విప్లవ అస్తిత్వ ఉద్యమాలపై కత్తి మహేష్ కుమార్ అభిప్రాయాలు.

ఇప్పటి చారిత్రక సందర్భంలో తెలుగు సాహిత్యంలో విప్లవ అస్తిత్వ ఉద్యమాల ప్రభావాన్ని స్థూలంగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది.విజయాలూ వైఫల్యాలూ పరిమితులను చర్చించుకోవాల్సి ఉంది…కొత్త తరం రచయితలకు విప్లవ అస్తిత్వ ఉద్యమాల పట్ల ఒక నిర్లిప్తత,అనాసక్తి,తిరస్కార దృష్టి కూడా కనపడుతోంది.ఈ అస్పష్ట ,అయోమయ ధోరణిని మీరెలా చూస్తున్నారు?రచయితలు సామాజిక ఉద్యమాలను అర్ధం చేసుకోడానికి సాహిత్య విమర్శ ఏ మేరకు ఉపయోగపడుతుంది?వీటన్నింటి తో పాటు కింది ప్రశ్నావళి లోని ప్రశ్నలకు ఈనాడు చాలా మంది జవాబులు ఆశిస్తున్నారు.

 1 . నేటి సాహిత్య సందర్భాన్ని మీరెట్లా నిర్వచిస్తారు?

 2 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల మధ్యా, అస్తిత్వ ఉద్యమాల్లో వివిధ అస్తిత్వాల మధ్యా –ఐక్యత,ఘర్షణలు ఏ స్థాయిలో ఉన్నాయి?

3 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల విజయాలనూ వైఫల్యాలనూ తెలుగు సాహిత్య విమర్శ సమర్ధవంతంగా ప్రతిఫలించిందా?

 4 . విప్లవ సాహిత్యోద్యమానికి అనుబంధంగా విప్లవ సాహిత్య విమర్శ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వచ్చింది.మరి వివిధ అస్తిత్వ ఉద్యమాలు సొంత సాహిత్య విమర్శను తగినంతగా అభివృద్ధి చేసుకోగలిగాయా?

 5 . విప్లవ ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని చెబుతాయి. అవి అభిప్రాయ భేదాల విషయంలో, విమర్శ విషయంలో ఎంతవరకు ప్రజాస్వామికంగా, సహనంగా ఉండగలిగాయి? ఉన్నాయి ?

6 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల ఉజ్జ్వల దశ కొనసాగుతోందా? ముగిసిందా?

 7 . విప్లవ సాహిత్యోద్యమం నుంచీ అస్తిత్వ ఉద్యమాల వరకూ అన్నింటినీ సమన్వయ పరిచే సమగ్ర ప్రగతి శీల దృక్పధం రూపొందవలసిన అవసరం ఉందా? అటువంటి అవకాశాలు ఉన్నాయా?లేదా ఇప్పటికే ఏర్పడిందా?

ఈ ప్రశ్నావళిని కొందరు తెలుగు బ్లాగర్స్ కి  పంపగా నలుగురు బ్లాగర్స్ స్పందించారు..వారికి నా కృతజ్ఞతలు.

 ఈ ప్రశ్నావళిని ఎవరైనా నింపి తమ అభిప్రాయాలను పంపవచ్చు.ప్రజాస్వామిక చర్చకి వీలుగా ఉన్న వాటిని బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.

మొదటగా ‘పర్ణశాల’ బ్లాగర్ కత్తి మహేష్ కుమార్ గారి స్పందనని పోస్ట్ చేస్తున్నాను.

అజ్ఞాత వ్యాఖ్యలు ఎప్పట్లాగే నా బ్లాగ్ లో అనుమతించబడవు.

 

విప్లవ అస్తిత్వ ఉద్యమాలపై కత్తి మహేష్ కుమార్ అభిప్రాయాలు.

 

 1 . నేటి సాహిత్య సందర్భాన్ని మీరెట్లా నిర్వచిస్తారు?

 

 వివిధ స్వరాల్ని కలుపుకుని సాగుతున్నా, రాబోయే తరానికి మాత్రం దూరంగా జరుగుతోంది తెలుగు సాహిత్యం. ‘నా వీపు నువ్వుగోకు నీ వీపు నేను గోకుతా’లాంటి ఒరవడేతప్ప జనబాహుళ్యానికి దగ్గరగా సాహిత్యాన్ని తీసుకెళ్ళడంలో సాహిత్యకారులూ, సాహితీవేత్తలు, ప్రచురణ కర్తలు, విమర్శకులు విఫలమౌతున్నారు. ఈ ధోరణికి కారణాలు బహుముఖం. అవలంభించాల్సిన విరుగుడులూ అనేకం.

2 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల మధ్యా, అస్తిత్వ ఉద్యమాల్లో వివిధ అస్తిత్వాల మధ్యా –ఐక్యత,ఘర్షణలు ఏ స్థాయిలో ఉన్నాయి?

 

సామాజిక-ఆర్ధిక-సాంస్కృతిక-రాజకీయ-ప్రాంతీయ నేపధ్యాలలో పుట్టిన విప్లవ, అస్తిత్వ ఉద్యమాలు సాహితీరంగంలో చేసిన కృషి ఎవరూ కాదనలేనిది. అణచివేయబడ్డ గొంతుకలు అక్షరాల్ని పట్టి, ఆ అక్షరాలతో తమ కథల్ని,వ్యతల్ని కళ్ళకుట్టి ఎదుటనిలిపి ఉద్యమ స్ఫూర్తిని, జీవనశక్తిని నింపే దిశగా అస్తిత్వ ఉద్యమాల తోడ్పడ్డాయి. తెలుగు సాహిత్యాన్ని “రంగుల”మయం చేసాయి. స్త్రీవాదం, దళితవాదం, తెలంగాణా వాదం లాంటి అన్ని వాదాలూ మొదటగా అణచివేత నేపధ్యంగా ఒక ధిక్కారస్వరంలా మొదలై తమ ఆత్మనిశ్చయ ముద్రల్ని బలంగా చిత్రించి, సమాంతర అస్థిత్వాలుగా ఎదిగాయి. ఈ ఎదుగుదల పరిణామక్రమంలో ఈ అస్తిత్వవాదాలు తమ ఉనికిని కోల్పోకుండా ప్రధానస్రవంతిలోకి మమేకం అవ్వడం సహజంగా జరగాల్సిన పరిణామం, ఉదాహరణకు, దళితవాదం కుల వివక్షతకు నిరసనగా తమ సాధికారక ఉనికిని ఎలుగెత్తి చాటడానికి ఉద్భవించినా, దాని అంతిమ లక్ష్యం సమానత్వాన్ని కాంక్షించి,మార్పుచెందిన సమాజంలో భాగమవడం. జీవితమైనా,సాహిత్యమైనా అదే జరగాలి. అంటే పుట్టుకతో వచ్చిన అస్థిత్వాలను పోగొట్టుకోవడానికి పోరాడి, సాధించి సంపాదించుకున్న వ్యక్తిత్వాల ఆధారంగా నూతన సమాజాన్ని నిర్మించి తమదిగా చేసుకోవడం ఈ ఉద్యమాల లక్ష్యం. కానీ, ప్రస్తుతం అస్తిత్వ ఉద్యమాలు అటువైపు ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపించడం లేదు

3 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల విజయాలనూ వైఫల్యాలనూ తెలుగు సాహిత్య విమర్శ సమర్ధవంతంగా ప్రతిఫలించిందా?

 

 లేదు.

4 . విప్లవ సాహిత్యోద్యమానికి అనుబంధంగా విప్లవ సాహిత్య విమర్శ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వచ్చింది.మరి వివిధ అస్తిత్వ

ఉద్యమాలు సొంత సాహిత్య విమర్శను తగినంతగా అభివృద్ధి చేసుకోగలిగాయా?

 లేదు.

5 . విప్లవ ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని చెబుతాయి. అవి అభిప్రాయ భేదాల విషయంలో,

విమర్శ విషయంలో ఎంతవరకు ప్రజాస్వామికంగా, సహనంగా ఉండగలిగాయి? ఉన్నాయి ?

 

అస్సలు లేవు. విమర్శ పేరుతో అక్కసు, ప్రతి విమర్శలుగా అసహనం మాత్రమే ఎక్కువగా వెల్లివిరుస్తోంది. ఇక ప్రజాస్వామికంగా ఉండటానికి చోటెక్కడ?!

6 . విప్లవ,అస్తిత్వ ఉద్యమాల ఉజ్జ్వల దశ కొనసాగుతోందా? ముగిసిందా?

 

 బహుశా అస్తిత్వ ఉద్యమాల ప్రగతిలో ధిక్కార యుగం ఇంకా అంతమవలేదు. కొన్ని విషయాలలో ఇంకా బలమైన నిరసన,వ్యతిరేకత అవసరం. కానీ, ఇలాంటి అతివాదాలు ధిక్కారం నుంచీ సామరస్యత దిశగా ప్రయాణించాల్సిన అస్తిత్వవాద ఉద్యమాల్ని కేవలం అక్కసు వెళ్ళగక్కే ఉద్యమాలుగా మిగులుస్తాయేమో అన్నది ఆలోచించాల్సిన విషయం. పుట్టుకతో వచ్చిన ascribed, prescribed విలువలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న అస్తిత్వ ఉద్యమాలు, ఆ విలువల్ని ప్రశ్నించడంతో సాహిత్యం మొదలుపెట్టినా, ఒక సాధికారకమైన ప్రత్యామ్న్యాయ విలువల నిర్మాణం దిశగా అడుగులు వేసి సామరస్యతని సృష్టించాలి. ఆ అడుగులు ఆలస్యమవుతున్నాయో లేక దారి తప్పమో అన్నది ఒక్క క్షణం ఆగి తరచిచూసుకోవలసిన సమయం ఇది అనిపిస్తుంది.

7 . విప్లవ సాహిత్యోద్యమం నుంచీ అస్తిత్వ ఉద్యమాల వరకూ అన్నింటినీ సమన్వయ పరిచే సమగ్ర ప్రగతి శీల దృక్పధం

రూపొందవలసిన అవసరం ఉందా? అటువంటి అవకాశాలు ఉన్నాయా?లేదా ఇప్పటికే ఏర్పడిందా?

 

కొంత ప్రగతిశీల ధృక్పధం ఏర్పడిన మాటవాస్తవం. Improvement కి ఇంకా అవకాశం ఉంది.

ప్రకటనలు

10 thoughts on “విప్లవ అస్తిత్వ ఉద్యమాలపై కత్తి మహేష్ కుమార్ అభిప్రాయాలు.

 1. విప్లవ,అస్తిత్వ ఉద్యమాల మీద ముఖాముఖి అన్న ఆలోచన చాల బాగుంది.
  ప్రశ్నలు బాగున్నాయి. కొన్ని చోట్ల జవాబులు ” అవును , కాదు, లేదు” లతో ముగించారు. విప్లవ,అస్తిత్వ ఉద్యమాల మీద ఏ ప్రశ్న అయినా ” అవును, కాదు, లేదు” కి మించిన జవాబుల్నిస్తాయని , మీరు కూడ ఈ విషయంలో “CNN news channel” ఇంటర్వ్యూ లాగ కాకుండ సాహితీ బ్లాగు కాబట్టి మరింత అర్ధవంతమైన సమాధానాలు ప్రచురించడానికి ప్రయత్నిస్తారని , మీ ఈ ప్రయత్నం సఫలమవ్వాలని ఆశిస్తూ
  ఆనంద్

 2. ముఖాముఖి ఇంటర్వ్యూ కాదు ఆనంద్ గారు.. మల్లీశ్వరి గారు ప్రశ్నావళి పంపించి తీసుకున్న అభిప్రాయాలు..
  ప్రస్తుతం విప్లవ సాహిత్యం ఫేడ్ అవుట్ అయిపోయిందని, అస్తిత్వ ఉద్యమాల స్వరం కూడా ఉద్యమ స్థాయిని వీడి వ్యక్తిగత స్థాయికి చేరిపోయాయని ఓ అభిప్రాయం విస్తృతంగా ప్రచారంలో వుంది.. అస్తిత్వ ఉద్యమాలు వెల్లువెత్తడానికి విప్లవ సాహిత్యం, ఉద్యమాలు తోడ్పాటునందించాయి..అస్తిత్వ ఉద్యమాలు అందుకున్న గొంతును తిరిగి విప్లవ సాహిత్య ఉద్యమాలు తమతో కలగలుపుకొని ముందుకు సాగడంలో కొంత వెనకబాటుతనానికి గురయ్యాయన్నది వాస్తవం. ఇందుకు కారణం ఆయా ఉద్యమాల నాయకత్వంలో వున్న ఆయా ధోరణులు, అవగాహనా లోపం అన్నది నా అభిప్రాయం.. గుడ్డుముందా పిల్ల ముందా అన్న రంధ్రాన్వేషణలో పడి కలిసి సాగించాల్సిన పయనాన్ని విడి విడిగా పొడిచేద్దామన్న ధోరణి వలన ప్రజలకు చేరువకాలేకపోయాయి. అస్తిత్వ ఉద్యమ ఉధృతి కాలంలో ప్రజలు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఇంతవరకు తమ విముక్తి సాధనగా అనుకున్న ఉద్యమ బాటను ప్రశ్నార్థకంగా చూడడంతో చాలా వెనకబాటుకు గురయ్యాం. దీనికి బాధ్యత వహించాల్సింది నాయకత్వమే.. ఈ అయోమయాన్ని కార్పొరేట్ వర్గం, రాజ్యం తమకనుకూలంగా మలచుకొని తీవ్ర నిర్బంధాన్ని అమలుచేస్తూ ఒకవైపు సైద్ధాంతిక గందరగోళాన్ని సృష్టించడంలో సఫలీకృతులయ్యారు.. కెరీరిజమే ఏకైక ఇజంగా మిగల్చడంలో మన ceo లుగా మారిన పాలకులు, మీడియా తమ కృషిని సాగించాయి. దీనికి ప్రధాన కారణం ప్రజా సంఘాల పాత్ర తగ్గడం, ఉద్యమం ప్రజలకు దూరంగా జరుగుతోందన్న అభిప్రాయాన్ని బలంగా ప్రచారం చేయడంలో పాలక వర్గం సక్సెస్ కావడం, అమ్ముడు పోయిన మేధావి వర్గం కారణాలు.. కానీ ఇవన్నీ అంటని నందిగ్రాం, లాల్ ఘడ్, సోంపేట, కాకరాపల్లిలు చరిత్రను ముందుకు నడుపుతూనే వున్నాయి..

 3. @ కెరీరిజమే ఏకైక ఇజంగా మిగల్చడంలో మన ceo లుగా మారిన పాలకులు, మీడియా తమ కృషిని సాగించాయి

  సామాన్యుడు గారు మన్ని౦చాలి , ఒకరిని బాధ్యులను చేయడ౦ సరి అయినదని అ౦టారా. వారు కాకపొతే ఇ౦కొకరు, కాని ఈ మార్పులు అనివార్యమైనవి కావా?

  • బాధ్యులని చేయడం గురించి అంటారా మీరు నేను చంద్రబాబును దృష్టిలో పెట్టుకొని రాసాననుకొని అన్నట్లున్నారు.. కానీ అది మొత్తం పాలకవర్గమే అలా మారిపోయింది.. they are the puppets in the hands of imperialists..వాళ్ళు ఎలా చెపితే అలా ఆడాలి, పాడాలి లేకపోతే అబోటాబాద్ లు రెపీట్ అవుతూనే వుంటాయి….

 4. మల్లీశ్వరి గారు,నాదొక సలహా మీరు అడక్కుండానే, ఈ అస్తిత్వ,దళిత,విప్లవ,స్త్రీ ఇలా వీటి గురించి క్లుప్తంగా మీరు వివరించి తర్వాత ఈ ప్రశ్నావళి సమాధానాలతో ప్రచురిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం.ఎందుకంటే నాతో సహా ఇక్కడ చాలామంది బ్లాగర్లు,బ్లాగు పాఠకులకు వాటి గురించి దాదాపు యేమీ తెలీదు.

  • రాజేంద్ర గారూ,
   విప్లవ,అస్తిత్వ ఉద్యమాల గురించి అవగాహన,పరిచయం ఉన్న బ్లాగర్స్ ని ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టాను…ఇపుడు నేను వివరించినా అసలు పరిచయం లేని వాళ్ళు ప్రశ్నలని అందుకోలేకపోవచ్చు.అదీకాక పై ఉద్యమాలను ‘క్లుప్తంగా’ వివరించడంలో చాలా సమస్యలు ఉన్నాయి.

 5. సామాన్యుడుగారు,

  మీరు ప్రత్యేకం గా ఒకరి గురి౦చి అన్నట్లు భావి౦చలేద౦డీ .

  పరిస్థితి, సమస్య లేదా స౦దర్భ౦ లో ను౦డి సాహిత్య౦ వస్తు౦ది కాని, పలానా వారు బాధ్యులు అవ్వరు అని నా అభిప్రాయ౦

 6. మహేష్ గారు

  @విమర్శ పేరుతో అక్కసు, ప్రతి విమర్శలుగా అసహనం మాత్రమే ఎక్కువగా వెల్లివిరుస్తోంది. ఇక ప్రజాస్వామికంగా ఉండటానికి చోటెక్కడ?!

  అవి లేకపోతే వుద్యమ అవసరమే లేదు కద౦డీ. నిజమయిన వుద్యమ౦ పరిస్తితులను దాటి పోరాడడానికి సిద్దమ్ గా ఉ౦డాలికాని, అక్కసు అసహన౦ వల్ల నే నీరుకారి పోతే తప్పు విమర్శకులదా.బలవ౦తులు బలహీనులను ఆదరి౦చే పరిస్థితి ఇప్పటి పోటీ ప్రప౦చ౦లొ తక్కువ.

  కాబట్టీ అభిప్రాయ భేదాల విషయంలో, విమర్శ విషయంలో ఇ౦కొ౦త ఎక్కువ ప్రజాస్వామికంగా, సహనంగా ఉండగలిగే విధ౦గా వుద్యమాలను పటిష్ట౦ చేసుకోవాలి. కాద౦టారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s