రేపే నా బ్లాగ్ పుట్టిన రోజోచ్…

ఈ మధ్య అఫ్సర్ గారు ఇంటర్ నెట్లో తెలుగు సాహిత్యం ,బ్లాగ్ సాహిత్యాల గురించి ఓ ప్రశ్నావళి పంపారు.తీరిక లేకపోవడం సంగతి  పక్కన పెడితే వెబ్ పత్రికలను ఇతర బ్లాగ్స్ ని చదవడం లో నేను వెనక పడే వున్నాను.అందుకే వెంటనే స్పందించలేకపోయాను. జాజిమల్లి బ్లాగ్ పెట్టి ఒక సంవత్సరం అయింది.ఈ సంవత్సరంలో నా బ్లాగ్ నుంచి,ఇతర బ్లాగ్స్ నుంచి, బ్లాగర్స్ నుంచి నేనేం తెలుసుకున్నానో ఓసారి సమీక్షించుకునే ప్రయత్నమే ఈ పోస్ట్.

‘నేనెందుకు బ్లాగ్ తెరిచేను’,’నా గురించి’ నా మొదటి పోస్ట్స్.ముగ్గురు నలుగురు అభినందనలు తెలిపారు.బానే ఉంది అనుకున్నా.తర్వాత ”ఇక్కడన్నీ మగ బోర్దులే” రాసాను.ఇక చూడాలి విమర్శలు…కళ్ళు గిర్రున తిరిగాయి. ఆ పోస్ట్ లో మలక్ పేట్ రౌడీ ‘మచ్చుకి రెండు ఝలక్ లు’ అంటూ కామెంట్ పెట్టి…అంతే పరార్…మళ్ళీ ఇటు వైపు తొంగి చూడలేదు.బహుశా నా బ్లాగ్ మలక్ కి ఝలక్ యిచ్చినట్లుంది.
ప్రింట్ మీడియా లో డిప్లొమాటిక్ విమర్శ లకి  అలవాటుపడిన నాకు ఇక్కడ కొంత అయోమయంగా అన్పించింది….ఇప్పటికీ…అంతే…ఈ మధ్య ఓ రోజంతా తీరిక చేసుకుని బ్లాగ్ ప్రపంచం అంతా చుట్టాను….ఈ మార్తాండ ఎవరో….ఆ ఒంగోలు శీను ఎవరో…ఎవరు చూసినా కత్తి మీద కత్తి గట్టడం ఏంటో, రకరకాల సంఘాలు ఎందుకో  ఏమీ అర్ధం కాలా…కొత్తపాళీని వదలలేదు జ్యోతి,సుజాత,సౌమ్యల్ని వదలలేదు… ఎందుకబ్బా ఇలా కొట్టేసుకుంటున్నారు ఎక్కడ మొదలైంది గొడవ అనుకుని ఎంత వెతికినా ఏ  సమాచారం తెలియలేదు…అపుడపుడు నా బ్లాగ్ కి వచ్చి కామెంట్స్ చేసే తార గారు అక్కడ కన్పించేసరికి కొంచెం ఆసక్తిగా వెతికా….వుహూ…ఏమీ తెలియలేదు…
అందుకే నా సూచన ఏంటంటే బ్లాగర్ల జీవిత చరిత్రలు అని మొదలుపెట్టేసి మొత్తం సమాచారమంతా ఒక చోట చేరిస్తే నాలాంటి ఔత్సాహిక బ్లాగర్లకి చాలా ఉపయుక్తంగా వుంటుంది అని మనవి చేసుకుంటున్నా…

.ఒడ్డున కూర్చుని తగవులు చూడడం నాకేం బాధ లేదు కానీ ఏంటో  ఆ తిట్లే పరమ భీకరం గా ఉంటున్నాయి…కొంచెం అందంగా తిట్టుకోవచ్చుగా ‘మడిసన్నాక కుసింత కలాపోసన ఉండాలి ..లేప్పోతే…’ ఎంచగ్గా ఈ మధ్య ఏదో పత్రిక లో మంచి మంచి సినిమా తిట్లు ఇచ్చారు కూడా….మనకి ఎలాగూ గొప్ప తెలుగు తిట్లు వున్నాయి.కాస్త గ్రాంధికం లో తిట్టుకోవాలంటే బోల్డు తెలుగు పద్యాలున్నాయి…నేను సాయం చేస్తా గానీ బాబ్బాబు…కాస్త అందంగా తిట్టుకోండి

ఇక నా బ్లాగ్ గొడవలోకి వచ్చేస్తా…అక్టోబర్ 30 కి నా బ్లాగ్ పెట్టి సంవత్సరం..71  పోస్ట్స్ రాసా… 605 కామెంట్స్,23,000  హిట్స్ వచ్చాయి.61 కామెంట్స్ తొలగించాల్సిన భాష,భావాలు కలిగి వున్నాయి…అందుకే వాటిని అప్రూవ్  చెయ్యలేదు ముఖ్యంగా ఎపుడూ చక్కగా కామెంట్స్ చేసే నాగార్జున గారు తెలిసో తెలియకో ఓ సారి రెండు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు…అవి తొలగించా.అలాగే తెలంగాణా మీద నేను రాసిన పోస్ట్స్ కి అదుపు తప్పిన విమర్శలు కొన్ని వచ్చాయి.అవీ తొలగించా.

అలాగే నా బ్లాగ్ నడవడానికి ప్రోత్సాహాన్ని ఇస్తున్న సాహితీ మిత్రుల గురించి, సహ బ్లాగర్ల గురించి,బ్లాగ్ మూలంగా నాకు జరిగిన మేలు గురించీ
రేపటి పోస్టులో రాస్తాను..

రేపే నా బ్లాగ్ పుట్టినరోజోచ్….

ప్రకటనలు

42 thoughts on “రేపే నా బ్లాగ్ పుట్టిన రోజోచ్…

 1. ఈ గొడవలూ ఇవన్నీ ఇక్కడ మామూలైపోయాయి లెండి! ఎవరి భావాలు ఎవరికైనా నచ్చలేదంటే అది మామూలుగా చెప్పరు ఇక్కడ

  !అందునా స్తీలంతా ముగ్గులూ, పండగలూ,గొబ్బెమ్మలూ,కుట్లూ అల్లికలూ వంటి సబ్జెక్టుల గురించి రాయాలని చాలామంది ఆశిస్తుంటారు. అలా రాయక కొద్దిగా డిఫరెంట్ గా రాస్తే ఆ కక్ష మనసులో పెట్టుకుని అనామకంగా వ్యాఖ్య రాసే సదుపాయాన్ని ఉపయోగించుకుని తృప్తి పొందుతారు.

  ఇవన్నీ పట్టించుకోక, హాయిగా రాస్తూ ఉండండి! తీరిక చూసుకుని చదివేస్తూ ఉంటాం!

 2. మీకు ముందుగా బ్లాగ్ ప్రధమ వార్షిక శుభాకాంక్షలు. బ్లాగ్ గొడవలేమి పట్టించుకోకండీ. ఇక్కడంతా ఏ విషయమైనా రచ్చ అవుతుంది. ఏమైనా నచ్చకపోతే చదివి నిశ్శబ్దంగా బయటకు వచ్చేయడమే ఉత్తమం.

 3. ఇదేమిటి ఈవిడ నా మనసులో మాటలన్నీ రాసేసోతేందే అని ఆశ్చర్య పడి, పోయి, రోజు నా మెయిల్ కి వచ్చేలా అనుస్న్ధించాను మీ బ్లాగ్. అప్పుడే, సోవత్సరం అయిందా.. మీ బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇకా ఎన్నో, ఏ న్నెన్నో, బ్లాగ్ పోట్ లు రాసి మా అందరి మనసు లు అలరించాలని మరి, మరి, కోరుకుంటూ, మీ అభిమాని..
  వసంతం

 4. ఇక్కడ జనాలకు అప్పుడప్పుడ తీరిక ఎక్కువై ఇలా తిట్టేసుకుని ,కొట్టేసుకుంటారు. కొందరు తిన్నదరక్క రాస్తుంటారు. మీరు అలాటివి పట్టించుకోకండి..

  శుభాకాంక్షలు రేపొచ్చి చెప్తా.

 5. కిరణ్ గారు;నిజనేమో…కానీ ఆశ్చర్యంగా ఒక్క ఎనానిమస్ వ్యాఖ్య కూడా ఎపుడూ రాలేదు…నేను తొలగించినవి కూడా పేర్లతో వున్నవే…
  లక్ష్మీ గారూ; థాంక్ యూ
  అరుణా; నా బ్లాగ్ చదువుతున్నావా?దొంగ పిల్ల(ల్లి) ఎపుడూ చెప్పలేదు.
  ఫణిబాబు గారూ,శ్రీలత గారు; ధన్యవాదాలు.
  వసంతం గారూ,మీరు బాగా గుర్తున్నారు.ఫ్రెండ్ గురించి రాసినపుడు మీరు స్పందించారు…అపుడే మీ బ్లాగ్ చూసాను…బావుంది.
  శ్రీ వాసుకి గారూ,నేను బ్లాగ్ పెట్టిన కొత్తల్లో మీరు,రవిచంద్ర,పిల్లకాకి,ఎక్కువ పోస్ట్స్ రాస్తుండేవారు.ఈ మధ్య కనపడటం లేదు?
  జ్యోతి గారు,ఎలా వున్నారు?ఎక్కువ రాస్తేనే టెంప్లేట్ మార్చడంలో సాయం చేస్తానన్నారు.ఏదో మరి ఇలా మార్చాం..నేను ఆనందు కలిసి …ఎలా ఉంది?

  • తార, నేను చాలా లక్కీ..మీ కామెంట్ వచ్చినపుడు నేను సిస్టం ముందే వున్నా..టకటకా అప్రూవ్ చేశా..లేకపోతేనా!!
   సోంపేట మీద మీ కామెంట్ కి నేనేం ఫీల్ అవలేదు..మీ వైపు కాజ్ ఉంది. నేను తప్పు రాసి ఉండొచ్చు అని మీరనుకున్నారు…కానీ కొంచెం మృదువుగా
   అడిగితే బావుండేదనిపించింది. అంతే…

 6. naa vaipu cause emi ledulendi 🙂

  kaani nenu appatike naa communistu mitrulu rasina oka 10 articles edit cheyyavalasi vachindi, sompet gurinchi ani madhyalo marx siddanthalu vachestayi, sompetlo aa companylone panichestunnaru kondaru, malli daanimeeda mosali kanniru, vallatho matladi ade alavatu aipoyindi, emi cheyyanu 😦

  meedi ade cate. anesi fix aipoyanu, daani meeda nenu raddam ani chustunnanu kani kudaradamledu, ee tour ayyaka first chesepani, mee article ki continuation rastanu.

  • ఇష్టం లేదని చెప్పే కంపెనీల్లో పని చేయడం వేరు…చెయ్యాల్సి రావడం వేరు కదా..దాన్ని బట్టే కన్నీరా?మొసలి కన్నీరా?అన్నది తెలుస్తుంది.ఏదేమైనా సోంపేట మీద మీరు రాసే పోస్ట్స్ కి ఎదురు చూస్తాను.

 7. మల్లీశ్వరిగారు….మీరు రాసిన ‘నాగార్జున’ నేనేనా…. !? నేనే అయితే ఆ అభ్యంతరకరమైన కామెంట్లు ఎంత గుర్తుచేసుకుందామన్నా గుర్తురావడంలేదు, అప్పుడు రాసినవి ఒక ఆలోచనను వ్యతిరేకించి రాసానా, వ్యక్తులను దూషిస్తూ రాసానా…..ఓసారి తెలియజేయండి సమీక్షించుకుంటాను….

  బ్లాగుకు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు…. 🙂

 8. మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్న ‘జాజిమల్లి’ కి అభినందనలు. అక్షరాల్లో తుళ్ళింతని, పదునుని, లోచూపుని పలికిస్తూనే, హుందాతనాన్ని కూడా నిలుపుకున్న బ్లాగ్ ఇది. బ్లాగ్ వేదికకు సరిగ్గా సరిపోయే పొట్టి కథనాలను అందిస్తూ ప్రతి పోస్ట్ కూ కొత్త మెరుగులను, మెరుపులను అందిస్తున్నది ‘జాజిమల్లి’.

 9. శ్రీనివాస్ గారూ,
  మీరిచ్చిన విలువైన సూచనలతో ఆ పొట్టి కధనాలకి అంత హుందాతనం వచ్చింది.
  మీ గుర్తింపే వాటిని ఓ ప్రక్రియలా తీర్చిదిద్దడానికి సాయం చేసింది.ధన్యవాదాలు.

 10. “కొంచెం అందంగా తిట్టుకోవచ్చుగా”

  నిజమే. ఆయనే ఉంటే మంగలాడెందుకని, ఆ నాజూకే ఉంటే అసలు కొట్టుకునేదాకా ఎందుకొస్తుంది? ఐనా మీ ఆకాంక్ష బావుంది.

  మీబ్లాగుకి యేప్పీ యేప్పీ బర్త్‌డే.

  • కొత్తపాళీ గారూ,థాంక్ యూ…
   మీ సామెతతో సమస్యలున్నాయి చూడండి మరి.
   మల్లిక్ గారూ,
   మీ వ్యాఖ్యలు ఈ మధ్య బొత్తిగా పిసినారివైపోతున్నాయి
   మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు.

 11. ఇక్కడ జనాలకు అప్పుడప్పుడ తీరిక ఎక్కువై ఇలా తిట్టేసుకుని ,కొట్టేసుకుంటారు. కొందరు తిన్నదరక్క రాస్తుంటారు. మీరు అలాటివి పట్టించుకోకండి..

 12. యాపీ యాపీ బత్తడే టు యుర్స్ ఒన్లీ బ్లాగ్! 😀

  ఆ పెంట గురించి మేమే పట్టించుకోవట్లేదు, అదంతా తెలుసుకుని ఆ తద్దినాన్ని మీరెందుకు నెత్తిమీద ఎక్కించుకోవడం?…హాయిగా పుట్టుకరోజు వేడుకలు జరుపుకోండి.

 13. యాపీ బర్త్ డే మల్లి గారూ! ఈ చెత్తంతా రెండేళ్ళుగా చూసి చూసి విసుగు పుట్టింది. కొత్తపాళీ అన్నట్లు అంత నాజూకే ఉంటే ఇక్కడిదాకా ఎందుకొస్తుంది? మీకు కామెంట్ మాడరేషన్ ఉందా ఇంతకీనూ?

  • సుజాత గారు
   థాంక్ యూ ,కామెంట్ మోడరేషన్ అంటే?కామెంట్ రాగానే అప్రూవ్ చెయ్యడమా,స్పాం లోకి పంపడమా,డిలీట్ చెయ్యడమా…ఇవే తెలుసు నాకు…ఇదే కామెంట్ మోడరేషనా?

 14. బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు మల్లీశ్వరిగారు…

  నాదో కంప్లెయింటు.. మీమీదే.. అప్పుడప్పుడైనా మీ బ్లాగుకొచ్చి కామెంట్ పెడుతున్నా కదా (పోస్టు చదివే అనుకోండి) మరి మీరు ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా బ్లాగులో కామెంటు పెట్టలేదు. ఆ సహాయం గురించి తప్ప. ఇలా ఎందుకని అడుగుతున్నామధ్యక్షా!!!!

  • జ్యోతి గారు. థాంక్ యూ…
   నిజమే ఈ సారి నుంచి శ్రద్ధగా చదివి కామెంట్ పెట్టడానికి ట్రై చేస్తా …మరి నా కామెంట్స్ కొంచెం క్రిటికల్ గా వుంటాయి…సబ్జెక్ట్ పరిధికి లోబడి…..

 15. మీ బ్లాగు గురించి జగధ్ధాత్రి గారు చెప్పేరు. అప్పుడు చూసేను.
  ఈ రోజు మీ బ్లాగు పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ బ్లాగూ, సాహిత్యకృషీ, నిరంతరంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.

 16. జాజిమల్లి గారు, నమస్తే. నిజమే మీరన్నట్టు ఈమధ్య పోస్ట్లు ఏమి వ్రాయడం లేదు. ఆఫీస్ పని ఒత్తిడి కొంత, కొద్ది ఆసక్తి తగ్గింది. ఎలాంటి విషయాలు వ్రాస్తే బాగుంటుందా అని ఆలోచనలో ఉన్నా. వ్రాయాలనే ఉంది కాని నేను వ్రాసేవేమి అంత గొప్ప విషయాలేమి కావండి. ఏదో నా సోది అంతే.

 17. మరో విషయమండీ రవిచంద్ర గార్కి ఈమధ్యే పెళ్ళి అయింది. అందుకు ఆయన బ్లాగ్కు దూరమై మొన్న మొన్నే తిరిగి మొదలుపెట్టారు. పిల్లకాకి బ్లాగ్ కృష్ణ గారు బ్లాగర్ లోకి మారిపోయారు. మీరు మాలికలోకి వచ్చి చూస్తే అందరూ కనబడతారు.

 18. మీ బ్లాగు పుట్టిన రోజు సందర్భంగా మీకూ పాఠకులకు శుభాభినందనలు.
  మీ బ్లాగు బహుళ ప్రయోజనకరమై ఆదర్శవంతమై జనానీకానికి మిక్కిలి తోడ్పడాలనీ, అందరి మన్ననలకూ పాత్రం కావాలనీ ఆశిస్తూ,
  అభినందిస్తున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s