ఈ ఆదివారం ఇంత గొప్పగా మొదలవుతుందనుకోలేదు.
పొద్దున్నే బద్దకం కాకుండా నరనరాల్లో ఇలా ఉరవళ్ళు తొక్కుతున్నదేంటి?
సంతోషమా,దుఃఖమా,ప్రేమా,తపనా,
పరిసరాల్లో ఇలా పరవళ్ళు తీస్తున్నదేంటి?
ఇష్టమా,అద్భుతమా,మైమరుపా,సంతృప్తా
ఇది వసీరా కవిత్వం కాక మరేంటి?
వసీరా కవిత ‘ దుఃఖం ‘
ఎంత మందిని జయించిందో ఏమో
మా చెడ్డ గర్వంగా నా మీదకి లంఘిస్తుంది దుఃఖం
సాచి లెంపకాయ కొడతాను
కళ్ళు తిరిగి నా కాళ్ళ దగ్గర కూలబడుతుంది
దుఃఖం భుజాలు పట్టుకు లేవనెత్తి
కళ్ళలోకి చూసి నవ్వుతాను
అసలే ఉడుకుమోతు
అందుకని దుఃఖం ఒళ్లంతా కితకితలు పెడతాను
అపుడు తడికళ్ళతో పకపకా నవ్వుతుంది
నేనూ దుఖమూ చెట్టాపట్టాలేసుకుని
హోటల్ కి పోయి టీ తాగుతాం
ఒకళ్ళమీదొకళ్ళు జోకులేసుకుంటాం
దుఃఖానికి వీడ్కోలు చెప్తూ అంటాను
మళ్ళీ ప్రయత్నించకేం
నువ్వే ఓడిపోతావు
కానీ సాటివాళ్ళు కష్టాల్లో ఉన్నపుడు
నేను మనిషినని గుర్తు చేయడానికి
తప్పనిసరిగా నా దగ్గరికి రా
నన్ను సాచి లెంపకాయ కొట్టి మనిషిని చెయ్యి
ఆ రోజుల్లో గొప్ప కవిత్వాం రాశారు వసీరా.
కొత్తపాళీ గారూ,
మీరన్నది నిజం.
కాలేజీ రోజుల్లో ఒక కొటేషన్ ని పదే పదే స్లామ్ బుక్స్ లో రాసేవాళ్ళం.
గొప్ప తత్వవేత్త చెప్పినట్లుండే ఆ వాక్యాలు
”కాళ్ళు తడవకుండా
మహాసముద్రాల్ని దాటిన మేధావి కూడా
కళ్ళు తడవకుండా
జీవితాన్ని దాటలేడు”
అని.
చాలా రోజులకి తెలిసింది మన తెలుగు కవి,మనకి తెలిసిన వసీరాయే ఈ కవిత రాసారని.
vaseera…….bodda kurma rao …….inka inka anekulatho KGH dhaggara loni old public library meda meedhi saahitya saayankaalalu, vaatiki entho viluvalanaddhina Raavi saastri gaaruu, appudappudu veechi andharni chuttesina kondagaali Bhushanam gaaroo, padikattu padhaalu vaadakunda marxism elaa cheppochcho cheppina Kaaraa gaaru, madhyala Mahila maargam pathikala ammmakaau… chandhaalu…. chalasaani prasad gaari ….. ninnu narikeyya, ninnu pogulu petta…. laanti prasamsalu……. vaseera ji ….. anthaki koncham mundhu venukaluga SU. RA ( Delhi Subbarao ) speechlu… … anthe sudden ga Balagopal sabhalu….. yes, it’s vizag….. yes…still….
అవును, వసీరా, ఎక్కడున్నావ్? ఎలా వున్నావ్? ఈ కవిత నిన్ను ఎప్పటికీ మరచిపోనివ్వదు నిజంగా! ఇంతకీ నువ్వు దుఖం చెంప మీద చాచి కొట్టావా లేదా?
అఫ్సర్ గారూ,
వసీరా గారిని గట్టిగా అడగండి మళ్ళీ కవిత్వంలో పడమనీ,చాలా మంది మిస్ అవుతున్నామనీ….
http://www.facebook.com/#!/afsarm
check it out! do you’ve vaseeraa’s contact number? i know he is not an email-friendly!
ఉంది. మీకు మెయిల్ చేస్తాను.
alaggalageeea
వసీరా,
మీ ప్రతిస్పందన చాలా సంతోషం..
మాటిచ్చేసారు….ఎదురు చూస్తూ ఉంటాం…
awesome and really a marvelous poem Malli. Thanks a lot for sharing this poem 🙂 too inspiring….u made my night 🙂
అవును కదా సాహిత్యానికి ఉన్న శక్తే అది కదా విజ్జీ
మంత్రదండంలా ఒక్కసారి మనల్ని మార్చేస్తుంది.
అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది.
”కాళ్ళు తడవకుండా
మహాసముద్రాల్ని దాటిన మేధావి కూడా
కళ్ళు తడవకుండా
జీవితాన్ని దాటలేడు”
చాలా బాగుంది కోట్.
శ్రీ,
మీ అభినందనలు వసీరా గారికి తెలియజేస్తాను.
వసీరా గుర్తొచ్చినపుడల్లా దుఖం ముంచుకొస్తుంది. మోతీనగర్ సెంటర్లో ఇరానీ టీ తాగుతూ పలకరించుకున్న రోజులు గుర్తొస్తే నిజంగానే దుఖం
ముంచుకొస్తుంది. గలగలా ప్రవహించిన వసీరా హఠాత్తుగా ఘనీభవించిపోయినపుడు వసీరా.. వసీరా .. అని మిత్రులతో కలిసి పలవరించిన రోజులు గుర్తొస్తే
కూడా దుఖం ముంచుకొస్తుంది. వసీరా ప్రస్తావన వచ్చినపుడల్లా సముద్రపు హోరు వినిపించేది. వుప్పటి సముద్రపు హోరు. యిప్పటికీ అదే హోరు. వసీరా గాఢమూ, నిగూఢమూ అయిన కవి. అచ్చమైన కవి. అద్భుతమైన కవి. సముద్రాన్ని దోసిట్లో పోసినందుకు ధన్యవాదాలు మల్లీశ్వరీ.
కదా ఉమా,
మేమూ ఓ కధకుడిని పదే పదే పలవరిస్తున్నాం,
ఘనీభవించాడని నిశ్చయించుకోడానికి పౌరుషపడి
ఆశగా ఎదురు చూస్తున్నాం.
ఆర్ద్రమైపోయిన మీ హృదయాన్ని చదివాక వసీరా కవిత్వం మీద
ఇంకా ప్రేమ కలిగింది.
దు:ఖం తో వసీరా స్నేహం ఎంత ఉదాత్తంగా ఉంది!మంచి కవిత వినిపించినందుకు ధన్యవాదాలు.
సరదాగా రాస్తున్నాను. సరదాగానే తీసుకోండి!!
మీరు, ఈ ‘వసీరా’ గురించి, ఓ నాలుగు పరిచయ వాక్యాలు రాస్తే, నాలాంటి వెర్రి మొహాలకి కాస్త ఉపయోగకరంగా వుండేది? కవిత్వం గురించి బొత్తిగా పట్టని నాలాంటి వాళ్ళకి, ఈ వసీరా ఎవరో బొత్తిగా తెలియదు. మీ మాటలని బట్టి, వసీరా అన్న వ్యక్తి కవిత్వం రాస్తారని తెలిసింది. మొదట్లో, ‘వసీరా’ అంటే స్త్రీ అనుకున్నాను. కొన్ని కామెంట్లు చదివాక, స్త్రీ కాదు పురుషుడు అని తెలిసింది. ఆయన, ఈ రోజుల్లో కవిత్వం రాయడం లేదని కూడా అర్థం అయింది. ఎందుకో మాత్రం అర్థం కాలేదు. ఎవరి మీదన్నా కోపం వచ్చిందా ఆయనకి?
అంతే కాదు, ఆయన మీకు తెలుసన్నట్టు కూడా అర్థం అయింది, మీ కామెంటు చూసి. మరి, ఆయన్నే, “ఎందుకు కవిత్వం రాయడం లేదూ, ఆవట్టాఁ?” అని అడిగేస్తే పోలా? ఆ జవాబు మాక్కూడా చెప్పొచ్చు కదా?
ఈ సారి, వసీరా రాసే కవిత్వం గురించి ఇంకొంచెం వివరంగా రాయండి.
పాఠకుడు
కవిత ఎలా ఉందో చెప్పలేదు మరి?
కవిత్వం గురించి బొత్తిగా పట్టని నాలాంటి వాళ్ళకి, ఈ వసీరా ఎవరో బొత్తిగా తెలియదు. మీ మాటలని బట్టి, వసీరా అన్న వ్యక్తి కవిత్వం రాస్తారని తెలిసింది. మొదట్లో, ‘వసీరా’ అంటే స్త్రీ అనుకున్నాను. కొన్ని కామెంట్లు చదివాక, స్త్రీ కాదు పురుషుడు అని తెలిసింది. ఆయన, ఈ రోజుల్లో కవిత్వం రాయడం లేదని కూడా అర్థం అయింది. ఎందుకో మాత్రం అర్థం కాలేదు. ఎవరి మీదన్నా కోపం వచ్చిందా ఆయనకి?
:))
dukhanni sachi lempakai kottina kavi tanani sachi lempakai kottamantunnadu ade dukhanni .okarini okaru kottukovadamena kavitvamante!
sorry ,naku kavitvamante emito teliyadu.
ఆమని గారూ,
కొట్టుకోవడం కాదు..అట్లా పదాల నుంచి యధాతధంగా అర్ధం తీస్తే అసలు ఏ కవిత్వమూ నిలవదు.మానవ జీవితం లో భాగమైన దుఃఖం పట్ల మన వైఖరి ఎట్లా ఉండాలో మానవీయకోణంలో పాజిటివ్ గా చెప్పిన మంచి కవిత ఇది.
మల్లీశ్వరి గారూ,
మీరు కోపం తెచ్చుకోనంటే, నెమ్మదిగా అడుగుతాను నా అనుమానాలు. ఆమని గారి లాగే, నాకూ కవిత్వం తెలీదు. కాబట్టి, మీరు మా ‘అజ్ఞానాన్ని’ గుర్తించి, కొంచెం సహనంతో, శాంతంతో కాస్త అర్థం అయ్యేలా జవాబు ఇవ్వండి. దీనర్థం, మీరు ఇప్పటి వరకూ, అసహనంగా, అశాంతంగా వున్నారని కాదు.
ఆమని గారికి మీరు రాసిన జవాబు చదివాను. మీరు, “మానవ జీవితం లో భాగమైన దుఃఖం పట్ల మన వైఖరి ఎట్లా ఉండాలో మానవీయకోణంలో పాజిటివ్ గా చెప్పిన మంచి కవిత ఇది.” అని రాశారు. ఈ మాటలతో అస్సలు పేచీ లేదు. ఈ విషయం అర్థం అయింది కూడా. మీరు, మళ్ళీ, “అట్లా పదాల నుంచి యధాతధంగా అర్ధం తీస్తే అసలు ఏ కవిత్వమూ నిలవదు.” అని కూడా అన్నారు. ఈ మాటలతో నాకు కొంచెం పేజీ. మీరు మళ్ళీ, మళ్ళీ కవిత్వం విషయంలో వున్న నా అజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ వుండాలి. కవిత్వం గురించి తెలియక పోయినా, గొప్పగా అర్థం కాకపోయినా, అప్పుడప్పుడూ, అక్కడక్కడా కవిత్వాన్ని చదువుతూనే వుంటాను. చాలా తక్కువ సార్లు బాగా అర్థం అవుతుంది. పదాల నించి యధాతధంగా అర్థం తీసినా, బాగానే అర్థం వచ్చింది. కాబట్టి, మీరన్నది అస్తమానూ నిజం కాకపోవచ్చు. పదాల నించీ వచ్చే అర్థాన్ని, యధాతధంగా వుంచుతూ, చక్కగా భావాన్ని ప్రస్ఫుటించే కవితలే లేవంటారా, మీరు? కాదు కదా?
ఇక ఆమని గారి మాటల గురించి నా అభిప్రాయం:
ఆమని గారూ, మీరు వెలిబుచ్చిన అనుమానం చదివానండీ. నాకు కూడా కవిత్వం బాగా తెలీదు. నాకు తెలిసినంత వరకూ, మీ అనుమానానికి జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
“దుఃఖం మొదట ఈ కవి దగ్గరకి చాలా గర్వంగా వచ్చింది, లొంగదీసుకుందామని. అంటే, కవికి ఏదో సొంత కష్టం వచ్చిందన్న మాట. కవి దాన్ని సాచి, లెంపకాయ వేశాడు. దాంతో ఆ దుఃఖం కింద పడింది. అప్పుడు, కవి దాన్ని మంచి చేసుకున్నాడు. దానితో స్నేహం చేశాడు. ఆ తర్వాత, “సాటి వాళ్ళు కష్టాల్లో వున్నప్పుడు నా దగ్గరకి రా. నాకు దుఃఖాన్ని కలిగించూ. ఓ లెంప కాయ వేసి నన్ను మనిషిని చెయ్యీ” అని అన్నాడు. అంటే, “నాకు ఏదో కష్టం వస్తే నా దగ్గరకి రాకూ, సాటి వాళ్ళకి కష్టం వస్తేనే నా దగ్గరకి రా” అని చెప్పాడు. బాగుంది కదూ? ఇదీ నాకర్థం అయిన భావం.”
మల్లీశ్వరి గారూ, నేను అర్థం చేసుకున్నది కరెక్టేనా? వసీరా కవిత్వంలో మాటలని యధాతథంగా తీసుకున్నా, సరైన అర్థమే వచ్చింది కదా? నేను రాసిన దాంట్లో తప్పులుంటే, దిద్దండి.
— పాఠకుడు
beautiful
నాగార్జున గారూ,
మీ బ్లాగ్ ఓపెన్ కావడం లేదు.చాలా సార్లు ప్రయత్నించాను.
http://naa-payanam.blogspot.com/
ఇది నా బ్లాగ్ చిరునామా. మరొకసారి ప్రయత్నించి చూస్తారా ! అప్పటికి ఓపెన్ అవకపోతే ఏ బ్రౌజర్ వాడుతున్నారో తెలియజేయండి.
అద్భుతం!!!
వసీరా గారు లోహనది అనేది ఏ కవితా సంకలనం sir స్త్రీవాదం నా