జాజిమల్లి పుట్టిన రోజు

”నాభావాలను నేనిపుడు ఎక్కువమందితో పంచుకోవచ్చు. ఇక్కడ నాభావాలకి కత్తిరింపులుండవు, ప్రచురణకోసం తిప్పలుండవు. ఈ బ్లాగింటిని నా భావాలతో , అనుభూతులతో సౌందర్యవంతం చేస్తా. స్వేచ్చ నవలలో ఓల్గా చెప్పినట్ట్లు నా ఉనికి సమాజ చలనానికి ఏ కొంచెమయినా ఉపయోగపడటం కోసం ఈ బ్లాగు ను వారధి చేస్తా.”
నా తొలి పోస్ట్ లో రాసుకున్న వాక్యాలివి.
నేను ఈ సంవత్సర కాలంగా బ్లాగ్ పట్ల ఒకటి రెండు సందర్భాల్లో తప్ప చాలా కమిటెడ్ గా వున్నా..నేను బ్లాగ్ మీద కొంత సమయం పెట్టడం పట్ల సాహితీ మిత్రులకి కొంత చిన్న చూపు వుండేది.కధలు నవలలు విరివి గా రాయడం మానేసి బ్లాగింగు కి ఎడిక్ట్ అయిపోతానేమోనని.”అంతర్జాలం  ఒక మాయా జాలం.జాగ్రత్త”  అని నన్ను హెచ్చరించిన మంచికంటి లాంటి మిత్రులు వారానికి ఒకటి రెండు పోస్ట్స్ రాసేస్తూ….తెగ బిజీ అయిపోయారు.

పతంజలి గారు చనిపోయాక ఆయన సాహిత్యం మళ్ళీ చదువుతున్నపుడు  నా రచనల పట్ల నాకు విముఖత ఏర్పడింది.కలం మూసేశాను. ఓ సంవత్సరంన్నర   ఏవీ రాయలేదు…ఆనంద్  పోరు పెట్టి  బ్లాగ్ మొదలు పెట్టించి సాంకేతిక సాయం అందిస్తూ వస్తున్నాడు.అటువంటి సమయంలో నేను బ్లాగ్ లో రాస్తున్న చిన్న చిన్న కధలకి సాహిత్యవిలువలున్నాయనీ అదొక ప్రక్రియగా డెవలప్  చేయమని తన అద్భుత మైన వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహించిన వారు కె.శ్రీనివాస్ గారు…

పి.సత్యవతిగారు,దగ్గుమాటి పద్మాకర్,వర్మ శివలక్షి,రోష్ని విజయభాను,ఎప్పటికపుడు తమ విలువైన అభిప్రాయాలు సూచనలు ఇచ్చేవారు.
నా బ్లాగ్ పోస్ట్స్ మీద పాఠకుడు చాలా విలువైన విమర్శలు చేసారు…ఆ  విశ్లేషణల ముందు  ఒక్క ప్రశంస లేకపోయినా ఏమీ అన్పించదు…నిజమైన సాహిత్య ప్రేమికుడు పాఠకుడు..ఈ మధ్య పోస్ట్స్ రాస్తున్నపుడు మరింత బాధ్యతతో అలోచిస్తున్నానంటే పాఠకుడి లాంటి విమర్శకులే కారణం.
కేక్యూబ్ వర్మ,గాజుల మల్లిక్, చాలా ఆత్మీయంగా బ్లాగ్స్ లో పలకరిస్తారు..రంగనాయకమ్మ వీడియోలని బ్లాగ్ లో పెట్టడంలో కె క్యూబ్ చాలా ఓపికగా సాయం చేసారు.
భావన,సుజాత,జ్యోతి,కృష్ణప్రియ,కొత్తపాళీ,నూతక్కి,తార,చిన్ని,నాగార్జున వేణు,పద్మార్పిత,పద్మప్రియ,సునీతా,శిరీష,రాఘవ,కుమార్.ఎన్,ఇంకా చాలా మంది బ్లాగ్ మిత్రులు తరుచుగా నా బ్లాగ్ కి వచ్చి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రోత్సాహం ఇచ్చారు.

ఈ మధ్య  పి.సత్యవతి గారు ఓ మాట అన్నారు.”తెలుగు రచయితలు ఇంటర్ నెట్ సాహిత్యాన్ని కూడా చదవాలి. కంప్యుటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ”ఆ మాటలు నిజమే అని ఈ సంవత్సరంలో నేను గ్రహించాను.

ఈ పోస్ట్, పోస్ట్  చేయడానికి ముందు చదివిన మిత్రురాలు ”వోట్ ఆఫ్ థాంక్స్ లా రాసావేంటి?” అంది. నవ్వొచ్చింది.నిజమే కానీ ఎపుడూ రచయితలాగానే కాకుండా అపుడపుడు మాములుగా కూడా మాట్లాడాలనిపిస్తుంది కదా….

ప్రకటనలు

18 thoughts on “జాజిమల్లి పుట్టిన రోజు

 1. మీ బ్లాగు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు..నా నవల రాతలో పడి నేను చదవలేకపోయిన కొన్నిబ్లాగుల్లో మీదొకటి. తొందర్లోనే వచ్చి చదువుతాను . కీప్ రైటింగ్.

  కల్పన

 2. వేణు,ఇందు,కల్పనా,గీతిక,మురళీ కృష్ణ,మాల పి కుమార్,రోష్ని,లక్ష్మీ,సామాన్యుడు,విజ్జీ,జగద్ధాత్రి,
  శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు…

 3. మేడంజి ,జాజిమల్లి పుట్టినరోజు ప్రకృతి పరవశించి ఈశాన్యం మూలనుంచి భూమిని అభిషేకించి ,మల్లి పరిమళాలను విశ్వవ్యాప్తము చేస్తూ ,మరో అరుంధతివి కమ్మని ఆశిర్వదిస్తున్నట్లుగా వుంది .ప్రకృతి కోర్కెను మీరు తీర్చాలని కోరుకుంటూ ,పుట్టిన రోజు శుభాకాంక్షలతో -dr .గాజుల మల్లిక్ ,అమరావతి ,శ్రావని ,చక్రవర్తి .

  • ప్రశాంత్ గారు,
   ధన్యవాదాలు.
   తెలుగుని తెలుగు లిపి లోనే రాయడం చాలా సులువు.ప్రయత్నించండి.
   అందులోనూ మాతృభాష అని కూడా పేరు పెట్టుకున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s