పల్లీ వొలిచి పప్పులు చేతిలో పెట్టేశాక కూడా..

జాజిమల్లి కధల పై  పి.సత్యవతిగారు ఏం చెప్పారు?
ఏప్రిల్ నెల చినుకు సాహిత్య మాసపత్రిక ఏడవ వార్షికోత్సవ ప్రత్యేక సంచికలో ‘వెన్నాడే పరిమళం’అంటూ ఆమె రాసిన దానిని జాజిమల్లి కధలపై సమీక్ష అని అనబుద్ది కావడం లేదు…
సత్యవతిగారూ మీ కధల టెక్నిక్ ఎందుకంత గొప్పగా ఉంటుందో నాకు మళ్ళీ అర్ధమైంది.నా బాల్యపు అనుభవాల్లోంచి మీ బాల్యం లోకి పెనవేసుకుంటూ చేసిన ప్రయాణం ఆ క్రమంలో మీ వ్యాఖ్యానం మనసుని తడి చేసాయి…ఎక్కడ కొంచెం మంచి కనిపించినా గుండెలకి హత్తుకునే ‘అమ్మ'(గోర్కీ అమ్మ గుర్తొచ్చింది)కదా మీరు.
మరి ‘కొలకలూరి పిల్ల కతలు’ ఎపుడూ రాయబోతున్నారు?
గత వేసవిలో మీ బ్లాగ్ లో నేను ఒక వ్యాఖ్యలో బెదిరించినట్లు…..”మీరు మీ అనుభవాలను రికార్డ్ చెయ్యకపోతే నేను ఏ వాయిస్ రికార్డర్ అయినా తీసుకుని వచ్చేస్తాను…అసలే నడివేసవి…అందులోనూ బ్లేజ్ వాడ…ఆపై  మల్లీశ్వరి…రిస్క్ ఎందుకు చెప్పండి?”

4 thoughts on “పల్లీ వొలిచి పప్పులు చేతిలో పెట్టేశాక కూడా..

  1. సత్యవతి గారూ,

    ఇప్పటి వరకు ఈ పుస్తకం పై చదివిన రివ్యూలు ఒక ఎత్తు అయితే, మీ సమీక్ష ఇంకొక ఎత్తు.చదివిన మేము కుడా డిట్టో! ఎలాగు ఆలోచన వచ్చేసింది కాబట్టి, ఆ “కొలకలూరి వి” కుడా వ్రాసెయ్యండి మనికెందుకు మళ్ళీ,

    “…అసలే నడివేసవి…అందులోనూ బ్లేజ్ వాడ…ఆపై మల్లీశ్వరి…రిస్క్ ఎందుకు చెప్పండి?”

    • కదా మౌళీ!
      మీరు కూడా చక్కగా అంగీకరించారు.అందుకు థాంక్ యూ…రాగం భూపాలం అంటూ ఇంచక్కని బ్లాగ్ కూడా నిర్వహిస్తున్నారు సత్యవతిగారు.అక్కడ ‘కొలకలూరి పిల్ల’ తన చిన్నప్పటి కతలు చెప్తుందేమో చూద్దాం.
      ఈ పోస్ట్ వేయడంలో ఏదో టెక్నికల్ ఫాల్ట్ చేశా.అది సరి కావడం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s