అనువాద విశారద

Sharada1

 

 

 

 

 

 

 

 

 

బ్లాగర్ పేరు;   శారద

బ్లాగ్ పేరు;   నీలాంబరి 

బ్లాగ్ చిరునామా;   www.sbmurali2007.wordpress.com

పుట్టిన తేదీ;   2 జనవరి

పుట్టిన స్థలం; హైదరాబాదు

ప్రస్తుత నివాసం;   అడిలైడ్ , సౌత్ ఆస్ట్రేలియా

విద్యాభ్యాసం;   PhD in Physics

వృత్తి, వ్యాపకాలు;

వృత్తి  – ఆస్ట్రేలియన్ ప్రభుత్వ రంగ సంస్థలో సైంటిస్టు

వ్యాపకాలు  సంగీతం, సాహిత్యం 

బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ; 2007

మొత్తం బ్లాగ్ పోస్టులు (ఇంటర్వ్యూ నాటికి); 69

 బ్లాగ్ లోని కేటగిరీలు

సంగీతం, పుస్తకాలు, అడిలైడ్ ముచ్చట్లు , అవీ ఇవీ, సినిమాలు

బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?

2007 లో. నిజానికి నేను మొదట్లో బ్లాగు కేవలం అంత వరకూ అక్కడక్కడా అప్పుడప్పుడూ ప్రచురించబడే నా కథలు ఒక్క చోట వుంచుకోవటానికి మొదలు పెట్టాను. మెల్లగా కేవలం కథలే కాకుండా మామూలు విషయాలు కూడా బ్లాగుల్లో ముచ్చటించుకోవటం నాకు చాలా నచ్చి, మిగతా విషయాల గురించి అప్పుడప్పుడూ రాయటం మొదలు పెట్టాను. కిందటి సంవత్సరం (2012) లో నా కథల సంకలనం “నీలాంబరి” తీసుకువద్దామని నిర్ణయించి నా కథలన్నీ బ్లాగులోంచి తీసేసాను.

అనుకున్నంత తరచుగా రాయలేకపోయినా అప్పుడప్పుడూ రాస్తూనే వున్నాను. మళ్ళీ ఒకటి రెండు నెలల విరామం తర్వాత ఎప్పటిలా బ్లాగు రచన కొనసాగించగలననే ఆశ—-

బ్లాగ్ రచనలో మీ అనుభవాలు

నా బ్లాగు రచన కొంచెం ఇష్టం కొంచెం కష్టంలా సాగుతూ వుంటుంది. చాలా మంది like minded స్నేహితులని సంపాదించుకొన్నాను. అది నన్ను చాలా సంతోష పెడుతుంది. These friendships are totally independent of age, gender, qualifications, professions or any other attributes. Which I like very much.

నన్ను కొంచెం నిరుత్సాహపరచే విషయం, నేను ఎంతో ఆసక్తితో, passionate గా రాసే విషయాలపై సైతం పెద్దగా స్పందన వుండకపోవటం. అయితే నేను అనుకున్నంత తరచుగా రాయలేకపోవటానికి కారణం, ఒకటి బధ్ధకమైతే, ఇంకొకటి కొంచెం పని వత్తిడి ఎక్కువగా వుండే వృత్తి.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు, పరిమితులు

సానుకూలమైన అంశాలు సులువుగా మన భావాలనీ, బాధలనీ, ఆలోచనలనీ పంచుకోగలగడం. తర్క బధ్ధమైన చర్చలూ, కొత్త విషయాల గురించి సులభంగా నేర్చుకోవటం మొదలైనవి. కొత్త స్నేహితులని సంపాదించుకోవడం. నా  వరకు నేను, ఎన్ని కొత్త విషయాలను తెలుసుకున్నానో లెక్క లేదు. అలాగే చాలా మంచి స్నేహితులని కూడ సంపాదించుకున్నాను. 

అయితే ఇతరుల అభిప్రాయాలతో మనం ఏకీభవించలేకపోయినంత మాత్రాన వ్యక్తిగత దాడులకి దిగటం, వెక్కిరించటం, వెటకారాలతో చర్చలని నిర్వీర్యం చెయటం చాలా సార్లు జరిగే విషయాలు. దీంతో any meaningful exchange of opinions becomes impossible. అప్పుడు బ్లాగులు కేవలం క్షేమ సమాచారాలు తెలుపుకునే వుత్తరాల్లా మిగిలిపోయే రోజు రావొచ్చు. బ్లాగుల్లో ఇది నన్ను చాలా నిరుత్సాహపరచే విషయం.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ముఖాముఖి సంభాషణలూ, చర్చల్లో వుండే సంపూర్ణత్వం virtual స్నేహాల్లో వుండదు. బ్లాగులో అనుకున్నదంతా, అనుకున్నంత వివరంగా చెప్పలేం. బయటి ప్రపంచానికి మనకి సంబంధినంచి ఏదో ఒక ముఖమే చూపించే ప్రమాదమూ వుంది.కాబట్టి బ్లాగుల్లో చర్చల్లూ, స్నేహాలూ,అభిప్రాయ భేదాలూ అన్నీ కొంచెం one dimensional గా వుండే అవకాశం వుంది.


మహిళా బ్లాగర్ గా  మీ ప్రత్యేకత

నేను ఇద్దరు ఎదుగుతున్న వయసులో వున్న ఆడపిల్లల్ని నాది కాని పాశ్చాత్య వాతావరణంలో పెంచుకుంటున్న స్త్రీని. ఈ ప్రయాణంలో నేను, నన్నూ, పిల్లల్నీ, నా చుట్టూ వున్న వాతావరణాన్నీ అర్ధం చేసుకుంటూ, నాలో వున్న core personality ని పోగొట్టుకోకుండా  నడుస్తూ, ఒక రకంగా balance walk చేస్తున్నాను. నా సంస్కృతిలో వున్న స్వయం నియంత్రణా, పాశ్చాత్య సంస్కృతిలో వున్న స్వయం ప్రతిపత్తినీ కలిపి పిల్లలని పెంచుతున్నాని ఆశ పడుతున్నాను. ఈ ప్రయాణం లో నాకెదురైన అనుభవాలూ, ఆలోచనలూ, అభిప్రాయాలూ అన్నిటినీ బ్లాగు ప్రపంచంతో పంచుకోవాలన్న ఆశనాది.

అయితే, ఒక స్త్రీగా నా అలోచనల సున్నితత్వమూ, కుటుంబం పట్ల నాకున్న ప్రేమా, బాధ్యతా నాకున్న ఒక పార్శ్వం అయితే, నా వృత్తి మీద నాకున్న ఆసక్తీ, దాని వల్ల నాకొచ్చే sense of achievement నాకున్న ఇంకొక పార్శ్వం. ఇవి రెండే కాక, సంగీతం మీద నాకున్న ఇష్టమూ, సాహిత్యం పట్ల నాకున్న ఆసక్తీ, ఇవన్నీ కలిపి నన్ను మొత్తంగా define చేస్తాయి. ఇన్ని కోణాల్లోనూ నన్ను నేను ఆవిష్కరించుకుంటూ, నా ఆలోచనలు పంచుకుంటూ, ఇతరుల అనుభవాలతో నేర్చుకుంటూ బ్లాగు ప్రయాణం సాగుతోంది.

సంగీత సాహిత్యాలూ, కుటుంబ బాధ్యతలూ సంగతలా వుంచితే, professional world లో ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు. చాలా వరకు టెక్నికల్ ప్రపంచం (ముఖ్యంగా నేను పని చేసే వాతావరణం) పురుష ప్రపంచం (boy’s club). అక్కడ ఆ.. ఈ లెక్కలూ, ఫిజిక్సూ, ఇంజినీరింగూ ఆడవాళ్ళకి ఏం వస్తాయిలే ” అన్న ధోరణే కనబడుతుంది. ఈ వృత్తనే కాకుండా, ఏ ఫీల్డులోనైనా, తమ వృత్తిని ప్రేమించి, ambitious గా వుండే స్త్రీలని చూస్తే సంఘంలో చాలా మందికి అసహనం. “ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం వల్లనే సంఘంలో నేరాల సంఖ్య ఎక్కువైంది” అన్న కొత్త వాదన ఒకటి ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. ఇది వింటే నాకైతే నవ్వాగదు. స్త్రీగా నేనెదుర్కునే సవాళ్ళలో ఈ స్టీరియోటైపింగునెదుర్కోవడమే నాకన్నిటికంటే పెద్ద సవాలుగా అనిపిస్తుంది. ఎప్పటికైనా కొంచెం తీరిక చిక్కితే ఆ సవాళ్ళూ, ఆలొచనలూ, అన్నీ పంచుకోవాలన్న కోరికా

సాహిత్యంతో మీ పరిచయం

సాహిత్యం తో నా పరిచయం ఆంగ్ల సాహిత్యంతో జరిగింది. అయితే ఇరవై యేళ్ళు దాటేక తెలుగు సాహిత్యం తో పరిచయం పెరిగి, ముందుకు జరిగింది.

స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా

చాలా వరకు ఆడవాళ్ళకి సంఘర్షణా, దెబ్బలాటలూ నచ్చవు. “ఎవరి అభిప్రాయాలు వాళ్ళవిలే” అన్న ఒకరకమైన నిరాసక్తతో మనకి నచ్చని అభిప్రాయలు ఎవరైనా వెలిబుచ్చినప్పుడు వదిలేస్తాం. అందులో బ్లాగుల్లో వాదనలు మొదలైనప్పుడు అవి చాలా తొందరగా “వ్యక్తిగత దాడుల్లోకి” దిగుతాయి. అందుకే చాలా వరకు సెన్సిటివ్ విషయాల మీద ఆడవాళ్ళు స్పందించరు. నేను కూడ చాలా సార్లు అలాటి మౌనమే వహించటం జరిగింది. ఏదైనా విషయం గురించి రాయాలనో, వాదించాలనో అనిపించినప్పుడు, “నేను స్త్రీని, ఇలాటి విషయం రాస్తే నన్ను తప్పుగా అర్ధం చెసుకుంటారేమో” అన్న ఆలోచన కంటే, “వాదనలతో మనుషులని మార్చలేం. మనుషులు మారాలంటే, వాళ్ళ సొంత ఆలోచన, అనుభవాలతోటే మారాలి,” అన్న ఆలోచన వల్ల ఎక్కువగా వాదోపవాదాల్లో పాలు పంచుకోను.

జీవన నేపధ్యం

మామూలు మధ్య తరగతి కుటుంబం. అత్తవారిది తమిళుల కుటుంబం కావడంతో వాళ్ళ సంస్కృతినీ దగ్గరించి గమనించే అవకాశం దొరికింది.

ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?

దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఒక వేళ మానేయటమంటూ జరిగితే, బహుశా అది చాలా gradual గా జరగొచ్చు.

సరదాగా ఏవైనా చెప్పండి

సీరియస్ విషయాల గురించే ఆలోచిస్తానన్న నింద నా స్నేహితులు నా మీద వేసినా, నిజానికి జీవితంలో sense of humour చాలా ముఖ్యమని నా నమ్మకం. అదృష్టవశాత్తూ నా జీవితంలో వున్న వాళ్ళందరికీ (భర్తా, తోబుట్టువులూ, పిల్లలూ) బోలెడంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ వుండడం వల్ల నా చుట్టూ నవ్వులకి లోటు లేదు. అలాగే నేను చదివే పుస్తకాల్లో కూడా హ్యూమరు చాలా పెద్ద స్థానాన్నే ఆక్రమిస్తుంది.

సీరియస్ గా ఏవైనా చెప్పండి

సాహిత్యం తరవాత నాకు అంతే passionate  గా ఇష్టమైన విషయం సంగీతం ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం. సంగీతం పాడుకోవడం లోనూ, పిల్లలకి నేర్పించడంలోనూ చాలా స్వాంతన పొందుతాను. జీవితం లో వచ్చే ఆటుపోట్లని తట్టుకోవడానికి ప్రతీ మనిషికీ ఏదో ఒక వ్యాపకం, మనసుని కదలకుండా కట్టిపడేయగలిగేది తప్పకుండా వుండాలి, అని నా నమ్మకం. అది కొన్నిసార్లు స్వతహాగా వచ్చినదైనా (inborn talent) కావొచ్చు, లేదా కల్పించుకొన్నదైనా కావొచ్చు (cultivated taste).

అనువాదకురాలిగా మీ అనుభవాలు-

పైన చెప్పినట్టు నాకు సాహిత్యంతో పరిచయం మొదట ఆంగ్ల సాహిత్యంతో జరిగింది. నాకు కొంచెం పెద్దయ్యాక చాలా వింతగా తోచిన విషయం ఏమిటంటే వివిధ ప్రాంతాల్లో మనుషులు బ్రతికే విధానాలు,

ప్రాంతాలు వేరు కావొచ్చు కానీ, మనుషుల మధ్య సంబంధాలని నిర్దేశించే సూత్రాలు మాత్రం దాదాపు ఒకే రకమైనవి.. అనువాదాల మీద అప్పుడే ఆసక్తి మొదలైంది. ఎందుకంటే, ఒక అనువాద కథలోమనకి ఏమాత్రం పరిచయం లేని ప్రాంతంలో వున్న మనుషుల భావోద్వేగాలతో కూడా మనం identify చేసుకోవచ్చు.

ఇది ఇలా వుండగా ఒకసారి నిడదవోలు మాలతి గారి తూలిక వెబ్ సైటు కొసం కొన్ని తెలుగు కథలని ఇంగ్లీషులోకి అనువదించాను. అప్పుడప్పుడూ ఇంగ్లీషులోంచి తెలుగులోకీ అనువాదాలు చేస్తూనే వున్నాను. అలా సరదాగా మొదలైన అనువాద ప్రక్రియ, over the years కొంచెం సీరియస్ నెస్ ని సంతరించుకుంది.

సొంతంగా చేసే రచనలకీ, అనువాదాలకీ చాలా తేడాలున్నాయి. రచనలకి భావ ప్రకటన ముఖ్యమైతే, అనువాదాలకి భాష మీద పట్టు ముఖ్యం.

అ) ప్రతీ భాషకీ తనదైన ఒక లయా, ఒక గ్రామరూ, idiomatic expression వున్నాయి. ఒక వాక్యాన్ని ఒక భాషలోంచి ఇంకొక భాషలోకి అనువదించేటప్పుడూ ఈ నిజాన్ని మనసులో పెట్టుకోవాలనిపిస్తుంది నాకు. అంటే “యథాతథంగా” అనువదించేకంటే, ఆ భాషకి తగిన ఇడియం వాడితే చదువరికి కథ గాఢంగా హత్తుకుంటుంది.

ఆ) అన్నిటికంటే హాస్య కథలు అనువదించటం కష్టమేమో. సాధారణంగా హాస్యం రెండు రకాలు. ఒకటి situational comedy, అసంబధ్ధమైన సంఘటనల వల్ల పుట్టే హాస్యం. రెండోది  భాషా, యాసలవల్లా పుట్టే హాస్యం. మొదటిది అనువదించటానికి వీలుగానే వున్నా, కొంచెం తాడు మీద నడకలానే వుంటుంది. రెండో రకం రాయాలంటే మాత్రం భాష మీదా, ఇడియం మీదా చాలా పట్టుండాలి. ఈ మధ్య నా అభిమాన హాస్య రచయిత P.G.Wodehouse కథ ఒకటి అనువదించటానికి ప్రయత్నిస్తున్నాను. ఎలా వస్తుందో చూడాలి.

ఇ) కిందటి వారం సారంగ ప్రత్రికలో చెహోవ్ రాసిన కథకి నేను చేసిన అనువాదం వచ్చింది. దాన్ని చదివిన పాఠకులొకరు, “కథలో పేర్లు రష్యన్ పేర్లు కాక భారతీయ పేర్లు పెడితే బాగుండేదేమో” అన్నారు.

ఈ విషయం లో కొంచెం confusion-

 ఇతర ప్రపంచ కథలు అనివదించేప్ప్పుడు భారతీయ పేర్లు పెట్టొచ్చు. కానీ అప్పుడది అనువాదం అవుతుందా లెక అనుసరణ అవుతుందా? పైగా, పేర్లన్నీ భారతీయుల్ పేర్లైనప్పుడు ప్రదేశాలు కూడా మార్చాల్సొస్తుంది. లండన్ బదులు మద్రాసు, న్యూయార్కు బదులు హైదరాబాదు ఇలాగ. అప్పుడిక అది అనుసరణే అవుతుంది కానీ అనువాదం కాదు.

అయితే అనువాద కథలు చదవటానిక్కారణం, ప్రపంచ రచయితలని పరిచయం చేసుకోవటమే కాక, బయట ప్రపంచం లో బ్రతుకుతున్న వాళ్ళ జీవిత విధానం తెలుసుకోవడానిక్కూడా. (అందుకే నాకు భారతీయ జీవితం గురించి భారతీయులు ఇంగ్లీషులో రాసే పుస్తకాలు తెలుగులోకి అనువదించాలంటే పెద్ద ఉత్సాహం వుండదు.) అప్పుడు కథలోని ప్రదేశాలూ, పేర్లూ మూల కథలో వున్నట్టు వుంటేనే, పరాయి భాషలోంచి వచ్చిన కథ చదువుతున్నామన్న స్పృహ పాఠకుడికి వుంటుంది.

నేననేదేమిటంటే- అనువాద కథ చదువుతున్నప్పుడు, పాఠకులకి భాషా- వ్యక్తీకరణ తమ స్వంత భాషలాగుండాలి. కథనమూ, పాత్రలూ, ప్రదేశాలూ మనవి కావన్న స్పృహా కలిగించాలి. అప్పుడే కథ చదవాలన్న కుతూహలమూ, కొత్త విషయాలను తెలుసుకోవలన్న కుతూహలమూ, రెండూ తీరతాయి.

మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ 

నీతిస్త్రీ వాదం ఆర్ధిక స్వాతంత్ర్యం మీద నేను రాసిన రెండు భాగాలూ నాకు చాలా ఇష్టమైనవి.

http://sbmurali2007.wordpress.com/2011/01/20/%e0%b0%a8%e0%b1%80%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95-%e0%b0%b8/

26 thoughts on “అనువాద విశారద

 1. శారద గారూ

  మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా ఆనదంగా ఉంది. నేను ఈమెయిల్ ఫాలో అయ్యేది మీ ఒక్క బ్లాగు మాత్రమె, ఏది మిస్సవ్వకూడదు అని ఆడ్ చేసికొన్నాను.

  మీరు వ్రాసినది కొంత అయితే వ్రాయాలనుకొంటున్నది కొండంత అన్నమాట. అప్పుడప్పుడు వ్యాఖ్యానించినా, తరచుగా నా స్పందనని తెలియపరచలేకపోయాను. గంభీరం గా ఉండడం వల్లనేమో కొన్ని అలా చదివి వెళ్ళిపోతుంటాను. మీ చివరి టపాలో అయితే వ్యాఖ్య వ్రాద్దామని..వ్రాయలేక రెండుమూడుసార్లు ప్రయత్నించి వదిలేసాను కూడా . మొత్తానికి చెప్పేదేంటంటే, మీరు వ్రాసినదానికన్నా ఏంతో ఇష్టం గా, ఉత్సాహంగా చదువుతాము మీరేం వ్రాసినా. ప్రోత్సాహాన్ని వ్యాఖ్యల్లో చూడొద్దు . మరీ అంత పర్ఫెక్ట్ గా వ్రాస్తే , వ్యాఖ్యానించడానికి ఏమి ఉండదు కదా 🙂

  బ్లాగులో అనుకున్నదంతా అనుకున్నంత వివరంగా చెప్పలేము అన్నారు. చాలా నిజం కాని, అసలు బ్లాగులో చెప్పాలనుకోవడానికి కారణం తెలిస్తే చెప్పెస్తాము కదా.

  @ అప్పుడు బ్లాగులు కేవలం క్షేమ సమాచారాలు తెలుపుకునే వుత్తరాల్లా మిగిలిపోయే రోజు రావొచ్చు.

  ఎంత సూటిగా చెప్పారు. ఇప్పటికి వ్రాస్తున్న ఇద్దరు ముగ్గురు కూడా ఇంకా తగ్గించేస్తున్నారు.మీలాంటి వారిని ‘అయినా వ్రాయండి’ అని చెప్పేంత చనువు లేదు, కాని మీరువ్రాయకపోతే మిమ్మల్ని ఇంకెక్కడా చూడలేము. అదన్నమాట

  మీ బ్లాగులో లేబుల్స్ విడ్జెట్ పెట్టండి. ఖాళీ ఉన్నప్పుడు వెతుక్కుని చదువుకోవడానికి బావుంటుంది.

  మీరు వ్రాయాలనుకొన్నవి అన్నీ తప్పకుండా వ్రాయాలి. మేము కూడా మా అభిప్రాయాలు మిస్సవకుండా చెప్తాము.

  మీ బ్లాగు పేరు ‘నీలాంబరి’ అని ఎందుకు ఉందా అని నాకెప్పుడూ సందేహమేనండీ .

 2. శారద గారి పరిచయం బాగుంది.అన్ని విషయాలలోనూ మంచి అవగాహన ఉన్న వారని తెలుస్తోంది.ఈ మధ్య వచ్చిన ఒకటి రెండు అనువాదాలు తప్పితే ఆవిడ రచనలు ఇంతకు ముందు ఏవీ చదివి ఉండలేదు.ఆవిడ రచనలు అన్నీ ముఖ్యంగా అడిలైడ్ ముచ్చట్లు అవీ త్వరలోనే చదవుతాను.ప్రపంచంలో ఏ భాష మాట్లాడే వారయినా ఏదేశస్థులైనా మనుషులందరి మనస్థత్వాలొక్కటే అన్నది నా అభిప్రాయం. ఆస్ట్ర్రేలియా లో పనిచేసే ఆవిడ అక్కడ కూడా ప్రొఫెషనల్స్ లో స్త్ర్రీల సామర్థ్యాన్ని గుర్తించడం లేదంటున్నారంటే నా అభిప్రాయం ఇంకా బలపడుతూనే ఉంది. శారద గారికీ మంచి పరిచయం చేసిన జాజిమల్లి గారికీ అబినందనలు.

 3. ఇప్పటి వరకు పరిచయం చేసిన బ్లాగర్ లందరి కన్నా మహిళా బ్లాగర్ గా మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.

  నేను స్పష్టంగా చెప్పటానికి ప్రయత్నించని ఎన్నో అంశాలని చక్కగా విశదీకరించారు శారద గారు.

  నాకు మీ పరిచయం చాలా నచ్చింది మళ్ళీ వ్యాఖ్యలలో తిరిగి కనబడతాను. ఇప్పటికి ఆనందంతో ఈ ముందు వ్యాఖ్య .

 4. I wrote a long comment and lost it by accident. So I’m writing in English simply because I might type faster in English and don’ have to shift between tabs.
  Sarada garu, when I read this part, “వాదనలతో మనుషులని మార్చలేం. మనుషులు మారాలంటే, వాళ్ళ సొంత ఆలోచన, అనుభవాలతోటే మారాలి,” అన్న ఆలోచన వల్ల ఎక్కువగా వాదోపవాదాల్లో పాలు పంచుకోను.”, I questioned my own participation in some discussions to some extent. It has helped me greatly to participate in the discussions that I did, even though at times it was difficult to not to go overboard (emotionally). My reason for participating in such discussions to examine my own opinion, to see if I can learn to see the same from a different perspective or if I find some strength in my own conviction. I don’t think I ever tried to bring about a change in anyone other then myself (for better) through discussions.
  I read some (wish I read all) of your posts and got a taste of more than one dimension of your personality.
  Coming to this,
  “నన్ను కొంచెం నిరుత్సాహపరచే విషయం, నేను ఎంతో ఆసక్తితో, passionate గా రాసే విషయాలపై సైతం పెద్దగా స్పందన వుండకపోవటం.”
  while I share that feeling about what I express, I realize that I am one of those people who don’t always comment on what they read or like. There are some bloggers among us who do just that and I admire them for that.
  I wish I could respond to each of the interviews published by Jajimalli garu or to each of her own posts. I respond only if I feel like that on a particular day or if something catches my eye that urges me to respond because I have something different to say or learn from or sometimes if there are not enough responses for a good enough post.
  I liked reading your interview and didn’t read it completely yet.
  Will read it again calmly when I am not in a rush to express my opinion first.

  • లలితా గారూ

   నేను కూడా శారద గారి ఆ వ్యాఖ్య దగ్గర చాలా సమయం ఆగిపొయాను. మీ అభిప్రాయం అప్పుడప్పుడన్నా చెప్పాలి అని అనాలని ఉన్నా , ఏమో శారద గారోక్కరే కానప్పుడు ఒక్కరినే అడగడం కరెక్ట్ కాదేమో, అదీ కాక తను చెప్పింది కూడా సౌకర్యమ్ గా ఉంటుందేమో అని వదిలేసాను. కాని అడక్కుండానే అంత వివరంగా శారద గారు చెప్పడమే ఒక పెద్ద గిఫ్ట్ ,అది చాలనిపించింది.

   అప్పుడప్పుడు మీ అందరు జాజిమల్లి బ్లాగులో మిగిలన టపాల్లో కనిపిస్తే బావుంటుంది అండీ. బ్లాగుల్లో గంట చదువుతున్నాము , పది నిముషాలు వ్రయాదానికి ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కాని అది చర్చలోకి మళ్ళితే ఎక్కడ/ఎప్పుడు తేలుతుందో అని అందరి సమస్య కావచ్చు.

   జాజిమల్లిగారు ఈ సమస్యకి సమాధానం లేదా పరిష్కారం చెప్పాలి. వ్యాఖ్య ఒక్కటి వ్రాయడం వరకే మాపని, దానిపై వచ్చే సమాధానాలు అన్నీ మీరే ఇవ్వాలి 🙂

   నిజమే బ్లాగుల్లో వ్యాఖ్యల క్వాలిటీ పెరగాలంటే, ఆయా బ్లాగరు బాధ్యత ముఖ్యం. ఎవరో తన్నుకుంటున్నారు , ఒకళ్ళు మనకి కుప్పలుగా వ్యాఖ్యలు వ్రాసేవాళ్ళు అనో, కావాల్సిన వారు అనో అనుకుంటే ఆ బ్లాగ్ ఫెయిలయినట్లే. టపా వ్రాసాక అందరి వ్యాఖ్యలకూ బ్లాగ ఓనర్ బాధ్యత ఉండడం లేదు.

 5. శారద గారూ! నేను చాలా అబిమానించే బ్లాగర్లలో ముఖ్యమైన వారు మీరు. ఎన్నో పుస్తకాలు, సంగీతం తాలుకూ కబుర్లు,విశేషాలు నేను మీ బ్లాగ్లో చదివి తెలుసుకుంటూంటాను.

  “నన్ను కొంచెం నిరుత్సాహపరచే విషయం, నేను ఎంతో ఆసక్తితో, passionate గా రాసే విషయాలపై సైతం పెద్దగా స్పందన వుండకపోవటం. ” — నేనూ చాలా సార్లు అనుకునేదే కానీ కొందరి బ్లాగులు చూసినప్పుడు, మీ బ్లాగ్ చదివినప్పుడల్లా ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది.

  “వాదనలతో మనుషులని మార్చలేం. మనుషులు మారాలంటే, వాళ్ళ సొంత ఆలోచన, అనుభవాలతోటే మారాలి”
  true ! చాలాసార్లు నేను కూడా ఇదే కారణంగా మౌనంగా ఉండిపోతుంటానండి..జీవితంలోనూ, బ్లాగుల్లోను కూడా..:)

  @జాజిమల్లి గారూ, ఇంత మంచి ముఖాముఖి అందించినందుకు ధన్యవాదాలు.

 6. ఇంటర్వ్యూ బావుందండి.

  Physics Profession ఏమో మీది!. మీరు Boys Club అనగానే నవ్వొచ్చి, మొన్న మార్చిలో చనిపోయిన తొలితరం కెనడియన్ రాకెట్ సైంటిస్ట్ Yvonne Brill గుర్తొచ్చారు. ఆవిడ వుమన్ అవడం వల్ల ఇంజనీరింగ్ చదవడానికి అడ్మిషన్ ఇవ్వలేదట ఒకప్పుడు. అందుకని కెమిస్ట్రీలో డిగ్రీ తీసుకోవాల్సివచ్చిందిట. 1940sలో బహుశా అమెరికాలో రాకెట్ ప్రొపల్షన్ టెక్నాలజీ మీద పనిచేసిన ఒకే ఒక మహిళ అని రాయగా చదివినట్లు గుర్తు.

  “జీవితం లో వచ్చే ఆటుపోట్లని తట్టుకోవడానికి ప్రతీ మనిషికీ ఏదో ఒక వ్యాపకం, మనసుని కదలకుండా కట్టిపడేయగలిగేది తప్పకుండా వుండాలి, అని నా నమ్మకం.”

  చాలా విలువైన మాట చెప్పారు. అకడమిక్స్ కాకుండా, ప్రతీ పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఇదని నేను కూడా బలంగా నమ్ముతాను. ముఖ్యంగా సంగీత, సాహిత్యాల పరిచయం లేని కుటుంబాల నుంచి వచ్చిన పేరెంట్స్ ఈ పాయింట్ నోటీస్ చేయక, అది పిల్లలకి అందించాలన్న ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోకపోవటం నేను తరచుగా చూసే విషయం. ఒకవేళ అభ్యాసం చేపించినా అది అకడమిక్స్ కి సప్లిమెంట్ గా వాళ్ళ resumes ని enhance చేసే దృష్టితో తప్ప, మీరు చెప్పిన దృష్టితో కాదు. Thanks.

 7. నా బ్లాగులో వ్యాఖ్యలు రాసే శారదగారు మీరేనా !
  సారంగలో మీ అనువాద కథ చదివి వ్యాఖ్యానించినపుడు కూడా నాకీ సంగతి తెలీదు.
  మిమ్మల్ని ఇలా కలవటం సంతోషంగావుందండీ శారదగారు .

  • స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
   @లలిత గారూ,
   అవునండీ! మీ బ్లాగులో వ్యాఖ్యలు పెట్టేది నేనే. అన్నట్టు, మీ గిరజాల బోడి బాబు కథ మా ఇంట్లో అందరికీ చదివి వినిపించాను.
   @కుమార్ గారూ,
   ప్రపంచంలోని మొట్ట మొదటి ప్రోగ్రామర్ ఆడా లవ్ లేస్, ఫిజిక్సులో అత్యంత సుందరమైన symmetry, conservation laws కనుక్కొన్న ఎమ్మా నెదర్, అందరూ వాళ్ళ వాళ్ళ రోజుల్లో వివక్షని ఎదుర్కొన్న వాళ్ళే. నిజానికి వాళ్ళతో పోలిస్తే మనం చాలా అభివృధ్ధి చెందాము.
   @Mauli gAru,
   నాకెంతో ఇష్టమైన ఆకాశాన్నీ, రాగాన్నీ కలిపి వచ్చేలా నా బ్లాగుకి “నీలాంబరి” అని పేరు పెట్టాను. ఆ పేరుతో నాదొక కథా సంకలనం కూడా విడుదలకి చేరువలో వుంది.
   పోతే- ఒక చిన్న క్లారిఫికేషన్=
   టపాలకి వచ్చే కామెంట్లు, ఎలాటివైనా బ్లాగర్లకి ప్రోత్సాహంగా వుంటుందన్న మాట నిజమే. అయితే నేను మాట్లాడేది చర్చల గురించి.
   బ్లాగులకి వచ్చే వ్యాఖ్యలు రెండు రకాలుగా వుంటాయి. “బాగుందనో,
   బాలేదనో”. తర్వాత రెండో రకం వి, “మీకిలా జరిగిందా? నాకలా జరిగింది,” అనే exchange of perspectives.
   చాలా వరకు నాకు తెలిసి బ్లాగుల్లో, “చాలా బాగుందండీ”, అనే వ్యాఖ్యలో, “లేదా నా ప్రాణం పోయినా సరే, తెలంగాణా రానివ్వం,” “ఆడవాళ్ళకి ఇంకా చట్ట సహాయం ఎందుకు మేమే పోషిస్తూంటే?” అనే రంకెలో తప్ప, పెద్దదో చిన్నదో ఒక సమస్య గురించి చర్చ, healthy exchange of opinions జరగడం ఎక్కువగా చూడలేదు.
   పెద్ద పెద్ద సమస్యలే కాకుండా దైనందిన జీవితం లో చిన్న చిన్నవైనా, ముఖ్యమైన డైలెమ్మాలూ, సందిగ్దాలూ, కంఫ్యూషన్లూ, వీటన్నిటి గురించి ఎక్కడైనా చర్చిస్తున్నామా? ఉదహరణకి, నేను రెండు మూడు సార్లు నా బ్లాగులో విచిత్రమైన సంఘటనలూ, నా మనస్సులో వుండే కాంట్రడిక్షన్లూ ప్రస్తావించాను. పెద్దగా స్పందన లేదు. (మనసులో ముళ్ళు, వికటించిన హాస్యం, యత్ర నార్యస్తు పూజ్యంతే are a few egs.). అందువల్ల చాలావరకు బ్లాగు పాఠకులకి feel good టపాలెక్కువగా నచ్చుతాయనే conclusion కి రావాల్సి వస్తుంది.
   I know we are all struggling with the given 24 hrs, trying to stretch them as much as possible. GIven our time pressure with other commttments, discussion in electronic media naturally becomes a lower priority. That is why I said that, “exchange of opinions in blogs, virtual world communications have a tendency to become one dimensional.”
   Thanks to all of you for your appreciation.
   Sharada

 8. పింగుబ్యాకు: అనువాద విశారద | వసుంధర అక్షరజాలం

 9. పింగుబ్యాకు: అభినందన, ఆణి ముత్యాలూ :) | నీటి బుడగలు

 10. ఇక్కడ పంచుకున్న ఆలోచనలకి పొడిగింపు ఇక్కడ (http://nitibudagalu.wordpress.com/2013/04/09/parakh/) చూడగలరు. ఇంక శారద గారి బ్లాగుకెళ్ళి సావకాశంగా చదువుకుంటాను 🙂

 11. I am a silent admirer of you and your blog Sarada garu! నాకు ఫిజిక్సు అన్నా ఫిజిక్సు చదివిన వాళ్ళు అన్నా ఓ ఆరాధనా భావం. మీ కుటుంబ సభ్యుల సంగీతాభిరుచి ఎంత ముచ్చటగా ఉంటుందో! మంచి చర్చలు జరగటంలేదన్న మీ వాదనతో ఏకీభవిస్తాను. సమాయాభావం కన్నా మీరన్నట్లు మనకెందుకు వచ్చిన గొడవ అనుకుని పక్కకి పోయేవాళ్ళమే ఎక్కువ.

 12. శారదగారూ….

  ఇంటర్వ్యూలోని అన్ని ప్రశ్నలకూ మీ సమాధానాలు చాలా బాగా నచ్చాయి… వాటిల్లో “మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత” అన్న ప్రశ్నకి మీ సమాధానం ఎందుకో ఎక్కువగా నచ్చేసింది.

  మీ గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి. ఇకపై తప్పక మీ బ్లాగ్ ఫాలో అవుతాను. మీ పరిచయ భాగ్యం కల్పించిన మల్లీశ్వరిగారికి ధన్యవాదాలు.

 13. ఇంత అభివృద్ధి సాధించినా స్త్రీల పట్ల చాలా మందికి చులకన భావం ఉందనడంలో మీతో పూర్తిగా ఏకీభవిస్తాను శారద గారు. ఇంటర్యూ ఆలోచింపచేసేదిగా వుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s