‘సాక్షి’లో నాన్నకూతురు

మార్చ్ 25 న సాక్షి ఆదివారం అనుబంధంలో నేను రాసిన ఈ కధ ప్రచురితమైంది.
 
(మాటర్ పైన క్లిక్ చేయండి.)
 
 
 
ప్రకటనలు

36 thoughts on “‘సాక్షి’లో నాన్నకూతురు

 1. మల్లీశ్వరి గారూ,
  మీ కథ నాకు కొంచెం భయాన్ని కల్గించింది. మా ఇంట్లో ఇలాంటి తండ్రీ కూతుళ్ళ జంట ఉంది. అందుకేనేమో!

  అయితే నాన్నలంతా కూతుళ్ళు ఒక వయసుకు వచ్చాకక్ అభద్రత పాలైపోతారన్నామాట. చూడాలి, వీళ్ళిద్దరూ ఎలా ఉంటారో!

  కథ ఎప్పట్లాగే చాలా బావుంది. చివరి లైన్లు మరీ బాగున్నాయి.

  • అలవోక గానే రాసాను.నిజానికి పెద్ద కధ రాయడం అంటే నాకు మూడు లేదా నాలుగు నెలలు పడుతుంది.కానీ కధ రెండు విడతలుగా నాలుగు రోజుల్లో రాసేయగలిగాను.
   మీ స్పందనకి ధన్యవాదాలు.

  • భారతి గారూ,
   సాక్షిలో ఈ కధ వచ్చినపుడు,
   ఈ కధ లోని తండ్రీ కూతుళ్ళని తమ జీవితాల్లో తమకి తెలిసిన తండ్రీ కూతుళ్ళతో పోల్చి చూసుకున్నారు చాలా మంది పాఠకులు.యిపుడు మీరు కూడా…
   ధన్యవాదాలు.

 2. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న తండ్రి కూడా..తన కూతురి విషయంలోకి వచ్చేటప్పటికి ఇలాగే ప్రవర్తిస్తూ..అనవసరంగా భయపడుతూ ఉంటారు .అదంతా..బిడ్డపై ప్రేమే అని వేరే చెప్పనవసరం లేదు కదా:) కథ చాలా బాగుంది.

  • వనజగారూ,
   బిడ్డపై ప్రేమే…సందేహం లేదు.కానీ ఆ ప్రేమని నడిపించే సూత్రాలని వాటి వెనుక ఉన్న పేట్రియార్కీని జాగ్రత్తగా గమనించండి…అపుడు ఇదంతా ప్రేమే కదా అని సరిపెట్టుకోలేం…కనీసం అమ్మాయిలు సరిపెట్టుకునే స్థితిలో లేరు.
   మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

 3. మీ బ్లాగ్ లో ని ‘పితృత్వం’ కధ నాకు బాగా నచ్చిన కధ, అదే కధ సాక్షిలో వచ్చిందని చెప్పగానే సంతోషం వేసింది కూడా :). అభినందనలు.

  కాని వ్యాఖ్యలు చూసి అర్ధం కాక అపుడు సాక్షి కధ చూసాను. హ్మ్! సమస్యలో(అసలేదయినా ఉంటె ) తల్లి, తండ్రి ఇద్దరికీ భాగం వున్నపుడు, పితృస్వామ్యం కి సంబంధించిన కధ గా చూడలేకపోతున్నాను . ఇంకా కధ మాత్రం చాల సరదాగా అనిపించింది 🙂

  సహజాతాల స్థాయి అంటే నా మట్టి బుర్ర కి అర్ధం కాలేదు 🙂

  • మౌళీ,
   పితృత్వం కధ 2005 లో రాసాను.అప్పట్లో వార్తలో వచ్చింది.
   సాక్షి పేపర్ వాళ్ళు కధ రాయమని అడిగితే ఈ కధ రాసి పంపాను.
   సీక్వెల్ గా తీసుకోవచ్చు..
   తల్లికీ తండ్రికీ ఇద్దరికీ ఉండే భాగం ఒకటి కాదు.తల్లి అయినా భార్య అయినా కూతురు అయినా పురుషుడికి ఆస్తి భావనే ఉంటుంది.దానిని సంరక్షించుకోవడంలో ప్రేమ కూడా ఒక సాధనం.అయితే ఇంత పకడ్బందీ గా తెలిసి ఎవరూ చేయరు.
   అందుకే వ్యవస్థలో భాగంగానే చూసాను తప్ప వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేయలేదు.
   సహజాతాలు అంటే పుట్టుకతో వచ్చేవి అని.అవి అంత తొందరగా మారవు.అని స్పందించినందుకు ధన్యవాదాలు.

   • జాజి గారు,

    తల్లి, తండ్రి కి ఉండే భాగం ఒకటి కాకపోయినా, మామూలు గా తల్లి పోషించే పాత్రని తండ్రి పూర్తిగా ఆక్రమించుకొన్నాడు. అందుకేనేమో తల్లికి మామూలుగా ఉండే భయాలు కూడా ఇక్కడ తండ్రిని చేరాయి.

    నేను నా అభిప్రాయం తెలియ చెయ్యడానికి ముఖ్య కారణం నేను గమనిస్తున్న తల్లి, తండ్రి ,కొడుకులు కూడా ..

    మాతృత్వం కాని , పితృత్వం కాని కొన్ని భయాలకు (ప్రేమ , సంరక్షణ లో భాగం గానే ) బందీ అవుతున్నాయి. ఆడపిల్ల విషయం లో కొన్ని భయాలు ఉంటె, మగ బిడ్డ విషయం లో ఇంకొక విధమైన భయాల వల్ల ,మొత్తానికి మంచి చేస్తున్నాం అనుకుంటూనే పొరబాట్లు చేస్తున్నారు. ఆ బంధం లో ఉన్న వ్యక్తులకు అర్ధం కాకపోవచ్చు. చూసే వాళ్ళకి అర్ధం అయినా తెలియ చెప్పేది కూడా కాదు 🙂

    కాబట్టి ఇది కేవలం సరదాగా ఆ తండ్రి కష్టాలు చూసి నవ్వుకునే టాం అండ్ జెర్రి లాంటి కధ గానే చూస్తాను 🙂

   • mowlee,
    ”కాబట్టి ఇది కేవలం సరదాగా ఆ తండ్రి కష్టాలు చూసి నవ్వుకునే టాం అండ్ జెర్రి లాంటి కధ గానే చూస్తాను :)”
    durmaargam kadaa repu opikagaa vyaakyaanisthaanu.

   • మౌళీ,
    నాతో ఏదో వాగించే కుట్రలో భాగంగా ఆ కొసమెరుపు వ్యాఖ్య చేసారని తెలూస్తోంది లెండి.
    సరే…
    ‘పిల్లల్ని పెంచడం మామూలుగా తల్లి నిర్వహించే’ పాత్ర కావడమే కదా మాతృత్వం అనే మిత్ గా మారింది.
    ఇక్కడ లాస్య విషయంలో ఆమె ప్రవర్తనని చైతన్యాన్ని కంట్రోల్ చేయడమే అసలు సమస్య.
    ఆ పని మగపిల్లల విషయంలో తల్లులూ చేస్తారని మీరంటున్నారు.ఒకసారి పోల్చి చూడండి.
    రెండు నియంత్రణల మధ్యా చాలా తేడా ఉంటుంది.

 4. దేవినేని మధుసూదన్ రావు గారు బ్లాగ్ లో పెట్టడం కోసం మెయిల్ చేసిన వ్యాఖ్య….

  ప్రియమైన మల్లీశ్వరి

  మార్చ్ 25 న సాక్షిలో ముద్రణ ఐన నాన్న కూతురు కథ చదివాను.

  చివరి రెండు వాక్యాలు నాకు ఆర్థము అవలేదు.కానీ
  కథ చక్కగా రాశారు. తల్లి పాత్ర దీనిలో ఏమి లేదు. తల్లికి ఏమి భాద్యత లేదా?
  15 years కే ప్రేమించాను అని చెప్పే వయసేనా? ఆ వయస్సు లో ఆడపిల్లలు
  తండ్రి కన్నా తల్లికే దగ్గరగా ఉంటారు. అప్పటివరకు కూతురు నాన్న కూచి అయినా
  వారి మనోగతాలను తల్లితోనే బాగా చెప్పుకోగలరు..

  తండ్రి ప్రేమే లేక పోతే కూతురు కూడా reciprocate చెయ్యదు కదా. చిన్నప్పటి
  కూతురు తండ్రి మీద అంత ప్రేమ చూపించడానికి తండ్రి కూతురును చాల అమితముగా
  ప్రేమించి ఉంటారు. ఆ ప్రేమను వదలుకోలేకే తండ్రి కూతురు మీద చెయ్యి చేసుకొనే
  ఉండాలి. అది correct అని నేను అనను. తల్లి,కూతురు తండ్రి మనసుని అర్ధం చేసుకుంటే
  బాగుండునని నా అబిప్రాయము. ఈ విషయంతో కథ ముగించితే బాగుండేదేమో..
  ధన్యవాదాలు
  శెలవు
  మధుసూదన రావు దేవినేని.

  • మధుసూదన్ గారూ
   ఓపికగా కధ చదివి విశ్లేషించినందుకు ధన్యవాదాలు.
   తరానికీ తరానికీ మధ్య విలువలు సంస్కార స్థాయి చైతన్యం వీటిల్లో బాగా మార్పులు వస్తున్నాయి.ఒక్కోసారి మార్పుల్ని అందుకోలేక అవగాహనలోకి తెచ్చుకోలేక భయపడుతుంటాం.
   15 ఏళ్ల పిల్ల అలా మాట్లాడుతుందా అని మీరంటే ఏం చెప్పను మధుసూదన్ గారూ!నిరంతరం టీనేజి పిల్లల మధ్య మెలుగుతున్నదాన్ని…వాళ్లెట్లా ఉన్నారో ఉన్నది ఉన్నట్లు చెపితే సమాజానికి చాలా చేదుగా ఉంటుంది.అట్లా చెప్పడమూ భయపెట్టడమూ నా కధా వ్యూహం కాదు.
   మనుషుల చెడ్డ ప్రవర్తనల్ని మోటుగా బండగా చెప్పడం నాకు ఇష్టం ఉండదు.
   పిల్ల తప్పు అయినా తండ్రి అదుపు అయినా మానవీయ కోణంలోనే చర్చించబడాలి….
   ఇట్లా సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించే క్రమం లోనే తండ్రీ బిడ్డల పాత్రల మధ్య గాఢమైన అనురాగం మూలాంశం అయింది.
   నిజానికి తండ్రిని మొదటి నుంచీ సమాజం ఆమోదించే దుర్మార్గుడిగా చిత్రించి ఉంటే ఎవరికీ ఏ అభ్యంతరాలూ ఉండవు.
   మనుషులు ఆర్చిటైప్స్ కారు కదా…మనం మంచిగానూ ఉంటాం చెడ్డగానూ ఉంటాం.
   ఏంటోనండీ ఎపుడూ పేచీకోరు కధలు తప్ప, చదివిన వాళ్ళందరూ భుజం తట్టి శెబ్బాస్ అనే కధలు ఎప్పటికి రాస్తానో…

   • @ఏంటోనండీ ఎపుడూ పేచీకోరు కధలు తప్ప, చదివిన వాళ్ళందరూ భుజం తట్టి శెబ్బాస్ అనే కధలు ఎప్పటికి రాస్తానో…

    ఈ కధలే చాలా బాగున్నాయి 🙂

  • మధుసూదన్ రావు గారు,

   తల్లి పాత్ర ఖచ్చితం గా ఇలా ఉండాలి అని మనం చెప్పలేం, ఇంత గొప్ప తండ్రులున్నచోట 🙂

   15 సంవత్సరాలకి ప్రేమించే వయసా అంటే, ఆ పిల్ల ఎం చెపుతుంది . అబ్బాయిలు ధ్యాస చదువు పై పెట్టడం మానేసి ఇలా ఆడపిల్లల వెంతపడుతుంటే ( మళ్ళీ పురుషాధిక్యత 😀 )

   తల్లికి బాధ్యత ఉంది కాబట్టే కూతురుతో స్నేహం గా ఉంటుంది (ఇలాంటివన్నీ దాచుకోకుండా ముందే చెప్పేస్తారని 🙂 ) .కాబట్టే తండ్రి కి తెలిసే సమయానికి అమ్మాయికి అసలు ప్రేమ అనే ఆలోచనే లేదు. 🙂

   తల్లి, కూతురు తండ్రి మనసును అర్ధం చేసుకొన్నారు.పాపం తండ్రే అర్ధం చేస్కోలేక సతమతం ( అమ్మో , నేను ఇక్కడ స్మైలీ పెట్టలేదు )

   ఇక పొతే, చివరి రెండు వాక్యాలు కధకి సరికొత్త అర్దాన్ని ఇస్తాయి.

   • మౌళీ…
    మీ హాస్యాన్ని పక్కన పెట్టి మీ అభ్యంతరాలు సూటిగా చెప్పకూడదూ…
    పదిహేనేళ్ళ పిల్లకి ప్రేమా!అని ఆశ్చర్యం పడటం ఈ రోజుల్లోకి మనం ఇంకా తొంగి చూడలేకపోవడానికి ప్రతీక.అసలది ప్రేమ కాదని ఎదిగిన వారికి తెలుసు…అట్లా మనుషులు తొలి యవ్వనం లోకి అడుగు వేస్తున్న సమయాల్లో ఉక్కిరి బిక్కిరిగా అర్ధం కాని ఆందోళనతో ఉంటారు.ఇవి కాలాతీతంగా జరిగే చర్యలు. వెనుకటి తరాల్లో అవి అంతర్గత సంఘర్షణలు గానే ఉండి పోయేవి..కానీ కుటుంబాల్లో ప్రజాస్వామిక విలువలు పెరుగుతున్న కొద్దీ ‘తప్పేమో’నన్న భయం తో దాచి పెట్టుకునే అనేక ఘర్షణలు మనుషుల అంతరంగాల్లోంచి బయటకి వస్తున్నాయి. ఈ పరిణామం చెడ్డదేమీ కాదు…హాస్యాస్పదమైనదీ కాదు.
    ఈ క్రమమంతటి లోనూ ‘కొత్తని’ స్త్రీలు ఎడాప్ట్ చేసుకున్నంత త్వరగా పురుషులకి సాధ్యం కాదు..ఇది సామర్ధ్యానికి సంబంధించినది కూడా కాదు.కొత్తని ఎడాప్ట్ చేసుకోవడం స్త్రీలకి చిన్నతనం నుంచీ బలవంతంగా అలవాటు చేయబడుతుంది.దాని మూలంగా నష్టాలతో పాటు ఈ కధలో తల్లి పాత్రకి వచ్చిన వెసులుబాటూ ఉంటుంది. అంతే తప్ప తల్లి కూతురి చర్యలు ఒప్పేసుకుని తండ్రి ఒక్కడే సతమతమవడం కాదు.
    కుటుంబ సంక్షోభాల్లో చాలా సందర్భాల్లో ముఖ్యంగా పిల్లల విషయంలో పరువు ప్రతిష్టలాంటి సూడో విలువలకి విఘాతం కలిగినపుడు స్త్రీలు దృఢ చిత్తంతో ఉండడం మనం గమనించుకోవచ్చు.దీనర్ధం నూటికి నూరు శాతం అని కాదు.ఎక్కువ శాతం అని మాత్రమే….
    నిజానికి కధ ముగింపు నాలుగు పేరాలు వేరే ఉంది.పత్రిక వారికీ నాకూ వచ్చిన కమ్యూనికేషన్ గాప్ లో ఈ ముగింపు అచ్చయ్యింది..
    వీలుంటే ఆ ముగింపు కూడా బ్లాగ్ లో పెట్టడానికి ప్రయత్నిస్తాను.
    థాంక్ యూ.

   • ఉహూ, అభ్యంతరాలెం లెవ్వు, మధుసూదన్ రావు గారి అభ్యంతరాలకి సమాధానం చెప్పాను,

    మీకే నా పై అనుమానం ఉండి నా వ్యాఖ్య హాస్యానికి వ్రాసినట్లు గా తోచింది.

    నా అభిప్రాయం పదిహేనేళ్ళ పిల్లకి మొదట ప్రేమ గురించి తనకు తానుగా అభిప్రాయం రాలేదు , స్నేహితుడైన ఒక అబ్బాయి పదే పదే ప్రేమించమని ఒత్తిడి చెయ్యడం వల్ల ఆలోచించింది.నాకెందుకో ఇది కూడా పురుషాధిక్యత లానే తోచింది (కాదేమో ).

    ఇక నా వ్యాఖ్య లో మొదటి లైను ,అది వ్యంగం కాదు. మొదట నాకుకూడా తల్లి పాత్రపై మధుసూదన్ గారికి కలిగిన సందేహాలే వచ్చాయి. గొప్పతండ్రి అనటం లో హాస్యం లేదు.

   • ఊహూ…
    హాస్యం అని ఎందుకన్నానంటే ముందటి వ్యాఖ్యల్లో టాం అండ్ జెర్రీ కధ చదివి నవ్వుకున్నట్టు….అన్నారు కదా అందుకు…
    మీరు మంచి చర్చే పెట్టారు.
    యిపుడు ప్రేమ ప్రతిపాదనలు అమ్మాయిల వైపు నుంచి కూడా ఉంటున్నాయి…అది కాదు సమస్య….ప్రేమ విఫలం అయినపుడు అబ్బాయిలు ప్రతిస్పందించినంత హింసాత్మకంగా అమ్మాయిల స్పందన ఉండదు.

   • బై ద వె, మీతో ఒక మంచి వ్యాఖ్య వ్రాయిన్చినట్లు ఉన్నాను. మీ వివరణ చాలా బాగుంది.

    ముగింపు రెండు లైన్లు, అంత సింపుల్ గా చెప్పి వదిలెయ్యకుండా వివరించి ఉంటె బావుండేది అనుకొన్నాను.(కాబట్టే మొదట పితృత్వం అన్న చివరివాక్యలపై మొదట నా సందేహాలని తెలియచేసాను ).

    మధుసూదన్ రావు గారి అభిప్రాయం చూసి ముగింపు వాక్యాలు స్త్రీ లకి మాత్రమె అర్ధం అవుతాయా అన్న సందేహం కూడా కలిగింది. 🙂

   • నిజమే…
    ఈ కధ ముగింపుతో నాకే పేచీ ఉండి…పత్రిక వాళ్లకి పంపాక కూడా మళ్ళీ మార్చి రాసాను…అది నాకు నచ్చింది. కానీ అప్పటికే కధ ఇష్యూ లోకి వెళ్ళిపోయింది.ముగింపులో అదే భావాన్ని అలా మోటుగా కాకుండా రాయాలి.చెప్పదల్చుకున్నది అదే కావొచ్చు కానీ అట్లా యాంత్రికంగా ఉండకూడదు…ముగింపు మీద ఎవరికి అసంతృప్తి ఉన్నా దానిని నేను అంగీకరించాను.

   • హ్మ్, అంతకన్నా వివరం గా చెప్పినా పెద్దగా లాభం ఉండదేమోనండి. నాకయితే మళ్లీ వ్రాసిన ముగింపు చూడాలని లేదు.

    ఈ కధ కి జత పరచడం కన్నా, దాన్ని డెవలప్ చేసి కధ చివరిగా కాక వ్యాసం మొత్తం లో వచ్చేలా వ్రాస్తే, ఈ కధలో చివరి గా చెప్పిన ‘పితృత్వం’ అంటే ఏమిటి , తల్లి వారసత్వపు పోరాటం యొక్క ముందు వెనుక వివరణ గురించిన ప్రశ్నలు రాని వారిని తాకుతుంది.

    నా ముందు వ్యాఖ్య లో “తల్లి పాత్ర ఖచ్చితం గా ఇలా ఉండాలి అని మనం చెప్పలేం” అని చెప్పడం ఎందుకంటే , మీ కధ లో ఉన్నట్లు తల్లి వారసత్వపు పోరాటం ఇంత ఎక్కువగా ‘నాన్న కూతుర్లను’ ఇంతకు ముందు చేరలేదు. కారణం ఇంతకు ముందు వరకు తల్లి పురుషాధిక్యతను ప్రశ్నించలేదు.(మీ కధకు ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ చుస్తే ఇప్పుడు కొంత మారినట్లు చక్కగా కనిపిస్తున్నది )

    మీ వివరణ కు ధన్యవాదాలు

   • అవును మౌళీ,
    ఇంతకు ముందు రాసిన కధలో పితృస్వామ్యం ప్రసక్తి రాలేదు.
    పితృత్వం,నాన్న ఓ పదమూడేళ్ళ కూతురు,యిపుడు ఈ నాన్న కూతురు…ఈ మూడు కధలూ ఒక పరిణామ క్రమాన్ని చిత్రిస్తూ రాసినవి.బహుశా ఈ క్రమాన్ని నేను నా రచనా వ్యాసంగం చివరి రోజుల వరకూ పరిశీలిస్తూ అక్షరబద్ధం చేస్తాను.ఒక అమ్మాయి జీవితంలో వివిధ దశలలో తండ్రితో తన అనుబంధం ఎన్ని మార్పులకి లోనవుతుందో…అందులోని సంఘర్షణని అర్ధం చేసుకోవడం బావుంది.అందుకే రాస్తున్నాను.
    స్పందించినందుకు ధన్యవాదాలు.

  • కిరణ్ గారూ.
   థాంక్ యూ…
   తులసి గారికి తెలిస్తే నన్ను చంపేస్తారు కానీ, తిరోగామి కధ నేను చదివిన గుర్తు లేదు.మళ్ళీ ఒకసారి ఆమె కధలు చదవాలి చాలా రోజులైంది తులసి గారిని చదివి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s