ప్రపంచీకరణ – చంద్రముఖి.

( ఇక్కడ ‘నేను’ అంటూ చెప్పినవి నా మాటలు కావు.కవి, కధకుడు,’అనేక’దశాబ్ది కవితా సంకలనకర్తల్లో ఒకరైన వంశీ కృష్ణ చెప్పినవి.)
 
“……….నేను ఈ రోజు రెండు సంఘటనల గురించి చెప్పాలనుకుంటున్నాను.చాలా రోజుల క్రితం నాకు ఒంట్లో బాగోక హాస్పిటల్ కి వెళ్ళినపుడు వెయిటింగ్ హాల్ లో నా పక్కన ఒక పెద్ద వయసావిడ కూర్చుంది.ఒక పల్లెటూరి నుంచి ఆవిడ వచ్చినట్లు మాటల మధ్యలో తెలిసింది.చేతిలో సెల్ ఫోన్…కాసేపటికి అది మోగగానే కాల్ లిఫ్ట్ చేసి అవతలి వైపు వాళ్లకి జాగ్రత్తలు చెపుతూ…..
 
‘ఈ రోజు హాస్పటల్ లోనే ఉంచమన్నారు….నేను ఈ రాత్రికి యిక్కడే ఈళ్లకి తోడుగా ఉంటా…నువ్వొక్కదానివే ఇంట్లో ఉండాల మరి…ఇల్లు జాగర్త….తొరగా భోంచేసి పడుకో….అట్టాగే ఎనిమిదింటికి సీరియల్ చూడటం మర్చిపోకు…సీరియల్లో ‘అక్షయ’కి  ఏవౌతుందో ఏంటో…’
బెంగగా అంది ఆవిడ…..ఇది ఒక సంఘటన…
 
ఇక రెండో సంఘటన….
 
మా ఇంటికీ నేను పని చేసే బాంక్ కీ,గంటన్నర ప్రయాణం.ఉదయం ఎనిమిదిన్నరకి వెళితే సాయంత్రం ఆరింటికి బాంక్ పని ముగుస్తుంది.ఏడున్నర,ఎనిమిది మధ్యలో ఇంటికి చేరుకోవచ్చు.కానీ మిత్రులతో కాసిన్ని కబుర్లు చెప్పుకుని ఇంటికి చేరేసరికి ఎపుడూ తొమ్మిదిన్నర దాటుతుంది.’ఆఫీస్ పని కాగానే సరాసరి ఇంటికి ఎందుకు రారు?’ అన్నది నా సహచరి ప్రశ్న.’స్నేహాలు మానవ సంబంధాలకి వన్నె తెస్తాయి కాబట్టి’అన్నది నాకున్న సమాధానం.నాలుగైదేళ్లుగా నాకు చెప్పి చెప్పి విసుగెత్తి పోయిందామె.
 
ఆ రోజు మిత్రులు కలవక తొందరగా ఇంటికి వచ్చేసాను.నా సహచరి టీవీ లో చంద్రముఖి సీరియల్ చూస్తుంటే నేనూ యధాలాపంగా చూసాను.మరుసటి రోజు మిత్రుల వద్ద ఉన్నా చంద్రముఖియే గుర్తు వచ్చింది.ఇంటికొచ్చాక సీరియల్ ఏవైందో అడిగి చెప్పించుకున్నాను.మరుసటి రోజు త్వరగా ఇంటికి వచ్చేసాను….ఆ వారంలో మూడుసార్లు చంద్రముఖి చూసాను….నెల తిరిగే సరికి క్రమం తప్పకుండా చూడడం అలవాటైంది.
 
ఆ నెలంతా గడిచాక నా సహచరి నాతో అంది కదా…. ” మొత్తానికి నాలుగేళ్ళుగా నేను చేయలేని పనిని ఒక్క నెలలో ప్రపంచీకరణ చేసేసింది…”అని.
 
నిజమే కదా!!!
 
పై సంఘటన లో ముసలావిడకీ, ఈ సంఘటనలో నాకూ మధ్య పెద్ద తేడా ఏం లేదు….వ్యక్తుల వ్యక్తిత్వాలను రద్దు చేసి….’మూసలు’గా చేసే శక్తి ప్రపంచీకరణకి ఉందని చెప్పడమే నా ఉద్దేశం……..”
 
( 27 – 2 – 2011  నాడు విశాఖపట్నం పౌర గ్రంధాలయంలో మొజాయిక్-ఎస్కే ఫౌండేషన్ వారు ‘అనేక’ దశాబ్ది కవితా సంకలన పరిచయ సభ పెట్టారు…ఈ సంకలనానికి ప్రపంచీకరణని నేపధ్యంగా తీసుకోవడం గురించి వంశీకృష్ణ మాట్లాడారు…ఆ ఉపన్యాసం లో కొంత భాగాన్ని ఇక్కడ పోస్ట్ చేయడానికి అంగీకరించిన వంశీ కృష్ణ గారికి ధన్యవాదాలు…..
– మల్లీశ్వరి.)
ప్రకటనలు

14 thoughts on “ప్రపంచీకరణ – చంద్రముఖి.

  • నాగార్జున గారూ,
   కుమార్ గారూ,
   టీవీలు రావడం ప్రపంచీకరణ అని కాదు.దాని ద్వారా వచ్చే వ్యాపార సంస్కృతి ప్రపంచీకరణ లక్షణం …
   మనుషులకుండే సున్నితమైన మానవ సంబంధాలను నిర్లక్ష్యం చేసి అవాస్తవ మైన కల్పనలకి మనుషుల్ని బానిసలని చేసే లక్షణం టీవీ సీరియల్స్ లో కనిపిస్తుంది.మనుషులు ఒరిజినాలిటీని కోల్పోతారు…మూసలుగా మారిపోతారు అని వంశీ కృష్ణ అన్నది అందుకే…
   శంకర్ గారూ,
   థాంక్ యూ……

 1. కథలో చెప్పదలుచుకున్న భావం బానేవుంది కానీ మోకాలుకీ, బోడిగుండుకీ లంకె పెట్టారే అది బాగోలేదు.

  మా పాప ఎప్పుడూ ఇంటర్నెట్టు చూస్తూ మానవ సంబంధాలను పెద్దగా పట్టించుకోదు. దానిని నేను నిరసిస్తే ఇదే మా తరం జీవిత విధానం – మీ తరంతో పోల్చొద్దు అంటుంది. నాదే చాదస్తమేమో అని వెనక్కి తగ్గుతూ వుంటాను.

  • కృష్ణా,
   ఇంటికి త్వరగా రావడం బావుంది.కానీ త్వరగా రావడం ఇంటి కోసం కాదన్నది గుర్తించాలి మనం.
   శరత్,
   ప్రపంచీకరణకి వ్యక్తుల వయసులతో నిమిత్తం లేకుండా మార్చే శక్తి ఉంది.మీ పాప ఇంటర్నెట్ లో ఎక్కువ సమయం గడిపితే దాన్ని గురించి తెలీని వారు టీవీ సీరియల్స్ చూడడంలో ఎక్కువ కాలం గడపొచ్చు…..ఇక్కడ సమస్య తరాల అంతరాలకి సంబంధించినది కాదు.మనుషుల వినోద సమయాన్ని,భావోద్వేగాలను ఇప్పటి కాలం లో ఏదైతే నియంత్రిస్తోందో దాన్ని గురించి వంశీ కృష్ణ మాట్లాడారు.
   వర్మా,
   ఆ లింక్ ఓపెన్ కావడం లేదు.

 2. మల్లీశ్వరిగారు, కథలో నాకు అర్ధం కానిది వంశీగారు ప్రపంచీకరణ మనను మూసలుగా మారుస్తుంది అని అన్నారా ?
  లేక అందులోని వ్యాపార ధోరణిని విమర్శించారా? రెండింటికి చాలా భేదం వుంది కదా…

 3. మేడంజి! మీ ప్రపంచీకరణ చంద్రముఖిని నా కవితలో బందీని చేసా …..అభివౄద్ది-ప్రపంచీకరణలో వచ్చే మార్పులను మనమే ఎదుర్కోవాలి ….అన్నింటిని సమతూకముతో స్వీకరించాలి …….పొస్ట్ భాగుంది ……మిమ్ములను తెలుగు సాహితీ వలయములోకి ఆహ్వానిస్తున్నాము ……అక్కడ ఇంకా చాలా మంది మిత్రులతో మన అభిప్రాయాలను పంచుకోవచ్చు .థాంక్స్ ….

  • మల్లిక్
   ఆ సాహితీ వలయం లోకి ఎలా వెళ్ళాలో తెలీడం లేదు.
   మొత్తానికి మీరు నా కన్నా ముందు కంప్యూటర్ జ్ఞానంలో దూసుకు పోతున్నారు…
   మీ కవితకి అభినందనలు చదివాక చెపుతా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s