ఈ తరం పాఠకుల కోసం ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఒక మంచి కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. చాసో ,కొకు, పి. సత్యవతి, కేతు విశ్వనాథ రెడ్డి, ఓల్గా వంటి పది మంది ఉత్తమ రచయితల కథల్లో పదింటిని ఎంపిక చేసి కథా స్రవంతి పేరున విడి విడి సంపుటాలుగా ప్రచురించింది. పది పుస్తకాలకీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు గౌరవ సంపాదకులుగా వల్లూరు శివప్రసాద్ గారు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. ఒక్కో పుస్తకానికి సంపాదకత్వ బాధ్యతలు కొంత మంది రచయితలకూ విమర్శకులకు అప్పగించారు.
అట్లా, పి. సత్యవతి గారి పుస్తకానికి నేను సంపాదకత్వం వహించాను. కథల ఎంపిక, సంపాదక వ్యాసం, పరిచయ వాక్యాలూ ఇట్లా అన్నింటిలో నా స్వేచ్ఛను గౌరవించిన వల్లూరి వారికీ, ఒకే మాట ఒకే బాటగా ఎంపికకు సహకరించిన పి.సత్యవతి గారికీ కృతజ్ఞతలు. సత్యవతి గారి పుస్తకంతో సహా మిగతా పుస్తకాల ఆవిష్కరణ 29-12-2014 తేదీన గుంటూర్ నందు జరుగుతుంది. సత్యవతి గారి పుస్తకం పై నేను మాట్లాడవలసి ఉన్నది. అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నా. దగ్గరలో ఉన్న మిత్రులు,వీలు కుదిరిన వారూ ఈ కార్యక్రమానికి తప్పక వెళ్ళగలరు. సత్యవతి గారూ అభినందనలు. మిస్ యూ ఎలాట్ …