విశేఖర్ గారూ…

విశేఖర్ గారూ,
 
‘ఆడపిల్లగా పుట్టినందుకు తండ్రి చేతుల్లో చనిపోయింది ‘అన్న మీ పోస్ట్ మీద వచ్చిన వ్యాఖ్యల్లో మల్లి అన్న పేరు మీద వచ్చిన వ్యాఖ్య నేను రాసింది కాదు.కానీ హారంలో చూస్తే మల్లి పేరుతో నేను రాసే  నా వ్యాఖ్యల లిస్టు లో అది చేరిపోయింది.ఇదెలా సంభవమో నాకు అర్ధం కాలేదు.
 
ఆ వ్యాఖ్య.
 
”రాజు గారు, ఇంత చరిత్ర చదివారు కదా, ప్రపంచం లోని సంపద సృష్ట్టిలో స్రీల కాంట్రిబ్యుషన్ ఎమీటీ? ఇంకొక మాట మీరు అన్ని వర్గాల మహిళలను ఒకే గాటన కట్టేసి మాట్లాడితే దానికి అర్థం లేదు. నీత అంబాని కూడా మహిళనే ఆమే తో పొలం పనులు చేసి కొనే మహిళల తో పోల్చి, ఇద్దరు స్రీ లే కదా అని వాదన చేస్తే అది ఒట్టి వాదనగా మిగిలిపోతుంది. వాస్తవానికి వారి ద్దరి మధ్య నక్కకు నాగలోకనికి ఉన్న తేడా ఉంట్టుది.”
 
అట్లాగే నేను చేయని  ఇంకొక వ్యాఖ్య కూడా వేరే బ్లాగ్ లోకి వెళ్ళింది.
మనం చేయని వ్యాఖ్యలు మన  వ్యాఖ్యల లిస్టు లో చేరడం అన్నది సాంకేతిక సమస్యల వల్ల జరుగుతుందా?లేదా ఎవరన్నా మిస్ యూజ్ చేసే ఆస్కారం ఉందో తెలీడం లేదు.
మీ బ్లాగ్ లో వ్యాఖ్య పెట్టే విధానం చాలా కష్టంగా ఉంది.ప్రయత్నించినా కుదరలేదు..మీ మెయిల్ ఐడి తెలీక పోస్ట్ వేయాల్సి వచ్చింది.
ఎనే వే …మీ పోస్ట్, దాని మీద చర్చ బాగా నడిచింది.అభినందనలు. 
ప్రకటనలు

6 thoughts on “విశేఖర్ గారూ…

 1. జాజి మల్లి గారూ, హారం చూడనందున మీరే ఆ వ్యాఖ్య చేశారని నేను భావించే సమస్య తలెత్త లేదు. మీ వ్యాఖ్య ద్వారా ఆ సమస్య ఒకటుందని అర్ధమయింది.

  నా బ్లాగ్ లో వ్యాఖ్య పెట్టడం కష్టంగా ఉందని ఇంకా ఇద్దరు మిత్రులు చెప్పారు. ఆ సంగతి వర్డ్ ప్రెస్ వారిని అడిగాను. వారు బగ్ ఉంది రెక్టిఫై చేశాం అన్నారు. మళ్ళీ అడిగి చూస్తాను. నిజానికి వర్డ్ ప్రెస్ లో మీకూ బ్లాగ్ ఉంది కనుక వ్యాఖ్య పోస్ట్ చేయడం మీకు తేలిగ్గానే ఉండాలి. కష్టంగా ఉందంటున్నారు కనుక బగ్ పూర్తిగా తొలగిపోలేదని అర్ధమవుతోంది.

  • విశేఖర్ గారూ,
   ఆ వ్యాఖ్య నేను చేయకపోయినా నా పేరుతో డైరక్ట్ గా నా కామెంట్ లిస్టు లోకి ఎలా వచ్చింది అన్నది నాకు ఆశ్చర్యం కలిగింది.కామెంట్ లిస్టు లో చూసుకుని ఎపుడూ ఈ కామెంట్ చేయలేదు కదా ఇదేంటి అనుకుని మీ బ్లాగ్ లోకి వచ్చాను.ఆ కామెంట్లో అభ్యంతరకర అంశాలు లేకపోయినా ఎవరు లాగిన్ అయ్యారు, మళ్ళీ మిస్ యూజ్ చేసే ఆస్కారం ఉందా అన్నదే నా సమస్య.మీకు వీలుంటే ఆ కామెంట్ వచ్చిన ఐ పి, మెయిల్ ఐడి నాకు తెలియజేయగలరు.
   ఈ విషయం మీకు తెలియజేయడానికి మీ బ్లాగ్ లో కామెంట్ పెడితే అవ్వలేదు.

 2. జాజి మల్లిగారూ, ఇప్పుడే మీ పోస్టులు చూశాను. ఉద్యమాలకి మీ బ్లాగ్ ద్వారా ఇస్తున్న మద్దతు చూశాక చాలా సంతోషం వేసింది. మళ్ళీ వివరంగా చదివి నా అభిప్రాయాలు రాస్తాను.

  • వ్యక్తులుగా,రచయితలుగా,కార్యకర్తలుగా,సంస్థలుగా చేయాల్సింది ఎంత ఉందో కదా…నాకున్న ప్రైవేట్ ఉద్యోగ బాధ్యతల వల్ల పూర్తి స్థాయి కార్యకర్తగా పని చేయలేకపోతున్నానే అన్న బాధ కూడా ఉంది.తప్పకుండా మీ అభిప్రాయాలు చెప్పండి.

 3. ఈ వ్యాఖ్య మీరే వ్రాసారు అనుకొన్నాను. కొంత అస్పష్టత ఉండటం తో అర్ధం కాక మళ్ళి మళ్ళి చూసాను కూడా 🙂

  ‘మల్లి’ అనే పేరు తో ఇద్దరు వ్యాఖ్యాతలు ఉంటె, ఆ ఇద్దరి వ్యాఖ్యలు హారం లో ఒకే లిస్టు లో రావడం మామూలే. కాకపొతే ఒక్కోసారి స్వభావాన్ని బట్టి ఏవి ఎవరి వ్యాఖ్యలో తెలుస్తాయి ,పేరు ఒకటే అయినా.

  కాని ఈ వ్యాఖ్య మాత్రం అచ్చంగా మీరు వ్రాసినట్లే కావాలని వ్రాసారు 🙂

  • అవును కదా…
   అందుకే సందేహం వచ్చింది.అయితే ఒకే పేరున్న వ్యాఖ్యలు హారంలో ఒకే లిస్టు లో వస్తాయన్న మాట.చూడండి ఇంతకాలం నాకు ఆ విషయం తెలీదు.థాంక్ యూ మౌళీ..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s