ఆవకాయ.కామ్ లో నా నవల – software for life

2008 స్వాతి అనిల్ అవార్డ్ పొందిన ‘జీవితానికో సాఫ్ట్ వేర్’ అను నా నవలని ఢిల్లీ  ఐ ఐ టి  ఆంగ్ల శాఖలో ప్రొఫెసర్ అయిన కల్లూరి శ్యామల గారు ‘software for life’ అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేసారు.ఈ అనువాద నవలని  newaavakaaya.com  అంతర్జాల పత్రికలో 20 నవంబర్ నుంచీ మూడు ఆదివారాల పాటు ప్రచురించి తర్వాత e – book రూపంలో పాఠకులకి  అందుబాటులో ఉంచుతారు.
 
రచయిత పరిచయం లేకపోయినా కేవలం నవల పట్ల ఇష్టంతో అనువాదం చేసి నవలా వస్తువు ఎక్కువ మంది పాఠకులకి చేరాలని తపన పడే కల్లూరి శ్యామల గారికి,శ్యామల గారు సంప్రదించిన వెంటనే ప్రచురణకి తమ అంగీకారాన్ని తెలిపి వెంటనే ప్రచురించిన ఆవకాయ.కాం వారికి,ముఖ్యంగా కడప రఘోత్తమరావు  గారికి  నా ధన్యవాదాలు.
 
 
ప్రకటనలు

10 thoughts on “ఆవకాయ.కామ్ లో నా నవల – software for life

  • మధు గారూ,
   తెలుగు వెర్షన్ పుస్తక రూపంలోనే ఉంది.స్వాతి మంత్లీలో 2008 లో ప్రచురింపబడిన నవల అది.తెలుగులో రీ ప్రింట్ చేయలేదు.కాబట్టి మెయిల్ లో పంపడం అసాధ్యం.మీ స్పందనకి ధన్యవాదాలు.

 1. hello.. jajimalli garu..!! reading novels n blogs is one of my hobby… i read your novel ‘Jeevithaniko software’ when i was studying in a girls university.. you won’t beleive if i say..!! that novel had circulated all over the university… every girl had read that novel..!! that’s one of the ultimate novel i read in my life..!! awesome concept and awesome narration..!! kudos to you..!!

  • ఉష గారూ
   చాలా సంతోషం.నిజానికి ఆ నవల ఇంకా బాగా రాసి ఉండొచ్చు.ఆ నవలలో ఉన్న నాటకీయత వలన ఎక్కువ మందికి నచ్చి ఉంటుంది అన్పిస్తుంది నాకు .ఆశ్చర్యమో సంతోషమో తెలీదు కానీ ఆ నవల వచ్చి మూడేళ్ళ పైన అయినా నవల గురించి నెలకి రెండు మూడు కొత్త కాల్స్ వస్తూనే ఉంటాయి.
   మీ స్పందన చూడగానే అలానే అన్పించింది.మీకూ బ్లాగు ఉందా? ఉంటే చెప్పండి చూస్తాను.

 2. Hello Jajimalli malliswari garu,
  Me navala Jeevithaniko software 2008 nundi ippati daka chalasarlu chadivanu. Mood off unnappudalla chaduvutanu. Naakunna pedda bad habit book enjoy chaduvutu rachaitani gurinchi alochinchaka povadam. Kaani ippudu aa alavatuni vadilichukunnanu. Really i want to read your other books also.

  • ఝాన్సీ గారూ,
   నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే…ఆ నవలని ఇప్పటికీ చాలా మంది గుర్తుంచుకోవడం…దాని మీద మాట్లాడటం…మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు…రచయితలు అప్రధానమై వారి రచనలే నిలబడతాయి..మీ వ్యాఖ్య దానిని సూచిస్తోంది.

 3. మీ సాఫ్ట్వేర్ ఫర్ లైఫ్ నవల లింక్ ను అప్పట్లో సరదాగా ఈ రంగం లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బంధువు ఒకబ్బాయికి పంపించానండీ, ఆశ్చర్యం గా తను తెలుగు వర్షన్ స్వాతి లో చదివారుట .

  ఇంకా కల్లూరి శ్యామలగారి అనువాదం తనకి చాలా బాగా నచ్చింది. వారి ఇంగ్లిష్ అనువాదాలు ఇంకా ఏమయినా తెలుసునా అనికూడా అడిగారు !

  • అవునా! మౌళీ…
   అనిల్ అవార్డ్ నవల కావడం మూలంగానూ రీడర్షిప్ ఉన్న పత్రిక కావడం మూలంగానూ కూడా ఎక్కువ మందికి చేరి ఉండొచ్చు.ఆ అనువాదం తర్వాతే ఆమె పరిచయమయ్యారు.ఆమె మిగతా అనువాదాల వివరాలు కనుక్కుంటాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s