మండే మొజాయిక్ ఆహ్వానం

మొజాయిక్ సాహిత్య సంస్థ జాజిమల్లి  పుస్తక పరిచయ సభని  విశాఖపట్నంలోని పౌర గ్రంధాలయం లో ఏర్పాటు చేసింది.మిగతా వివరాలు ఆహ్వాన పత్రికలో చూడగలరు.సాహితీ మిత్రులకు ఆహ్వానం.
 

 

26 thoughts on “మండే మొజాయిక్ ఆహ్వానం

   • ఈ పాంప్లెట్ లు ప్రచారం చేసారా ? లేక బ్లాగులో పెట్టడానికి తయారు చేసారా ? ఒక వేళ ఇంకా ప్రచారం చేయకపోతే సవరణ చేయించండి.

   • అరవింద్ గారూ,
    ఇవి మొజాయిక్ సాహిత్య సంస్థ తరుపున జగద్ధాత్రి, రామతీర్ధ గారు వేసారు.ఇవి కేవలం విశాఖలోనే పంచారు..విశాఖ పౌర గ్రంధాలయం అంటే ఇక్కడ ఉండే వారికి చాలా మందికి తెలుసు.నేను బ్లాగ్ లో పెట్టే ముందు ఇంట్రో రాసి ఉండాల్సింది మీరు సూచించాక సవరించాను.థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్.

 1. సారీ..ఈ పోస్ట్ కి సంబంధించిన వ్యాఖ్య కాదు.
  మీ పుస్తకం కొనుక్కున్నానోచ్చ్ :))
  ఆ మధ్య బ్లాగులు – మహిళలు అని ఏదో సెమినార్ లో మాట్లాడాలన్నారు. మాట్లాడారా? వీలైతే ఆ వ్యాసం బ్లాగులో పెట్టగలరా? ఊరికే చదువుదామని. లేదా నాకు మైల్ చేసినా సరే 🙂

  • సౌమ్యా,
   బావున్నారా? స్త్రీల బ్లాగ్ సాహిత్యం మీద కెయూ లో మాట్లాడాను.పూర్తి స్థాయిలో మాట్లాడే సమయం లేకపోయింది.ఆ వ్యాసాన్ని ఇంకా సమగ్రం చేయాలి.అసమగ్రంగా ఉన్నపుడు పోస్ట్ చేయడం ఎందుకు?త్వరలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా.అపుడు బ్లాగ్ లో పెట్టడం కానీ మీకు మెయిల్ చేయడం కానీ చేస్తా.
   పుస్తకం కొన్నారా మరి మీరేం చెపుతారో వినాలని ఉంది.

   • సరే అయితే ఎదురు చూస్తుంటాను 🙂

    తప్పకుండా…చదివేసి చెబుతాను. కొన్ని ఆల్రెడీ మీ బ్లాగులో చదివేసాననుకోండి 🙂

 2. నేను వెబ్‌సైట్‌లో పెట్టినవి MPEG-4 ఫార్మాట్‌లోని వీడియోలు. పాత రకం ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో అవి ఓపెన్ అవ్వకపోవచ్చు. మీ కంప్యూటర్‌లో అవి ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ అప్‌లోడ్ చేసిన వీడియో చూడండి: https://plus.google.com/111113261980146074416/posts/18cdBwtzefu ఒక కంప్యూటర్‌కీ, ఇంకో కంప్యూటర్‌కీ అవి సపోర్ట్ చేసే ఫైల్ ఫార్మాట్స్ మారుతుంటాయి. అదే ఇక్కడి సమస్య. ఆ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మా తమ్ముని కంప్యూటర్ నుంచి చేశాను. ఆ కంప్యూటర్‌లో వీడియో ప్లే అయ్యింది కానీ నా కంప్యూటర్‌లో ప్లే అవ్వలేదు. టెక్నికల్ కంప్లెక్సిటీ విషయంలో నాదే తప్పనుకుంటే క్షమించండి.

  • ప్రవీణ్ గారూ,
   గూగుల్ ప్లస్ లో చర్చ ఏదో జరుగుతున్నట్టుంది.నా ఫోటోలని కానీ నేను మాట్లాడిన ఆడియో వీడియోలని కానీ సక్రమంగా,ఏ అసభ్యమైన కామెంట్స్ లేకుండా చూడగలిగితే ఆ లింక్ ఉంచండి. లేదా వాటిని తీసేయండి.సాహిత్య సమావేశాల్లో రచయితలు మాట్లాడుతున్నపుడు ఫోటో లు వీడియోలు తీసుకోవడం సహజం…అంతే తప్ప ప్రత్యేకంగా తీయమనీ వద్దనీ ఎవరికీ చెప్పం.
   ఇక స్త్రీవాదం పై నా అభిప్రాయాలూ మీ అభిప్రాయాల మధ్య చాలా తేడా ఉంది…మగవారిని ద్వేషించడానికో ఆవేశంగా ఉపన్యాసాలు ఇవ్వడానికో కాదు స్త్రీవాదం నా జీవన విధానంలో ఒక భాగం కూడా.మీరు స్త్రీవాదం అంటే లైంగిక స్వేఛ్చ మీదే ఎక్కువసార్లు మాట్లాడతారు.అది కూడా అభ్యంతరకరమే.
   విషయాలని సెన్సేషనల్ గా తప్ప వాటి పట్ల తపనతో మాట్లాడుకోలేమా!
   అందుకే స్త్రీవాదం మీద చర్చ అంటే ఆమడ దూరం పరిగెత్తాలనిపిస్తోంది ఈ మధ్య.

   • జాజి గారు,

    చలం మొదలు స్త్రీ వాదులు అనబడే ఒకప్పటి పురుషులంతా లైంగిక స్వేచ్చ గురించి మాత్రమె ఎక్కువగా మాట్లాడారు అనుకుంటున్నాను . బహుసా మహిళలు వాటి గురించి మాట్లాడలేరని ఏమో అప్పట్లో. ప్రవీణ్ ఇంకా అటువంటి ప్రజలమధ్యనే ఉండటం ఒక కారణం కావచ్చు.

    ఇక స్త్రీ వాదం అంటే చలం, రంగనాయకమ్మ గార్ల పుస్తకాలు అభిమానించి వాటి గురించి మాట్లాడడం మాత్రమె అన్నట్లుండే వారిదొక రీతి. ఇంతోటి స్త్రీ వాదాన్ని హేళన చేస్తూ వ్యాఖ్యానించే ప్రబుద్దులు ఇంకో వరుసలో ప్రత్యేకత చాటుకుంటున్నారు 🙂

   • మౌళీ,
    చానాళ్ళకి కనిపించారు…
    చలం కాలం నాటికి తెలుగు సమాజానికి స్త్రీవాదం పరిచయం కాలేదు.ఎనభైల తర్వాతే…అది కూడా రచయిత్రుల కాంట్రిబ్యూషన్ తోనే తెలుగు సాహిత్యం లోకి స్త్రీవాద స్పృహ ప్రవేశించింది.ఒక సిద్ధాంతంగా కాకపోయినా స్త్రీల పట్ల ఉండే వివక్షా మూలాలను చలం కొకు లాంటివాళ్ళు బలంగా విశ్లేషించారు.
    ఇప్పటికీ సమాజం పెదవి విప్పని అనేక అంశాలను చలం 90 ఏళ్ల కిందట మాట్లాడాడు కనకే అతని రచనలంటే ప్రజాస్వామిక వాదులకి స్వేచ్చా పిపాసులకి అంత మోహం.ఆ కాలపు రచయితలు అందరూ లైంగిక స్వేఛ్చ గురించి మాట్లాడలేదు.చలం రచనల్లోనయినా కాల్పనిక సుఖవాద చాయలు కనిపిస్తాయేమో కానీ కొడవటిగంటి స్త్రీల పై అమలయ్యే వివక్షా రూపాలను విస్తృతమైన కాన్వాస్ మీద అతి వాస్తవికంగా చిత్రించారు.
    బ్లాగర్లలో చాలా మంది రంగనాయకమ్మ గారిని స్త్రీవాది అంటుంటారు.
    రంగనాయకమ్మ గారు స్త్రీవాది కాదు.తను మార్క్సిస్ట్ నని ఆమె ఎన్నోసార్లు అన్నారు.మార్క్సిస్ట్ దృక్పధం నుంచి పితృస్వామిక సమాజాన్నిదాని మూలంగా స్త్రీలకి ఎదురయ్యే సమస్యల్ని ఆమె అవగాహనలోకి తెచ్చుకుంటారని నా అభిప్రాయం.

   • చలం గారి పేరు చెప్పుకునేవాళ్ళందరూ నిజంగా చలం గారి అభిమానులు కాదు. ఆ విషయం తరువాత నా బ్లాగ్‌లో వ్రాస్తాను. ఎందుకంటే ఇక్కడ వ్రాస్తే అది off topic discussion అవుతుంది.

   • పుస్తక పరిచయ సభ అనగానే పట్టు చీర, నగలతో కనిపిస్తారనుకున్నా కాని అచ్చు జాజిమల్లి కధల్లోని మల్లీశ్వరి గారినే చూసాము 🙂

    మీ పుస్తకం తెలుగు చదవడం వచ్చిన మహిళలు అందరి కోసం వ్రాశా అని అన్నారు కాని, నేనయితే ఇప్పుడు పుట్టి పెరుగుతున్న పిల్లలు కూడా ( అమ్మాయిలు , అబ్బాయిలు ) తప్పకుండా చదవవలసిన జ్ఞాపకాలు అనుకొంటున్నాను. అవి కేవలం జ్ఞాపకాలు మాత్రమె కాదు, మనసుని తట్టి వెలుగు ని ప్రసరింప చేస్తాయి.

    కుటుంబరావు గారి రచనలు కొన్నే తటస్త పడ్డాయి. ఇప్పుడిక చదవాలన్న ఆసక్తి కూడా లేదు.

    ప్రవీణ్ వాదన వివాహిత స్త్రీ ల అసహాయ పరిస్తితి పై, వివాహాల విషయం లో ఉన్న కొన్ని వివక్ష ల పై మాత్రమె ఉండడం గమనించాను. ఇవి పూర్తి గా/లేక అసలు స్త్రీ వాదానికి సంబంధించినవి కాకపోవచ్చు,తను స్త్రీ వాది అయినా.

    అలాగే రంగనాయకమ్మ గారి రచనల తో నాకు బొత్తిగా పరిచయం లేదు, ఆమె స్త్రీ వాది కాదు మార్క్సిస్ట్ అని తెలియచేప్పినందుకు ధన్యవాదములు.

 3. ఆ రోజు సెంట్రల్ లైబ్రరీలో జరిగిన మండే మొజాయిక్ మీటింగ్‌లో మీరు “ఇప్పటికీ బ్రాహ్మణులకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని చెప్పినట్టు నాకు గుర్తుంది. బ్రాహ్మణుల విషయంలో అది నిజం కావచ్చు కానీ రిజర్వేషన్‌ల విషయంలో పునరాలోచించాల్సిందే. ఇప్పటికీ చాలా మంది అభ్యుదయవాదులు ‘కేవలం రిజర్వేషన్‌ల వల్ల దళితుల జీవితాలు బాగుపడతాయని‌’ అనుకుంటున్నారు. చదువుకోవడానికే డబ్బులు లేనివాడు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం ఎలా సంపాదించగలడు? నేనేమీ రిజర్వేషన్‌లకి వ్యతిరేకం కాదు. కానీ అవి ఉన్నంతమాత్రాన పేద దళితులకి ఉద్యోగాలు రావు, అవి ఎత్తేసినంతమాత్రాన అగ్రకులాలలోని పేదవాళ్ళకి అవకాశాలు పెరగవు. రిజర్వేషన్‌లు కులం శృంఖలాల నుంచి కొంత మందిని బయటకి తీసుకొస్తాయి, అంతే కానీ వాటి వల్ల గొప్ప మార్పేమీ జరగదు.

  “ఆర్థిక వెనుకబాటుతనం అనేది కేవలం కులాన్ని బట్టి ఉండదు. దాని పైన భౌగోళిక పరిస్థితుల ప్రభావం & mode of production ప్రభావం కూడా ఉంటాయి” అని నేను ఫేస్‌బుక్‌లో వ్రాస్తే కొంత మంది నన్ను కమ్మవాడని అనుకున్నారు. ఒరిస్సాలో గుడిసెలలో ఉండే కమ్మవాళ్ళనీ, వెలమదొరలనీ చూశానని చెపితే నేను అగ్రకులాలలోని పేదల గురించి మాత్రమే బాధపడుతున్నానని నా మీద విమర్శలు చేశారు. “అగ్రకులాలలోని పేదవాళ్ళని ఉద్ధరించడానికి మార్క్సిజం ముసుగు వేసుకున్న కమ్మవాడు” అని నన్ను వెక్కిరించారు. పేదరికం ఎవరికైనా దుర్భరంగానే ఉంటుంది. అది అగ్రకులాలవాళ్ళకైనా, పేదవాళ్ళకైనా ఒకే రకం సమస్యగా ఉంటుంది. ఈ విషయం చెపితే అర్థం చేసుకునే స్థితిలో కుల సంఘాల నాయకులు లేరు. మార్క్సిజం కొద్దికొద్దిగా తెలిసినవాడు ఎవడైనా కులం కంటే వర్గం గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. “మా అమ్మానాన్నలకి రిజర్వేషన్‌ల వల్లే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి కనుక మాకు మార్క్సిజం అవసరం లేదు” అని అనుకునే దళితవాదులకి నేనే కాదు, నా కంటే తల పండిన పండితుడు కూడా ఏమీ చెప్పలేడు.

  మీరు రిజర్వేషన్‌ల గురించి పునరాలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే అవి చదువుకున్నవాళ్ళకి మాత్రమే అందే ఫలాలు. మన దేశంలో అంగట్లో “చదువు కొనే” అవకాశం లేనివాళ్ళు చాలా మంది ఉన్నారు.

  నేను ఇంకో కోణంలో మాత్రమే రిజర్వేషన్‌లని అభివృద్ధికరమైనవిగా చూస్తాను.
  ఎలాగంటే: పల్లెటూరిలో వ్యవసాయం చేసుకునే దళితుని కొడుకు ఏదో ఒక విధంగా చదువుకుని రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం సంపాదించాడనుకుందాం. అతను పని చేసే ఆఫీస్‌లో అతనికి బ్రాహ్మణుల అమ్మాయి పరిచయమై, ఆ పరిచయం ప్రేమగా మారిందనుకుందాం. అప్పుడు బ్రాహ్మణుల అమ్మాయి దళిత యువకుణ్ణి కులాంతర వివాహం చేసుకోవడం జరుగుతుంది. కానీ పల్లెటూరిలో ఊరి చివర గుడిసెలోనో, పట్టణంలోని మురికివాడలోనో ఉండే దళితుణ్ణి బ్రాహ్మణుల అమ్మాయి కులంతో సంబంధం లేకుండా పెళ్ళి చేసుకోవడం జరగదు. ఇప్పుడు కొంత మంది దళితులైనా బ్రాహ్మణ స్త్రీలని కులాంతర వివాహాలు చేసుకోగలగడానికి కారణం రిజర్వేషన్‌లే. రిజర్వేషన్‌లు లేకపోతే కుల సంబంధాలలో ఈ పాటి మార్పులు కూడా రావు. కానీ కేవలం రిజర్వేషన్‌లని పట్టుకుని వేలాడితే మార్పు మొదటి దశలోనే ఆగిపోతుంది. మార్పు అలా పరిమిత స్థాయిలో ఉండకూడదు కనుక మనం రిజర్వేషన్‌లవాదాన్ని దాటి ముందుకి వెళ్ళాలని అంటున్నాను.

  • ప్రవీణ్ గారూ,
   బ్రాహ్మణులు అని మాత్రమే స్పెసిఫై చేసి ఉండను…ఫార్వార్డ్ కులాలు అని నా ఉద్దేశం…
   కోస్తాంధ్ర లో దళిత మధ్యతరగతి వర్గం ఎమర్జ్ అవుతోంది కనుక అక్కడ మీ విశ్లేషణని అన్వయించవచ్చేమో.మిగతా ప్రాంతాల్లో మీరు చెప్పేదశ ఇంకా రాలేదు.వర్గాన్ని బట్టే రిజర్వేషన్స్ నిర్ణయించడం వాస్తవంలో కష్టసాధ్యం…

 4. వర్గాన్ని బట్టి రిజర్వేషన్‌లని నిర్ణయించలేము. నిజమే. కొన్నేళ్ళ క్రితం నేను శ్రీకాకుళం పట్టణంలో ఇంటర్నెట్ కేఫ్ నడిపేవాణ్ణి. అప్పట్లో నా దగ్గరకి స్కాలర్‌షిప్ అప్లికేషన్‌ కోసం సమీప గ్రామం నుంచి ఒకాయన వచ్చాడు. వాళ్ళ అబ్బాయి వైజాగ్‌లోని ఒక కార్పొరేట్ కాలేజ్‌లో ఇంటర్ చదివేవాడు. వాళ్ళ అబ్బాయి కోసం నా చేత స్కాలర్‌షిప్ అప్లికేషన్ పెట్టించాడు. ఆ పెద్దాయన డీసెంట్‌గా తెల్ల చొక్కా వేసుకుని, నుదుటి మీద కస్తూరి తిలకం పెట్టుకుని ఉన్నాడు. అతని వేషం చూస్తే అతను ఆర్థికంగా ముందున్నవాడని అర్థమైపోతుంది. కానీ అప్లికేషన్‌లో మాత్రం తన వార్షిక ఆదాయం ఏడాదికి పది వేలు అని వ్రాయించాడు. ఏడాదికి కేవలం పది వేలు సంపాదించేవాళ్ళు ఎవరూ తమ పిల్లలని కార్పొరేట్ కాలేజ్‌లకి పంపించలేరు. అతను చెప్పే లెక్క తప్పు అని సులభంగానే అర్థమైపోతుంది. అయినా అతను నా చేత వార్షిక ఆదాయం పది వేలు అని వ్రాయించాడు. కులం ఆధారంగా కాకుండా వర్గం ఆధారంగా రిజర్వేషన్‌లు పెట్టినా ఇలాంటి తప్పుడు క్లెయిమ్‌లు చేసేవాళ్ళు ఉంటారు.

  “1991 వరకు మన దేశంలో లాభాలతో నడిచిన ప్రభుత్వ రంగ పరిశ్రమలకి 1991 తరువాతే ఎందుకు నష్టాలు వచ్చాయి?” అని గ్లోబలైజేషన్‌వాద పాలకులని ప్రశ్నించే ధైర్యం మన దళిత సంఘాల నాయకులకి లేదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్‌లు పెట్టాలి అని అంటూ ప్రాక్టికల్‌గా సాధ్యం కాని డిమాండ్‌లు చెయ్యడానికి మాత్రం ధైర్యం ఉంటుంది. ప్రైవేట్ పెట్టుబడిదారుడు ఎవడైనా తన వ్యక్తిగత లాభం కోసం వ్యాపారం చేస్తాడు కానీ పేదవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి వ్యాపారం చేస్తాడా? ఆ పెట్టుబడిదారులు ఇస్తున్న విరాళాలతోనే నడుస్తోన్న పాలక వర్గ పార్టీలు ఆ పెట్టుబడిదారులకి నచ్చని నిర్ణయాలు తీసుకుంటాయా? ఈ మాత్రం సందేహాలు వచ్చే సెన్స్ కూడా కుల సంఘాలలో పని చేసేవాళ్ళకి లోపించింది. అందుకే నేను కుల అస్తిత్వ పోరాటాలకి దూరంగా ఉంటున్నాను.

  మొన్న లక్ష్మీపేటలో తూర్పుకాపు కులస్తులు భూమి కోసం దళితులని హత్య చేస్తే అది బ్రాహ్మణవాద హత్యాకాండ అని అంటూ గద్దర్, కత్తి పద్మారావులు పేపర్‌లలో ప్రకటనలు ఇచ్చారు. అక్కడ హత్యాకాండ చేసినవాళ్ళు కూడా రెండుమూడు ఎకరాలు కంటే ఎక్కువ భూమి లేని పేదరైతులే. ఆ standard of livingలో ఉన్నవాళ్ళకి బ్రాహ్మణవాదం అంటే ఏమిటో తెలియదు. దళితులని ఆ గ్రామం నుంచి తరిమేస్తే తాము క్లెయిమ్ చేసిన భూమి తమకి వస్తుందని అనుకుని అక్కడ హత్యాకాండ జరిపారు. దీన్ని ఒక ఆర్థిక సమస్యగా చూడకుండా దీన్ని బ్రాహ్మణవాద కోణంలో చూశారు ఆ ఇద్దరు దళిత మేతావులు. ఇలాంటి వాళ్ళని చూస్తోంటే దళితవాదం కూడా వాస్తవికతకి దూరమైన రొమాంటిక్ మోడ్‌లో నడుస్తోన్న ఉద్యమం అని అనిపిస్తోంది.

  ఇప్పుడు కుల అస్తిత్వవాద ఉద్యమాలు ప్రధానంగా రిజర్వేషన్‌ల కేంద్రకంగానే సాగుతున్నాయి. అవి సమాజానికి పనికిరాకుండా పోయాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s