వ్యాపకాలు: ఒకటి, మంచి టపాలు రాయలనుకోవటం!
రెండు, బోల్డు పుస్తకాలు చదవాలని కలలు కనటం!
నెలకో పుస్తకం చదవలేకపోతానా అని గత రెండు మూడేళ్ళుగా ఇండియా వెళ్ళినప్పుడల్లా సగం సూటుకేసు పుస్తకాలతో నింపుకుని వస్తున్నాను. నా పుస్తక పఠనం నూతిలో కప్ప టైపులో సాగుతూ ఉంటుంది. ఎలాగంటే…. దాదాపు ప్రతీ రోజూ పనులన్నీ అయిపోయి, నిద్రకు ఉపక్రమించే ముందు, ఎంతో కాలంగా చదువుతూ ఉన్న పుస్తకాన్ని తెరుస్తాను. “అవును, కధలో నిన్న ఏమైంది?” అనుకుంటూ ఒక పేజీ వెనక్కి వెళ్లి recap రీకాప్ చేసుకుని, ఇంకో పేజి చదివి, తర్వాతి పేజీ సగం నిద్రలో చదివాననిపించి, నిద్రలోకి జారుకుని బోల్డు పుస్తకాలు చదవాలని కలలు కంటూ ఉంటాను.
మూడు, ఫోటోగ్రఫీ@ అదింకో కధ. వద్దులెండి…
బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ : January 2, 2011
మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి) : కొన్ని మంచి పోస్ట్ లు ఉన్నాయనే నమ్మకం.
బ్లాగ్ లోని కేటగిరీలు: కధలు, కవితలు, పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, మహిళ….ఇలా చాలా వున్నాయి.
బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?
ఒకసారేప్పుడో బాగా తీరిక ఉన్న సమయాన తెలుగు కధలు నెట్లో ఏమన్నా దొరుకుతాయేమో చూద్దామని గూగుల్ లో తెగ వెతికేసా. ఈ గూగుల్ బాబాయ్ ని ఒకటి చెప్పమని అడిగితే పది చెపుతాడు కదా! అలా తెలుగు బ్లాగులు ఉంటాయని తెలిసింది. ఇలాంటిదేదో నేనూ మొదలుపెడితే పోలా అనుకున్నా.
బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?
I have very good experience here. ఎంతో తృప్తి…కాలేజీలో క్లాసు (కెమిస్ట్రీ, అందులోనూ ఆర్గానిక్ కెమిస్ట్రీ) బోర్ కొట్టినప్పుడల్లా నోట్ బుక్ వెనుక పేజీల్లో రాసేసుకుంటూ టైం పాస్ చేసేదాన్ని. నిద్ర రాకుండా ఉండే టెక్నిక్ కూడా! ఒకటి రెండు తవికలు రాసి ఫ్రెండ్స్ కి కూడా ఇచ్చాను. సాహిత్యము, కవితల్లాంటి పదాల అర్థాలు అప్పటికి ఇంకా తెలీవు. కష్టం కలిగినా, సంతోషమొచ్చినా గబ గబా రాసేసుకునేదాన్ని.చదువైన తర్వాత పెళ్లి, ఉద్యోగం, పిల్లలు …… I totally forgot about writing which is my way of expression. జీవితం చాలా వేగంగా రొటీన్ లో పడిపోయింది.
ఒకసారి చెల్లి దగ్గరకు వెళ్ళాను. బాబు నిద్రపోతున్న టైంలో ఒక పుస్తకం కనిపించింది. కాళీగా ఉన్నాను కదా అని చదవటం మొదలుపెట్టాను. మొదటి పేజిలో భావుకత్వంతో కూడిన నాలుగు లైన్లు ఉన్నాయి. వాటిని చదువుతూ, ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు అని నవ్వుతూ చెల్లితో అన్నాను (అదేదో పెద్ద గోప్ప విషయంలా). I can never forget the way she looked at me, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంది. I felt very much ashamed of myself. రాయటం పూర్తిగా మర్చిపోయానా అనే బాధ కంటే నాలోని సున్నితత్వాన్ని కోల్పోతున్నానా అని బాధేసింది. From then I started buying books and recollected my words too.
నేను బ్లాగ్ ఎలా మొదలుపెట్టానంటే….. 2011 సంవత్సరము, జనవరి 2వ తారీకు నాడు, మా ఆఫీస్ లో నూతన సంవత్సరము శుభాకాంక్షలు చెపుతూ, అందమైన డైయిరీ ఇచ్చారు. ఆ డైయరీ ఓపెన్ చెయ్యగానే అదేదో సినిమాలో చూపించినట్లు, మరేదో నవల్లో చదివినట్లు, డైయరీలో ఈ సంవత్సరము నేను చెయ్యాల్సిన పనులన్నీ రాయాలి అనే మహత్తరమైన ఐడియా వచ్చింది. ఏమి రాద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు, తెలుగులో బ్లాగ్ స్టార్ట్ చేసేసి, అందులో నా పాండిత్యం, పైత్యం, తిక్క అన్నీ రాసిపడెయ్యాలి అనుకున్నాను. అనుకున్నదే తడువుగా బ్లాగ్ మొదలుపెట్టేసాను.
పురాతన కాలంలో రాసిన కవితలు పోయినవి పోగా, దొరికిన ఒకటి రెండు కవితలు పోస్ట్ చేసేసా. నాకు తెలిసిన వాళ్ళందిరికీ facebook, mail ద్వారా ఢంకు వేసి, డోలు వాయించి మరీ చెప్పేసా. కుతూహలంతోనో, మొహమాటంతోనో, ఇష్టంతోనో నా కవితలు చదివిన నా స్నేహితులందరూ సూపర్ డూపర్, నీకు ఈ కళా పోషణ కూడా ఉందా అనీ మెచ్చుకునేసరికి, నేను ఉబ్బితబ్బిబైపోయి మహా గొప్పగా ఫీల్ అయిపోయి వీరావేశంతో మళ్లీ రాయటం మొదలుపెట్టేసా. నాదంతా ఆరంభ శూరత్వంలే అనుకున్నాను, ఆశ్చర్యంగా ఇప్పటి దాకా కొనసాగింది. వెనక్కి తిరిగి చూసుకుంటే, I have learned a lot. likeలైక్ మైండెడ్ ఫ్రెండ్స్ కూడా దొరికారు.అంత గొప్పగా రాయకపోయినా ఓ మాదిరిగా రాయటం నేర్చుకున్నాను. ఇప్పుడు పాత పోస్ట్ చదువుతుంటే సిల్లీ గా వున్నాయే అని నవ్వుకుంటాను.
బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు? పరిమితులు?
ఇవే రాయాలి, ఇలాగే రాయాలి అనే నియమాలు, సంకెళ్ళు లేవు. మనసుకి హత్తుకున్న విషయాలు, ఎదురైన సంఘటనలు, ఆలోచింప చేసే ఏ విషయాన్నైనా రాసుకోవొచ్చు. It’s a way of expressing our self. కధో, కవితో లేక మరేదైనా రాసాక మనసు తేలికగా ఉంటుంది. ఎవరైనా మెచ్చుకుంటే కొంచెం సేపు మునగ చెట్టు ఎక్కి మరోటి టపా రాయొచ్చు అనే స్పూర్తిని తెచ్చేసుకోవొచ్చు.
పరిమితులు@ భిన్నభిప్రాయాలను ఆహ్వానించే వాతావరణం ఇక్కడ లేదేమో అనిపిస్తుంది. I don’t agree with your opinion అని చెప్పే క్రమంలో వ్యక్తి దూషణలు, ఎగతాళులు ఆశ్చర్యాన్ని, బాధను కలిగించాయి.
మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?
మహిళా బ్లాగర్ గా నా ప్రత్యేకత అని చెప్పలేను. స్త్రీ సహజమైన సున్నిత మనసుతో చుట్టూ ఉన్న మనుష్యులను, మనస్తత్వాలను పరిశీలిస్తూ విశ్లేషించుకోవటం నాకు చాలా ఇష్టం. ఎక్కువ ఆలోచించటం..బహుశా అందుకే ఈమాత్రమన్నా రాయగలుగుతున్నా.
సాహిత్యంతో మీ పరిచయం?
సాహిత్యంతో పరిచయం లేదనే చెప్పాలి. మా ఇంట్లో అందరు ఇంజనీర్లు, డాక్టర్లు. టెక్నికల్ పుస్తకాలే తప్ప సాహితి పఠనాలతో అంతగా పరిచయం లేదు. ఇటు బ్లాగుల్లోనూ, అటు పేస్ బుక్ తెలుగు పుస్తకం గ్రౌప్స్ పుణ్యమా అని మంచి పుస్తకాల గురించి తెలిసింది. గత రెండు మూడేళ్ళుగా పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. కాలేజీ రోజుల్లో ఎండమురి నవలలు చదివాను..అంతే!
స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
ప్రత్యేకించి ఇబ్బందులేమీ లేవు. చిన్న చితక ఉన్నా పెద్ద పట్టించుకోను.మానవత్వంతో చూడాల్సిన విషయాలను ఒక వాదమనే పేరు తగిలించటం, ఒక్కోసారి కొట్టిపడేయ్యటం కోపాన్ని, అసహనాన్ని కలిగిస్తాయి.
జీవన నేపధ్యం?
కష్టపడాలి, మీ కాళ్ళపై మీరు నిలబడాలని మా ముగ్గురు అక్కాచెల్లెల్లకు నూరిపోసిన అమ్మ నాన్న. Family first అనే భర్త. ఇద్దరు అల్లరి గడుగ్గాయలు. భార్య, తల్లి, ఉద్యోగి…..ఈ మూడు పాత్రలతో సాగే దినచర్య.
ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
ఆసక్తి వున్నత కాలం. Negligence, laziness నన్ను డామినేట్ చెయ్యనంత కాలం.
సరదాగా ఏవైనా చెప్పండి?
మనందరి మనసులలో ఎంతో కొంత పసితనం ఉంటుంది. కుదిరినప్పుడల్లా ఆ చిన్నిపాపనో/బాబునో బాగా గారాబం చేసి తీరాల్సిందే.
సీరియస్ గా ఏవైనా చెప్పండి?
ఏకాంతం అత్యవసరం….సముద్రపు లోతుల్ని, మన ఆలోచనలను తెలుసుకోవటానికి.
@ మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి,కవితలైతే రెండు మూడు
అబ్సర్డ్ పైయింటింగ్
మనసు పొరలలో నిక్షిప్తమైన బావాలు
కుంచె కొసలకు వేళాడి వేళాడి
ఏ కలనో జారిపడి
అలుక్కుపోయిన రంగుల కలబోత
వృత్తాల గర్భాల్లో అనంతాలు
వంకరటింకర గీతల్లో భావోద్వేగాలు
మోహమో, వ్యామోహమో
ప్రేమమయమో, ద్వేషపూరితమో
జీవమో, జీవచ్చవమో
ఏమో
ఏవేవో అర్థాలు
అంతులేని అయోమయాలు
హృదయాంతరాలలో ప్రకంపనల అలజడి లేపి లేపి
ఆలోచనల అలలు ఎగిసెగిసిపడి
చిక్కు ముడులలో బిగిసి బిగిసి
పాళీ కొనలకు అటు ఇటు ఊగిసలాడి
స్తబ్దత నిశ్శబ్దము నీడలో
చిత్రించబడిన ఆకారం
ఆ మోములో
ఆనందమో విషాదమో ఎవరికెరుక?
వీక్షించిన ఒక్కోమారు ఒక్కో బావం…
ఆచిత్రంలో
అన్నీ ఆద్యంతాలకు పరుగులు తీస్తున్న గీతలే…నా ఆలోచనల్లా
అన్నీ దిక్కులను వెతుకుతున్న రేఖలే…నా ఆశల్లా
అన్నీ శూన్యంలో అంతమవుతున్న ఆకృతులే…మనిషి మరణంలా
మా గోడకు వేలాడుతున్న అబ్సర్డ్ పైంటింగ్
అచ్చు గుద్దినట్టు నాలా………
అసంపూర్ణం
ఒక్కో రాత్రి, ఒక్కో పగలు
ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో
ఇంతేసి దిగులును?
నేల ఈనుతున్నట్టు, ఆకాశం చాలనట్టు
పుట్టుకొచ్చే ఈ ఆలోచనలు!
కడవల కొద్దీ తోడినా
ఊట బావిలా ఊరుతూండే ఈ జ్ఞాపకాలు!
నల్ల మబ్బుల నీటి భారం
వానై వరదై ముంచెత్తితే మటుమాయం…ఎంతదృష్టం!
కనురెప్పల కన్నీటి భారం
చినుకై కురిసి కురిసి
కడలిలోనే మరింత భద్రం….ఎంత విషాదం!
ఒక్కో వేదన, ఒక్కో ఆవేదన
ఎంతకీ చిధ్రమవ్వవు చిత్రంగా!
గాయాల తీపు తగ్గిందని భ్రమించినా
గురుతుల సలపరాలు జీవించే ఉంటాయి వింతగా!
గతించిన గేయపు స్వరాన్ని
కరిగిపోయిన కాలపు పెదవులు
ఆజన్మాంతం అవిశ్రాంతంగా ఆలపిస్తూనే ఉంటాయి…
జనించిన స్మృతి రాగం
కాలం మిగిల్చిన వినికిడిలో
కూనిరాగమై ఆలకిస్తూనే వుంటుంది…
ఒక్కో ఘటన, ఒక్కో సంఘటన
ఎప్పటికీ అంతు చిక్కని
వైకుంఠ పాళి పాచికలే!
నిచ్చెన అనుభవాల కన్నా
పరిశీలన పాముకాట్లు ఎక్కువ బాధిస్తుంటాయి……
ఒక్కో అక్షరం, ఒక్కో భావన
ఎప్పటికీ అసంపూర్ణమే!
పోగు మిగిలిపోయిన నేత అల్లికలా…..
Chaala bagundandi
Thank you Madhu garu.
మూడు భాద్యతలు నిర్వహిస్తూ కూడా బ్లాగ్ వ్రాయడం తో పాటు మరి కొన్ని భాద్యతలు నిర్వహిస్తున్న మీకు ఎంత సాహిత్య పిపాస ఉందొ గమనిస్తూనే ఉన్నాను . అభినందనలు ప్రవీణ గారు. సరదాగా, నిర్మొహమాటంగా మీ మాటలు చెప్పేశారు . వ్రాస్తూనే ఉండండి కాస్త బద్ధకం వదిలించుకుని. 🙂
అభినందనలు
సాహిత్య పిపాస అనేకంటే… నాకు మనుష్యులు, మనస్తత్వాల గురించి తెలుసుకోవటం చాలా బాగుంటుంది. సైకాలజీ చదవాలని నా చిరకాల కోరిక. I have a big to-do list and this is one among the list 🙂
సాహిత్యం నాకు ఆ అవకాశాన్ని ఇస్తుంది. మనకు తెలిసిన లోకాన్నే కొత్తగా పరిచయం చేస్తుంది. Thank you for all your encouraging words vanajavanamali garu.
Praveena gari jawabulu simpulaathisimplegaa unnayi!Ekkuva chadavaali thakkuva raayaali!meeru pusthakaalu viriviga chaduvutakupakraminchinanduku abhinandanalu!
సూర్య ప్రకాష్ గారు @ “ఎక్కువ చదవాలి తక్కువ రాయాలి “.ంఅంచి మాట చెప్పారు. చదవటంలోని ఆనందమే ఆనందం. వ్యక్తులు, వ్యక్తిత్వాలు పరిచయం అవుతాయి. Thank you.
చాలా చక్కటి కవుర్లు కలబోసి పోగుపెట్టారు. రచనలు ఇంకా బాగున్నాయి.అభినందనలు ప్రవీణ గారు.
ధన్యవాదాలు జయ గారు.
ప్రవీణ గారు ఓ రోజు మీ ‘పెద్ద మనిషి’ కవిత చదివి ఆ రోజే దాదాపుగా మీ బ్లాగు మొత్తం చదివాను. సమాజం పట్ల మీ దృక్పధాన్ని చూసి చాలా ముచ్చటేసింది. నాకు నచ్చే కొద్ది మంది కవి/కవయిత్రులలో మీరొకరు. ఇంటర్వ్యూ బావుంది.
You are one of the like minded friend I found through Blog Jyothirmayi gaaru.
ఈ కవితే కదా! మన చుట్టూ పక్కల ఎందరో ఇలాంటి వారు!
ఆ పెద్ద మనిషి
రచ్చబండపై ఆశీనుడై
మొగుడు పెళ్ళాల పంచాయితీ తీర్చాడు
పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోమని మందలించి
మొగుడుకి అణుకువగా నడుచుకోమని సూచించి
ఇంటికి చేరాడు…..
కాళ్ళకు అంటిన సంస్కారాన్ని నీళ్ళతో కడిగేసుకుని
కండువా పెద్దరికాన్ని కొక్కానికి తగిలించి
“ఒసేయ్ ఎక్కడ చచ్చావ్”
ధర్మపత్నిని కేకేసాడు….
ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు.
మంచి వ్యంగ్య కవిత
ఇంత సొంతడబ్బాకు అంత చోటిచ్చిన మల్లీశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు…
అందరినీ ఒక చోటకు చేర్చిన మీ కృషి అభినందనీయం. మెయిల్స్ లో కాంటాక్ట్ చేసి, సమాధానాలు విపులంగా రాయండి అని ప్రోత్శాహించిన మీ కృషి కి హాట్స్ ఆఫ్ అండి!
ప్రవీణ గారూ,
మన అనుభవాలూ ఆలోచనలూ కేవలం వ్యక్తిగతం కాదు.అయినా సరే వ్యక్తిగతమంతా రాజకీయమే.
మనం మాట్లాడాలి. సంకోచాలు లేకుండా మాట్లాడాలి. అందుకు ఈ వేదిక కొంచెం సాయపడినా నాకు సంతోషమే
థాంక్ యూ
నిజం..సంకొచాలు లేకుండా స్పష్టంగా సూటిగా మాట్లాడాలి. మీ కృషి అభినందనీయం.
చాలా బావుంది ప్రవీణా.. నీ వాక్యాల్లో కధల్లో కనిపించే డౌన్ to ఎర్త్ నేచర్ నాకెప్పుడూ నచ్చుతుంది. నిజాయితీ గా రాసేవు కాబట్టి .. ఈ జర్నీ మనమేనా చేసింది అనే ఒక అబ్బురం బాగుంటుంది. నీ పోస్టు చేయని ఉత్తరాల్లంటివి ఇంకా రాయగలవు. ముఖ్యంగా వేరే దేశం లో వృత్తి, వుద్యోగం ,కుటుంబం, పిల్లలు ఇలాంటి వాటిల్లో … ఉన్న చిన్న చిన్న పెద్ద పెద్ద కధలు ఇంకా రాస్తావని ఆశిస్తున్నాను .
పోస్టు చెయ్యని ఉత్తరాలు రాస్తునప్పుడు చాలా ఎంజాయ్ చేసాను.
థాంక్యు సాయి పద్మ
ప్రవీణ నాకు ఫేస్బుక్ సాహిత్య గ్రూపుల ద్వారా పరిచయం. తను రాసే ప్రతి రచనా చాలా సూటిగా, స్పష్టంగా, ఖచ్చితంగా ఉంటాయి. అందుకే నాకు ఇష్టం.
ఆఖరికి తనుపెట్టే స్టాటస్ మెసేజ్‌లు కూడా వదలను. ఎందుకో బాగా నచ్చుతాయి. మరిన్ని రచనలు మీ కలం నుంచి రావాలని కోరుకుంటూ అభినందనలు ప్రవీణా… నిజంగానే ఓ చక్కని అమ్మాయిని పరిచయం చేసిన మల్లీశ్వరిగారికి బోలెడన్ని థాంకులు… 🙂
శోభ, స్పూర్తి కోసం బయోగ్రఫీలే చదవక్కరలేదు మన చుట్టూ ఉన్న వారే చాలు అని నిరూపించారు మీరు. Iam very proud to know you.
థ్యాంక్యూ ప్రవీణా… 🙂
శోభా,
మీకు కూడా ధన్యవాదాలు
🙂
Nice interview Praveena garu. మీ భావాలు..వాటిని మీరు వ్యక్తపరిచే విధానం చూడ ముచ్చటగా ఉంటుంది. ఈ మద్యే ఫేస్బుక్ పుస్తకం గుంపులో కొంచం ఎక్కువగా చదువుతున్నా మిమ్ముల్ని. బ్లాగులో కూడా కొంచం వ్రాస్తూ ఉండండి.
సిరిసిరిమువ్వ గారు @ I am glad to receive your response here. మీ బ్లాగ్ గురించి నేను ఎందరికో చెప్పాను.
తప్పక రాస్తాను… Thank you.
i like this letareture
Thank you Ganesh garu.
తను ఫస్‌బుక్ ద్వారా పరిచయం… వారి బ్లాగ్ లోని పోస్టులని నిశితంగా అనుసరిస్తాను.
అంతరంగాన్ని ఆలోచనలని అక్షరాలతో అలవోకగా అందుకుటుంది…
వ్యక్తికి, వ్యక్తిత్వానికి, సమాజానికి ఏమి కావాలో …
తనేం పొందుతుందో అదే అక్షరాలతో(శరాలతో) సంఘర్షణతో అందిస్తుంది…
తనది, స్పష్టతని అందుకునే ముక్కుసూటి ప్రయత్నం…
సత్యంగా, అంత సూక్ష్మత్వం సున్నితత్వం స్త్రీ లకే సాధ్యం.
ప్రవీణ గారి అభ్యున్నతిని మనసారా కోరుకుంటూ. .
-సత్య
సత్య గారు @ నేను అలా అలా ఆకాశం లో విహరించేసి వచ్చేస్తానే! 🙂
Thanks a lot for all your encouraging words.
🙂
ప్రవీణ గారు,మనం ఎదైన చెయ్యడానికి చుట్టూ ఉన్నవారి మరియు స్నేహితుల ప్రోత్సాహం ఉంటే మనస్సుకు ఎంతో బలాన్నిస్తుంది.మీరన్నట్టు ప్రవీణ బాగా రాస్తుంది అని అందరు అంటుంటే మీలో మరింత ఉత్సహం ,ఉత్తేజాన్నిఇస్తుంది. అదే ఉత్సహంతో మంచి మంచి రచనలు చేసి పెద్ద రచయిత్రి గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ……….
Thank you Raji Reddy garu
3 ROLES BALANCE CHESUKUNTOO SPANDINCHE MANASUNU KAPADUKOVADAM….ADI NRI GAA …NOT AN EASY THING….KEEP WRITING…
ఇంటర్ చదివే రోజుల్లో .. ఎపుడైనా క్లాసు బోర్ కొడితే …. సిధార్థ కాలేజీ దగ్గర చిన్న పార్క్ లో కూర్చునే వాణ్ణి ….
ఒక అందమైన అమ్మాయి … అటు వైపు .. ఇటు వైపు తిరుగు తుండేది … ఆ రోజుల్లో నే ఆ అమ్మాయి చాలా హుందాగా వుండే వారు …. అందరికి ఛాలా గౌరవము అయ్యిన భావము. … తరువాత కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ గా ప్రత్యక్షం … పరిచయం చేసుకుందాము అంటే.. వెధవ మొహమాటము , అభిమానము……
ఆ కంప్యూటర్ సైన్స్ batch నా జీవేతం ని పూర్తి గా మర్చి వేసింది … ఈ batch ని చూసేక నా గోల్స్ పూర్తి గా మారి పొయ్యాయి…
వీళ్ళని చూసి ఇంప్రెస్స్ అయ్యి .. నేను పార్ట్ టైం జాబు చేసి మరి కాష్ దాచుకొనే వాణ్ణి .. సమ్మర్ లో ఫుల్ల్ టైం లో జాబు చేసే వాణ్ణి ..
ఆ తరువాత జేవేతం లో. చాల ఓటమి .. నిసతువ్వ… బ్యాంకు లోన్ తెచ్చుకొని మరి MCA లో చేరాను.. …చాల కాస్త పడ్డాను .. చాల ప్రణాళిక తో …
ప్రతి రోజు.. అను కుంటాను.. ఆ బత్చ్ గురుంచి… Europe lo వున్నా , అమెరికా లో వున్నా.. ప్రతి రోజు .. అనుకుంటాను…
15 ఇయర్స్ తరువాత అల్ అఫ్ సడన్ .. పేస్ బుక్ లో అందమైన కవితలు .. కవిత సంకలనాలు … గుడ్.. yes.. she is same Praveena ,, which i noticed 15-16 years back near park @ sidhartha college …….
బహుశా .. ఒక్కసారి కూడా .. మాట్లడు కుండ .. ప్రభావం చూపించిన .. వ్యక్తులు వీళ్ళు మాత్రమే అనుకుంట,,,,
పరిచయం లేకుండానే .. నేను world lo వన్ అఫ్ ది బెస్ట్ Sr IT Analyst & Technical Manager అయ్యాను అంటే .. ఈ పర్సన్స్ తో డైరెక్ట్ గా.. పరిచయం వుంటే .. జేవేతం లో చాల ఉన్నత శిఖరం లో వుండే వందినేమో…… 🙂
Good luck & Best wishes ..
Anka Raju Sunkesula MCA.,
Sr. Systems Analyst ..
ప్రవీణ గారూ
క్లౌడ్ 9
అంక రాజు గారూ,
అందమైన వర్ణచిత్రంలా ఉన్నాయి మీ భావాలు
హహాహ్హా…. Looks like my memory chip size is too small.
Anka Raju garu, మల్లీశ్వరి గారు అన్నట్టు అందమైన వర్ణ చిత్రంలా వున్నాయి, u may try writing stories. Thank you.
Thank you Praveena gaaru . After your suggestion, myself started putting all my personal experiences in story format. I had written nearly 25 personal experiences. Just shared 2 of them now to the public.
Please read : http://sunkesula.blog.com/
chakkani mi maatale mi tapallaa mottaniki miloni miru gurinchi baagaa chpparu
మంజు గారు @ ఆ మాటలు మాత్రమె రాయగలను, అంతకు మించి ఒక్క అక్షరం కుడా రాయటం రాదు. Thank you manju garu.
chala bagundi
Thank you Ashok garu.
హహః వాస్తవాలు ఒక్కింత surprising కి గురి చేస్తాయి …. ( నా భావ వక్తికరణ లో తప్పులు దొర్లి వుంటే .. క్షమించండి … )
Nice.
నేను మొదట ఫేస్బుక్ లో జాయిన్ అయిన తరవాత . ప్రవీణ గారి కవితలు కు నా స్పందన తెలియ చేసే వాడిని . తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లో జాజిమల్లి మొదటి బ్లాగ్ కధలు పుస్తకం గా కే శ్రీనివాస్ గారు ఈ పుస్తక పరిచయం తో వెంటనే ఆ పుస్తకం కొని చదవటం ,దాని గురించి ప్రవీణ గారితో చర్చిస్తూ . మొదటి బ్లాగ్ కవితలు పుస్తకం గా వారివి ,వర్మ గారి ,ఇంకో కొంతమంది మంచి కవితలు అన్ని కలిపి ఒక పుస్తకం గా తేవాలి అనే నా ప్రయత్నం ను ప్రవీణా తో చరిన్చినట్లు గుర్తు . వర్మ గారి కవితలు ,ప్రవీణ గారి కవితలు కాంట్రాస్ట్ గా ఉంటాయి . ఆ ప్రతిపాదన కొంచం లేట్ అవ్వటం ఇంతలోనే వర్మా గారి కవితలు పుస్తకం వచ్చింది . తర్వాత ఎప్పుడో మల్లిజాజి గారి ఫ్రెండ్ లిస్ట్‌లో ఈ మద్యనే నేను యాడ్ అయ్యాను .
ఇప్పుడు మళ్ళి ఈ వేదికపై ఇద్దర్ని ఒకేసారి కలిసాను .
మల్లి జాజి గారు బ్లాగర్లు అందరిని ఈ వేదికపై పరిచయం చేసే ప్రయత్నం అభినందనీయం