మనస్విజయం

బ్లాగర్ పేరు;  జయ

బ్లాగ్ పేరు;  మనస్వి

బ్లాగ్ చిరునామా;    www.manasvi-jaya.blogspot.in

పుట్టిన తేదీ;     ఆగస్ట్, 28

పుట్టిన స్థలం;    హైద్రాబాద్

ప్రస్తుత నివాసం;    హైద్రాబాద్

చిరునామా(ఇబ్బంది లేనట్లయితే)    

విద్యాభ్యాసం;    M.A., Ph.D.

వృత్తి, వ్యాపకాలు; పిల్లలకు పాఠాలు చెప్పటం.  లలితకళలంటే ప్రాణం.

బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ;      2008,  డిసెంబర్ 31  (వ్రాయటం మొదలు పెట్టింది మాత్రం ఏప్రిల్ 2009)

మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి);     వంద కి కొంచెం ఎక్కువ.

బ్లాగ్ లోని కేటగిరీలు;         అంతర్మధనం ,అనుభవాలు ,కవితా భావాలు, గుర్తుకొస్తున్నాయి, చర్చావేదిక, 
చిత్రలేఖనాలు, నాలోని నవరసాలు, పుస్తకాలు, ప్రయాణాలు, మనస్వి, ముచ్చట్లు, వంటకాలు, వన్నెలచిన్నెలు,
శుభాకాంక్షలు, సమ్మర్ స్పెషల్స్, సరదాగా …  సినిమాలు
  
బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?     

బ్లాగ్ అంటే అసలేవిటో తెలియకుండానే నేను దీన్ని మొదలు పెట్టాను. అంతకు ముందు బ్లాగ్ లనేవి ఉన్నాయని కాని, లేదా అవి చదివిన అనుభవం కాని నాకు లేదు. ఇదంతా నా మీద మా అక్క ప్రభావం. తను బ్లాగ్ ఓపెన్ చేసుకొని నన్నూ చేయమంటే యాంత్రికంగా నే చేసిన పని ఇది. కాని, క్రమంగా ఇందులో కొంతమంది రచనలు చదివి, నా భావాలు కూడా పంచుకోవాలనే కోరిక మెల్లిగా మొదలయ్యింది. నా విద్యార్ధుల తో నా అనుభవాలే దీనికి బీజం వేసాయి. నేను రాసుకున్నవి చాలా మటుకు నా వృత్తికి సంబంధించినవే. మెల్లిగా నా అనుభవాలు రాసుకోటం ద్వారా, వచ్చిన కామెంట్ల  వలన, నా భావాలను హాయిగా వ్యక్తీకరించుకునే వేదిక ఇదే…అన్న భావం నాలో స్థిరపడిపోయింది.

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?   

ఒకటి, రెండు కలత పరచిన అంశాలు తప్ప, అన్నీ మంచి అనుభవాలే.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?    

కొన్ని కొత్త విషయాలను తెలుసుకొనే అవకాశం ఏర్పడింది. మంచి పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. కాలం గడుస్తున్నా కొద్దీ కొంత మంది కొత్త బ్లాగర్ లతో ఏర్పడిన స్నేహం నూతన బంధాలను కూడా ఏర్పరిచింది. నా ప్రపంచం విస్తరించింది.నాకు నేను ఏర్పరచుకున్న పరిమితులను నేను తప్పకుండా ఎప్పటికీ అనుసరిస్తాను.  అంతర్జాలంలో విహరించే మన రచనలను ఎంతోమంది ఎన్నో రకాల ధృక్పధాలతో పరిశీలిస్తూ ఉంటారు.చెప్పదలుచుకున్న విషయాన్ని క్షుణ్ణంగా వివరించటం ముఖ్యం.  పొగడటాలు, తెగడటాలు కూడా జరుగుతాయి.ఎవరైనా తమ రచనల సత్ఫలితాలనే కోరుకుంటారు.ఎవరినీ నొప్పించక, తాను నొచ్చుకోకుండా ఉండటమే సరి అయిన పరిమితి.  

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?    

నాకెటువంటి ప్రత్యేకతా లేదు. అందరిలో నేనొకదాన్ని.ప్రతిరోజు  ఆడపిల్లలను గమనిస్తున్న నాకు, వారిగురించిన ఆలోచనలు, అభిప్రాయాలు నాకు తెలియకుండానే నా రచనల్లో ప్రతిబింబిస్తాయేమో అని అనిపిస్తూ ఉంటుంది. మన మాట, మన మనసు…మన గుణాన్ని తెలుపుతుంది అని నమ్ముతాను.

లలితకళల్లో మీకు ప్రవేశం ఉందా? ఏ కళ  అంటే ఇష్టం?

లలితకళలంటే నాకు చాలా ప్రాణం. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా నాకు ఇష్టమే. కాని దేనిలో కూడా పూర్తి ప్రవేశం లేదు. ప్రస్తుతం కొంచెంగా చిత్రలేఖనాన్ని హింసిస్తున్నా.

డాక్టరేట్ అధ్యయన అనుభవాలు?

 నా డాక్టరేట్ అనుభవాలు మాత్రం నాకు ఎన్నో విషయాలు నేర్పించింది. ఒక్కదాన్ని బాంబే, కలకత్తా, ఢిల్లీ వంటి నగరాల్లో సంచరించటం వల్ల ఎందరో పెద్దలతో పరిచయాలు, అనేక ముఖ్యమైన అంశాలు తెలుసుకో గలిగాను. మరాఠి, గుజరాతీ వంటి భాషలు తెలుసుకో గలిగాను.ఒకప్పటి ఇంగ్లీష్ డాక్యుమెంట్స్, మోడీ స్క్రిప్ట్ చదవటం నేర్చుకున్నాను. పనిలో పనిగా,అనేక ప్రాంతాల ప్రజల మనస్తత్వాలు, ఆచారాలు, వాళ్ళ సంస్కృతి తెలుసుకోగలిగాను.చిన్నప్పటినుంచి చదివిన చదువుకన్నా, ఈ రీసెర్చ్ ద్వారానే ఎంతో నేర్చుకున్నాననిపిస్తుంది.  

 సాహిత్యంతో మీ పరిచయం?   

చదవటం ఇష్టమే కాని, అంతగా అలవాటు లేదు.నా సబ్జెక్ట్ పుస్తకాలు ఎక్కువగా చదవటం తోటి సమయమంతా గడిచిపోతోంది. ఇతర పుస్తకాలు చదువుతూనే ఉన్నప్పటికీ, నాకు ఎక్కువగా శరత్ చంద్ర సున్నిత రచనలు, రంగనాయకమ్మగారి ఆధునిక భావాలు,దేవులపల్లి గారి భావావేశం  చాలా నచ్చుతాయి. 

స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?   

ఇప్పటి వరకు ఇటువంటి సమస్య ఏదీ నేనెదుర్కోలేదు. ఏదైనా సరే మనం చెప్పదలుచుకున్న అంశం వ్యతిరేక భావాలతో, విమర్శలతో గాకుండా చక్కగా వివరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదనిపిస్తుంది నాకు. ఆవేశం కన్న ఆచరణ, మార్గ నిర్దేశ్యత ముఖ్యం. 

జీవన నేపధ్యం?   

సంప్రదాయ బద్ధమైన కుటుంబంలో జన్మించాను. కట్టుబాట్లు ఎక్కువే. అంత మాత్రాన నా స్వేచ్చకు విద్యకు ఏనాడు ఆటంకం ఏర్పడలేదు. కోరుకున్న వృత్తి, జీవితాన్నిసంపాదించుకో గలిగాను.అది చాలు నాకు. 

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని? 

నేనేమి అంత ఆక్టివ్ బ్లాగర్ ని కాను. నాకు ఎప్పుడు రాయాలనిపిస్తే, ఏది రాయాలనిపిస్తే అది రాసుకుంటూనే పోతాను. 

సరదాగా ఏవైనా చెప్పండి?   

సరదాగానా…ఏముంది,  బతకలేక బడిపంతులు. మేము స్ట్రైక్ చేసిన రోజుల్లో మా మీద లాఠీ చార్జ్ జరిగి, పేపర్లో వచ్చిన ఒక వార్త నాకు ఇప్పటికీ నవ్వు తెప్పిస్తూనే ఉంటుంది. అదే “విద్యా శాఖా మంత్రి ఇంటి ముందు బడిపంతులుకి బడిత పూజ” అని.

సీరియస్ గా ఏవైనా చెప్పండి?   

ఆడ పిల్లని కాపాడండి….అంతే

 మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి,కవితలైతే రెండు
మూడు ఈ ఇంటర్ వ్యూ తో పాటు పోస్ట్ చేయడానికి పంపగలరు.

http://www.manasvi-jaya.blogspot.in/2009/10/blog-post_23.html     మజార్ భాయ్
http://www.manasvi-jaya.blogspot.in/2010/05/blog-post.html    నల్లమల లో చెంచులతో
http://www.manasvi-jaya.blogspot.in/2009/10/blog-post_29.html       విరిసే పువ్వు
http://www.manasvi-jaya.blogspot.in/2010/01/blog-post_23.html      మాతృగర్భాలే మరణ శయ్యలు
http://www.manasvi-jaya.blogspot.in/2009/10/blog-post_17.html  కల్లోల కర్నూల్
http://www.manasvi-jaya.blogspot.in/2010/04/blog-post_9979.html  యమునా తీరమున
http://www.manasvi-jaya.blogspot.in/2010/03/blog-post_08.html  నేను నేను గానే
నాకు నచ్చినవి వడబోయగా కష్టం మీద ఇవి ఉంచాను…అంతే మరి !!!  ఇక్కడ ప్రచురించే కన్నా డైరెక్ట్ గా చదువుకుంటే  బాగుంటుంది కదా:)

పాస్పోర్ట్  ఫొటో:ఒకటి: నా బ్లాగ్ లో రెండు పోస్ట్ ల్లో ఉన్నాను. ఇంకెందుకు:)

43 thoughts on “మనస్విజయం

 1. నాకెంతో ఇష్టమైన బ్లాగ్స్ లో మనస్వి -జయ గారి బ్లాగ్ ఒకటి.ఏ విషయాన్నైనా చక్కగా, ఎంతో “అందంగా” చెప్పగల
  నేర్పు జయగారికుంది.జయగారి కామెంట్స్ కూడా బాగా రాస్తారు.పరిచయం చేసిన జాజిమల్లి గారికి ధన్యవాదాలు.

 2. మల్లీశ్వరి గారు, మొదట్లో ఎప్పుడో జిలేబీ గారు నా గురించి రాసారు. మళ్ళీ ఇప్పుడు మీరు:) నాతో ఇంటర్వ్యూ, అంటే నాకే గమ్మత్తు గా ఏవిటో గా ఉంది:) థాంక్సండి.

 3. మీ సున్నితత్వం, సునిశిత పరిశీలన చాలా బాగుంటాయి జయ గారూ.
  I like reading your blog a lot and learnt many things.
  (ఏమిటో. మళ్ళీ బ్లాగులు చదవటం మొదలు పెట్టేసరికి పాత మిత్రులని కలుసుకుంటున్నట్టని[ఇస్తోంది.)
  శారద

 4. స్టెతస్కోప్ లేని మరో డాక్టర్ గారి పరిచయం బావుందండీ.మనస్సుల్ని చదవడంలో ఆవిడ నిజంగానే డాక్టరేట్ పుచ్చుకున్నారనిపిస్తుంటుంది ఒక్కోసారి.

 5. కమాకజకయ కగాకరి కఇంకటకర్యూ కమకనకస్సు కకి కహకత్తుకకుకనేకలా కఉంకది. కనొకప్పింకపకక….కతాకనొకవ్వకక కవ్రాకసే కబ్లాకగకర్లకలో కజకయ కగాకరు కఒకకకరు. కఅకభికనంకదకనకలు కజకయ కగాకరూ!

  • కవకరూకధికని కగాకరు, కనింకడు కమకనకసు కతో కకకల్మకష కమెకరుకగకని
   కఅకభికనంకదకన కమీకది. కఅంకత కఅకర్హకత కనాకకు కలేకకుకన్నా కమీ కకకమ్మకని కహృకదకయాకని కకి కనా కకృకతకజ్ఞకతకలు.

 6. మనస్వి బ్లాగ్ అంటే నాకు చాలా ఇష్టం . జయ గారు చాలా బాగా హృదయాన్ని ఆకట్టుకునే వ్రాతలని లలిత లలితంగా వ్రాస్తారు. ప్రతి పోస్ట్ అంత బాగా వ్రాయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆమె నిజంగానే “మనస్విని ” అందరి హృదయాలని జయించారు

  జయ గారు అభినందనలు మీ బ్లాగ్ ఇంటర్ వ్యూ చాలా బాగుంది.

 7. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలనే మాట మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. నాకెంతో ఇష్టమైన అధ్యాపకవృత్తిలో వుంటూ, అందులోనూ ఆడపిల్లలకి ఆదర్శంగా వుండాలనుకుంటున్న మీ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చిందండీ. సింపిల్ గా, మనసుని ఆకట్టుకునేటట్టుగా వుంది. ఇంటర్వ్యూ చేసిన జాజిమల్లిగారికి ధన్యవాదాలు, మీకు అభినందనలు.

  • లలిత గారు, మీ అభిమానానికి నా ధన్యవాదాలండి.

   మీ లాంటి పెద్దలు కూడా నా కోసం వచ్చినందుకు, నేను తప్పకుండా మల్లీశ్వరిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

  • లలిత గారూ,
   ముగ్గురు లలితల కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను దయ చేసి ఎవరైనా తీర్చండి.దాట్ల లలిత గారు,సహృదయ లలిత గారు,యస్. లలిత గారు ముగ్గురూ వేర్వేరు కదండీ
   మీ స్పందనకి ధన్యవాదాలు

 8. అభినందనలు జయగారు…

  బ్లాగు ఓపెన్ చేయగానే….

  మనస్వి.. వినీల గగనపు వేదికపై నే పాడిన జీవన గీతం….

  అంటూ హాయిగా ఆహ్వానించే మీ బ్లాగు పోస్టులు కొన్నింటిని చదివాను… చదవాల్సినవి చాలానే ఉన్నాయి.. తప్పక చదువుతానండి..

 9. @ జయ గారూ.. మీరు చిత్రలేఖనాన్ని హింసిస్తున్నానని చెప్పినా సరే మీరు బొమ్మలు చక్కగా వేస్తారని మా అందరికీ తెలుసు. మీ బ్లాగులో పెట్టిన బొమ్మలు చూస్తే ఎవరైనాసరే అదే మాటంటారు. 🙂
  మీరు సరదాగా, సీరియస్ గా చెప్పినవి చాలా నచ్చాయండి.

 10. మీ పక్షుల, పువ్వుల చిత్రాలు నాకు చాలా చాలా నచ్చాయి జయగారు. లలిత కళలంటే ఇష్టం చాలా మందికి ఉంటుంది. కాని అభిరుచి తగ్గట్లు సాధన చేసి కళను పెంపోదించుకున్న మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేను. మీరు సీరియస్ గా చెప్పింది చాలా నచ్చింది.

  • జ్యోతి గారూ,ప్రకృతి అంతా లలితకళేకదా:) మీ మాటలు కూడా నాకు ఎంతో నచ్చాయి. ముఖ్యంగా ‘సీరియస్’ విషయం నచ్చిందన్నారు చూడండి, అక్కడ పడిపోయాను. Thank you.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s