ఇంకేం రుజువులు కావాలి?

సోంపేట పరిసర గ్రామాల ప్రజలు పవర్ ప్లాంట్ ని గుడ్డిగా తిరస్కరించలేదని,పవర్ ప్లాంట్ మూలంగా వచ్చే నష్టాల్ని స్వయంగా పరిశీలించాకే గట్టి నిర్ణయానికి వచ్చారని అక్కడి ప్రజలు,ఉద్యమ నాయకులు చెప్పారు.చేపల చెరువుల కోసం అని చెప్పి ముందుగా వ్యవసాయ భూముల్ని ప్రజల వద్ద కొనుగోలు చేసిన దళారులు వాటిని ఎక్కువ ధరలకి ఎన్.సి.సి (నాగార్జున కనస్ట్రక్షన్స్ కంపెని)కి అమ్మారు.ఆ తర్వాత ఆ భూముల్నీ,బీల ప్రాంతాన్నీ ఏక మొత్తంగా అత్యంత చవకగా కొన్న ఎన్.సి.సి, అక్కడ పవర్ ప్లాంట్ కట్టబోతోందని తెలిసి  మోసపోయామని ప్రజలు  అర్ధం చేసుకున్నారు.

అప్పటికీ ప్రభుత్వాన్ని ఎదిరించే చైతన్యం ప్రజల్లో కలగ లేదు.పవర్ ప్లాంట్ మూలంగా ఎన్ని నష్టాలు వస్తాయో వారికి అవగాహన లేదు.మానవ హక్కుల వేదిక,మత్స్యకారులసంఘం,పర్యావరణ పరిరక్షణ సమితి మొదలైన సంఘాలు ప్రజల్లో ఆ చైతన్యాన్ని కలిగించడం లో సఫలమయ్యాయి.

అందులో భాగంగానే విశాఖపట్నం దగ్గరలోని పరవాడ ఎన్.టి.పి.సి. థర్మల్ కర్మాగారం పరిసర ప్రాంతాలకు  సోంపేట ప్రజలు కొందరు పరిశీలన కోసం వెళ్ళారు.అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల్ని స్వయంగా చూసి, ప్రాణాంత వ్యాధుల బారిన పడిన అనేక మందితో మాట్లాడాక  పవర్ ప్లాంట్ వద్దే వద్దన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారు.

సోంపేట పోలీసు కాల్పుల్లో చనిపోయిన గొనప కృష్ణమూర్తి గురించి వివరాలు తెలుసుకోడానికి అతని  కుటుంబీకులతో మాట్లాడినపుడు కృష్ణమూర్తి సోదరుడు ”పీల్చుకోడానికి ఇంత చల్లని గాలి,తాగడానికి తియ్యటి నీళ్ళు, కాలి కింద కాస్త బూవి చాలు మాకు..ఇవి పోగొట్టి వచ్చే ఏ అభివృద్ధి మాకు అక్కర్లేదు”అన్నారు.

పవర్ ప్లాంట్ల నిర్మాణం ప్రజా ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో  పరవాడ పరిసర గ్రామాల ప్రజలు ఎదుర్కుంటున్న వ్యాధులు నిరూపిస్తాయి.ఫోరం ఫర్ బెటర్ విశాఖ (జె.వి రత్నం)నుంచి సేకరించినవి ఈ ఫోటోలు. వారికి కృతజ్ఞతలు.

ప్రకటనలు

12 thoughts on “ఇంకేం రుజువులు కావాలి?

  • వీర్రాజు గారూ
   ప్రజల జీవన్మరణ సమస్యల పట్ల మీకు చులకన భావం ఉండడం,
   దానిని మీరు ఇంత బాహాటంగా చెప్పగలగడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
   వ్యక్తిగతంగా నన్ను తీవ్రంగా విమర్శించిన వ్యాఖ్యలకి కూడా ఎపుడూ
   మనసు ఇంతగా నొచ్చుకోలేదు.

 1. వీర్రాజూ ఇవి దేనికి ఋజువులు అని వెకిలి నవ్వుతో అడిగిన ప్రశ్న కళ్ళుండీ చూడలేని, బుర్రుండీ ఆలోచించలేని, హృదయముండీ స్పందించలేని వీర్రాజులాంటి వ్యాధిగ్రస్తులు ఈ సమాజంలో ఉన్నారనటానికి ఋజువులు. జాజిమల్లి మీరు మనసు నొచ్చుకుంది అని ఇలాంటి వారికి చెప్పాల్సిన పనిలేదు, వీలయితే మీ రచనల ద్వారా వీర్రాజులాంటి వ్యాధిగ్రస్తులకి చికిత్స చేయండి.

 2. అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్టు మీరు అత్యుత్సాహంలో ఆ నిర్భాగ్యుల ఫోటోలు వాడుకుని పవర్ప్లాంట్ వల్ల అలాంటి రోగాలు ఇంకా ఎక్కువొస్తాయనడం, అర్థంలేనిదే కాదు అమానుషం కూడా. ఇంకా రాని ప్లాంట్ నుంచి వచ్చిన రోగాలా అవి? బుర్ర వుండే రాస్తున్నారా? పాఠకులను ఎర్రిపప్పలు చేయడానికా?

  • వీర్రాజు గారూ,
   ఇంకా రాని ప్లాంట్ నుంచి వచ్చిన రోగాలు కావు అవి.ఎన్.టి.పి.సి థర్మల్ పవర్ ప్లాంట్
   మూలంగా పరవాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వయంగా అనుభవిస్తున్న రోగాలు అవి.
   ఈ పరిస్తితులను ఇపుడు నేను కొత్తగా అత్యుత్సాహంతో చెప్పడం కాదు అనేక ప్రజా సంఘాలు,
   సోంపేట ప్రజలు స్వయంగా పర్యటించి నిర్దారించుకున్న తర్వాతే పవర్ ప్లాంట్ వద్దనుకున్నారు.
   పవర్ ప్లాంట్ వచ్చేసాక తీరిగ్గా రోగాల గురించి చర్చించుకోడం మీకు పరిష్కారంగా
   అన్పించి ఉండొచ్చు.కానీ సోంపేట ప్రజలు మనందరి కన్నా ముందున్నారు.తమకి వద్దనుకున్న
   వాటిని (రోగాలని కూడా) గట్టిగా తిరస్కరించడం తెలుసుకున్నారు.

 3. థర్మల్ మీద సోం పేట వారికి కలిగినవి ఎక్కువ అనుమానాలే, కానీ నిజాలు వేరు.
  అవి అన్నీ థర్మల్ ప్లాంట్ పెట్టడం వలనే రావటం సత్యదూరం.

  అవి థర్మల్ ప్లాంట్ లో ఏ ఒక్క కాలుష్య నియంత్రణ పాటించకపోవటం వలన వస్తున్నవి.
  వ్యర్ధాలు అన్నీ సరిగ్గా పారవేయటం ఖర్చుతో కూడుకున్న పని అని అలా ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేయటం వలన, అవి చుట్టు పక్కల ఏ ఒక్క ప్రాణిని బతకనివ్వటం లేదు.

  తరువాత సముద్ర జలాలను వాడటం వలన వచ్చే అత్యంత హానికారక ఉప్పు వలన సమస్త జంతు జాలం నశిస్తున్నది, మత్య్స్ సంపద మాట దేవుడెరుగు ముందు ఆ ఉప్పు వలన బ్యాక్టీరియా కుడా బతక జాలదు.

  ప్రభుత్వ సంస్థకే చట్టాల మీద ఇంత గౌరవం ఉన్నచో, అవినీతే ఊపిరిగా ఉన్న నాగార్జున వారు ఇంక ఎంత హాని కలిగిస్తారో, మరో సహారా ఎడారి అవుతుంది శ్రీకాకుళం..

 4. విజయవాడ థర్మల్ కేంద్రం పరిసర ప్రాంతాల్లోని ప్రజల ఫోటోలా, పొరబడ్డాను. నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా, తొలగించగలరు. దేశవ్యాప్తంగా వున్న అలాంటి ప్లాంట్స్ గురించి స్టడీ జరపాలి.

 5. సోంపేట రెండుసార్లు వెళ్ళిన మీరు వారి తరపున ఎంతో సానుభూతితో వరస కథనాలు ప్రచురిస్తున్నందుకు అభినందనలు తెలుపుకొంటున్నాను. ఆ అభివృద్ధి అనే బ్రహ్మ పదార్థం గురించి ఆలోచనపరులకు భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. దానికి పెద్ద ఉదాహరణ అరుంధతీ రాయ్. పెట్టుబడిదారులు తమ ప్రయోజనం కోసం ఆమె రాసిన నవలకు పెద్ద ఎత్తున బహుమతి ప్రకటించారు. వచ్చిన ప్రైజ్ మనీతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన ఆమె ఇప్పుడు అభివృద్ధికి మరో పార్శ్వాన్ని చూస్తున్నారు. దానినే ప్రపంచానికి చాటిచెప్తున్నారు. తనదాకా వస్తేగాని చాలా విషయాలు చాలామందికి అర్థం కావు. అయినప్పటికీ అర్థమయిన వారు వారికి తోచిన వ్యాఖ్యానాలను ఎలుగెత్తి చాటడం ప్రస్తుత అవసరం. ఆపని మీరు మరింత విజయవంతంగా చెయ్యాలని కోరుకుంటున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s