టిక్కు టాక్కు సెప్పుల గుంటకాన…

ఈ నెల భూమికలో వచ్చిన కాలమ్
(మాటర్ పై క్లిక్ చేయండి)

ప్రకటనలు

17 thoughts on “టిక్కు టాక్కు సెప్పుల గుంటకాన…

 1. కొత్తగా కాలమ్ రాయటం ప్రారంభించారనుకుంటాను, బాగుంది. స్వీయానుభవంతో మొదలుపెట్టటం పఠనీయతను పెంచింది. ఉత్తరాంధ్ర స్త్రీల మాట తీరు ప్రత్యేకతను చాలా బాగా వివరించారు. ‘బూవి సెపితే ఆకాశం నమ్మదా?’ అన్న వాకపల్లి గిరిజన మహిళ ఆవేదన ఎంత శక్తిమంతంగా ఉందో! వీళ్ళంతా నామవాచకాలు కాదు సర్వనామాలే’ అనే వ్యాఖ్యానం కూడా బాగుంది.

  • అవును వేణూ గారూ,
   ఇది మూడో కాలమ్…సీరియస్ అంశాలను సీరియస్ గా చెపితే పఠనీయత తగ్గుతుంది అన్నది వాస్తవం.కానీ కొన్ని సందర్భాల్లో తప్పడం లేదు…అందుకే ఈజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను.చూడాలి మరి.
   థాంక్ యూ అండీ.

 2. సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కి అప్పట్లో కూడా హింసాద్రి ఎక్స్‌ప్రెస్ అని పేరు ఉండేదా? 2002 టైమ్‌లో అనుకుంటాను, విశాఖపట్నంలో సింహాద్రి ఎక్స్‌ప్రెస్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కంటే 20 నిముషాల ముందు స్టేషన్ నుంచి బయలుదేరేది. కానీ జన్మభూమి ఎక్స్‌ప్రెసే సింహాద్రి కంటే ముందు రాజమండ్రి చేరేది. అనపర్తి దగ్గర జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కి లైన్ ఇవ్వడానికి సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ని ఆపేసేవాళ్ళు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ కావడం వల్ల టికెట్ ధర పది రూపాయలు ఎక్కువ అని నేను సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కేవాణ్ణి. కానీ సింహాద్రిలో రాజమండ్రి చేరేసరికి నేను కూడా నరకం చూసేవాణ్ణిలెండి.

  • ప్రవీణ్ గారూ,
   మీ వ్యాఖ్య చూడగానే అందులోని విషయం మీదికి కాకుండా మీ వాక్యాల నిర్మాణం మీదికి ధ్యాస పోయింది.తెలుగు పంతులమ్మని కదా…
   చాలా సరళమైన విషయాన్ని భలే సంక్లిష్టం చేసారు.నాలుగు లైన్ల మీ వాక్యంలో ఆరు ‘సింహాద్రి’లు, నాలుగు ‘జన్మభూమి’లు, తొమ్మిది ‘ఎక్స్ ప్రెస్’లు వచ్చాయి.
   1993 కి జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఉందా?గుర్తురావడం లేదు.రత్నాచల్ ఉండేదన్నట్టు జ్ఞాపకం.

   • అది, ఇది అని సర్వనామాలు వాడితే కంఫ్యూజ్ అయిపోతారని నేనే కావాలని syntax (వచన నిర్మాణం) అలా వ్రాసాను. నేను సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కినది 2002 టైమ్‌లో. సింహాద్రితో విరక్తి పుట్టి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కడం మొదలుపెట్టాను.

   • ప్రవీణ్ గారూ,
    సర్వనామాల సమస్య కాదు లెండి.అన్ని రైళ్ళ ఆప్షన్స్ ఉండడమే సమస్య.

 3. హిం సా ద్రి :), మేము విజయవాడ నుండి కాకినాడ కి వెళ్ళేవాళ్ళం

  మాండలీకం విషయానికి వస్తే కొత్తలో గమ్మత్తు గా ఉన్నా, నవ్వుకొని వదిలేసేవాల్లమే కాని, ఇంత ఆసక్తిగా పట్టించుకోలేదు.

  మీ భూమిక కాలమ్స్ అన్ని బుక్ వేయిస్తారా!

  • నేను పుట్టినది ఉత్తరాంధ్రలోనే. కానీ చిన్నప్పుడు కరీంనగర్, వరంగల్‌లలో ఉండడం వల్ల నాకు ఉత్తరాంధ్ర భాష రాలేదు.

   సింహాద్రి ఎక్స్‌ప్రెస్ విషయానికొస్తే అది ఎప్పుడూ నరకమే. అప్పుడు నా దగ్గర డబ్బులు లేక జెనెరల్ పెట్టెలలో ప్రయాణించేవాణ్ణి కానీ ఇప్పుడు నేను ఎలాగూ ఎక్కేవి ఎసి పెట్టెలు కనుక నాకు ఏ ట్రైన్ ఎక్కినా నరకం ఉండదులెండి.

  • మౌళీ,
   బాగా ఆలస్యంగా నడిచేదని ‘హింసాద్రి’ అనేవాళ్ళం.అయితే మీరూ దాని బారిన పడ్డారన్న మాట.కాకపోతే అంత అర్జెంట్ పనులు లేని వాళ్ళు సింహాద్రిని ఎంచుకుని,ప్రయాణంలో చక్కగా కారేజీల్లో పులిహారా పెరుగన్నాలు తెచ్చుకుని కంపార్ట్మెంట్ ని ఘుమఘుమ లాడించేసేవారు.
   భూమిక కాలమ్స్ బుక్ వేయడం గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదండి.

  • లక్ష్మీనారాయణ గారూ,
   మన ప్రాంతం,మన సంస్కృతి భాష గురించి ఎక్కడ విన్నా, చదివినా ఎవరికైనా సంతోషం కలుగుతుంది.అది అత్యంత నిసర్గంగా మీ వ్యాఖ్యలో కనిపించింది.
   ధన్యవాదాలు.

 4. జాజి మల్లి గారు, హింసాద్రి అంటూ పాత జ్ఞాపకాలు గుర్తుకు తెప్పించారు. నేనెక్కిన రెండో రైలు సింహాద్రి. ఉత్తరాంధ్ర భాషీయుల మధ్య నేను నాలుగేళ్లు గడిపాను. ఉత్తరాంధ్ర అయినా, గుంటూరు, ప్రకాశం, నెల్లూర్లయినా శ్రమ జీవుల తర్కం దాదాపు ఒకటిగానే ఉంటుంది. జీవిత అనుభవాల్లోంచి వచ్చే తర్కం అది. చాలామంది తర్కకోసం పండిత భాష్యాలు వెతుకుతారు గానీ వాస్తవాలు నిండుగా ఉండే సామాన్యుల తర్కాన్ని నవ్వి తేలిక చేస్తారు. నవ్వుకోవలసింది అలా నవ్వేవాళ్లని చూసేనని మీరు గొప్పగా చెప్పారు. ప్రజా ఉద్యమాలతో జతకలిపి మరీ తర్క జ్ఞానాన్ని విప్పి చూపిన మీ శైలి, వివరణ, సందర్భం బాగున్నాయి.

  “‘బూవి సెపితే ఆకాశం నమ్మదా?” :గుండెల్ని తొలిచేసే ఓ పచ్చి నిజం చెప్పడం కోసం భూమ్యాకాశాల్ని తోడు తెచ్చుకున్న ఈ ఆత్మవిశ్వాసానికి సాటి లేదు.

  మౌళిగారికి మీరు చెప్పింది నిజం. ఇక్కడితో అయిపోలేదు. పెట్టిన ఖర్చు లాభాలుగా పిండుకునేదాక పెట్టుబడి నిద్రపోదు.

  • విశేఖర్ గారూ
   పోస్ట్ పై మీ సమీక్ష కు ధన్యవాదాలు.శ్రమజీవుల తర్కపు మూలసూత్రం ఎక్కడైనా ఒకటే కానీ ఆయా ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కొన్ని విశిష్ట లక్షణాల్లోంచి వారి వారి వ్యక్తీకరణల్లో వైవిధ్యం ఉంటుంది.బహుశా అదే నన్ను ఆకర్షించి ఈ కాలమ్ రాయించినట్లుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s