజం మీద చేయి వేసుకుని ధీమాగా నడుస్తుంటే ఆ కాలం ఆగకూడదని మరి నాలుగు వీధులు ఎక్కువ తిరిగాం కదా. అల్లాగే మరి నాలుగు దశాబ్దాలు స్నేహితులకి మల్లే స్వేచ్చగా కలిసి నడుద్దామన్న ఊహని బహుమతిగా ఇస్తున్నాను
ప్రియచందూ…
పుట్టినరోజు శుభాకాంక్షలు

(2014 ఆగస్ట్, 05  నాడు ఫేస్ బుక్ లో రాసిన పోస్ట్. ఈ మధ్య నా బ్లాగ్ ని చూసి పశ్చాత్తాపం కలిగింది. అక్కడా ఇక్కడా జల్లేసినట్లు ఉన్న నా జ్ఞాపకాలు ఇక్కడ సేవ్ చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాను.)

4 thoughts on “చందుకి ప్రేమలేఖ

  1. నిజం చెప్పొద్దూ, మీరు ఇన్ని వ్రాస్తూ, అదీ మీ పాపాయి గురించి వ్రాస్తున్నప్పుడు కూడా చందు గారికి ఫాన్స్ ఉంటారు, వాళ్లకి కొంచెం అన్నా పరిచయం గా ఒక ముక్క బ్లాగు లో వ్రాయడం లేదని, మరీ స్వార్ధం గా దాచేసారన్న పేచీ నుండి మొత్తానికి తప్పించుకున్నారు 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s