సాహితీ సుమబాల – మాల

Inline images 1

 బ్లాగర్ పేరు; మాలా కుమార్

 

 బ్లాగ్ పేరు; సాహితి

 
 
బ్లాగ్ చిరునామా;  http://sahiti-mala.blogspot.in/
 
పుట్టిన తేదీ;  25- జూలై
పుట్టిన స్థలం;  గుంటూరు
 
ప్రస్తుత నివాసం;  హైదరాబాద్
చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)   శ్రీనగర్ కాలనీ , హైదరాబాద్

విద్యాభ్యాసం; పి.జి ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ 

వృత్తివ్యాపకాలు;  ప్రీస్కూల్ టీచర్ , బ్యూటీషియన్ , ప్రస్తుతము గృహిణి . వ్యాపకాలు ఒకప్పుడు పేంటింగ్ , నిట్టింగ్ , టేలరింగ్ , రకరకాల వంటలు వండటం . ప్రస్తుతము పుస్తకాలు  చదవటం ,  తోటపని , వంటలో ప్రయోగాలు & బ్లాగింగ్ .

బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ;  డిశెంబర్ 27 , 2008.

మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి);  మొత్తం నాలుగు బ్లాగులు .

 1.       సాహితి – 215

 http://sahiti-mala.blogspot.in/

 2.కమ్మటికలలు -149,

 http://kammatikala.blogspot.in/

 3. చల్తేచల్తే -40,

 http://prayanamlopadanisalu.blogspot.in/

 4. ప్రభాతకమలం-44

 http://kamalamadapati.blogspot.in/
 బ్లాగ్ లోని కేటగిరీలు; అచ్చట్లు-ముచ్చట్లు , ఆర్మీలైఫ్, శుభాకాంక్షలు , అహా ఏమిరుచి , కథలు ,నా ఆలోచనలు , మహిళలూ- మహరాణులు వగైరా

 

 బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?

 నేను కంప్యూటర్ నేర్చుకున్నకొత్తల్లో మా ఇంట్లోని పిల్లల ద్వారా తెలుసుకున్నాను .అదే రోజు మొదలు పెట్టాను .” సాహితి “ముందుగా మొదలు పెట్టాను . పాటలకోసం “ కమ్మటికలలు” , నా   ప్రయాణపు అనుభవాలు రాసుకోవటం కోసం ‘చల్తే చల్తే’ , మా ఇంట్లోనివారి కోసం” ప్రభాతకమలం” ఇలా నాలుగైపోయాయి .నాకు నచ్చినవి , నాకిష్టమైనవి , నా అనుభూతులు రాసుకోవటాని కి బ్లాగ్ ఒక మంచి వేదికగా అనిపించింది .

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?

చదవటము తప్ప వ్రాయటం అలవాటులేని వ్రాయటం నేర్చుకున్నాను . మంచి మితృలను సంపాదించుకున్నాను .మితృల ద్వారా కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకున్నాను . కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను . నాది అంటూ నాకొక ప్రపంచం సృష్ఠించుకున్నాను . నా బ్లాగు నాది , నా స్వంత కృషితో ఏర్పడ్డది అనుకుంటే గొప్పగా వుంటుంది . ఈ మద్య నా పోస్ట్ లన్నీ ప్రింట్ చేయించాను . వాటిని బైండ్ చేయించుకోవాలనుకుంటున్నాను .

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?

సానుకూలత అంటే నా భావాలు నిస్సంకోచంగా తెలుపుకోవచ్చు . నాకిష్టమైనట్లు వ్రాసుకోవచ్చు .నలుగురూ చదివి వారి వారి అభిప్రాయాలు తెలుపుతారు . దానితో నా రచనలను మెరుగు పరుచుకోవచ్చు . ఏదైనా  వ్రాసుకోవచ్చు కదా అని , ఎవరి నీ కించపరిచేవి  వ్రాతలు కాని , వివాదాస్పదమైనవి కాని వ్రాయకుండా నాకు నేను పరిమితులు ఏర్పరుచుకున్నాను .

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?

ప్రత్యేకత ఏమన్నవుందో లేదో నాకు తెలీదండి 🙂

సాహిత్యంతో మీ పరిచయం?

మా పుట్టింటి వైపు , మా అమ్మ ,పిన్ని , మామయ్యలు అందరూ రచయతలే . మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతే అందరూ కూర్చొని సాహిత్య గోష్ఠి జరుపుతారు . చర్చలు , వాదోపవాదాలు చాలా జరుగుతాయి .మా అమ్మ దగ్గర పెద్ద లైబ్రరీ వుండేది . మా నాన్నగారి ట్రాన్స్ఫర్ల తో తను మేంటేన్ చేయలేక పుస్తకాలన్నీ మా మామయ్యల కిచ్చింది . మా పెద్దమామయ్య గారు నెల నెలా వెన్నెల ను స్తాపించారు . వారి ఇంట్లో ఇప్పటికీ ప్రతినెలా అందులోని మెంబర్స్ ఐన రచయతలు వచ్చి వారి వారి రచనలు చదువుతారు . చర్చించుకుంటూ వుంటారు . అలా చిన్నప్పటి నుంచి సాహిత్య చర్చలు వినటము , పుస్తకాలు చదవటమూ అలావాటైంది .

స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?

ఏ ఇబ్బందులూ ఎదురుకాలేదు .

జీవన నేపధ్యం?

మామూలు మధ్యతరగతి వాళ్ళము . మావారు ఆర్మీ ఆఫీసర్ కావటము వల్ల ఎక్కువగా వూర్లు తిరగటం అలవాటైంది . సొసైటీ కి ఎక్కువగా ఎక్స్ఫోజ్ అయ్యాను .వివిధ యూనివర్సిటీలలో చదువుకున్నాను 🙂 ప్రస్తుతము అమ్ముమ్మగా , బామ్మగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను .

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?

ఇన్నాళ్ళూ అని నేనేమీ అనుకోవటం లేదు . ఓపిక , ఆసక్తి వున్నన్ని రోజులు వ్రాస్తాను .

సరదాగా ఏవైనా చెప్పండి?

చలికాలం లో , అర్ధరాత్రి , మంచం మీద బాసింపట్టు వేసుకొని కూర్చొని , బ్లాంకెట్ కప్పుకొని , చల్లటి ఐస్క్రీం తింటే ఆ సరదానే వేరు 🙂

సీరియస్ గా ఏవైనా చెప్పండి?

నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎదుటివారిని బాధించేకన్నా నొప్పించక , తానొవ్వక తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు అన్నట్లుగా వుండాలి .

మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ

నా బ్లాగ్ లోని నా రచనలన్నీ నాకు ఇష్టమైనవే . ఒకటి ప్రత్యేకం అనిలేదు . ప్రత్యేకం గా విడతీయాలంటే కష్టమే .ఐనా తప్పదు అంటే ఈ సీరీస్ అంటే కొంచం ఎక్కువ .

https://docs.google.com/file/d/0B3EHPUVz5hVAZGM0ZjU0MjEtODI3NC00ZDg1LTk4YzYtZjJjZDYyMTg1MjFj/edit?pli=1&hl=en

ప్రకటనలు

33 thoughts on “సాహితీ సుమబాల – మాల

 1. మాలా గారు మీ గురించి మీ బ్లాగుల గురించి క్లుప్తంగా అందంగా చెప్పారు. ముఖ్యంగా అన్ని పోస్ట్లు ఇష్టమే అని చెప్పడం బావుంది. అవును మరి ప్రతి అక్షరం బ్లాగ్ కోసం పురుడు పోసుకున్నదే కదా ! అభినందనలు .

  మల్లీశ్వరి గారు ఆగిన నడక ..మళ్ళీ మొదలయింది. చాలా సంతోషం. మీ బిజీ షెడ్యూల్స్ మధ్య కూడా మాహిలా బ్లాగుల పరిచయాల పట్ల ఉన్న శ్రద్ద మరొకమారు కనబడుతుంది . థాంక్ యూ !

 2. ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఇంత చక్కగా ఇంటర్వ్యూ చేసిన జాజిమల్లిగారికి, అంతే చక్కగా సమాధానాలిచ్చిన మీకూ హృదయపూర్వక అభినందనలు.

 3. సాహితీ సుమాబాల – మాల…. నిజంగా మాలగారికి తగిన టైటిల్.. ఇంటర్వూ సింపుల్‌గా చక్కగా ఉంది. మాల గారికి, మల్లీశ్వరి గారికి అక్షరాభివందనాలు… 🙂

  • నారాయణస్వామి గారు,
   మీ కామెంట్ కు ఎలా స్పందించాలో తెలీటము లేదు 🙂 ( కాని చాలా సంతోషంగా వుంది :)) ముందు నుంచీ నా బ్లాగ్ ను చాలా ప్రోత్షాహిస్తున్నారు.మీలాంటి సహృదయుల అభిమానము ,ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.

 4. మాలా గారు, మీ ఇంటర్యూ ఇప్పుడే చదివాను. చాలా ఆలశ్యంగా.
  జాజిమల్లి గారు అందరినీ పరిచయం చేస్తూ ఇచ్చే టైటిల్స్ చూస్తుంటే భలే ఆశ్చర్యం గా ఉంటుంది. ఇంత చక్కటి, అప్ట్ టైటిల్స్ ఎలా పెడతారా అని. చాలా బాగుందండి మాలా గారు మీ ఇంటర్యూ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s