జాజిమల్లి కతలకి ఇక వీడ్కోలు.

ప్రింట్ లో వచ్చిన బ్లాగ్ సాహిత్యం  గురించి  సమాచారం ఏవైనా ఉంటే  బ్లాగ్మిత్రులు తెలియజేయగలరు.నాకు తెలిసీ తెలుగుతూలిక బ్లాగర్ మాలతి గారి బ్లాగ్
 
 
సాహిత్యం పుస్తకరూపంలో వచ్చింది.తూర్పుపడమర బ్లాగర్ కల్పన గారి తన్హాయి నవల ప్రింట్ లో వస్తున్నట్టు తెలుసు…ఇవి కాకుండా కేవలం బ్లాగ్ లోనే
 
 
ప్రచురింపబడిన సాహిత్యాన్ని ప్రింట్ లోకి తీసుకువచ్చిన మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి తెలియజేయగలరు.
 
 
జాజిమల్లి కతల శీర్షికన నేను రాసిన 40  కతలతో  ప్రింట్ లో సంకలనం తీసుకుని వస్తున్నాను.ఇవి నేను కేవలం బ్లాగ్ లోనే రాసాను. నా మాటలు
 
 
రాసుకునేపుడు ప్రింట్ లో వచ్చిన బ్లాగ్ సాహిత్య ప్రస్తావన చేయడం అవసరం అనుకుంటున్నాను.
 
 
 
ఇక జాజిమల్లి కతలకి శాశ్వతం గానూ,జాజిమల్లికి తాత్కాలికంగానూ వీడ్కోలు….
 
 
ఇన్నాళ్ళూ ఈ కతల్ని ఇష్టపడిన బ్లాగ్మిత్రుల సహకారానికి కృతజ్ఞతలు.
ప్రకటనలు

62 thoughts on “జాజిమల్లి కతలకి ఇక వీడ్కోలు.

 1. మీ కతలు పుస్తక రూపంలో వస్తున్నందుకు ఆనందంగా అభినందించాలో, ఇకపై బ్లాగులో కథలు రాయబోను అన్నందుకు విచారించాలో తెలియడంలేదు మల్లీశ్వరిగారు. మీ పుస్తక ప్రచురణ కార్యక్రమానికి అభినందనలు 🙂

 2. మీ కతలు పుస్తకంగా ప్రచురితమవడం చాలా ఆనందదాయకం. అయినప్పటికీ బ్లాగులో మీ కతల రాతల్ని కొనసాగించవచ్చు కదా. దానికేమీ ఇబ్బంది వుండదనుకుంటా. అయితే, మనకి వర్డ్ ప్రెస్ లో కొన్ని వ్యాసాల్ని పబ్లిక్ గా కనిపించకుండా దాచే సౌకర్యం వుందనుకుంటాను. దానిని వినియోగించి కొన్నాళ్లపాటు పుస్తకంగా వచ్చిన పోస్టులను పక్కనపెట్టి పుస్తకాన్ని ప్రచారం చేయొచ్చు. అభినందనలతో…

 3. మీ కతలు పుస్తకం గా వస్తున్నందుకు చాలా సంతోషం. శుభాభినందనలు!

  “జాజిమల్లికి తాత్కాలికంగానూ వీడ్కోలు….” ఇదే నేను హర్షించలేకపోతున్నాను. మీ బ్లాగు చదవడం నాకు దాదాపుగా అలవాటుగా మారిపోయింది. చాలాసార్లు నేను కామెంట్లు పెట్టడం లేదు కానీ చదువుతున్నాను. మీరు తాతకాలికంగా మానేస్తానన్నా ఏదో బాధ గా ఉంది. మరి మాకు అరవైయేళ్ళ గర్భం, చాకలి దాలమ్మ ల కథలు ఎవరు చెబుతారు!

  తొందరగా వచ్చేయండి ప్లీజ్.

 4. తరతరాల బానిసత్వం లాగా, తరతరాలుగా మారని భావజాలం, ఇజాలే నిజమనుకునే అజ్ఞానం, ఆ అజ్ఞానంతో వాదనలు, వీటికి మీరు దూరం అని అనుకున్నాను మొదట్లో, మెల్లగా మీరూ ఆ తానులో ముక్కలే అనిపించింది, ఇజాల గొడవలు లేని టపాలు మాత్రం బాగుంటాయి వాటిపైన కొద్దిగా దృష్టి పెట్టమని మనవి.

 5. జాజిమల్లి గారు,

  బ్లాగ్ కి తాత్కాలికం గా దూరం ఉండటం ఎందుకు? కాస్త తీరిగ్గా ఉన్నప్పుడు నాలుగు ముక్కలు రాయచ్చుగా?
  పుస్తకం అచ్చవుతున్నందుకు అభినందనలు. అన్నట్టు నాకొక టపా బాకీ ఉన్నట్టున్నారు? మర్చిపోయారా?

  • నాగార్జున ,రవి,సౌమ్య,కృష్ణ ప్రియా,తారా,మౌళీ ధన్యవాదాలు.
   జాజిమల్లి కతలు ఆపేయడానికి ప్రత్యేకమైన కారణం అంటూ లేదు.ఇదే ప్రక్రియ మీద ఇలానే రాసుకుంటూ పోవడం మీద నాకు ఆసక్తి తగ్గింది.ఇక చాలు అన్పించింది.పెద్ద కధల మీద కొద్దిగా ధ్యాస పెట్టాలనుకుంటున్నాను…ఒక నవల రాసే ఆలోచన కూడా ఉంది.
   నాగార్జున,సౌమ్యా మీ అందరినీ ఇష్టపెట్టే,కష్టపెట్టే అవకాశాలను అంత తొందరగా వదలను.
   కృష్ణా, గుర్తుంది.నేను మీకు లేఖా రూపం లో రాస్తే మీరు మీ బ్లాగ్ లో పోస్ట్ చేయాలన్న ఒప్పందం కూడా ఉంది మర్చిపోయారా?
   రవీ,మీ సూచన బావుంది.ప్రచారం అని కాదు గానీ వేరే పబ్లికేషన్స్ వాళ్ళు వేస్తున్నపుడు మళ్ళీ నా బ్లాగ్ లో కతలు ఉండడం రిపీటెడ్ గా ఉంటుంది కదా…
   తారా,చాలా స్ట్రేంజ్ కామెంట్ చేసారు మీరు..అందులోనూ నాకు సానుకూల ధోరణే కనపడింది.కాకపోతే ఒక వివరణ చెప్పకుండా ఉండలేను.
   మీకు నచ్చని పోస్ట్స్ రాయించిన ఆ అజ్ఞానమే మీకు నచ్చిన పోస్ట్స్ కూడా రాయించింది.ఆ విషయంలో నా జ్ఞానానికి ద్వంద్వత్వం లేదు.కాకపోతే పాఠకులు ఎవరికి కావలసినవి వాళ్ళు తీసుకుంటారు. కోస్తాంధ్ర లో పుట్టి పెరిగి ,ఉత్తరాంధ్ర లో జీవిస్తున్న నేను, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఏవన్నా రాయడం అనేది ప్రింట్ లో రాసినంత సులువుగా బ్లాగ్ లో కుదరలేదు నాకు.నా పోస్ట్స్ ని ఎంతో ఇష్టపడి చదివే బ్లాగర్స్ చాలా మంది ఈ ఒక్క కారణం తోనే దూరమవడం కూడా నాకు తెలుసు.కానీ మనం నమ్మిన దాని పట్ల ఉండే నిజాయితీ కమిట్మెంట్ ఏ ప్రలోభాలకీ లొంగనివ్వదు.అలాగే మతం గురించో,స్త్రీల పట్ల ఉండే వివక్ష గురించి రాసినపుడో నా బ్లాగ్ పట్ల కొంత మందికి అయిష్టత కలిగిందని తెలుసు. నా బ్లాగ్ ఎక్కువ మంది చదవాలని,నా రాతలు ఎక్కువమంది చేత చర్చించబడాలని నేనూ కోరుకుంటాను.కానీ దాని కోసం ఎపుడూ రాజీ పడలేదు.పడలేను కూడా…అభిప్రాయాల ఘర్షణని ఒక విభేదంగా మాత్రమే తీసుకుని ఉంటే నా అజ్ఞానాన్ని భరించే శ్రమ మీకు తప్పేది.నాకు అర్ధమవుతున్నంత వరకూ ఇజాలను కూడా దాటిన ఏవో విలువలని మీరు ఈ కతల్లో చూడగలిగారు అందుకీ ఈ కామెంట్….అందుకే నా ఈ సుదీర్ఘ స్పందన కూడా…

   • ఎంత మంది చదువుతారు, ఎంత మంది చదవరు అనేది ప్రశ్న కాకూడదు. http://radicalfeminism.stalin-mao.in ఈ బ్లాగ్‌లో ఆడవాళ్ళకి క్షురక వృత్తి చేసే హక్కు ఉండాలి లాంటి controversial వ్రాతలు వ్రాసాను. ఆడది మంగలి కత్తి పట్టుకుంటే పెద్ద మనుషులమని చెప్పుకునేవాళ్ళు చూడలేరని తెలుసు. ఆడవాళ్ళు ఆ పని చెయ్యాలని అడ్వొకేట్ చేస్తూ వ్రాస్తే సోకాల్డ్ చదువుకున్న జనం చదవరని కూడా తెలుసు. అయినా నేను అలా వ్రాసాను.

  • జాజి గారు ,
   ము౦దు ఇష్టపడి చదివిన వారు కూడా మీ బ్లాగు కు దూరమవడం ‘జరుగలేదని’ నా అభిప్రాయం. వ్యాఖ్యని౦చడమ్ మానేసి ఉ౦డొచ్చు .లేదా అప్పుడప్పుడు వ్యాఖ్యానిస్తూ ఉ౦డొచ్చు .. అలాగే వారు కూడా రాజీ పడని మీ ఆలోచనా సరళి కి తలవ౦చి మీరు ‘తమ ప్రా౦త౦ వారే’ అని సగర్వ౦ గా చెప్పుకోవడం కూడా మీకు అభిన౦దనే.

   ఒక అభిప్రాయ బేధాన్ని అ౦గీకరి౦చలేక అజ్ఞానం అని దాడి చేస్తూ౦టే మౌన౦గ తప్పుకోవడమే ఇప్పటివరకు. మీ సవివరణ ఈ స౦ప్రదాయాన్ని మార్చుతు౦దని ఆశిస్తాను.

   • మౌళీ,
    మీ అభిమానానికి కృతజ్ఞతలు.
    తార రాసిన దాన్ని నేను దాడిగా భావించడం లేదు.నా బ్లాగ్ లో తనకి నచ్చని విషయాల పట్ల అసహనాన్ని ప్రదర్శించారు అంతే…కొంచెం దూకుడుగా కామెంట్ చేయడం తన స్వభావం…అది నన్నెపుడూ నొప్పించలేదు కూడా…తార కామెంట్ మీద నా స్పందన కేవలం తనకి మాత్రమే కాదు….నేను రాసిన పోస్ట్స్ పట్ల ఇష్టత ఉండీ కొన్ని విషయాల్లో నా అభిప్రాయాల పట్ల అయిష్టత ఉన్న వాళ్ళని ఉద్దేశించి కూడా…

   • హ్మ్,

    నా వ్యాఖ్య మీ వివరణ గురి౦చే కాని తార గారిని విమర్శి౦చడం కాదు. నిజానికి మీచే ఆ వ్యాఖ్య వ్రాయి౦చిన తార గారికి కూడా అభిన౦దనలు! కనీస౦ మౌన౦గా ఉ౦డకు౦డ, తన స్టా౦డ్ చెబుతున్నారు.

    అది మీకు మీ ఇజాలు పట్ల స౦దిగ్దమ్ లో ఉన్న వారి కి వారధి అవ్వొచ్చు కూడాను , వ్యతిరేకత కలిగిన వారిని వదిలేసినా .

    అభిప్రాయ బేధాన్ని అ౦గీకరి౦చకు౦డ ‘అజ్ఞాని అని ‘ కొ౦దరు దాడి చెయ్యడం మీ వ్యాఖ్య చూసాక జ్నాపక౦ వచ్చి౦ది కాని, తార గారి వ్యాఖ్య తో కాద౦డీ.

   • అర్ధమయింది మౌళీ…కానీ తార వ్యాఖ్యలో అజ్ఞానం అన్న మాట ఉండడం, మీరూ అదే వాడడం జరిగేసరికి కొంచెం పొరపడ్డాను.యిపుడు క్లారిటీ వచ్చింది.

 6. తెలంగాణావాదం అంటే గుర్తొస్తోంది. ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలోని కొందరు సమైక్యవాదులు “హైదరాబాద్ లేకపోతే కోస్తా ఆంధ్రకి మిగిలేది గెంజి అన్నం, అంబలి” అంటూ సిగ్గులేకుండా పాడితే ఒక సమైక్యవాద చానెల్ వాళ్ళకి బాగా పబ్లిసిటీ ఇచ్చింది. అందుకే సమైక్యవాదులని పేరడీ చేస్తూ రాజకీయ అగ్నిహోత్రం అనే కథ వ్రాసాను. http://patrika.teluguwebmedia.in/2009/12/blog-post_19.html మీరు కూడా సమైక్యవాదాన్ని పేరడీ చేస్తూ కథలు వ్రాయండి.

 7. నేనూ ఉండేది ఉత్తరాంధ్రలోనే కానీ ప్రత్యేక తెలంగాణాకి మద్దతు ఇస్తున్నాను. నేను మార్క్సిస్ట్-లెనినిస్ట్‌ని. మార్క్సిజం-లెనినిజం అనేది అంతర్జాతీయవాద భావజాలం. కేవలం హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసే కొందరు కోస్తా ఆంధ్రుల ప్రయోజనాల గురించే ఆలోచిస్తే అది అంతర్జాతీయవాదానికి విరుద్ధమవుతుంది. అందుకే నేను ప్రత్యేక తెలంగాణావాదాన్ని సమర్థిస్తున్నాను. సమాజం గురించి ఆలోచించకుండా మెటాఫిజికల్‌గా బతికేవాళ్ళు ఎక్కువగా ఉన్న సమాజంలో కొంత మంది కేవలం భాషా సమైక్యత కోసం హింస చేస్తారనడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. నేను సమైక్యవాదులని నమ్మకపోవడానికి అది కూడా ఒక కారణం. మీరు తెలంగాణా గురించి మీ అభిప్రాయాలు నిస్సంకోచంగా వ్రాయండి. సమాజం గురించి మేము అజ్ఞానంతోనో ఉంటాం అనుకునేవాళ్ళకి మీరు గానీ నేను గానీ చెప్పగలిగేది ఏమీ ఉండదు.

  • ప్రవీణ్ గారూ,
   మీ కామెంట్స్ చాలా సార్లు చూసాను.మీరు రాసిన పోస్ట్స్ కూడా కొన్ని చదివాను.మీ భావజాలం అభ్యదయకరమైనదే.అందులో సందేహం లేదు.కానీ మీ వ్యక్తీకరణలో ఏదో ఇబ్బంది ఉంది. ఎంతో మంచి విషయాలను ఒకోసారి మీరు అసందర్భంగా ప్రస్తావించడం జరిగినపుడు మీ మీద కలిగే అసహనం కొంత మందికి మీ భావాల మీద అసహనంగా మళ్ళుతుంది.ముఖ్యంగా అనేక సిద్ధాంతాలకి,ఉద్యమాలకి సంబంధించి మీ వద్ద విలువైన సమాచారం ఉంటుంది.కానీ విశ్లేషణలో ఆ సమాచారానికి న్యాయం చేయనట్టుగా అన్పిస్తుంది.ఇది మీ బ్లాగ్ రైటింగ్స్ మీద నా అభిప్రాయం.
   ఇక పేరడీ సాహిత్యం కాదు గానీ జె.పి ఇష్యూ మీద సెటైరికల్ స్టోరీ ఒకటి రాసాను.అది ఒక దిన పత్రిక పరిశీలనలో ఉంది.
   స్పందించినందుకు ధన్యవాదాలు.

   • ఏ విషయాన్నైనా దాని చుట్టూ ఉన్న పరిస్థితులతో వేరు చేసి చూస్తే ఆ విషయం అర్థం కాదు. అది కేవలం నా సూత్రీకరణ కాదు. సమాజం గురించి లోతుగా పరిశీలిస్తే మీకూ అర్థమవుతుంది.

   • ప్రవీణ్ గారూ,
    ఏ విషయాన్ని చుట్టూ పరిస్తితుల నుంచి విడదీసి చూసానూ!!కొంచెం వివరంగా చెప్పండి.

 8. బ్లాగ్ కథలు ఒక సంఖ్యకు చేరాయి కనుక, వాటిని విరమించాలని అనుకుంటే అది మీ ఇష్టం. కానీ బ్లాగ్ రచనకే విరామం ఇవ్వడం ఎందుకు? ఏదో ఒక ఫ్రీక్వెన్సీతో రాస్తూ ఉంటె, మరో కొత్త అద్భుతమైన ప్రక్రియను కనుగొంటారేమో? మీకు మంచి నాణ్యమైన చదువరులున్నారు. దయచేసి, ఏదో ఒకటి, మీరు చదివిన వాటి గురించో ఆలోచింటే వాటి గురించో, రాస్తూనే ఉండాలని కోరిక.

  • సర్,
   ” మీకు మంచి నాణ్యమైన చదువరులున్నారు ” అన్న మీ మాట చాలా నిజం.అందుకే నా బ్లాగ్ పోస్ట్స్ కి చాలా మంచి విశ్లేషణలు వచ్చాయి.విరామం కొద్ది రోజులే…మీ సూచనలు ఎపుడూ నాకు చాలా విలువైనవి.నేను తప్పక వాటిని పాటించడానికే ప్రయత్నిస్తాను.మీ స్పందన నాకు చాలా ఆనందాన్ని కలిగించింది…కృతజ్ఞతలు.

 9. జాజిమల్లిగారు ముందుగా మీ వ్యాఖ్యకి జవాబు ఇస్తాను,

  మీ స్త్రీవాదానికి వస్తే, మీ అనుభవాలు మీకు కొన్ని నేర్పి ఉండొచ్చు, కొన్ని అలోచనలు రేకెత్తి ఉండొచ్చు, అలానే నా అనుభావాలు నాకు ఉంటాయి, నా ఆలోచనలు నాకు ఉండొచ్చు, అంతమాత్రాన నా అలోచనలు సరైనవి, మీవి తప్పు ఐపోవు.
  అలాగే తెలంగాణా మీద నాకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు, మీకు కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ ఏ ఒకటీ కరెక్టు, ఏ ఒకటీ తప్పు ఐపోకపోవచ్చు, ఎవరి ధృక్పధాలు వారివి..

  కానీ కొన్ని విషయాలు వీటన్నిటికీ దూరంగా ఒకటే సరైనది, మిగతావి అన్ని తప్పు అయ్యేవి ఉంటాయి, నా అభ్యంతరమల్లా వాటి గురించే

  ఇక అజ్ఞానం, జ్ఞానంకి వస్తే, ప్రతి ఒక్కరూ విజ్ఞానులు ఐపోరు, అలాగే అన్నిట్లోనూ అజ్ఞానులు ఐపోరు, కానీ జ్ఞానానికి – అజ్ఞానానికి సన్నటి గీత ఉంటుండి, అది మనం అన్ని సార్లు గమనించకపోవచ్చు, ఎందుకంటే అవి అసలు ఉన్నాయి అని మనకి తెలియకపోవచ్చు, అలాని తెలుసుకునే ప్రయత్నం చెయ్యకపోవడం తప్పు అని కుడా అనను, కానీ అది ఎందుకు తప్పో పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపించినా తమ తప్పు సరిద్దిద్దుకునే ప్రయత్నం చెయ్యకపోవడం మూర్ఖత్వం అవుతుంది..

  ఇంతవరకూ మీకు అభ్యంతరం లేదనుకుంటాను.

  ఇక నేను ఇంప్లై చేసిన టపా మా ఇంట్లో పాలు పోసేది చంద్రబాబు అన్న టపాలో మీ భావాల గురించి, సరే ఇది ప్రస్తుతం పక్కన పెడదాం.

  మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి,

  ఆర్థిక శాస్త్రాన్ని కార్మికుల దృష్టితో చూడటమే సరైనదని మీరు ఒప్పుకుంటారా?విభేదిస్తారా?

  • తారా,
   ” కానీ అది ఎందుకు తప్పో పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపించినా తమ తప్పు
   సరిద్దిద్దుకునే ప్రయత్నం చెయ్యకపోవడం మూర్ఖత్వం అవుతుంది..”అన్నారు….సాక్ష్యాధారాలు ఎవరి ప్రమాణాలతో ఉంటాయి?పోనీ సార్వజనీనమైన ప్రమాణాలు,విలువల విషయానికి వస్తే దొంగతనం నేరం అని చట్టం చెపుతుంది….నాలుగు రోజులు తిండి లేని కటిక పేద చేసే దొంగతనాన్ని లోకం సానుభూతితో అర్ధం చేసుకుంటుంది.ఒకే విలువ వ్యక్తులకి ఒకే రకంగా అన్వయించడం కుదరదు…”కానీ కొన్ని విషయాలు వీటన్నిటికీ దూరంగా ఒకటే సరైనది, మిగతావి అన్ని తప్పు అయ్యేవి ఉంటాయి, నా అభ్యంతరమల్లా వాటి గురించే” అని కూడా అన్నారు అట్లాంటి ఉదాహరణ ఏవన్నా ఇస్తే నాకు క్లారిటీ వస్తుంది.మా ఇంట్లో వాడుకపాలు….అన్న టపా లోని ఏ భావాలు అభ్యంతరకరమో చెపితే బావుండేది.అభివృద్ధికి నమూనాకి సంబంధించి కూడా అందరి అభిప్రాయాలూ ఒకే విధంగా లేవు.
   ఆర్ధిక శాస్త్రాన్ని శాస్త్రీయంగా నేను నేర్చుకోలేదు..మార్క్సిజాన్ని నేను అధ్యయనం చేస్తున్న దశలోనే ఉన్నాను కాబట్టి ఈ సిద్ధాంత చర్చకి నేను న్యాయం చేయలేను.కాకపోతే మనుషులుగా మనం మౌలికంగా కలిగి ఉండాల్సిన విలువలను జీవితం నుంచీ సాహిత్యం నుంచీ గ్రహించిన జ్ఞానం తోనే నేను మాట్లాడగలను.
   ఆర్ధిక శాస్త్రాన్ని కేవలం శాస్త్రంగా మాత్రమే చూడదల్చుకున్నపుడు అక్కడ కార్మికుల దృష్టి మాత్రమే ప్రధానం కాదు.

   • మార్క్సిజం అర్థం కావాలంటే గతితార్కిక చారిత్రక భౌతికవాదం (Dialectical and Historical Materialism) చదవాలి. అది చదవకుండా మార్క్సిజం గురించి కబుర్లు, కాకరకాయలు చెప్పుకుంటే మార్క్సిజం అర్థం కాదు. కంభంపాటి సత్యనారాయణ గారు వ్రాసిన మార్క్సిజం మూల సూత్రాలు – గతితార్కిక భౌతికవాదం, మార్క్సిజం మూల సూత్రాలు – చారిత్రక భౌతికవాదం, మార్క్సిజం మూల సూత్రాలు – వర్గ పోరాటం పుస్తకాలు చదవండి. అలాగే రంగనాయకమ్మ గారు వ్రాసిన కాపిటల్ పరిచయం కూడా చదవండి. ఫ్రెడ్‌రిక్ ఎంగెల్స్ వ్రాసిన “The Origin of the Family, Private Property and the State” పుస్తకం కూడా చదవండి. ఈ రచనలు అర్థమైతే తరువాత లెనిన్, స్టాలిన్, మావోలు వ్రాసిన రచనలు కూడా అర్థమవుతాయి.

   • ఇపుడింతకీ ఇక్కడ మార్క్సిజం గురించి కబుర్లూ కాకరకాయలూ చెప్పుకుంటున్నదెవరూ!!మీరిచ్చిన లిస్టు అంతా చదివే వరకూ మమ్మల్ని బ్లాగ్ పోస్ట్స్ రాయవద్దంటారా? శ్రీశ్రీ మహా ప్రస్థానం రాసేనాటికి తనకి మార్క్సిజం తెలియదన్నాడు.మహాప్రస్థానంలో మార్క్సిజం లేదా?..జ్ఞానాధిక్యం..దాని ప్రదర్శన కూడా తక్కువ చెరుపు చేయదు…మీ వ్యాఖ్యలు సందర్భానుగుణంగా ఉండేట్లు చూడండి ప్రవీణ్ గారూ

   • కబుర్లు చెపుతున్నది మీరే కదా. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అన్న శ్రీశ్రీని పొగుడుతూనే ఇంకో వైపు అమెరికా సామ్రాజ్యవాదులని పొగిడేవాళ్ళు ఉన్నారు. మార్క్సిజం కేవలం కబుర్లకి పరిమితం కాకూడదనే నేను మార్క్సిజంని లోతుగా చదవమన్నది. “ఆర్ధిక శాస్త్రాన్ని కేవలం శాస్త్రంగా మాత్రమే చూడదల్చుకున్నపుడు అక్కడ కార్మికుల దృష్టి మాత్రమే ప్రధానం కాదు” అని అన్నారు. శాస్త్రంలోనూ రకాలు ఉన్నాయి. ఏ రకం శాస్త్రమో మీరు చెప్పలేదు. శాస్త్రాన్ని సమాజం నుంచి వేరు చేసి చూస్తే అందులో కార్మిక వర్గ దృష్టిని కలపాలనిపించదు. అందుకే ఆర్థిక శాస్త్ర విద్యార్థులు కూడా మార్క్సిజాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. అది శాస్త్రాన్ని జడ దృష్టితో చూసేవాళ్ళ తప్పు కానీ శాస్త్రం తప్పు కాదు.

   • ప్రవీణ్ గారూ,
    నేను చెప్పిన వాక్యాలు స్పష్టం గా చదవండి.మీరిచ్చిన వివరణకి అది భిన్నం కాదు.

   • Excellent reply,

    >>సాక్ష్యాధారాలు ఎవరి ప్రమాణాలతో ఉంటాయి?

    Yes, very good question.

    >>
    కానీ కొన్ని విషయాలు వీటన్నిటికీ దూరంగా ఒకటే సరైనది, మిగతావి అన్ని తప్పు అయ్యేవి ఉంటాయి, నా అభ్యంతరమల్లా వాటి గురించే
    >>

    It happens only in case of mathematics 🙂
    So, standard itself will be mathematical nature.

    >>అభివృద్ధికి నమూనాకి సంబంధించి కూడా అందరి అభిప్రాయాలూ ఒకే విధంగా లేవు.

    Economists from west, they study poverty only in books, more over they measure poverty for their countries only like, how much aid they should give and in its best form, so, they wont insist on removing poverty, they only insist on the best they can do with the money in their hand with immediate effect. Thats the irony, and our people here they take sides, if UPA/NDA want to start some publicity work poverty increases else it decreases.

    >>టపా లోని ఏ భావాలు అభ్యంతరకరమో చెపితే బావుండేది.

    I will, definitely.

    >>
    ఆర్ధిక శాస్త్రాన్ని శాస్త్రీయంగా నేను నేర్చుకోలేదు..మార్క్సిజాన్ని నేను అధ్యయనం చేస్తున్న దశలోనే ఉన్నాను కాబట్టి ఈ సిద్ధాంత చర్చకి నేను న్యాయం చేయలేను.
    >>

    This is what I am saying, there are only facts no isms, Carl Marx as well as Adam smith, they published tons of materials on ideologies or policies, may be they represent opposite poles, but most of ideologies of both were proven wrong, So, if you start with their books, you are going no where, since those books were written centuries back and most of the material were proven wrong, so why to start with those things, you will go no where (ofcourse anyone), so discard discarded ideas, see Economics as Economics not as Marxist viewpoint or Capitalistic view point, Economics has its own nature and neutral view, it neither support capitalism nor communists. So, go by facts not by ideas, most of time things are beyond our scope, especially in a system with complex relations and human emotions.

    >>
    ఆర్ధిక శాస్త్రాన్ని కేవలం శాస్త్రంగా మాత్రమే చూడదల్చుకున్నపుడు అక్కడ కార్మికుల దృష్టి మాత్రమే ప్రధానం కాదు.
    >>

    It was proved in 1953 by Debreau, that you take any perspective, either Workers or Capitalist it doesn’t matter, equilibrium will be unique. This is what changed the direction of Economic Theory and ofcourse how the world looks itself too.

   • Tara, you are trying to hide the actual point as the so called intellectual Jahnavi does in his writings. One can be either socialist or capitalist. There is no third route or substitute. One can understand it well if he reads Lenin’s writings.

  • ప్రవీణ్

   @ గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అన్న శ్రీశ్రీని పొగుడుతూనే ఇంకో వైపు అమెరికా సామ్రాజ్యవాదులని పొగిడేవాళ్ళు ఉన్నారు.

   హ హ . ఇజాలు, వాదాలగురి౦చి నాకు తెలిదు కాని మీ సెటైర్ సూపర్. ఒకప్పటి మనకు అత్య౦త మిత్ర రాజ్యం గా ఉన్న రష్యా కి మనమిచ్చే విలువ గడ్డిపోచ మాత్రం చెయ్యడం లేదు 😦

 10. కొంచెం దూకుడుగా కామెంట్ చేయడం తన స్వభావం
  …..

  నా స్వభావం కాదండి, కావాలని రాసిందే, అలా ఎందుకు రాశానో మీకు తరువాత వివరణ ఇస్తాను.
  నా పై నమ్మకానికి ధన్యవాదాలు.

  • మీ స్వభావం అని ఎందుకన్నానంటే …ఇంతకు ముందు కూడా సోంపేట విషయం లో ఇలాంటి కామెంట్స్ రావడం మూలానే…మళ్ళీ మీరు వెంటనే ఆ వ్యాఖ్య చేసినందుకు నొచ్చుకున్నారు కూడా….అంతకు మించి మరేమీ లేదు…అలాగే ఈ చర్చలో వెంట వెంటనే వ్యాఖ్యలు రాసే వెసులుబాటు నాకు ఉండదు…నెమ్మదిగా అయినా మీ వ్యాఖ్యల మీద నా అభిప్రాయాలు నేను చెపుతూ ఉంటాను…అలాగే మీ ఓపిక కూడా…

   • అవునండి, అది నాకు గుర్తున్నది అందుకనే మీ బ్లాగు గుర్తున్నది,
    దూకుడూగా ఎందుకు ఇచ్చాను పైన అంటే, కొన్ని ప్రభలంగా నమ్మేవి తప్పు అని ఒకరు చెప్తే వినగలిగే స్థితిలో ఉన్నారో లేదో అవసరం, మీరు మార్క్స్ రాసిన ప్రతి అక్షరం కరెక్టే అని నమ్మితే నేను వచ్చి అదేమీ కాదు అంటే, మీరు మా మార్క్స్ని అంటావా అని నాతో వాదన పెట్టుకుంటే మీకూ నాకూ అదో టైం వేస్ట్, ఉపయోగం కుడా ఉండదు, మీకేమీ తెలియదు అని ఓ కామెంట్ పడేశాననుకోండి, మీరూ “నేను ఎక్కడైనా తప్పు రాసానా” ( తప్పు నాదే అయ్యుండొచ్చు, మీరు అన్నీ సరిగ్గానే రాసినా) అని అలోచిస్తారా లేదా అన్నది తెలుస్తుంది, అప్పుడు మనం ఇద్దరం వివరంగా మాట్లాడుకోవచ్చు, అలా కాకుండా నాది తప్పు అంటావా అని మీకు అనుకుంటే మీ జవాబు వేరే విధంగా ఉంటుంది, నేను ఇక మీకు జవాబు ఇవ్వనవసరం లేదు, ఇద్దరికీ టైం సేవ్ 🙂

    ఇంక దీనికి జవాబు ఎందుకు ఇచ్చాను అంటే, చిన్నప్పటి నుండి కధలు చదివి చదివి అలవాటు ఐపోయింది, అభ్యుదయ భావాలు అన్న కేటగిరీలో కధా వస్తువు, కధ ప్రయాణం, ముగింపు మొత్తం ఒకటే మూస, ప్రత్యేకించి ప్రపంచీకరణకి వస్తే, మా చిన్నప్పుడు ఎంతో బాగుండేది ఇప్పుడు మొత్తం పాడైపోయింది అని ఒకటే మోత, చివరకి చందమామ కుడా పట్టుకోవడం మానేసాను, ఇది నా ఒక్కడి పరిస్థితే కాదు, చాలా మందికి అని MBS ప్రసాద్ గారు ఒక పెద్ద సిరీసే నడుపుతున్నారు, కనీసం ఇవి ఐన చదవండి అని “నాకు నచ్చిన కధలు” అని, అవి అన్నీ కుడా పాతవే, నవ్యత అన్నది లేకుండా పొతున్నదేమో, మీరు ఐన మీ కధలు మూసలో పడిపోకుండా, చదివించేట్టు అందిస్తారన్న ఆశతో..

    మీకు ఏమైనా అపోహలు ఉన్నచో అన్నిటికీ మూలం మార్క్స్ చెప్పినవి చెయ్యకపోవడమే అని తేల్చెయ్యకుండా కాస్త మంచివి ప్రత్యేకించి అభ్యుదయం అన్న కేటగిరీలో నవ్యత అందించగలరేమో అని నా వంతుగా మీకు కొద్దిగ other side/ reality చూపిస్తే అని.

   • @మా చిన్నప్పుడు ఎంతో బాగుండేది ఇప్పుడు మొత్తం పాడైపోయింది అని ఒకటే మోత,

    ఈ చర్చ స్త్రీ వాదం, ప్రా౦తీయ వాదం పై కాదనగానే ప్రప౦చీకరణ అయ్యు౦టు౦దనే అనుకొన్నాను :). ఇక ఈ విష్య౦ పై వచ్చిన టపాల్లో నా భేదాభిప్రాయలు నేను ప౦చుకొన్నాను కాని, జాజిమల్లి కధలుగా వాటికి నా అభిప్రాయాలు తో పరిమితమైన స౦బ౦ధమ్ మాత్రమె ఉ౦ది ఎ౦దుక౦టే, ప్రప౦చీకరణకు వ్యతిరేకం గా కాకు౦డా జాజిమల్లి గా తన అనుభవాలను, వాటి మ౦చి చెడులను ఇ౦కొక తరానికి అ౦ది౦చే ప్రక్రియగా చూస్తే!

    అదే సమయం లో అభివృద్ధి పధం లో నిర్లక్ష్యం చేయబడ్డ సమాజాలు, వారి ప్రస్తుత సమస్యలు అర్ధం చేసికొ౦టే ఈ సమస్య ము౦దు తరాల్లో పునరావృతం కాదు. కాబట్టి ఈ కధల్లో ని భావాలకు నా మద్దతు తెలియచేస్తున్నాను

   • తారా,
    మీరు ఇజాలను వ్యతిరేకించినా మీ ఆర్గ్యుమెంట్ పోలీమికల్ గానే ఉంది.
    సరే…మీరు నా కధల్లో మిస్సయిన అభివృద్ధి రెండో పార్శ్వం గురించి చెప్పాలనుకుంటున్నట్టు నాకు అర్ధమైంది.చెప్పండి.

 11. చంద్రలతగారు తన బ్లాగు టపాలతో ఒక పుస్తకం తెచ్చారు.
  అచ్చులో కాకుండా ఈ-సంపుటాలుగా మరికొన్ని సంకలనాలు వచ్చాయి, వివిధ బ్లాగర్లు సమకూర్చినవి..
  మీ రచనావ్యాసంగాన్ని విస్తరింపచేసుకునే ఉద్దేశంతో ఈ కథల్ని ఆపేస్తానంటున్నారు కాబట్టి ఓకే.
  బ్లాగులో ఉండే వెసులుబాటు, ఇతర రచనాప్రక్రియల్లో దొరకనిది మీకీపాటికి అనుభవానికి వచ్చి ఉంటుందనే అనుకుంటున్నా. అంచేత విరామాన్ని కుదించి బ్లాగు రాయడం కొనసాగిస్తారని ఆశిస్తున్నా.
  రాబోయే పుస్తకం కోసమూ, రాయబోయే రచనలకోసమూ ఎదురు చూస్తుంటాం.
  శుభాకాంక్షలు.

  • కొత్త పాళీ గారూ..
   గుర్తొచ్చింది.చంద్రలత బ్లాగ్ టపాల సంకలనం ఆవిష్కరణ హైదరాబాద్ లో చేసారు.
   ఆ వెసులుబాటు ఎంత హాయిగా ఉంటుందో నాకూ అనుభవం లోకి వచ్చింది కాబట్టే బ్లాగ్ రచనని నేనూ ఆస్వాదించాను.తప్పకుండా త్వరలోనే ఇంకో కొత్త ప్రక్రియతో మొదలు పెడతాను.
   మీ స్పందనకి కృతజ్ఞతలు.

 12. సరే…మీరు నా కధల్లో మిస్సయిన అభివృద్ధి రెండో పార్శ్వం గురించి చెప్పాలనుకుంటున్నట్టు నాకు అర్ధమైంది.చెప్పండి.

  ____

  లేదు జాజిమల్లి గారు,
  నేను ఇప్పటివరకు చూడని, చూడలేని అంశాల గురించి మీరు రాస్తే చదవాలి అని అనుకుంటున్నాను, అది మీలాంటి వారికే సాధ్యం, ఎందుకంటే ప్రజలతో మాకన్నా మీరు ఎక్కువ మమేకమై ఉంటారు, వారితో గడుపుతారు, వారి కళ్ళతో సమాజాన్ని చూడగలిగే అవకాశం మీకు ఉన్నది.
  సమాజం ఎలా ఉన్నది అని న్యూట్రల్‌గా చెప్పే ఒక గొంతు అవసరం ఎంతైనా ఉన్నది, మీరు అది ఇవ్వగలా అని మాత్రమే అడుగుతున్నాను, అలాంటి గొంతులున్నంత కాలం మాకు అజ్ఞానపు పొరలు కమ్మవు 🙂

  అంటే గోర్కీ అమ్మ నవల తీసుకోండి, దానిలో తప్పొప్పులు ఎక్కడా చర్చకు రావు, కొందరు మితృలు తాము నమ్మినదాని గురించి ఎలా పోరాటం చేసారు అన్నది మాత్రమే కనిపిస్తుంది, మార్క్స్ ఎందుకు ఒప్పు, జార్ చక్రవర్తి ఎందుకు తప్పు అన్న అంశాల జోలికి పోడు. అలా న్యూట్రల్గా అంటే పాత్రల కళ్ళతోనే సమాజాన్ని చుస్తూ రాసినవి, ఇది తప్పు అని ఖచ్చితంగా తేల్చిపారెయ్యకుండా.

  అభివృద్ధి రెండో పార్శ్వం గురించి కొద్దిగా సమయం ఇవ్వండి ఒకటి రెండు రోజులు నేను దీని గురించి వివరంగా రాస్తాను.

  నేను పొలిటికల్గా రాయడం లేదు, ఒక పాఠకుడిగా నాకు ఇది కావాలి అని చెప్తున్నాను, ఇది బ్లాగుల ద్వారా మాత్రమే సాధ్యం అనుకుంటాను 🙂

   • తారా,
    మీరు చెప్పింది అర్ధమైంది.న్యూట్రల్ గా ఉండడమన్నది అన్ని సందర్భాలకూ వర్తించదు కదా.ఒక ఉదాహరణ చెపుతాను చూడండి.మనం ఇదివరకు చర్చించిన దాన్లోంచే తీసుకుందాము….మేము సోంపేట నిజనిర్ధారణకి వెళ్ళినపుడు అక్కడి ప్రజలు ఖచ్చితంగా చెప్పిన మాట యిపుడు ఇక్కడ ఉన్నవి రెండే రెండు పార్టీలు…ఒకటి ప్రజలపార్టీ, రెండు కంపెనీపార్టీ. ఎవరి వైపు ఉండాలో ఎవరైనా తేల్చుకోవాల్సిందేనని అన్నారు…ప్రజల్లో ఆ స్పష్టత ఉన్నపుడు అక్కడ మనం న్యూట్రల్ గా వ్యవహరించేది ఏముంటుంది….అక్కడ మనం తీరిగ్గా….నాగార్జునా కనస్ట్రక్షన్స్ గురించీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రయోజనాల గురించీ మాట్లాడడం అనేది ప్రజాసమస్యల పట్ల మనకున్న నిబద్ధతని ప్రశ్నార్ధకం చేస్తుంది. మనం మాట్లాడినా లేకపోయినా పెట్టుబడిదారీ ప్రయోజనాల రక్షణ కోసం ప్రభుత్వాలూ,చాలా వ్యవస్థలూ,వ్యక్తులూ మాట్లాడుతూనే ఉంటారు… న్యూట్రల్ గా మాట్లాడేవారికంటే నిరంతరం పేద ప్రజల పక్షాన్నే నిలబడి పోరాడే గొంతుల అవసరమే ఇప్పటి సమాజానికి చాలా ఎక్కువ.అభిమానంతో మీరు నా గురించి కొంచెం ఎక్కువ స్థాయిలో ఊహించారు….

    ఇంట్లో కూచుని సామాజిక సమస్యల మీద అనర్ఘళంగా రాయడం అంటే సిగ్గేసి…నాకు వీలైన సందర్భాల్లో మిత్రులతో కలిసి కొన్ని సమస్యల మీద పని చేయడం జరుగుతోంది అంతే…ఇక జాజిమల్లి కతలు ఏవో చిన్ననాటి జ్ఞాపకాలుగానో లేకపోతే మా చిన్నప్పుడు చాలా బావుంది…ఇపుడలా లేదు అన్న కంప్లైంట్ తోనో రాయలేదు…దానికో క్రమం ఉంది. మీరు చెప్పాల్సింది చెప్పేసాక ఈ చర్చ ముగింపులో అది చెప్తాను.

  • తార గారు,

   మీ అభిప్రాయం బాగు౦ది. మన౦ చూడని, చూడలేని అంశాలు మనం చదివి అ౦గీకరిస్తామో లేదో ప్రోత్సహి స్తామో లేదో , అయినా ఇ౦కా వ్రాసేది చాలా ఉ౦ది కదా.(విరామం అనగానే ఇక్కడ టపాలు బాగా తగ్గిపోతాయని నాకయితే అనిపి౦చలేదు) . నేను చాల సార్లు అనుకొన్నాను అస్తిత్వ,విప్లవ భావం అనే జాజి గారు తెల౦గాణ గురి౦చి కాని, మన బ్లాగుల్లో కెలుకుడు గురి౦చి కాని పట్టి౦చుకొన్నట్లే ఉ౦డరే౦టి అని. నిజానికి అవి కూడా చాలా స్పష్టం గా వ్యక్తపరిచారు, నేను చూడలేదు 🙂 ఇ౦కా విచిత్ర౦ ఏ౦టి అ౦టే , సమాధానం కూడా ఎవ్వరు చెప్పలేదు వాటికి .

   న్యూట్రల్ గ చెప్పే అంశానికి న్యూట్రల్ గానే చెపుతారు కదా. మీరు అడిగేవి వ్రాస్తే చదవాలని ఇక్కడ అ౦దరికీ కుతూహలమ్ ఉ౦టు౦ది(శ్రమ మనది కాదుగా అని అనను) . కాని వ్రాసిన వాటిని మీరు మాత్రం ఎ౦తవరకు న్యూట్రల్ గా చూడగలరు ? మనం చూడము. చివరికి ‘టై౦ పాస్’ టపా లకు ఇచ్చిన పాటి విలువ కూడా ఇవ్వము . విలువ ఇవ్వడం అ౦టే బాగు౦ది అని నచ్చిన టపాకు వ్యాఖ్య వ్రాయడమన్నది నా ఉద్దేశ్యం కాదు.

   • మౌళీ,
    మీరడిగింది మంచి ప్రశ్న…న్యూట్రల్ గా రాయడం సంగతి సరే..రాసినదాన్ని న్యూట్రల్ గా మనం చూడగలమా అన్నది…
    ఇక మిగతా బ్లాగ్స్ లో చర్చల్లో నేను ఎపుడూ పాల్గొనలేదు. సమయం ఎక్కువగా ఉండదు అది ప్రధాన కారణం. అంతే కాకుండా కొన్ని బ్లాగ్స్ లో మనుషులు స్పష్టం కాకుండా ముసుగులో ఉండే అజ్ఞాత వ్యాఖ్యలు కొన్ని అసభ్యంగానూ కుసంస్కారంతోనూ ఉండడం నేను గమనించాను…అలాంటి చోట్ల సమయం వృధా తప్ప మనం నేర్చుకోగలిగింది ఏమీ ఉండదు.

   • >>మీరు చెప్పింది అర్ధమైంది.న్యూట్రల్ గా ఉండడమన్నది అన్ని సందర్భాలకూ వర్తించదు
    ___

    అమ్మ నవలతో పోల్చండి, రచయిత అక్కడ ఎవరి పక్షంలో ఉన్నాడు?
    నేనంటున్నది పోరాటం గురించి రాయండి, ప్రజలతరపునే రాయండి, అంతే తప్ప సమస్యని మీ(రచయిత) సొంత కోణం నుంచి కాదు

    >>నాగార్జునా కనస్ట్రక్షన్స్ గురించీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రయోజనాల గురించీ మాట్లాడడం అనేది

    అక్కడ అసలు కంపెనీ గురించి, పవర్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావన అనవసరం, అక్కడ అసలు విషయం “ప్రజలలో అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది?”, మీరు నిజాయితీగా ప్రజల కోణం ఆవిష్కరిస్తే, జరిగిన తప్పులేమిటి, అవి మళ్ళీ జరగకుండా ఏమి చెయ్యాలి, ప్రభుత్వం పాత్ర ఏమిటీ అన్నది ఒక అలోచన చేయొచ్చు.

    నేను చెప్పేది ఏమిటంటే, ఒక వ్యక్తి జీవితం, తీసుకున్న నిర్ణయాల గురించి రాస్తున్నప్పుడు, అతను అవి ఎందుకు తీసుకున్నాడో, అతని జీవన స్థితిగతులు ఏమిటో అతని కళ్ళతోనే చూపించండి, తప్పొప్పులు సంగతి కుడా అతని మాటల్లోనే, అంతే తప్ప రచయితలు తాము అనుకున్న తప్పొప్పుల కోణంలో ఆ వ్యక్తిని చూడొద్దు అని.

    సోం పేట్ గురించే వస్తే, కొందరు కమ్యూనిష్ట్‌లు, వెళ్ళి వచ్చి సమావేశం జరిపారు, ఒక్కరు కుడా న్యూట్రల్ వాయిస్‌లో చెప్పలేదు, అంటే ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అని, ఎంతకీ ఇది కేవలం పెట్టుబడి దారులు కుట్ర, ప్రజా విప్లవం, అసలు పవర్ ప్లాంట్లని నిషేధించాలి అని మొదలు పెట్టి డిల్లీలో ఉన్న గీజర్లని కుడా నిషేదించాలి అని తేల్చారు, అదే కంపెనీ వాళ్ళూ? నక్సల్స్ పాత్ర ఉన్నది, మాకు సెక్యూరిటీ పెంచండి అని వినతులు, అసలు ఎవరూ ప్రజల అనుమానాలు ఏమిటీ, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అవి కేవలం అపోహలు ఐతే మెల్లగా చెప్పి అపోహలని దూరం చేయొచ్చునుగా లేదు అవి నిజాలే ఐతే చట్టరిత్యా తప్పులు చేసిన అధికారుల మీద, రాజకీయవేత్తల మీద చర్యలు తీసుకోవాలి అన్నది ఆలోచించలేదు, ఇంత జరిగినా అసలు ప్రజల మృతికి ఎవరు భాద్యత తీసుకున్నారు? ఎవరికైన శిక్ష పడిందా?

    ఉద్యమం జరిగింది , ఏదో ఒకటి అయ్యింది, మరి ప్రజలని చచ్చిపోవడానికి ఎవరు కారణం? వారికి ఏమి శిక్షపడింది? అసలు ప్రజల్లో అంత అసహనం ఎందుకు పెరిగింది అన్నది వారి మాటల్లో, ఆ తరువాత వాళ్ళ జీవితాలు ఏమైనా మెరుగుపడ్డాయా?

    ఇది అలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా నీరోధించడానికి అత్యవసరం, కానీ ఏ రచయితా వీటి గురంచి రాశారు చెప్పండి?

    విశ్లేషణలు మాత్రం కోకొల్లలు, కానీ ప్రతి విశ్లేషణలో ఎదో ఒక సిధ్ధాంతం, ఏదో ఒక స్వార్ధం కనిపిస్తూనే ఉంటుంది.

    >>
    న్యూట్రల్ గా మాట్లాడేవారికంటే నిరంతరం పేద ప్రజల పక్షాన్నే నిలబడి పోరాడే గొంతుల అవసరమే ఇప్పటి సమాజానికి చాలా ఎక్కువ.
    >>

    నేను చెబుతున్న న్యూట్రల్ మీకు అర్ధం కాలేదనుకుంటాను,
    అన్యాయం జరిగింది అనుకోవడం వేరు, అన్యాయం జరగడం వేరు, మీరు ఒక కొలమానం పెట్టుకుని, ఆ ఫ్రేం వర్క్‌లో లేనివి అన్నీ అన్యాయాలు అని తేల్చొద్దు అంటున్నా, సోం పేట కి వస్తే అక్కడ కొన్ని ప్రాణాలు పోయాయి, దాన్ని అన్యాయం అని అనకుండా ఎలా అంటాం? అక్కడ అన్యాయం కనిపిస్తున్నది.

    అలా కాకుండా, పాల ఫ్యాక్టరీలు పశువుల కాపర్లని దొచుకుంటున్నాయి అంటేనే తేడా వస్తుంది, ఎందుకంటే అసలు అక్కడ పాలు అందజేసేవారు ఈ ఫ్యాక్టరీ మాకేదో తీరని నష్టం చేకూరుస్తున్నది అని అనుకుంటున్నారా, లేదా మీరు ఆ భావలనలో ఉన్నారా? పాల ఫ్యాక్టరీ అన్నది అక్కడ అందరికీ లాభం కలిగించాలి, మీరు అక్కడ ఆ లాభం చూడకపోవడం మీ తప్పు, కానీ నిజంగా అందరికీ నష్టం కలిగిస్తుంటే అది ఫ్యాక్టరీ తప్పు, దాన్ని సరిదిద్దాలి, చట్టం ద్వారా, అలా కాకుండా అసలు ఆ వ్యవస్థ మీకు నచ్చక అంతా దోపిడీ అంటే అక్కడ మీ tone న్యూట్రల్ అవదు, ప్రజల పక్షం అని మీరు అనుకున్నా, అది నిజంగా ప్రజా పక్షం అవదు.,

    “ఉన్న వ్యవస్థని ప్రజలే మార్చుకున్నారా, లేద బలవంతంగా రుద్దబడిండా? ప్రజలే ఆ వ్యవస్థని ఎన్నుకుంటే అది తప్పు అని మీరు ఎలా చెబుతారు? ”

    లేదా బలవంతంగా రుద్దబడితే అది తప్పే, ఇక్కడ మీరు బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నారు, అక్కడ రెండు వైపులా అలోచించాల్సిన పని లేదు.

    అంతే తప్ప, మీ ఫ్రేం వర్క్లో లేనివి అన్నీ తప్పులే, అవి ప్రజలు కుడా గమనించలేక పోతున్నారు అన్న ఉద్దేశంతో ఉండొద్దు అంటున్నా, ఇక వ్యక్తిగా మీకు నచ్చని అంశాల గురించి, వాటివలన వచ్చే నష్టాలు ఇవి అని మీరు అనుకుంటే అవి వ్యక్తి కోణంలోనే రాయండి, దాన్ని ప్రజలకి అన్వయించొద్ద

    >>మీరు చెప్పాల్సింది చెప్పేసాక ఈ చర్చ ముగింపులో అది చెప్తాను.
    >>అభిమానంతో మీరు నా గురించి కొంచెం ఎక్కువ స్థాయిలో ఊహించారు….

    నేను ఇక్కడ చర్చించడం లేదు, నా రిక్వర్మెంట్స్ చెబుతున్నాను (అవి నావో లేదా, నాలాంటి పాఠకులు ఇంకా చాలా మంది ఉన్నారో లేదో నాకు తెలియదు, కొందరి మాటలని బట్టి ఉన్నారేమో అనే అనుకుంటున్నాను), ఇక కొద్దిగా నా సలహాలు కొన్ని.

    మీరు అలా రాస్తారో రాయరో అది మీ ఇష్టం, కానీ సో కాల్డ్ పెట్టుబడి దారుల దోపిడీ, వగైరా వగైరా మూసలో కొట్టుకుపోయే రచనలు మాత్రం మీరు కుడా రాయొద్దు/ మొదలెట్టొద్దు అని ఒక విన్నపం. (నాకు అలా ఎందుకు అనిపించిందో మీకు చెప్పనే లేదు కదా, అది రాత్రికో,రేపు పొద్దున చెబుతాను.)

    ఇవి నా సూచనలు, సలహాలు, కోరికలు మాత్రమే, చర్చ కాదు.
    నేను ఏమి చదవాలి అనుకుంటున్నానో చెబుతున్నాను అంతే, అవి మీరు అందిస్తే ఆనందిస్తాను, లేదా ఏమీ లేదు.
    నా ఉద్దేశంలో న్యూట్రల్ అంటే ప్రజల గొంతుతో, రచయిత గొంతుతో కాదు అని.

 13. I use English for faster typing,

  I tried to find your post on Heritage Milk couldn’t locate it, anyway I explain why a 3rd party milk distribution may be necessary.

  Take for example, bigger city and a small village 10kms away from that city, say some X has 2 cows and gets some 10 lit milk a day, and price of the milk is 20rs/lit if he gives to diary and 30rs if he delivers to home.

  What about the costs, he might need 1/2 liter petrol every day to deliver milk, which costs him 35rs, and he spends 2.5hrs to 3hrs a day to deliver milk, so what will be his income, 300 – 40 = 260 rs a day(5rs depreciation), what about off season like summer, the milk production will decrease considerably, so it will be about 110rs? More over say, one day the cow gives 11lit and another day 8 lit, what about wastage and loss? Say there is severe rains for some 10days every year, again lot of milk will be wasted, means loss to him.

  Say there is a milk collection center, and he gets 200 and 100 resp. the loss is 60rs and 10rs, but there is advantage, he got 2.5 more hours to spend, so, infact he can invest in another cow, and can get additional income of 100 and 50rs, so, with the aid of a dairy he can increase his income.

  Other advantages, he can completely discard milk distribution as his primary job, as he no longer need to look after customers and worry about fluctuations in milk.

  Investment on petrol will increase significantly with increase in population, distance to customers,traffic, he won’t be effected with climate.

  What about customers, they wont be effected with milk price much, more over they can get what ever quantity they want, more or less with out any problem, and important thing is quality and variety. (toned, double toned,..). Quality is a major concern, you can see this is the reason why people in villages also moving towards pasteurized milk instead of local vendor.

  So, how it effects common man, simple, as secondary source of income, he can use cows, either 1 or 2 or 10, it doesnt matter, the dairy will take what ever he produce, and there is no need to worry about selling, he no longer needs any middle person to buy his milk, this adds to his income.

  So, a specialized agency collection and distribution creates employment, more income and also scope for better quality (as dairies often invest on R&D for better production, better health and better feeding habits).

  No one is a loser here, its a win win situation.

  There is no theft or dopidi, its just outsourcing some part of work.

 14. Okay, now if it comes to Telangana issue,

  Supporting Telangana or rejecting it may be its your view, I dont object, I dont object some one blames Pak for local MLA’s odd behavior I dont mind, but my objection comes when you say, that is for common man or thats people voice.

  As a writer, if you support one claim you need to verify people woes, first of all you need to clear other section doubts, like, my doubts are,

  ప్రత్యేక ఆంధ్ర ఇస్తే, రాజధానికి అయ్యే ఖర్చు ఎక్కడ నుంచి వస్తుంది? సామాన్యుడే పన్ను కట్టాలి, ఉప్పు, పప్పు, కారం, సబ్బు, ప్రతిదానిమీద పన్ను పెరుగుతుంది, అది ఎవరికి తగులుతుంది, సామాన్యుడికేగా?, ఇక, కోస్తాలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా, రియల్ ఎస్టేట్ కోసం పంట పొలాలని ప్లాట్లుగా మార్చాసిందే, కనీసం ఒక జిల్లాలో ఐనా దాదాపుగా 80% పైగా వరి పొలాలు మాయం అవుతాయి, మరి, తగ్గే వరి ఉత్పత్తి ఎవరికి తగులుతుండి? బియ్యం కే.జీ. వంద ఐతే నష్టం ఎవరికి? రెక్కాడితే తప్ప డొక్కాడని పేదోడికే బాగా తగులుతుంది, ఇక తెనాలి లాంటి చిన్న టౌన్లలోనే ఎకరా మూడు కోట్లకి తక్కువలేదు, తెలంగాణా ఇస్తే అవి 20-30 కోట్లు అవుతాయి, మరి చిన్న మధ్య పరిశ్రమల సంగతి ఏమిటీ? అవి అన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? ఇతర రాష్ట్రలకి తరలి పోతే, మరి భూమి లేని పేదోళ్ళ సంగతి ఏమిటీ? మధ్య తరగతికి ఇళ్ళు కొనాలి అంటే కోట్లు పొయ్యాలేమో (అధమం చిన్న సైజు అపార్ట్‌మెంట్ 25 లక్షలకి తక్కువకి లేదు ఇప్పుడే), అద్దెలు సంగతి? హైదరాబాదుకి సరి సమానంగా ఉన్నాయి, ఇవి అన్నీ డబున్నోలకన్నా పేద, మధ్యతరగతి, జనాలకే కదండి దెబ్బ, అటు తెలంగాణా ప్రజలకి ఐనా అంతే దెబ్బ, ఇక తెలంగాణా వస్తే ఈ సమస్యలు తీరుతాయి అన్నవి అమలు సాధ్యమేనా అన్న అనుమానాలు మొదలెడితే..

  ఇది చూడండి, http://asainskaburlu.blogspot.com/2010/09/blog-post_27.html

  మరి ఇవి అన్నీ సామాన్య ప్రజాలకి తగిలే దెబ్బలే, మరి మీరు నేను సామాన్య ప్రజల పక్షమే అంటే నేను ఎలా నమ్మేది?

  ఇక న్యూట్రల్ టోన్ కి వస్తే, మీరు తెలంగాణాకి మద్దతుగా రాసే ముందు, మరి ఇవి అన్నీ ఆలోచించి, వీటిని ఎలా అధిగమించాలి అన్నది సరైన సాక్ష్యాధారాలతో రూఢీ చేసుకున్నారా? అన్నీ మరి సవివరంగా తెలంగాణా వ్యతిరేకించే వారితో చర్చించారా? మీరు తప్పు ఐతే మరి దాన్ని సరిదిద్దుకున్నారా?

  గిదంతా మాకు తెల్వద్ మా తెలంగాణా మాకు కావాలె, లేదా ఇవి అన్నీ పెట్టుబడిదారుల కుట్ర అంటే అది న్యూట్రల్ వాయిస్ అవదు.

  ప్రజలు ఇది కావాలి అనుకుంటున్నారు అన్నది న్యూట్రల్, ప్రజలకిదే ఇవ్వాలి అనడం న్యూట్రల్ కాదు.

  ______

  నేను ఇది ఉదాహరణకి చెప్పాను, తప్ప, ఇక్కడ తెలంగాణా గురించి చర్చ కోసం మాత్రం కాదు, ఆ విధంగా ఏమైనా కామెంట్స్ వస్తే అనుమతించ వద్దని మనవి, మీరు అనుమతించినా నేను తిరిగి స్పందించను.

  సో, నేను చెప్పేది, హెరిటేజ్ ని వ్యతిరేకించడమో, తెలంగాణాకి మద్దతు ఇవ్వడమో అవి ప్రజల పక్షం కాకపోవచ్చు, మీరు అలా చెయ్యడం వలన ఆ సామాన్య ప్రజలకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందేమో.

  రచయితగా మీరు తెలంగాణా ఉద్యమం ఎందుకు వచ్చింది అన్నది ప్రజల గొంతుతో రాస్తే, అప్పుడు తెలంగాణా ఇవ్వడమే పరిష్కారమో కాదో, లేదా ఇతరాత్రావి అందరూ చర్చించొచ్చు.

 15. So, thats it.

  My comments might sound confusing, but I what I tried to say is, if you look for solutions it may not be accurate, some times you stance may do more loss instead of achieving any thing, but if you present situation as it is, then I will aid to find better solution. So, as person, be open to contradictions, but as a write you should be (you in the sense one, I just generalized that here, I am not saying you in specific) express your opinions if people feel that so.

  In my experience I never found such a writer, but there is lot of necessity for such works.

  Taara

  • తారా…
   ఇంత ఓపికగా మీరు మీ వాయిస్ చెప్పినందుకు ముందుగా అభినందనలు…మీరు చెప్పిన అంశాలలో రెండు మూడు తప్ప మిగతావి అన్నీ చర్చ లేకుండా అంగీకరించేవి కాదు. మౌలికంగా నా దృక్పధంతో ( సిద్ధాంతాలు కావు) విభేదించే అంశాలు కూడా కొన్ని మీరు ప్రస్తావించారు… కానీ ” ఇవి నా సూచనలు, సలహాలు, కోరికలు మాత్రమే, చర్చ కాదు.
   నేను ఏమి చదవాలి అనుకుంటున్నానో చెబుతున్నాను అంతే, అవి మీరు అందిస్తే ఆనందిస్తాను, లేదా ఏమీ లేదు.” అన్నారు మీరు…పాఠకుడిగా మీకేం కావాలో మీరు స్పష్టంగా చెప్పడం మంచి విషయం….అట్లా రాయగలిగిన రచయితలు అందుకుంటారు…లేని వాళ్ళు లేదు…మీరు చెప్పదల్చుకున్నారు…మీరేం చెప్పాలనుకున్నారో నేను వినదల్చుకున్నాను…జరిగింది అంతే…కృతజ్ఞతలు తారా…

   • Discussion tends to be more technical, so, I choose to refrain from it, but if you wish to learn about some thing in specific I can suggest you some good books, but most of times, it turns to be mathematical.

    And of all, I asked you to consider my request too.

    Happy publishing.

 16. తార,

  కృష్ణవేణి తీరం బ్లాగులో నన్నేదో అడిగారు, ఇప్పటివరకు చూడలేదు. అదే౦టొ కాస్త అర్ధం అయ్యేట్టు చెప్పగలరా , మీరు ఆ బ్లాగులోనే చెప్పవచ్చును.అభ్య౦తరమ్ లేదు

 17. మల్లీశ్వరి గారు మీరు వీడ్కోలిస్తున్నపు మిమ్మల్ని పరిచయం చేసుకున్నాను . కథలు చాల ఆలోచిమ్పచేసుట్లుగా ఉన్నాయి. వ్రాసిన శైలి చాల బావుంది.

  • కృష్ణా…
   విమర్శ అన్న పెద్ద మాట వద్దు…మీ బ్లాగ్ తో మొదటి పరిచయం,మీ బ్లాగ్ పోస్ట్స్ చదివినపుడు నాకు కలిగిన ఫీలింగ్స్ ఇవే రాస్తాను…తప్పకుండా త్వరలోనే….మరి ఎవరూ నన్ను తిట్టకుండా చూడాల్సిన బాధ్యత మీదే…

 18. అభినందనలు
  శ్రీనివాస్ గారి రివ్యూ కూడా బాగుంది.

  మీరడిగిన ఒక ప్రశ్నకి
  నేను కూడా నా బ్లాగులో వ్రాసిన (పత్రికలో అచ్చయిన) కవితలతో “ఆకుపచ్చని తడిగీతం” అనే కవితా సంకలనాన్ని 2009 లో తీసుకొచ్చాను.

  బొల్లోజు బాబా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s