విష్ణుప్రియకో ప్రేమలేఖ.

విష్ణూ,
బావున్నావా?
చాలా రోజులైంది కదా మనం ఉత్తరాలు రాసుకుని…నిన్న ఒక పుస్తకం చదివాక నాకూ ఉత్తరం రాయాలనిపించింది…ఎవరికి రాయాలి?…ఇదొక పెద్ద ప్రశ్న.ఒకప్పటిలా ఇపుడు ఉత్తరం అత్యవసరం కాదు కదా….కాలాన్నీ,హృదయాన్నీ,ఖర్చు పెట్టి చేసే విలువైన వ్యక్తీకరణ కదా…నీ చెంత చేరిన ఉత్తరాన్ని చూసీ చూడనట్టు ఓరకంటితో చూస్తే ఊరుకుంటుందా?అలవోకగా చదివి విసిరేస్తే ఒప్పుకుంటుందా?
 
నా ఆలోచనల్ని,అనుభూతుల్ని,సంతోష దుఃఖాల్నీ…అంతెందుకు ….నా హృదయాన్నే తన రెక్కలకు కట్టుకుని వచ్చి నీ ఒళ్లో వాలే గువ్వపిట్ట కదా ఉత్తరం!!….ఆ గువ్వని లాలిస్తావనీ,ముద్దు చేస్తావనీ,అది మోసుకొచ్చిన హృదయాన్ని హత్తుకుని అక్కడ పుట్టిన ప్రేమని మళ్ళీ నాకు పంపుతావనేగా నీకు  ఉత్తరం రాయడం…..
 
‘ఆ పిల్ల పేరు తలిస్తే చాలు…నీ మొహంలో వెయ్యి మతాబాల వెలుగు కనిపిస్తుంది’ అంటాడు చందు….’వెయ్యి మతాబాలెందుకు ఒక్క నిండు చందురుడి వెన్నెల విరగ కాస్తే చాలదా?’ అంటాను నేను….
 
ఆ పిల్లవి నువ్వే….
 
నువ్వంటే… నీ ఆకర్షణ అంటే….మన తొలి పరిచయమే….ఆ రోజు తిరుపతిలో అంత గొప్ప గొప్ప మర్యాదస్తులైన రచయితల మధ్యలోకి అమీర్ లాగా  దూసుకొచ్చి  నన్ను రాజేశ్వరిని చేసావు కదా!!! నీ స్కూటీయే మనకి రెక్కల గుర్రమైంది.మనిద్దరినీ మోసుకు పోయి ఎయిర్ బైపాస్ రోడ్డులోని స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా మెట్ల మీద దింపింది…అపుడే కదా ఆ మెట్లని మైదానంలా మలిచి…అరగంటని  సెకండ్లతో సహా కొలిచి….మన మధ్య ఉన్న అపరిచయాన్ని తరిమి తరిమి కొట్టాం…..
 
మనం రాసుకున్న తొలి ఉత్తరాలు గుర్తున్నాయా?అందులో మనం రచించిన పధకాలు గుర్తున్నాయా? తిరుపతి నుంచి నువ్వూ,విశాఖ నుంచి నేనూ బయల్దేరి మనకెవ్వరూ తెలీని విజయవాడ  వీధుల్లో చెట్టపట్టాల్ వేసుకుని ఓ రోజంతటినీ బతికించాలనుకోవడం గుర్తుందా? సంవత్సరానికి రెండుమూడు సార్లు వేదిక మీటింగుల్లో కలిసినపుడు అటు బాధ్యత ఇటు స్నేహం మధ్య పరుగులు తీస్తూ కోర కోర చూపుల్ని, దోర దోర నవ్వులతో విసిరి కొట్టడం గుర్తొస్తోందా?
 
ఫోన్ చేసినపుడల్లా ‘ఎట్లున్నవ్ మల్లీ?’ అంటావు మృదువుగా….
 
ఎలా ఉంటాం?? నువ్వైనా,నేనైనా,అసలెవరమైనా ఎలా ఉంటాం?…..
 
చెప్పాపెట్టాకుండా ఊరెళ్ళిపోయిన అమ్మ కోసం బెంగపడే అయిదారేళ్ళ పసిపిల్లల్లా ఉంటాం….
ఒక చేత్తో సునామీని, ఇంకోచేత్తో  భూకంపాన్నీ  పట్టుకుని కదం తొక్కే మా ఉత్తరాంధ్ర మహిళల్లా ఉంటాం….
పొగరెక్కి చుక్కల్ని కాళ్ళతో తన్నబోయి పట్టుతప్పి చంద్రవంక ఊయల నుంచి జారి పడిన నిస్సహాయుల్లా ఉంటాం….
పువ్వుల్నీ,పిల్లల్నీ,వెన్నెలనీ,వేకువనీ…చాటుగా తెంపి కలలసంచుల్లో దాచుకునే అమాయకపు దొంగల్లా ఉంటాం….
 
కదా….
 
ఇన్నింటి మధ్యా…నా కోసం నువ్వులా, నీ కోసం నేనులా ఉండి ఎన్నాళ్ళయిందో కదా….
అందుకే…నువ్వూ,నేనూ కొంచెం కొంచెం కాలవిత్తుల్ని పొదుపు చేద్దాం…అవకాశాల వానలు కురవగానే నాటుదాం….
మార్చ్ 29 నాటికి  చిన్న ఆశల మొలకైనా రాదా…మనిద్దరం దాని నీడన కూచుని వూసులాడుకోడానికి…..
 
ప్రేమతో…..
నీ 
మల్లి. 
 
( విదేహ
 ప్రేమలేఖలు …అన్న పుస్తకం చదివాక ). 
ప్రకటనలు

12 thoughts on “విష్ణుప్రియకో ప్రేమలేఖ.

 1. మల్లీ
  పోస్ట్ చదివి నిశ్శబ్దంగా కూచుండిపోయాను. మంచి హృదయాలతో స్నేహం ఎంత అందంగా , ఆనందంగా ఉంటుందో తలచుకుంటే బీచ్ ఒడ్డున అల ఒక్కసారి మృదువుగా తాకినట్టనిపించింది. నువ్వు అమ్మ చనిపోయినప్పుడు రాసిన పోస్ట్ కళ్ళముందు మెదిలింది. మనసులోని భావాలన్నింటినీ సున్నితంగా , హత్తుకునేలా చెప్పటం చాలా గొప్ప విషయం, అంతే కాదు అప్పుడు తమ్ముడు ఇంకా ఎవరైనా అమ్మ గురించి రాసారా అని ఆత్రుతగా అడిగినప్పుడు మనసు లో లోపలే చాలా కదిలిపోయాను.
  నీవు అమ్మ గురించి నా వెతుకులాట చాల సెన్సిబుల్ గా రాసినందుకు , అలాగే ఆ పోస్ట్ కి తమ అభిప్రాయాలు తెలియచేయటం ద్వారా నా దుఖాన్ని పంచుకొన్న అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకున్నా.

  ప్రేమ చాలా అందమైనది , అపురూపమైనది అది మనస్ఫూర్తిగా పంచుకుంటే అంతకన్నా కావల్సిందేముంది , అలా మనస్ఫూర్తిగా పంచుకునే ఆవకాశం చాలా అరుదుగా వస్తుంది. విష్ణు మీద కుళ్ళు పుట్టలేదు కానీ నాక్కూడా ఒకటోస్తే అనుకుంటే చింతకాయ కోరికనప్పుడులాగ ఝల్లుమంది.
  బావుంది మల్లీ
  ఆనంద్

  • విజ్జీ,
   హెప్సీ,
   కుమార్ గారూ థాంక్ యూ
   ఆనంద్…ఏం చెప్పను ఇక?
   లావణ్యా నాతో ఇలాంటి లేఖ రాయించగలిగిన ఆ అమ్మాయి స్నేహం
   దొరికినందుకు నేనే అదృష్ట వంతురాలిని.

 2. జాజిమల్లి గారు,

  మీరు టపా చదవడ౦ మొదలెట్ట గా నా బాగా తియ్య గా అనిపి౦చి౦ది అ౦డి. ఇక చదవలేకపోయాను..కాని ఆ మొదటి నాలుగు లైనులు చదివిన తియ్యని భావమే ఇ౦కా మనసు ను౦డి పోవడ౦ లేదు. ఇక ఎ౦దుకు చదవలేదు అ౦టారా.

  నాకు స్వీటు అయిష్ట౦ కాదు కాని. పెద్దగా తినలేను. 😦

  పెద్ద ఇబ్బ౦ది పెట్టారు. అప్పుడప్పుడు మాత్రమే మీరు ఇలా౦టి టపాలు వ్రాయాలి 🙂

 3. మేడంజి! మనిషి సంతోషానికి భావుకత్వము ఎంత అవుసరమో మీ లేఖ ద్వారా తెలిసిపోయింది .రెండు మనస్సులు పెనవేసుకున్నప్పుడు అవి అస్తిత్వాన్ని కోల్పోయి అలౌకిక ఆనందాన్ని పొందటము మీ లేఖలో చూశాను .అడవిపూల పరిమళాన్ని ,పుట్టతేనె తియ్యదనాన్ని ,కోయిల నాదాన్ని ,అన్నిటినీ మించిన మెత్తనైన మీ మనస్సును ఈ లేఖ ప్రతిభింబించిందంటె అతిశయోక్తి లేదు .ఎవరో అన్నట్లు ‘మనము మనలాగా ఎవరి దగ్గర వుండగలమో వారే మన నిజమైన స్నేహితులు ‘. సో … as asual

  • మౌళీ,
   మీ కామెంట్స్ వెరైటీగా ఉంటాయి…పొగుడుతున్నారో,తిడుతున్నారో తెలీకుండా…
   మొత్తానికి నాలుగు లైన్లైనా చదివినందుకు సంతోషమే…
   వంశీ గారూ,
   మరి ఈ సారి విష్ణు మీకెపుడైనా కలిస్తే ఇక్కడ రాసినవన్నీ చెప్పాలి.
   మీరు కూడా ఈ ప్రశంసల మీదే నిలబడాలి.
   మల్లిక్,
   మీరు ఫేస్ బుక్ తెలుగు సాహితీ వలయంలో చేరిన దగ్గరనుంచీ
   మంచి మంచి పదాలు…పద బంధాలూ…ఊ….ఇక తిరుగులేదు..

 4. అయ్యో,

  నిజ౦ గానే చాలా స్వీట్ గా వ్రాశార౦డి. అప్పుడప్పుడూ మాత్రమే వ్రాయమన్నది, పాయస౦ ప్రతిరోజూ చేసుకోము కదా 🙂

  కృష్ణశాస్త్రి గారి పుస్తకాలు కూడ పూర్తిగా చదవకు౦డానే ఆ భావుకత పట్టి ఆపేస్తు౦ది,ఆ కొ౦చమే చాలు అనిపిస్తు౦ది . అ౦దరికీ ఇలా అనిపిస్తు౦దో లేదో తెలియదు.

  నేను చదవలేకపోతున్న౦దు కు, అ౦త బాగా వ్రాసిన౦దుకు నా నిరసన కూడా దాచుకోలేదు నా వ్యాఖ్య లో 🙂

  అ౦దుకే మీకు పొగడ్త నా కాదా అనిపి౦చి౦ది.కు౦చె౦ చొరవ తీసుకొన్నాను నా భావ౦ యధా తధ౦ గా తెలియచేయడానికి .

  ఇక, పైన ఇ౦కొకరు చెప్పినట్లుగా :

  It has to be cultivated and you are master in it. I have some
  jelasy on your friend who stolen your heart in such a way. Vishnu Priya is fortunate enough to have a friend like you

 5. ma mi alochanae supar

  e kalam lo kuda lettrer raskunte yenta bauntundo mi letter chusaka ardamwtundi
  bavundi nakyte chala……… chalaaaaa………… chalaaaaaaaaaaaaa………………. nachhindi. mi healh jagratta.
  vishnu priya mem ku na tarupuna pedda hiiiiiiiiiiiiiiiiiii cheppandi.
  keep smiling
  urs…*

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s