కాకరాపల్లి బాధితులకు సంఘీభావం తెలుపండి

కాల్పుల్లో మరణించిన జీరు నాగేశ్వరరావు భార్య లక్ష్మి

east coast company getu mundu

attada appala naidu,varma taditara rachayitalu

badhitulato rachayitalu

వడ్డి తాండ్రలో కాలి పోయిన ఇళ్ళు,దుస్తులు,డబ్బు.

మూడేళ్ళ క్రితం సిక్కిం వెళ్ళినపుడు భూమికి 14 వేల అడుగుల ఎత్తులో,మంచులో కప్పబడిన పర్వత శ్రేణులతో ఉండే ‘నాతుల్లాపాస్’ అనే ప్రదేశానికి వెళ్లాం.భారత చైనా సరిహద్దు ప్రాంతం అది..ప్రతి కిలోమీటర్ కీ భారత సైన్యం పహారా కాస్తూ కనపడింది.ఉద్రిక్తంగా ఉండే సరిహద్దు ప్రాంతాల పట్ల ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా ఉంటాయో అక్కడ చూసాను. 
 
మార్చ్ రెండో తారీకు కాకరాపల్లి ఉద్యమకారులకి సంఘీభావంగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తరుపున నేను ఉత్తరాంధ్ర రచయితలతో కలిసి వడ్డితాండ్ర మొదలైన గ్రామాలు తిరిగినపుడు పైన చెప్పిన మాదిరి వాతావరణమే కనిపించింది.కోట బొమ్మాళి నుంచే పోలీసుల హడావిడి ఎక్కువగా కన్పించింది.ఆ చుట్టు పక్కల గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నా మేం వెళ్ళిన రోజు నుంచీ కొంత సడలించారని  తెలిసింది.సుమారు 1000 మందికి పైగా పోలీసులు ఆ చుట్టుపక్కల గ్రామాలని తమ ఆధీనం లోకి తెచ్చుకున్నారు.
 
వడ్డి తాండ్రలో వాహనం దిగీ దిగగానే …సముద్రంలో మునిగిపోతున్న వాళ్లకి గడ్డిపోచ దొరికినా చాలన్నట్టుగా ఆ గ్రామస్తులు ఆత్రుతగా మా చుట్టూ చేరారు… పోలీసులు బాంబులు వేయడం ద్వారా కాలిపోయిన ఇళ్ళు,సామాను చూపించారు.
 
”మొగోడొచ్చి ఆడదాయిని కొట్టీసినట్టు ఆ పోలీసులొచ్చి మా ఇళ్ళని బాంబులతో కొట్టీసినారు”అంటూ ఉత్తమ్ అనే మత్స్యకారుడు వాపోయాడు.
 
నిజనిర్ధారణలో  భాగంగా మేం వడ్డితాండ్ర,ఆకాశలఖవరం,సీరపువాని పేట,హనుమంతునాయుడుపేట,ఈస్ట్ కోస్ట్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్న ప్రాంతం తిరిగాం …అనేక మంది మత్స్యకారుల్నీ,రైతుకూలీలని కలిసి విషయాలను సేకరించి  వాస్తవాలను  మా అవగాహనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసాం.
 
అన్ని గ్రామాల్లో ప్రజలు థర్మల్ ప్లాంట్ నిర్మాణం పట్ల పూర్తి వ్యతిరేకత తోనూ, ప్రభుత్వ చర్యల పట్ల తీవ్ర ఆగ్రహంతోనూ ఉన్నారు.అక్కడి ప్రజల నుంచి మేం తెలుసుకున్న విషయాలను, వారు బయట ప్రపంచానికి చేసిన విజ్ఞప్తులనూ,వీలు వెంబడి పోస్ట్ చేస్తాను..
 
అట్టాడ అప్పల నాయుడు,వివిన మూర్తి,వర్మ,వేలూరి రామారావు,రామలక్ష్మి,చలం,దాసరి రామచంద్రరావు,బులుసు సరోజినీదేవి మా బృందంలో  ఉన్నారు.
 
మేం రచయితలమని తెలిసి  హనుమంతు నాయుడి పేటలో మహిళలు ” మాకిష్టం లేని ప్రాజెక్ట్ ని మా మీద రుద్దుతున్న ఈ ప్రభుత్వాన్ని,అక్రమంగా అనుమతులిచ్చిన వాళ్ళని,ఈ కలెక్టర్ ని,కంపెనీలో వాటాలున్న రాజకీయనాయకుల్నీ,ఇదుగో ఈ రోజు నీళ్ళు పట్టుకోడానికి వెళ్ళినపుడు మమ్మల్ని చూసి తొడ గొట్టిన పోలీసుల్నీ బాగా తిడుతూ రాయండి..మీకు ఏవన్నా భయంగా ఉంటే మా పేర్లు పెట్టి మరీ రాయండి….మీరు వచ్చి వెళ్ళినందుకు మాకు మేలు జరిగేది ఏవన్నా ఉందంటే అదే…మా అందరికీ చెప్పండి…”అని గట్టిగా చెప్పారు….     

ప్రకటనలు

9 thoughts on “కాకరాపల్లి బాధితులకు సంఘీభావం తెలుపండి

 1. మేడంజి!మీరేంటి ప్రభుత్వానికి ,పోలిసులకు వ్యతిరేకంగా అలగా జనము కోసం ప్రజాస్వామ్య విరుద్దంగా ప్రవర్తిస్తారా?ప్రభుత్వము ప్రజలకోసం ఎమైనా చేస్తుంది.ఎంతటి త్యాగానికైనా,ఎన్ని ప్రాణాలు తియ్యడానికైనా సిద్దపడుతుంది .ప్రజలు తమ ప్రాణాలు పొయినా ప్రభుత్వానికి సహకరిస్తేనే అది ప్రజాస్వామ్య స్పూర్తి అవుతుంది .పాపం పోలిసులు అమాయకులు -వాల్లు పై వాల్లు ,ప్రభుత్వము తొడ కొట్టమంటే తొడకొడతారు,వాకపల్లి లాగా అత్యాచారము చెయ్యమంటె చేస్తారు ఇందులో వాల్లు నిమిత్తమాత్రులు …

 2. మేడంజి!నేను మామూలు మనిషిని ఎవడొ మా అమ్మనో ,అక్కనో తొడ గొట్టి మీసం మెలేస్తే సబ్యతా అని ,ఎవరేమంటారొ అని ఇంట్లొ కూర్చోను -వారు ఎవరైననూ వారి కాల్లను కన్నీటితో అభిషేకిస్తాను ,పూల హారాలు వేస్తాను . ఇది నా అభిప్రాయము ,అందరిని అదే విదముగా స్పందించమని గాని ,నా అభిప్రాయాన్ని గౌరవించమనిగాని కోరడములేదు.దొంగ….కొడుకులు అని కవితలలో వ్రాసిన వాల్లను మహా కవులుగా కీర్తిస్తున్నాము ….నా అభిప్రాయములో మోతాదుకు మించని కోపము ,న్యాయము వుందని నేను భావిస్తున్నాను ……వుంచుతే మొత్తము అభిప్రాయాన్ని వుంచండి లేదా దయచేసి వొక మామూలు మనిషి ,ఎటువంటి స్పందనలు లేని మనిషి అభిప్రాయముగా భావించి తీసేయమని ప్రార్తిస్తున్నాను

  • మల్లిక్,
   కాకరాపల్లి బాధితులపట్ల మీ ఆవేదనని అర్ధం చేసుకున్నాను.కానీ నా బ్లాగ్ లో నేను అనుమతించే వ్యాఖ్యలకి కొన్ని పరిమితులు పెట్టుకున్నాను..ఆ సంగతి నా బ్లాగ్ లో అందరి కన్నా ఎక్కువ వ్యాఖ్యలు రాసిన మీకూ తెలుసు…వ్యాఖ్యని ఎడిట్ చేయడాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు.మనందరం బాధితుల పక్షాన నిలబడ్డ వాళ్ళమే….అదే ప్రధానం అనుకుందాం…మీరు నొచ్చుకోకండి….ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం.

 3. మేడంజి!మీరు ఏమి అనుకోనంటె ఆ టైటిల్ తీసేయండి .కొన్ని పరిమితులలో వున్నప్పుడు ఇటువంటి విషయము మీద పోస్ట్ రాయకూడదు.నాయుడిపేట మహిళలకు మీరు చెప్పిండాల్సింది -తిట్టడము లాంటి సబ్యత లేని మాటలు మీరు మాట్లాడకూడదు ,మమ్ములను తిట్టమని రాయండి అని మీరు అడగకూడదు అని .దయచేసి నా అభిప్రాయాన్ని ఎడిట్ చెయ్యకుండా మొత్తము తీసెయ్యండి …ఎడిట్ చెయ్యబడి వున్న నా అభిప్రాయాన్ని చూసి నేను చాలా ఫీల్ అవుతున్నాను …..please…please

  • మల్లిక్
   ప్రజల ఉద్వేగాల స్థాయిని తెలపడానికే ఆ టైటిల్ పెట్టాను…అది కూడా వాళ్ళన్న మాటల్లోంచే…
   దాని మీద ఇపుడు మీరు చెప్పిన అభిప్రాయాన్ని గౌరవిస్తూ టైటిల్ మారుస్తున్నాను.టైటిల్ మార్చడం ప్రజల
   ఆగ్రహాన్ని కప్పిపెట్టడం కాదని నాకు నేను సర్ది చెప్పుకున్నాను…

 4. none of us has to take things personally or emotionally. the point is, as writers and artistes many and most of us are more susceptible to mass hysteria. it is commonplace to pour a sea of abuses on police and the sad result is avoidable problems to self. on an objectivity, other than competing with one another in hurling scolds and scraps on the other side and trying to outshine others to get better mileage, what did or shall we do for the hoi polloi ? the issue is on news board for about 2 years. let us make a clean breast of it. how many of us even cared to go and find out what is up?. but the thing is, to detect any malady at the nib needs lot of study and thinking. thanks for reading this.

 5. కాకరాపల్లి వెళ్ళలేదు కానీ కాకరాపల్లి సమీప గ్రామమైన తేలినీలాపురం వెళ్ళాను. ఆ గ్రామం విదేశీ పక్షులు విడిది చేసే కేంద్రం. ఆ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం కడితే ఆ కేంద్రం నుంచి వచ్చే వేడికి విదేశీ పక్షులు వెళ్ళిపోతాయని ఖచ్చితంగా చెప్పగలను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s