అక్క వెళ్ళిపోయింది

అక్క వెళ్ళిపోయింది

నలుగురిని ముగ్గురు చేస్తూ.. రెండేళ్ళ కిందటి జాజిమల్లి పాఠకులకి మా నలుగురక్కాచెల్లెళ్ళ పై నేను రాసిన కథలు గుర్తు ఉండే ఉంటాయి. ఒక ఖాళీని తడుముకునే ప్రయత్నం చేస్తుంటే అక్క వ్యక్తిత్వపు హిమవన్నగం దొరికింది మాకు. దానినే పుస్తక రూపంలో మిత్రులందరితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. పిడిఎఫ్ లో ఉన్న ఈ పుస్తకాన్ని మీకు అందుబాటులో ఉంచుతున్నాను

మల్లీశ్వరి

prayanam final

 

cover page

cover page

ప్రకటనలు

80 thoughts on “అక్క వెళ్ళిపోయింది

 1. మిమ్మల్ని వదిలి వెళ్ళినా, మీ చెంతే తన మనసు వదిలి వెళ్ళిన మీ అక్కయ్య జ్ఞాపకాలే మీకు కలకాలం తోడు.ఒకరికోసం ఒకరు అన్నట్లుగా ఉండే మీరు ఎన్నటికీ విడిపోరు.మిగిలిపోయే ఆ జ్ఞాపకాలు ఏనాడు మనసుని వీడిపోవు.
  మాటలు రావట్లేదండి:(

 2. మల్లీశ్వరి గారూ, మీ జాజిమల్లి బ్లాగ్ కతలు పుస్తకం లో “నలుగురు అక్కా చెల్లెళ్ళం”అని గర్వం గా చెప్పుకుంటుంటే అదేదో నాకొక్కదానికే చెప్తున్నంతగా ఆ ఫీలింగ్ ని నేను own చేసుకుని సంతోషించాను.

  ఈ వార్త వినడం చాలా బాధా కరంగా ఉంది. కానీ మీరు చేసిన పని చాలా మంచి పని, గొప్ప పని! మనుషుల మీద మమతల మీద మనసుల్లో గౌరవాలు లేకుండా, పోయాక మాత్రం గ్లాసులు చెంబుల మీద పేర్లు కొట్టించి పంచే సంస్కృతి కి మీరు చరమ గీతం పాడారు కనీసం మీ ఇంట్లో! ఒక మనిషి తో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని అక్షర బద్ధం చేసి , పదే పదే ఆ జ్ఞాపకాల పరిమళాన్ని ఆఘ్రాణించే అవకాశం కల్పించుకున్నారు!

  మీ బాధను !తగ్గించలేం! కానీ మీ జ్ఞాపకాలు అనుభవాలు చదివి, మీ పెద్దక్కను మీతోనే ఉంచుకునే మీ ప్రయత్నాన్ని మాత్రం అర్థం చేసుకుని మీ బాధను కొంత మేమూ పంచుకోగలమనుకుంటాను !

  • సుజాత గారూ,
   జాజిమల్లి కతలు రాసిన నాటి నుండీ మీరు నలుగురక్కాచెల్లెళ్ళలో ఒకరని తెలియడం వల్లనో మీ నిక్కచ్చితనం వల్లనో ఒక అటాచ్ మెంట్ ఉండేది అక్క పరిస్థితి బాగులేనపుడు ఓ సారి మీరు గుర్తొచ్చారు. అపుడు జంపాల చౌదరి గారికి మెయిల్ లో అనుకుంటా అడిగాను మనసులో మాట సుజాత గారు ఎక్కడా కనపడడం లేదు అని. మీరు రీసెంట్ గా బ్లాగ్ పోస్ట్ ఒకటి రాసారని కూడా ఆయన చెప్పారు. మనం ఎపుడూ కలవలేదు కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు.మానవ సంబంధాలు ఇంత గొప్పగా ఉంటాయని తెలియడం చాలా సంతోషాన్ని ధైర్యాన్ని ఇస్తుంది

 3. కేన్సర్ గురించి, ఆ మహమ్మారి పెట్టే బాధనూ స్వయంగా బాగా దగ్గరగా చూసి ఉన్నాను కాబట్టి నేను ఆ బాధను, మీ అందరి ఆవేదననూ అర్థం చేసుకోగలను. మా మేనమామ గారు బోన్ కేన్సర్ తోనూ, మా మామగారు లివర్ కేన్సర్ తోనూ నరకం పడ్డారు! శిలాప్రతిమల్లా వాళ్ల బాధను చూస్తూ కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయులుగా ఉండిపోయేవాళ్ళం చుట్టూ ఉన్నవాళ్ళం! మా మావయ్య అయితే మీ అక్కగారి లాగనే ఎన్ని పంపకాలు అప్పగింతలూ చేసి వెళ్లాడో! ఓ పుస్తకంలో ప్రతివారి పేరునా ఒక జాబు,అప్పగింతలూ,వారితో చెప్పవలసిన విషయాలు రాసిపెట్టారు. దానికి సీలు వేసి నా తదనంతరం చదవవలసింది అని రాసిపెట్టారు. వాళ్ళిద్దరూ కూడా స్వభావరీత్యా ఎంతో మంచివారు. చీమకు కూడా అపకారం తలపెట్టనటువంటి ఉత్తములు. మరి దేవుడు అలాంటివారినే ఎందుకు త్వరగా తీసుకుపోతాడో… దేముడినే అడగాలి!!

  ఇంత మంచి చెల్లెళ్ళున్న మీ అక్కగారు ధన్యురాలు. ఇంతమంది ఆప్యాయతానురాగాలతో సాగనంపారు కాబట్టి తప్పకుండా ఆవిడ ఆత్మకు శాంతి కలిగిఉంటుందనడం లో సందేహం లేదు. ఆవిడకు మీరిచ్చిన ఈ నివాళి చాలా గొప్పది. ఆవిడ చూపిన సాహసం ఎందరికో ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. అలానే ఆవిడ స్మృతులే మీ అందరికీ ఓదార్పుని ఇస్తాయనీ అనుకుంటున్నాను. ఎందుకంటే మనిషికి మరణం ఉంది కానీ జ్ఞాపకాలకు మరణం లేదు!

  • తృష్ణ గారూ,
   మీ జ్ఞాపకాలను పంచుకోవడం బాగుంది.
   బోన్ కాన్సర్ లివర్ కాన్సర్ లు చాలా పెయిన్ ఫుల్ గా ఉంటాయి. అంతటి నరకాన్ని కూడా ఎదిరించగలిగిన మరి ఇద్దరు గొప్ప వారి గురించి మీ ద్వారా తెలుసుకున్నాము. వారికి వందనాలు

 4. అక్కా చెల్లెళ్ళ సంభందం అముల్యమైనది. తొక్కుడు బిళ్ళ దగ్గర నుంచీ పెళ్ళయ్యాక వచ్చిపడే వడిదుడుకల దాకా ఎన్నో పంచుకుంటాం. ఒకరి జీవితాలలో ఒకళ్ళం పెనవేసుకుని పోతాం. అలాంటి తోబుట్టువు వేల్లోస్తానని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతే, ఆ ఖాలీ ఎప్పటికి అలాగే ఉండిపోతుంది. ఆ ఖాలీ నిండా జ్ఞాపకాలు, కొంత కన్నీరు ప్రవహిస్తూ ఉంటాయి.
  స్త్రీలలో ఎంతో శక్తి దాగుంటుంది. పైకి ఏమి తెలీని అమాయకులుగా కనిపిస్తున్నా, వారికి అన్నీ తెలుసు. కష్టం తెలుసు, కన్నీరు తెలుసు….వాటిని ఎదురుకోవటం తెలుసు. మీ అక్కగారు మరో ఉదాహరణ.
  గిన్నెలు, తపాలాలపై పేరు రాపించి పంచిపెట్టకుండా ఇలా ఆవిడ వ్యక్తిత్వాన్ని, ధైర్యాన్ని, వీడ్కోలు చెప్పిన విధానాన్ని అక్షర రూపంలో అచ్చేసి ఎంతో ఎంతో మంచి పని చేసారు.
  మనసంతా చెమ్మగా, దేవుడిపై కోపంగా, మన బంధాలపై ప్రేమగా…ఇంకా ఎలా చెప్పాలో తెలిట్లేదు.

  • ప్రవీణ గారూ,
   ఈ పుస్తకం వేయాలన్న ఆలోచన మా చిన్నక్క చేసింది. రెండు రోజులు అదే పని మీద కూచున్నపుడు ఫోన్ల ద్వారా చిన్నమ్మ విజ్జి భూమి అడుగునున్న జల పైకి వూరుతున్నట్లు అక్క గురించి చెపుతూనే ఉన్నారు వాళ్లిద్దరే మూల కారణం నేను వాళ్ళు చెప్పిన పని చేసాను.మీరు ఈ పుస్తకపు సారాంశాన్ని చక్కగా చెప్పారు

 5. మీ బ్లాగ్ కథల్లో చదివినపుడు కొద్దిగానే తెలిసిన మీ పెద్దక్క గురించీ, ఆమె వ్యక్తిత్వం గురించీ ఇప్పుడు ఇంకా వివరంగా, స్పష్టంగా తెలిసింది.

  ఎప్పటివో సండే మ్యాగజీన్ల కట్టలు తీసి వాటిని తాను చదవలేకపోతున్నానన్నపుడూ, మరికొన్ని సందర్భాల్లోనూ బాధ కలిగింది. అంత పెద్ద కష్టం చుట్టుముట్టినా నిబ్బరం కోల్పోని ‘అమాయకురాలి’ని, మేమెవరమూ ఇంతకుముందు చూడని వ్యక్తినీ మా కళ్ళ ముందుంచారు.

 6. ఏమిటో నిన్న మర్చిపోయాను(మా మావయ్య వెళ్పోయి పదిహేనేళ్లయిపోయింది).. అప్పుడు మా నాన్నగారు కూడా ఇలానే “చిన్నన్నయ్య”(ఎనిమిదిమంది సంతానంలో ఆయన రెండో అన్నగారు) అని మా మావయ్య గురించి ఒక చిన్న పుస్తకం రాసి ప్రింట్ చేయించి బంధువులందరికీ ఇచ్చారు..!

 7. పెద్దక్క ప్రయాణం పుస్తకాన్ని ఆత్మీయ మిత్రులు దేవినేని మధుసూదనరావు గారు తన మిత్రులకి షేర్ చేసారు. వారి నుంచి వచ్చిన స్పందనల్ని పంపారు. బ్లాగ్ లో పోస్ట్ చేయడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు

 8. Dear madhusudanarao garu, thankyou for sending the happy memories of peddakka. it is not a simple task to undergo the tragedy of losing someone who is so dear and near.The sisters and brothers are the real gifts of God. I respect the courage with which the great soul tackled the merciless desiege .my heartfelt condolences to that family. Regards.
  సోమరాజు సుశీల

 9. Dear Madhusudana Rao garu,
  Thanks a lot for sharing the item.
  It is really a great tribute by the three sisters to their sister on her death.
  Tears rolled down my cheeks while reading the sentences ‘ Elurlo smasaanam chaalaa irugga untundi…. kaastha vishaalamgaa unde chota dahanam chesthe baagundunu’.
  Hats off to her courage.
  Regards,
  C. Ravindrakumar
  author of katha chitralu bathuku paataalu

  • శారద గారూ
   ఈ పుస్తకంలోనే ముందుమాట లో రాసాను మానవ సంబంధాలలోని సానుకూల అంశాలను ఎన్నిసార్లు చదివినా కళ్ళు తడి చేసుకునే మనుషులం కదా మనం అని. మీ స్పందన దానికి బలం చేకూర్చింది

 10. hello Madhugaru,

  Thanks for sharing this story. Much appreciate it.
  I am gobsmaked and wept while reading it. I felt like I am reading my own family story as there are so many similarities in the journey.
  Probably those three sisters will understand me more than anyone else. People asked me so many times why am I spending my hard earned money to organise cancer awareness programs for everyone without expecting anything back from anyone.
  The answer lies in this story.
  Once again, thank you so much for sharing a beautiful story.
  Convey my regards to your wife.
  Regards,
  Sharon

 11. మీరు అపురూపంగా వ్రాసుకొన్న బ్లాగులే మీ అనుబంధాలు ఎంత ధృఢమయినవో చెపుతాయి. మీ పెద్దక్క వెళుతూ మీ ప్రేమ గాధతలు మా దాకా వచ్చేట్లు చేసి వెళ్ళారు .

  తను వెళ్ళాక కూడా మీతోనే ఉండాలని, మిమ్మల్ని వదిలి వెళ్ళలేని తన అసక్తతను తన అంత్య క్రియలు జరపాల్సిన చోటును పట్టుబట్టడం ద్వారా చెప్పారు. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా అది నెరవేరింది , కాబట్టి తన కోరికను జరపలేకపోయామన్న బాధ అస్సలు అవసరం లెదు.

  ఇక తన అవయవాలు సంగతికొస్తే , తన భావాలు , బాధ్యతగా వెళ్ళిన స్తైర్యం ఇంతమందిని చేరి మార్గదర్సకం చేస్తుండగా ..ఇది నలుగురికి అవయవాలు ఇవ్వడం కన్నా గొప్ప. అలా నలుగురిలో కన్నా నాలుగు వేల మందిలో తను స్పూర్తిని కలిగించిన్ది. మీ నలుగురిలో ఒకరి గా పుట్టడం తను చేసుకొన్నా అదృష్టం కూడా, తనకోరికలు తను ఆశించిన తీరుకన్నా బాగా నెరవెర్చారు. మిమ్మలన కన్న అమ్మా నాన్న ధన్యులు

  ఏ కాలం లో నయినా అమాయకత్వం తెలియని తనం, పెద్దల మరియు శాస్త్ర సంప్రదాయాలనుమ్ది పిల్లలకి వస్తాయని నా అనుకోలు . కాబటి ఒకరి అమాయకత్వానికి కేవలం సమాజమే మొదటి కారణం కాని ఒక్క రో , కుటుంబమో కాదు.

  ఉదాహరణకి, పెద్దక్కకి వచ్చిన వాపు ఇంకెక్కడయినా అయితే తప్పకుండా ఇంకొకరితో పంచుకొని ఉన్దెది. కాని ఈ సమాజం స్త్రీని ఇంకా శాస్త్ర సంప్రదాయాలపెరుతో కట్టి పడేసింది . ఆడపిల్ల రొమ్ము ఇంకొకరికి చూపించడానికి మొహమాటపడే తరంలోనే కదా పెద్దక్క పుట్టింది???

  స్త్రీ అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే సిద్దాంతాలు , శాస్త్రాలే ఈ రోజు తను వెళ్ళిపోవడానికి కారణం కాదా ???

  పుస్తకం గురించిన బ్లాగులో ఇది అడగోచ్చూ లేదో తెలియక వ్రాస్తున్నాను . అభ్యంతరం లేకుంటే ప్రచురించండి .

  • నిజమే మౌళీ,
   ఎన్ని ఫోన్ కాల్స్ ఎస్సెమ్మెస్సులు మెయిల్స్ తన స్ఫూర్తి ద్వారా చిరంజీవిగా మారింది.
   శరీర దానం,నేత్రదానం సామాజిక చైతన్యానికి గుర్తు కదా ఆ కోరిక తీర్చ గలిగితే బావుండేది.
   మీరు రైజ్ చేసిన పాయింట్ మరి అయిదారుగురు కూడా అడిగారు. అడగకూడని, చర్చించకూడని విషయాలని అనుకోలేదు. తప్పకుండా మాట్లాడాలి

   • @శరీర దానం,నేత్రదానం సామాజిక చైతన్యానికి గుర్తు కదా ఆ కోరిక తీర్చ గలిగితే బావుండేది.

    ఇంతకు ముందు వ్యాఖ్య వ్రాస్తున్నపుడు సందిగ్దం ఉంది, అది మీ సమాధానం తో తీరినట్లే అనుకుంటున్నా . అమ్మ కూడా రెడ్ క్రాస్ కి కళ్ళు డొనేట్ చేసారు,20 సంవత్సరాల క్రితం , అది విన్న వెంటనే మా తాతయ్య కళ్ళ నీళ్ళు పెట్టుకొన్నారు. అసలు అది కుదూరుతున్దా అన్న మీమాంస మాత్రం పై వ్యాఖ్య లో చేరింది . తనే డొనేట్ చేసారు కాబట్టి తన హక్కుఅవుతుంది అనిపిస్తుంది ఇప్పుడు . అలా ఎవరికి వారు నిర్ణయం తీసికొని పలానా సంస్థకి తెలియపరచడం అన్నది చాలా పరిస్థితులకు అనుబంధమై ఉంటుంది.

    ఇప్పటికీ కోరిక, నిర్ణయం వేరు వేరు అనుకుంటున్నాను తన నిర్ణయాలన్నీ పాటిస్తున్నారు, అది చాలు

 12. మల్లీశ్వరి గారు.. ఇప్పుడే చదివాను. చాలా బాధ కల్గింది . కేన్సర్ తో బాధపడిన “అమ్మ ” జ్ఞాపకాలు ఇక్కడ “నాగవల్లి” గారి దృఢ చిత్తంలో చూసాను. మీ అక్కచెల్లెళ్ళ అనుబంధం బావుంది. “మనుషులు చనిపోయి జ్ఞాపకాలలో బ్రతికి ఉండటం నిజం .ఈ అక్షర రూపంలో మీరు ఇలా పంచుకున్న తీరు చాలా బావుంది. ఇలా జరిగిందన్నమాట.. లో ఇంత గొప్ప సందేశాత్మక
  అనుబంధం చూసి కనులు చెమర్చాయి. మధ్య తరగతి మనుషుల మధ్య అనుబంధాలే నిజమైన ఆస్తులు. పంచుకోవడానికి స్థిరాస్తులు,చరాస్తులు కూడా అవే! మీరు చాలా సుసంపన్నులు. “నాగవల్లి” గారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్దిస్తూ..
  స్త్రీలకి శరీరం పై శ్రద్ద ఉండాలి .. తప్పక అందరూ ఇది గుర్తెరగాలి .

  • వనజ గారూ
   మీ తల్లి గారికి కూడానా!
   ప్రతి కుటుంబం లోనూ ఇలా వింటూనే ఉన్నాం. అవునండీ మన శరీరం పై మనకి శ్రద్ధ లేకపోవడం ఎంత నష్టమో అక్క ఉదాహరణ లో తెలిసింది.
   ఇందాక కథా రచయిత్రి నా స్నేహితురాలూ వినోదిని ఫోన్లో మాట్లాడుతూ ఒక మాట అంది వనజ గారూ ” ఇన్నేళ్ళ మీ అక్క చెల్లెళ్ళ అనుబంధం నుంచి మీరు బేలతనాన్ని కాక ఒక బలాన్ని పొందారు. అందుకే విషాదం లో కూరుకు పోకుండా వెంటనే ఒక పని లోకి దిగి తన స్ఫూర్తిని కొనసాగించారు ” అని
   ధన్యవాదాలండీ

 13. మల్లీశ్వరి గారూ, విషయం తెలిసి చాలా బాధ అనిపించింది. మీ బ్లాగ్ పోస్టుల్లో మీరు రాసుకున్న మీ అక్కాచెల్లెళ్ళ ముచ్చట్లు నాకు చాలా ఇష్టమయినవి. నాకు స్వంత అక్క చెల్లెళ్ళు లేనందుకు బాధ పడినది అపుడే. మీరు నాతో మొదటిసారి మాట్లాడినపుడు మా అక్క పేరు కూడా ‘నాగవల్లి’ అని మురిపెంగా చెప్పటం నాకు చాలాసార్లే గుర్తుకు వచ్చేది. దానితో పాటే మీ అక్కా చెల్లెళ్ళ ముచ్చట్లూనూ.

  అమ్మతో కూడా చెప్పుకోలేనివి అక్క చెల్లెళ్ళతో చెప్పుకుంటారు అంటారు. ఆ అనుబంధమే వేరు. మీ అక్క వ్యక్తిత్వాన్ని , ధైర్యంతో పరిస్థితులను అర్ధం చేసుకుని వాటిని ఆమోదించిన తీరు చాలా విభిన్నమూ, విలక్షణమూనూ. స్థితప్రజ్ఞత అంటారే, అది కలిగిన వాళ్ళకే అది సాధ్యమయ్యేది. మీ అక్క లేని లోటు తీర్చలేనిది. కానీ మీ జ్ఞాపకాల సౌరభాల్లో, ఆవిడ నుంచి మీ అందరూ పొందిన స్ఫూర్తి లో ఆవిడ ఎప్పుడూ చిరంజీవే.

  మీరు మీ పెద్దక్క గురించి, మీ అనుబంధం గురించి మీకే కాదు, చాలామందికి ఎప్పటికీ గుర్తుండేలా అక్షర రూపం ఇచ్చి చాలా మంచి పని చేసారు. ఇది ఒకరకంగా ఆవిడ పిల్లలకూ, మీ మిగిలిన అక్కాచెల్లెళ్ళ పిల్లలకూ కూడా ఆవిడ గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికీ, పదే పదే తలుచుకోవడానికీ ఒక అపురూపమయిన కానుక.

  మీరందరూ, ముఖ్యంగా మీ అమ్మా నాన్న గార్లు ఈ విచారం నుంచి త్వరగా కోలుకునే శక్తిని మీకు ఇమ్మని ఆ దేవదేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • పద్మవల్లి గారూ
   ఆ సంభాషణ నాకు కూడా గుర్తుంది నాగవల్లి పేరు అరుదు కదా వినగానే అపుడు భలే సంబరం కలిగింది.
   మా తరువాతి తరం పిల్లలకి ఒక జ్ఞాపిక కదా ఈ పుస్తకం బావుంది.
   ఇట్లా ఒక్కో వ్యాఖ్యకీ ప్రతిస్పందిస్తుటే అంతా ఒకే చోట కూచుని మాట్లాడుకున్నట్లే ఉన్నది
   ఈ బ్లాగులూ సాహిత్యం ఇవేమీ తెలియని అక్కయ్యలకి అమ్మా నాన్నలకి ఇవన్నీ చదివి వినిపిస్తాను
   వ్యక్తి గత పరిచయలేమీ లేని చోట ఇంత మంది ఆత్మీయతను పంచడం చూస్తే అపురూపం గా ఉన్నది

 14. during reading the whole time I was astonished to know such Extraordinary courage of an ORDINARY housewife. Till cancer was detected she remained as ORDINARY house wife.

  The efforts of remaining three sisters in sharing the life-story (Courageous death is as good as life).

  The book should be circulated among Cancer hospitals.

  M.RAVIKUMAR.
  AUTHOR OF CHINTHALA VALASA KATHALU

 15. ఎప్పుడూ నాకు ఒక్క అక్కైనా/చెల్లైనా ఉంటే బాగుండుననుకునే నేను మీ అక్కచెల్లెళ్ళ కధలు చాలా ఆసక్తితో చదివేదాన్నండీ. ఇప్పుడు ఆ ఆత్మీయ పందిరిలోంఛి ఒక తీగ వాడి పోయిందని తెలిశాక చాలా బాధగా ఉంది!
  భగవంతుడు మీ అక్కగారి ఆత్మకి శాంతి కలిగించాలని కోరుకుంటూ.. మీకూ, మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

 16. “ఇంకా సంవత్సరమో రెండోళ్లో సమయం ఉందనుకున్నాను”… ఈ మాటలు చూస్తుంటే ఎంతగా దుఃఖం ముంచుకొచ్చిందో…

  అంతిమ ప్రయాణం ముందే ఖరారైనప్పుడు.. ఆ ప్రయాణానికి సిద్ధపడిపోతూ.. అప్పగింతలు పెట్టడం.. చేయకుండా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయాలనుకోవటం లాంటివి… చదువుతుంటే మా నాన్న కళ్లముందు నిలబడినట్లైంది.

  పూర్తి స్థాయిలో లివర్ పాడై పోయినందువల్ల ఏవో ట్యూబ్స్‌ అమర్చి మా నాన్న ప్రాణం నిలబెట్టారు డాక్టర్లు. ప్రతి ఆరునెలలకు ఓసారి ట్యూబ్స్ మార్చుతుంటే ఆయనకేం సమస్య ఉండదని.. అయితే గ్యారంటీ ఇవ్వలేం అన్నారు. కొన్నాళ్లకి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టే కనిపించారాయన. కానీ నోట్లోంచి, ముక్కులోంచి, మలమూత్రాల్లోనూ రక్తం పడటం ఆయన ఎప్పుడూ మా దృష్టికి తీసుకురాలేదు. తను కొంతకాలమే ఉంటానని ఆయనకి అర్థమైపోయి చేయాలనుకున్న పనులన్నీ చేసేశారు.. చూడాల్సిన వారినందరినీ చూసారు.. తనకి ఇష్టమైన పదార్థాలన్నింటినీ తిన్నారు. చివర్లో తెలిసి హాస్పిటల్‌కి వెళ్లినా ఏం చేయలేకపోయాం. 3 రోజుల తరువాత మాకు దూరమైపోయారు.

  ముందు రోజు హాస్పిటల్లో వుండగానే తనతో ఫోన్లో మాట్లాడాను చాలా బాగా మాట్లాడారు. కానీ మరుసటి రోజుకల్లా నేను వెళ్లేసరికే మాట్లాడలేని స్థితిలోకి వెళ్లిపోయారు. కళ్లతో మాత్రం పలకరిస్తూ.. ఏదో చెప్పాలని ప్రయత్నం.. చెప్పేందుకు శక్తి చాలటం లేదు.. ముందురోజు వెళ్లలేక పోయినందుకు ఇప్పటికీ నన్ను నేను తిట్టుకోని క్షణం ఉండదు.. ఏంటో అలా జరిగిపోయింది.

  నాగవల్లి గారి గురించి చదువుతుంటే చాలాసార్లు మా నాన్న గుర్తొచ్చినా.. చదువుతూ చదువుతూ ఎన్నిసార్లు తన ఫొటోని చూసి ఉంటానో లెక్క లేదు.. చదవటం ముగించినా కళ్లు తడవటం మాత్రం ఆగనేలేదు. కొన్ని కొన్ని చదువుతుంటే దుఃఖం పట్టనంతగా వచ్చి వెక్కి వెక్కి ఏడ్చేశాను. తన గురించి చదువుతుంటే ఎంతో ఆత్మీయంగానూ.. సొంత అక్కలా అనిపించారావిడ. మల్లీశ్వరిగారూ.. మీరన్నట్టు తను బంగారుకొండే.

  మన చేతులమీద పోవాల్సినవాళ్లే మనల్ని సాగనంపాల్సి వస్తే.. ఆ దుఃఖం ఏ పాటిదో అర్థంకానిదెవరికి… ఈ విషయంలో అమ్మా, నాన్నల పరిస్థితిని ఊహించుకోగలను. వారికి ఆ మనోధైర్యాన్ని మీరే ఇవ్వాలి.

  అక్కని జ్ఞాపకాల్లోనూ.. అక్షరాల రూపంలోనూ సజీవంగా ఉంచుకున్న మీరందరూ ధన్యులు. తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ…

 17. మీ గుండె తడిని ఆర్ద్రంగా సజీవంగా బొమ్మ కట్టారు. ‘పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ,ఉన్నోళ్ళు పోయినోళ్ల తీపిగురుతులు -ఆత్రేయ గీతం గుర్తుకొస్తున్నది.అక్క లేని లోటు పూరించలేనిది.

 18. మేడం గారూ,
  పుస్తకం చదివాక చాలా బాధనిపించింది.మీఅక్కగారి ఆత్మస్థైర్యానికి జోహార్లు.మీ అక్కచెల్లెళ్లు తో పాటు మీ కుటుంబ సభ్యులందరూ పుస్తకం చదివిన పాఠకులకు ఆత్మీయులైపొయారు.

 19. మల్లీశ్వరి గారు,
  “పెద్దక్క ప్రయాణం” ఇప్పుడే చదవడం పూర్తి చేశాను. చదువుతుంటే మా అమ్మ గురించి ఆలోచనలే….తనకు కూడా బ్రెస్ట్ కాన్సర్ కు సర్జరీ, రైట్ టాన్సిల్ దగ్గర రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగాయి, 2010 లో. ఇప్పుదు అమ్మకు బాగానే ఉంది. అమ్మ ఆ బాధని తట్టుకుని ఉండటం, తన సహనం చూస్తే గ్రేట్ అనిపిస్తుంది.
  మీ పెద్దక్కకు మీరు పుస్తకరూపంలో తనతో జ్ఞాపకాలు పంచుకుంటూ ఇచ్చిన నివాళి, మీరు చేసిన ప్రయత్నం బావుంది.
  “ఒక మనిషి తన ఉనికి నుంచి విత్ డ్రా అవడం భౌతికంగానే కాక చాలా పార్శ్వాల్లో
  చాలా రూపాల్లో ఉంటుందని తెలియడం ఒక అనుభవం” చాలా బాగా వ్రాశారు. అలాగే మీ ప్రేమ – ఆప్యాయతల గ్గూఉరించి వ్రాస్తూ – “ఆప్యాయతల గూడు నుంచి ఒక పుల్ల లాగివేయబడింది.” అన్నారు, మీ కుటుంబంలో ప్రేమాభిమానాలకు ఉన్న విలువ అర్థం అవుతుంది.
  “ఖాళీ అయిపోతున్నచోట తన గొప్పతనపు జ్ఞాపకాల విత్తులు చల్లివెళ్లింది…..అవి మొలకెత్తి పెరిగి తప్పక ఫలవంతం అవుతాయి” ఇంతకంటే గొప్ప నివాళి ఉంటుందా!

 20. చాలా రోజులతర్వాత చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లేలా చేసిన రచనను చదివాను. అక్కమరణమనే చేదును చవిచూసిన మీరు ఈ పుస్తకంద్వారా మానవసంబంధాలలోని తీపిని మా అందరికీ పంచారు.

 21. “పెద్దక్క ప్రయాణం” చదివి చాలా రోజులైంది.
  పెద్దక్క జ్ఞాపకాలూ , నా చెల్లెలి జ్ఞాపకాలూ
  ఒకేరకమైనవి కావడం తో మనసంతా భారమై ఎలా స్పందించాలో
  తెలియలేదు. స్పందించేందుకు ప్రయత్నించినప్పుడల్లా
  ఏదో శూన్యం ఆవరించేది.
  మీ పెద్దక్కకీ నా చెల్లెలికీ మధ్య గుండె ధైర్యం, నిబ్బరం
  విషయంలో ఒకే రకమైన పోలికలున్నాయి.
  నా చెల్లెలు చనిపోయి పదేళ్ళవుతోంది
  ఈ పుస్తకం చదివిన తర్వాత తనని ఎంత జ్ఞాపకం చేసుకున్నానో.
  ఎంత బాగా రాశారో.
  గుండె దడదడ లాడుతున్నా ఏకబిగిన చదివాను.
  మళ్ళీ చదువుతాను
  నా చెల్లెలిని తలచుకుంటూ మళ్ళీ మళ్ళీ చదువుతాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s