బ్లాగ్ సాహిత్యం – రచయిత్రులు

సదరన్ రీజనల్ లాంగ్వేజెస్ సెంటర్ (మైసూర్),తెలుగు శాఖ (కాకతీయ విశ్వ విద్యాలయం),ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ లో జనవరి 27 , 28 , 29 తేదీల్లో సమకాలీన స్త్రీల సాహిత్యం (1990 – 2010) అంశం మీద జాతీయ స్థాయి సెమినార్ జరగనున్నది.ప్రరవే ఏర్పడి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మహాసభ ఇది.
 
ఈ సెమినార్ లో నేను బ్లాగ్ సాహిత్యం – రచయిత్రులు అన్న అంశం మీద పత్ర సమర్పణ చేస్తున్నాను. సాహిత్య సంబంధమైన విషయాలున్న స్త్రీల బ్లాగులు తెలియజేయగలరు.మీరు చెప్పే సమాచారం ద్వారా వ్యాసం సమగ్రంగా రావడానికి వీలుంటుంది..నవల,కధ,కవిత్వం,వ్యాసం,లేఖలు,దిన చర్య కధనాలు,జోకులు,ఇలాంటి అంశాలున్న బ్లాగుల్ని సూచించగలరు. తప్పనిసరిగా బ్లాగ్ కోసమే రాసిన అంశాలు ఉండాలి.  .ప్రింట్ లో వచ్చాక బ్లాగ్ లో పోస్ట్ చేసినవి కాకూడదు. బ్లాగ్ పేరు చెప్పినా లింక్ పంపినా malleswari.kn2008@gmail.com  కి గానీ,వ్యాఖ్యలలో గానీ తెలియ జేయగలరు.
 
నాకు తెలిసిన కొన్ని బ్లాగులు.
 
తెలుగు తూలిక
మనసులో మాట
వివాహ భోజనంబు
జాజిపూలు
కృష్ణప్రియ డైరీ
మా గోదావరి
తూర్పూ పడమర
గడ్డిపూలు
వెన్నెల సంతకం
తృష్ణ
మధురవాణి
నా స్పందన
జ్యోతి
sowmya writes
కొత్తావకాయ
రమ్యంగా కుటీరాన
alochanalu.wordpress
మడత పేజీ
 
ఇట్లా కొన్ని బ్లాగుల్ని పరిగణన లోకి తీసుకున్నాను .మరి కొన్నింటిని  బ్లాగు మిత్రులు సూచించగలరు.
 
(కృష్ణ ప్రియా సారీ….నీకిచ్చిన మాటని ఇట్లా నిలబెట్టుకోవాల్సి వస్తోంది.)
 
 

49 thoughts on “బ్లాగ్ సాహిత్యం – రచయిత్రులు

 1. మీరు ఉదహరించినవి మహిళల బ్లాగులు. వాటిలో మా గోదావరి, తూర్పు-పడమర లాంటి ఒకటి రెండు బ్లాగులు తప్ప మిగితా బ్లాగుల్లో వంటలు, వార్పులు, చుట్టాలు, బంధువులు లాంటి traditional విషయాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్లాగులు సాహితీ పరిశీలనకి నిలుస్తాయా అనేది సందేహమే. నేను అన్నిటికంటే ఫ్రీక్వెంట్‌గా చదివే మహిళా బ్లాగర్ల బ్లాగుల్లో ఇది ఒకటి: http://maryamnamazie.blogspot.com/

 2. పైన ఉదహరించిన మహిళా బ్లాగర్ వర్కర్-కమ్యూనిస్ట్ పార్టీ ఇరాన్ కార్యకర్త. మన తెలుగు మహిళా బ్లాగర్లలో రాజకీయ పార్టీ కార్యకర్తలు ఒక్కరైనా ఉన్నారా? సాహిత్యం అంటే అందులో సామాజిక విషయాలు ఎక్కువగా ఉండాలి కానీ హోమ్లీ విషయాలు కాదు.

  • మీ వ్యాఖ్యలకి ఎన్నిసార్లు ఆశ్చర్య పోయినా ఇంకా కొండంత ఆశ్చర్యం మిగులుతూనే ఉంటుంది.సాహిత్యానికి మీ ప్రమాణాలేవో మీరు పెట్టుకున్నారు.కానివ్వండి.మాకు అభ్యంతరం లేదు.సామాజిక విషయాలే సాహిత్యం గానీ హోమ్లీ విషయాలు కాదంటున్నారు…నేను చెప్పిన బ్లాగులు సాహితీ పరిశీలనకి నిలుస్తాయో లేదో వ్యాసం వచ్చాక వ్యాఖ్యానిస్తే బావుంటుంది.అదీ కాక మేం…స్త్రీలం…నిల్చున్న చోటు నుంచే ముందు మాట్లాడతాం… అసలు మాట్లాడనివ్వండి. వ్యక్తిగతమంతా రాజకీయం ఎలా అయిందో చదివిన మేధావులే కదా మీరు? స్త్రీల బ్లాగుల మీద మీకెందుకు ఇంత చిన్న చూపు!!

   ఇక నుంచీ రచయిత్రులు కాదల్చున్న వారందరూ ఏదొక రాజకీయ పార్టీలో (మళ్ళీ అదేదో మీకు నచ్చిన రాజకీయ పార్టీలో )సభ్యులై ఉండాలని ఒక రూల్ పాస్ చేయించండి.గొడవ వదిలిపోతుంది.

 3. నాకేమీ మహిళల బ్లాగులపై చిన్న చూపు లేదు. మీరు పరిశోధన చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు. ఉదయం వనిత చానెల్‌లో పెళ్ళిళ్ళూ, పేరంటాల గురించి కార్యక్రమం వస్తే ఇలాంటి కార్యక్రమాలు మహిళల అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడతాయి అని సందేహం వచ్చి చానెల్ మార్చేశాను. మీ రచనలు కొన్ని చదివి మీరు అభ్యుదయవాద బ్లాగర్ అనుకున్నాను. చివరికి రొటీన్ విషయాలు వ్రాసే బ్లాగులపై పరిశోధన మొదలుపెట్టేసరికి నిరాశ కలిగింది.

  • ప్రవీణ్ గారూ
   నేను పరిశోధన చేసే అంశం రొటీన్ విషయాలు రాసే బ్లాగుల మీద కాదు.స్త్రీల బ్లాగుల్లో ఉండే సాహిత్య అంశాల మీద…ఈ బ్లాగుల్లో సాహిత్యం మరీ ప్రాధమిక స్థాయిలో ఉంటే….అలా ఎందుకుందో పరిశీలించాలి తప్ప జడ్జిమెంట్స్ ప్రకటించడం పరిశోధకుల లక్షణం కాదు.

 4. నా బాధ మీకు అర్థమైతే జడ్జ్‌మేంట్లు ఎందుకు ఇచ్చానో అర్థమవుతుంది. దళితవాదం, స్త్రీవాదం లాంటి వాటి గురించి వ్రాసే కొద్ది మందిని కూడా డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలా చేసేవాళ్ళని వెనుక నుంచి నడిపిస్తున్నది మహిళా బ్లాగర్లే. గూగుల్ బజ్‌లో నేను ఇలా వ్రాసాను “శంకరాభరణం శంకరశాస్త్రిలాగ మడికట్టుకుని ఉంటే బాగుపడము. కొంచెం ఆధునికత నేర్చుకోవాలి” అని. ఇలా వ్రాసినందుకే జ్యోతి అనే మహిళా బ్లాగర్ నన్ను బ్లాక్ చెయ్యాలని డిమాండ్ చేసింది. ఆ సమయంలో మహిళా బ్లాగర్లు ఎవరూ నాకు సపోర్ట్ ఇవ్వలేదు. ఒక పురుష బ్లాగర్ నాకు సపోర్ట్ ఇస్తూ “నిజాలు ఎప్పుడూ బ్లాక్ చేసేటట్టే ఉంటాయి” అని వ్రాసాడు. మహిళా బ్లాగర్లలో ఇంకా అగ్నిహోత్రావధానుల కాలం నాటి అభివృద్ధి నిరోధక భావజాలం ఉన్నప్పుడు మహిళల బ్లాగుల సాహిత్యం అంటేనే భయం కలగడంలో ఆశ్చర్యం ఏముంది? మీరింకా బ్లాగులకి కొత్తలాగ ఉన్నారు. నేను 2008 నుంచి తెలుగు బ్లాగుల్లో ఉన్నాను కాబట్టి నేను ఎన్నో అనుభవాలు చూసి ఉన్నాను. ముందు థీసిస్ వ్రాయండి. మీ థీసిస్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో తెలుస్తుంది. తెలుగు మహిళా బ్లాగర్లలో నేను అందరికంటే దగ్గరగా ఉండేది నీహారిక గారికి మాత్రమే. ఆవిడ ఒకప్పుడు హోమ్లీ విషయాలే వ్రాసేవారు. తరువాత రాజకీయ విషయాలు వ్రాయడం మొదలుపెట్టారు.

  • ప్రవీణ్, ఇంత మంది మహిళా బ్లాగర్స్ కి లేని బాధ మీకు మాత్రం ఎందుకు. ఇక్కడ అందరు టైం పాస్ కోసం వ్రాస్తున్నాం అని చెప్తారు. వాళ్ళ టైం పాస్ ఎలా ఉండాలా అని ఒకరు చెప్పకూడదు కదా

   • నీకు ఈ విషయం ఇప్పుడే అర్థం కాదు మౌలీ. కేవలం టైమ్ పాస్ కోసమైతే నేను కూడా పట్టించుకునేవాణ్ణి కాదు. స్త్రీవాదం గురించి వ్రాసే కొద్ది మందిని కూడా బ్లాక్ చెయ్యమనడం, మహిళా బ్లాగర్లే అలా మాట్లాడడం ఇక్కడ అసలు సమస్య. నీకు వివరాలు కావాలంటే నా నంబర్ 9295019502 కి ఫోన్ చెయ్యి, చెపుతాను. నీహారిక గారి గూగుల్ ప్రొఫైల్ కూడా చదువుతుంటాను. ఆ ప్రొఫైల్ లింక్ ఇది : https://plus.google.com/103145057876600078379 మేటర్ బాగుంటే బ్లాగుల మీదే కాదు, సోషల్ నెట్వర్కింగ్ ప్రొఫైల్స్ మీద కూడా థీసిస్ వ్రాయొచ్చు.

   • నేను 2009 నుంచీ బ్లాగ్ ప్రపంచంలో ఉన్నాను.నేను రాసిన కొన్ని పోస్టుల మీద కొన్ని సార్లు అభిప్రాయ భేదాలు వచ్చాయి…వాటిని అట్లాగే తీసుకున్నాను…మరీ ప్రగతి నిరోధంగా ఉన్న వాటిని తిరస్కరించాను.మీరేవో గొడవల గురించి రాసారు.వాటి గురించి తెలీదు.తెలుసుకోవాలన్న ఆసక్తీ లేదు.వ్యక్తిగతంగా ఎవరి పేర్లూ మీరు మెన్షన్ చేయొద్దు …అట్లా అయితే అలాంటి వ్యాఖ్యల్ని నేను తొలగించాల్సి ఉంటుంది.
    సబ్జెక్ట్ మీద మీరు ఎంతైనా వ్యాఖ్యానించ వచ్చు.

    అభివృద్ధి నిరోధక భావజాలం కేవలం మహిళల బ్లాగుల్లోనే ఉండదు…మరి మహిళల బ్లాగు సాహిత్యం అంటే మీకు ఎందుకు భయం కలుగుతోంది? స్త్రీల బ్లాగుల్లో మాటర్ బాగుంది….లేదు..అన్న నిర్ణయం ఎవరు చేస్తారు?అసలు చెయ్యొచ్చా?ఎలా ఉందో చెప్పడం వరకే పరిశోధకుల పని.ఆ బ్లాగుల్ని చదవాలో వద్దో బ్లాగ్ పాఠకులు నిర్ణయించుకుంటారు..మీకు రెండు మూడు సార్లు గుర్తు చేసాను…మేధో పెత్తనం కూడా తక్కువ హాని చెయ్యదు అని…

   • మేథోపెత్తనం కాదు. తెలుగు బ్లాగులన్నీ చదివిన అనుభవంతో చెప్పగలను. వ్యాఖ్యల్లో బ్లాగర్ల పేర్లు వ్రాయొద్దన్నారు. ఇక్కడ వ్రాయకపోయినా నా బ్లాగ్‌లో వ్రాసుకోగలను. ఇది నాకు సమస్య ఏమీ కాదు. ముందు మీరు థీసిస్ వ్రాయండి. అది ఎవరికి అనుకూలంగా ఉందో తెలుస్తుంది.

   • నేను రాసేది థీసిస్ కాదు పరిశోధనా పత్రం…పేర్లు మెన్షన్ చేయొద్దని అన్నది భయపడి కాదు.సంస్కార పరిధిలో మానవ ప్రవర్తనలు ఉండాలని.వ్యవస్థల లోపాలకి మనుషుల్ని ముఖ్యంగా స్త్రీలని టార్గెట్ చేయొద్దని…ఎవరికో అనుకూలంగా ఉండాలని నేను పేపర్ రాయను.నాకు ఏ విషయాలు అవగాహనలోకి వచ్చాయో అవే రాస్తాను.

   • మౌళీ,
    టైం పాస్ కోసం రాయడం అని మహిళా బ్లాగర్లు కొందరు అంటే అని ఉండొచ్చు.ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతోనే సాహిత్య సృజన చేయరు.మహిళా బ్లాగర్లకి ఒక్క అవుట్ లెట్ గా బ్లాగ్ వేదిక చాలా సాయపడుతోంది.దాన్లోంచే మంచి రచయిత్రులు పుడుతున్నారు.ఈ రోజు కృష్ణ ప్రియ రచయిత్రి కాదని ఎవరైనా అనగలరా?

   • అభివృద్ధి నిరోధక భావజాలం మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది కానీ తమకి కొందరు మహిళా బ్లాగర్ల సపోర్ట్ ఉందని చెప్పి మగవాళ్ళే ఆ భావజాలాన్ని జస్టిఫై చేసుకుంటారు. ఇదంతా మీకు ఇప్పుడు అర్థం కాదు. అనుభవంలోకి వచ్చిన తరువాత తెలుస్తుంది.

   • సరే ప్రవీణ్ గారూ
    మహిళా బ్లాగులకి సంబంధించి బ్లాగర్లని వ్యక్తిగతంగా వ్యాఖ్యానించకుండా ఆయా బ్లాగుల్లోని ఏ అంశాలపై మీకు వ్యతిరేకత ఉందో పాయింట్ వైజ్ గా చెప్పడానికి ప్రయత్నిచండి.ఆ క్రమంలో బ్లాగుల పేర్లను ప్రస్తావించవచ్చు.పదజాలం సంస్కారవంతంగా ఉంటే చాలు..మీరు చెప్పే అంశాలు నా రీసెర్చ్ పేపర్ కి ఉపయోగ పడితే నాకు మంచిదే కదా..

   • నేనన్నది కూడా అదే మాటండీ. టై పాస్ కోసం వ్రాసుకున్తాన్నాము అనే వాళ్ళ అభిప్రాయాలని ప్రవీణ్ గారు విశ్లేషించి విమర్శించి వాతావరణం చెడగోట్టుకోవడం ఎందుకు. అసలు సామాజిక బాధ్యత పలానా రచయిత్రి కి ఉండాలని కూడా చెప్పకూడదనే నా అభిప్రాయమును.

    ఇక్కడ ఒకరిద్దరు చెప్పే ‘సామాజిక బాధ్యత’ బయటి ప్రపంచానికి సంబందించినది లా అనిపించదు నాకు. బ్లాగులకు సంబంధించినది గా తోస్తుంది. ఒక మంచిరచయిత యొక్క రచనని చదివి ఊరుకోము. ప్రశ్నిస్తాము.ఆ ప్రశ్నలు సమాజం నుండే కదా వస్తాయి. రచయిత కి ఆసక్తి, అవకాసం ఉంటె సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. లేదంటే లేదు.

    @మహిళా బ్లాగర్లకి ఒక్క అవుట్ లెట్ గా బ్లాగ్ వేదిక చాలా సాయపడుతోంది

    నా సమాధానం అవును అని, కాదనీను .

   • మౌలీ, నీకు ఈ విషయం ఇక్కడ అర్థం కాదు. నాతో వ్యక్తిగతంగా ఫోన్‌లో కాంటాక్ట్ చెయ్యి. నీకు వివరంగా చెపుతాను. ఇక్కడ చెపితే కీబోర్డ్ అరిగిపోతుంది కానీ ప్రయోజనం ఉండదు.

 5. భమిడిపాటి లక్ష్మి గారి బ్లాగు, మాల కుమార్ గారి బ్లాగు తప్పకుండా చేర్చండి. సరిగమలు బ్లాగు కూడాను. నా ఆలోచనలు అని ప్రవీణ గారు కవితలు వ్రాస్తారు.

  • శ్రీవల్లీ రాధిక గారి మహార్ణవం లో ప్రింట్ లో వచ్చిన వాటినే బ్లాగ్ లో పెడుతున్నట్టు గుర్తు. కేవలం బ్లాగ్ కోసమే రాసినవి లేవనుకుంటాను. మళ్ళీ చెక్ చేస్తాను.

 6. ఈ ప్రవీణుడు ఎవరండీ బాబు! ఈ అబ్బాయి కి తెలియని విషయమంటూ ఏదీ లేనట్టుంది. అన్నిటి మీదా ఖచ్చితమైన ఖరారైన ఖండితమైన అభిప్రాయాలున్నయి!

  చీర్స్
  జిలేబి.

 7. నేను మెయిల్ పంపాను. కానీ ఫెయిల్యూర్ మెసేజ్ వచ్చిందేమిటి?
  >>>>>
  Delivery to the following recipient failed permanently:

  malleeswari.kn2008@gmail.com

  Technical details of permanent failure:
  The email account that you tried to reach does not exist. Please try double-checking the recipient’s email address for typos or unnecessary spaces. Learn more at http://mail.google.com/support/bin/answer.py?answer=6596
  >>>>>

 8. హో హో ఆ రోజు చేసిన పత్రసమర్పణ వెనుక ఇంత కష్టం దాగి ఉన్నదని ఇప్పుడు తెలుస్తోంది…
  బాగానే బ్లాగులన్నింటిని ,భావాలను సేకరించారు మేడం… జై ప్రరవే.
  https://sskchaithanya.blogspot.com
  https://www.facebook.com/sskchaithanya/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s