మహిళా బ్లాగర్లకి విజ్ఞప్తి

కధా రచనతో పాటు సాహిత్య విమర్శ నా అభిమాన అంశం.స్త్రీల సాహిత్యం మీద పరిశోధన చేస్తున్నపుడు చాలా బాగా రాసి కూడా  వెలుగులోకి రాని రచయిత్రులెందరో కనిపించి చాలా ఆశ్చర్యం కలిగింది.పేరు ప్రఖ్యాతుల సంగతి పక్కన పెట్టి అసలు రాసినట్లు కూడా రికార్డ్ కాకపోవడం బాధాకరం.తెలుగు సాహిత్యానికైతే వెయ్యేళ్ళ చరిత్ర.మన బ్లాగులకి పదేళ్ళ చరిత్ర నిండలేదింకా…మహిళలు నిర్వహిస్తున్న సాహిత్య బ్లాగుల్ని,బ్లాగర్ల వివరాలని నాకు చేతనైనంత మేరకు ఒక చోట చేర్చే ప్రయత్నం చేయాలని అనిపించింది…ఇది సముద్రంలో వెతుకులాటే….ఈ వెతుకులాట మేలిముత్యాల వేట కనుక  ప్రియమైన మహిళా బ్లాగర్లని జాజిమల్లి ఎంతో ఇష్టంతో,ప్రేమతో ఆహ్వానిస్తోంది.
మీ మెయిల్ ఐడిని malleswari.kn2008@gmail.com కి పంపితే ప్రశ్నావళి పంపుతాను.దానిని మీరు నింపి పంపితే నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.
ఈ ప్రశ్నలు కాక మీరు ఇంకేమైనా చెప్పదల్చుకున్నా రాయొచ్చు.మార్పులూ చేర్పులూ ఉంటే  సూచించండి.ఇది కేవలం వ్యక్తిగతంగా కాక మన బ్లాగ్ సాహిత్య చరిత్రని మనమే నిర్మించుకునే ప్రయత్నంగా చూడాలనీ మీకు వీలైన సహకారాన్ని అందించాలనీ కోరుకుంటున్నాను.నాకు తెలిసిన మెయిల్ ఐడీ లకి పోస్ట్ చేస్తున్నాను.మీరు మరి కొన్ని సూచించగలరు.కనీసం 100 మంది మహిళా(సాహిత్య)బ్లాగర్ల అంతరంగాల్ని కొంత మేరకైనా ఆవిష్కరించగలిగితే మన ప్రయత్నం ఫలించినట్లే…
ప్రకటనలు

2 thoughts on “మహిళా బ్లాగర్లకి విజ్ఞప్తి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s