సోంపేట ప్రజలు ఇంతగా పట్టుపడుతున్న ఈ బీల భూముల స్వరూప స్వభావాలు సాధారణ భూములకి భిన్నంగా వుంటాయి.తర తంపర భూములుగా కూడా వీటిని వ్యవహరిస్తారు.200 సంవత్సరాల కిందట చౌడు భూములుగా రెవిన్యూ రికార్డ్స్ లో నమోదయిన ఈ భూములపై రీ సర్వే జరగలేదు.పరిణామంలో చౌడు భూమి బీలగా మారిన విషయాన్ని ప్రజలు గుర్తించారు కానీ ప్రభుత్వానికి ఇంకా ఇవి చౌడు భూములుగా కనపడుతుండడం విశేషం.
మహేంద్రతనయ నది నుంచివచ్చే నీరు పల్లపు నేలలోకి ప్రవహించి నిలవ ఉండిపోతుంది సముద్రం పక్కనే వుండే బీల మంచి నీరు ఉప్పు నీరు కలయిక తో వుంటుంది. చేప గుడ్లు ఫలదీకరణం చెందడానికి బీల అనువుగా వుంటుంది రొయ్య చేప,బొంత చేప,బొంత నీటి చేప ఇక్కడ దొరుకుతాయి.
సముద్రపు ఆటుపోట్లని బీల అదుపు చేస్తుంది.బీల మూలంగా భూగర్భజలాలు సమృద్ధిగా వుంటాయి.పవర్ ప్లాంట్ వదిలే వ్యర్ధాలు బీలలోకి ఇంకినపుడు చుట్టు పక్కల బావుల్లో నీరు కలుషితమైపోతుంది. ఆస్ట్రేలియా .సైబీరియా నుంచి వలస వచ్చే 120 రకాల పక్షులు ప్లాంట్ ఏర్పడితే కనుమరుగవుతాయి.బీల గడ్డితో చాపలు గొడుగులు అల్లుతారు. సంవత్సరానికి రెండు పంటలు కూడా వేస్తారు.
మహేంద్రతనయ లో వర్షాలు వచ్చినపుడు బీల నిండి పోయి చేపలు చేతులకే అందుతాయి.బీలలో వున్న పాముల మెట్టలో 15 రకాల పాములు, అడవి పందులు,ఈత పందులు, తోడేళ్ళు,కూడా వుంటాయి.కలవ దుంపలు,దుద్డుందుంపలు దొరుకుతాయి.డెబ్భై శాతం కూలీలకి బీలే ఆధారం.భర్త చనిపోయినా బీలని నమ్ముకుని బతుకుతున్నానని,ఆ బీలే కలుషితమైపోతే ఎట్లా బతకాలని ఓ స్త్రీ ఆవేదన చెందింది.
అవును బీలంటే మనకి ఒక చిత్తడి నేల… మరి వారికి?
బీల…
ఇదొక ఇంటి పేరూ కాదు..
ఊరు పేరూ కాదు
ఒక ప్రాంత జీవన అస్తిత్వానికి సంకేతం.
బీల…
ఇదొక మాటా కాదు
పాటా కాదు..
‘నీరు నేల’ మాది అని నినదించిన
జీవజాల సామూహిక నినాదం
బీల..
ఇది నీటిలో ఈదే చేపా కాదు
గాలిలో ఎగిరే పక్షీ కాదు
ఏడుగురు రాజులతో పోరాడి గెలిచిన
మర్ల పోలమ్మ యుద్ధ జయకేతనం
(నారాయణ వేణు రాసిన కవిత ఇది)
మీ విశ్లేషణ బాగుంది. మంచి సమాచారాన్ని అందించారు. వేణు మాస్టారి కవిత బాగుంది. సోంపేట పోరాటంపై వచ్చిన కవితల్నీ, రచనల్నీ ఓ పుస్తక రూపంలో తీసుకు వస్తే బాగుంటుంది. నే రాసినది చదవగలరు మట్టి వేదం http://sahavaasi-v.blogspot.com/2010/08/blog-post.html
వర్మగారూ తప్పకుండా చదువుతాను.
sompta chuttupakkala prajalu raajakeeyanaayakulaku saanghikabhahiskarana,sahaayaniraakakana cheyali.prajalanu aa vaipugaa kaaryonmukulanu cheyyali.marlapolamma evaro telupagalaru.
గాజుల మల్లిక్ గారూ సోంపేట వరుస కధనాల మీద మీరు క్రమం తప్పకుండా చదివి స్పందించారు ఈ విషయం పట్ల మీ నిబద్ధత మీ కామెంట్ లలో తెలుస్తోంది.
మల్లీశ్వరి గారికి, నమస్కారములు.
“బీల” వాస్తవ్యుల దీనమైన “బేల” తనాన్ని చూస్తే గుండే తరుక్కుపోతుంది. కానీ కొందరు మహానుభావుల పుణ్యమా అని, వారందరూ కలిసి, తమ బేలతనాన్ని అలుసుగా తీసుకోవద్దని హెచ్చరిస్తూ సాధించుకొన్న తమ లక్ష్యం తీరు అభినందనీయం.
భవదీయుడు,
మాధవరావు.
narayana venu gari kavitvam chala bavundi.