కధతో ఒక రోజు

సాహిత్యాన్ని అభిమానించేవాళ్ళు,కధలంటే ప్రాణం పెట్టేవాళ్ళు…సంవత్సరానికి  ఓ రోజు కలిసే చోటది…అది హైదరాబాద్ కావొచ్చు,విశాఖ కావొచ్చు,డిల్లీ కావొచ్చు,బెంగుళూర్ కావొచ్చు. అందులోనూ ఈసారి కధ సాహితి 20ఏళ్ల  పండుగ కూడానూ…
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సాహిత్యకారులతో పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం నవంబర్ 21వ తారీఖు కళకళలాడింది.
ఉదయం 9 గంటలనుంచీ సాయంత్రం 6 గంటల వరకూ కధావరణంలోగడపడం,అంతమంది సాహిత్యకారులను ఒక చోట కలవడం,
పలకరించుకోవడం,సాహిత్యాన్ని కలబోసుకోవడం…ఫ్రెష్ అయినా భావన కలిగింది.
నేను హరగోపాల్ సాహిత్య ఉపన్యాసాన్ని వినడం  అదే మొదటిసారి .ఇరవయ్యేళ్ళ కధాసాహితి సంపుటిలో ఉన్న కధల లోని సామాజికత మీద మాట్లాడారు.సంక్లిష్టమైన కోణాలని కూడా శ్రోతలకి బాగా కమ్యూనికేట్ అయ్యేలా చెప్పారు.కధల మాస్టారు కాళీపట్నం ఓపిగ్గా నింపాదిగా 20 నిమిషాల పైన మాట్లాడారు.గుడిపాటి ఈ సదస్సుని అటెండ్ చేయడానికి తనకి ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూ సాహిత్య,రాజకీయ అంశాల మధ్య ఉండాల్సిన సున్నితమైన రేఖని విశ్లేషించారు.
వాడ్రేవు వీరలక్ష్మీదేవి ”కొత్త రచయితలు ప్రయోగాలజోలికి పోకుండా వస్తువు మీద దృష్టి పెట్టాలని పదేపదే చెప్పారు. ఈ అభిప్రాయంతో నాకు విభేదం ఉంది. కధావస్తువు తనంత తానే శిల్పాన్ని వెతుక్కుంటుంది అన్న మాటని నేను నమ్ముతాను.
కధ-2009 లోనూ ఇరవయ్యేళ్ళ కధసాహితి సంపుటిలోనూ ఉన్న సుమారు పాతిక మంది కధా రచయితలు తమ తమ కధల నేపధ్యాన్ని వివరించిన తీరు ఆకట్టుకుంది. ఎంతో ఆసక్తిగా,ఇష్టంగా మనం చదివే కధల వెనుక ఉన్న నేపధ్యాన్ని చదివినపుడు మరింత తెలుసుకున్న భావం కలిగింది.
సుమారు 200 మందికి పైగా సాహిత్యకారులు ఈ సదస్సుకి వచ్చారు.అందులో నేను గుర్తు పట్టిన వాళ్ళు,నన్ను గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించిన సాహితీ బంధువులు వీళ్ళు…..
ప్రొ:హరగోపాల్, కె శ్రీనివాస్, కాళీపట్నం రామారావు, కె.శివారెడ్డి, అబ్బూరి ఛాయాదేవి, తుమ్మేటి రఘోత్తంరెడ్డి, గుడిపాటి, ఏ.వి.జగన్నాధ శర్మ, శ్రీపతి, పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్, కొలకలూరి ఇనాక్, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, బమ్మిడి జగదీశ్వరరావు, ఆర్.కె., వి.చంద్రశేఖరరావు, మధురాంతకం నరేంద్ర, వాడ్రేవు వీరలక్షీదేవి, కొడవటిగంటి వరూధిని, ఆర్.శాంతసుందరి, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, సతీష్ చంద్ర, దగ్గుమాటి పద్మాకర్, కుప్పిలి పద్మ, సి.సుజాత, వంశీ(డైరక్టర్), వాడ్రేవు చినవీరభద్రుడు, ఆర్.ఎం.ఉమా మహేశ్వరరావు, కాట్రగడ్డ దయానంద్, ఖదీర్ బాబు, గోపిని కరుణాకర్, గొరుసు జగదీశ్వర రెడ్డి, కొండేపూడి నిర్మల, ఘంటసాలనిర్మల, జాజుల గౌరీ, దర్భశయనం శ్రీనివాసాచార్య, అక్కిరాజు భట్టిప్రోలు, యాకూబ్, పెన్నా శివరామకృష్ణ, సి.మృణాలిని, తుమ్మల రామకృష్ణ, కె.వరలక్ష్మి, కె.వి.కూర్మనాద్, జి..యస్.రామ్మోహన్, వేగుంట మోహనప్రసాద్(మో), యాళ్ళ అచ్యుతరామయ్య, మల్లిపురం జగదీశ్, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, సురేష్, బి.పద్మావతి, అరుణ్ సాగర్, పరకాల సుధాకర్, బా రహంతుల్లా, జి.యస్.చలం, పగడాల నాగేందర్, సం.వె.రమేష్, జెన్నీ, కె.యస్.రమణ, తాయమ్మ కరుణ, శ్రీశ్రీవిశ్వేశ్వరరావు, ప్రమీల, రెహనా, శ్రీనివాస్, ముళ్ళపూడి శ్రీనివాస్, వారణాసి నాగలక్ష్మి, శివలక్ష్మి , సమతా రోష్ని, నంబూరి పరిపూర్ణ, దాసరి అమరేంద్ర, అజయప్రసాద్. వర్మ, నారాయణ వేణు, అక్బర్,  ఉదయమిత్ర, డా:నరేంద్రనాద్, జైని మల్లయ గుప్త, వి.రాజారాంమోహన్రావు, ఎన్.రవి, రమేష్ హజారే, నున్నానరేష్, బి మురళీధర్, మనసు ఫౌండేషన్ నాయుడు, పి.చిన్నయ్య, దేశి రాజు, అమర్నాద్, అమరజ్యోతి, శ్రీధర్ ,కాళీపట్నం సుబ్బారావు, వేముగంటి మురళీ కృష్ణ, బ్రహ్మయ్య, ఆర్.రామకృష్ణ, వెలుగు రామినాయుడు, సీత, సుధాకర్ రెడ్డి, శివరావు, చైతన్య,

ప్రకటనలు

9 thoughts on “కధతో ఒక రోజు

  1. మేడంజి ,ఆ రోజు నేను సిటీలోనే వున్నాను ,badluck నాకు ఆ మీటింగ్ తెలియదు ,మీకు తెలిసిన రచయితల పేర్లలో నాకు తెలిసిన వారు చాలా తక్కువ ,ఇంత మంది తెలిసిన మిమ్ములను చూస్తుంటే నాకు ఈర్శగా వుంది .ఇంత మంది తెలిసిన మీరు నాకు తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా వుంది .

  2. మల్లిక్,
    మీరు వచ్చుంటే బావుండేది.చాలా మంది రచయితలని పరిచయం చేసుకుని ఉండేవారు.
    మాలతిగారు,
    సాహితీ బంధువుల జాబితా ఇంకా పెద్దదే…ఈ సభలో ఇంత మట్టుకు..మీరెపుడు ఇండియా వస్తారు?

  3. bandaru achchamamba kathani kuuda silpam ledani modati kathaga gurthinchadam ledu!same 2 same and sarme 2 shame, na katha gurinchi alanti vimarse vachchindi.ante bandaruvaru, nenu vokate category anna mata.actually, i am very proud of myself in this matter(yenta kovvu!?!)HA..HA..HA…..!poneele .adanta brahma padrdamaite, nee korika meraku vadilestale.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s