లక్షలూ కోట్లూ నాతో మాట్లాడవు కదా…

మా సోంపేట పర్యటనలో భావోద్వేగంతో నిండిన ప్రజల మాటలు, వారి హావభావాలు జానపద ప్రదర్శక కళల్ని గుర్తు చేసాయి… ఆ పర్యటనల్ని సమీక్షిస్తున్నపుడు వారి ఆవేశం,ఆక్రోశం ,ఉద్వేగాలు,ఉద్రేకాలు,వ్యంగ్యం,నిష్కల్మషత్వం,పట్టుదల అసంకల్పితంగా కళాత్మకతని సంతరించుకోవడం కన్పించింది.

సామాన్య ప్రజానీకం మాట్లాడిన పదునైన మాటలు,తమ ఉద్యమాన్ని బలపర్చుకోడానికి గోడల మీద వారు రాసుకున్న నినాదాలు నా అనుభవం లోకి వచ్చినవి మీకు పరిచయం చేస్తాను. కాల్పుల్లో గున్నా జోగారావు ను చంపేసిన ప్రభుత్వం ఆయన భార్యకు ఐదు లక్షల పరిహారం ఇస్తానంటోంది.  ”లచ్చలు,కోట్లు నాతో మాట్లాడవు కదా …నా పక్కన కూకుని నాకు మంచీ సెడు సెప్పవు  కదా” అని జగదాంబ దీనంగా  కుమిలిపోతున్నది.
బీల భూముల్లో నీరు బురద చాలా ఎక్కువ గా ఉండి ఎంత లోతుఉండేది తెలీదు దీని మీద ఒక రైతు సామెతొకటి చెప్పారు.
“కళింగ స్వాముల్నీ,నాగు పాముల్నీ,బీల భూముల్నీ” నమ్మకూడదని.
గొల్ల గండి వూళ్ళో  కోదండరాం అనే రైతు ”బీల తల్లి లాంటిది -బిడ్డలం మాం ఊరుకోం ”తర్జని చూపించి మరీ గట్టిగా చెప్పారు.
పోలీసులు,పవర్ ప్లాంట్ గూండాల దౌర్జన్యాల్ని ఎదిరిస్తామని చెపుతూ ”ఆళు  మూడు వేల మందొస్తే మాం ముప్ఫై వేల మందొస్తాం….ఆళు పొగ బాంబులేస్తే మాం బురద మట్టితో కప్పెడతాం…ఆళు అగ్గి బాంబులేస్తే  మాం పెట్రోల్ జల్లడానికైన సిద్ధం”అని రామాయ పట్నం మత్స్యకార మహిళ బట్టి మోయినమ్మ(మోహిని) శివ తాండవం ఆడేసింది. పలాసపురం గ్రామస్తులైతే ”భుక్తి కోసం భూమి కోసం నిలబడితే మా మీద నక్సలైట్లని ముద్రేస్తే… మరేటి సేస్తాం….మావు  అదే అవుతాం”అని నిర్ద్వందంగా తేల్చి చెప్పేశారు.
ప్రజలు ఇంటింటా ఊరూరా రాసుకున్న నినాదాలు ఇలా వున్నాయి
బీల మాకు ముద్దు -పవర్ ప్లాంట్ వద్దు
ప్రాణాలైనా అర్పిస్తాం-పవర్ ప్లాంట్ ఆపుతాం
రుషి కుద్ద బీల-ప్రజలు నమ్ముకున్న నేల
బీల మనది-నేల మనది
పవర్ ప్లాంట్ ఇచ్చేవి ఉద్యోగాలు కావు-ప్రాణాలు తీసే వ్యాధులు
పవర్ ప్లాంట్ ఆపుదాం-భావి తరాలను కాపాడుదాం
ప్రకటనలు

14 thoughts on “లక్షలూ కోట్లూ నాతో మాట్లాడవు కదా…

 1. బాగుంది.
  కానీ ప్రజలు ఎంతవరకూ, ఎంత ఎఫెక్టివ్‌గా ఈ ప్రభుత్వ గుండాయిజాన్ని ఎదిరించగలరో అనుకుంటే, కొంచెం నిరాశాగానూ దిగులుగానూ ఉంటోంది.

 2. ===
  “సోంపేట పోలీసు కాల్పుల్లో మరణించిన గున్నా జోగారావు భార్య జగదాంబ….” అని విచారంగా అంది.
  ===

  పైలైను చదివితే, తప్పు అర్థాలు వస్తున్నాయి. పోలీసు కాల్పుల్లో గున్నా జోగారావు భార్య జగదాంబ మరణిస్తే, ఆవిడ ఎలా మాట్టాడగలరూ? మరణించింది గున్నా జోగారావు అయితే, ఆ విషయం స్పష్టంగా రాయాలి.
  =====
  “సోంపేట పోలీసు కాల్పుల్లో గున్నా జోగారావు మరణించగా, ఆయన భార్య జగదాంబ……” అని విచారంగా అంది.
  ======
  పై విధంగా రాస్తే, విషయం స్పష్టంగా వుంటుంది.

 3. We want industrialization and we oppose big plants coming up.There is a gap between these two. we have to decide in which path we have to travel .Whether we want industrialization or not? If u want industrialization identify the land for industry and get consensus before put up industry there. Give some share to land owners in the coming plant so that they can have feel like they re part of the industry or on going development. Simply anybody can oppose but showing alternative make you more responsible citizen.

  • సింధు గారూ, మీరు మంచి పాయింట్ మాట్లాడారు.అభివృద్ధి నమూనా మీద ఇక ఇపుడు తప్పనిసరిగా చర్చ జరగాలి.ఎందుకంటే మా పర్యటనలో చాలా మంది సామాన్య ప్రజలు కూడా ఈ విషయాన్ని ప్రశ్నించారు.మా మిత్రులు విద్యా సాగర్ గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర గ్రామీణ జీవితంలో వచ్చిన ఆర్ధిక పరిణామాల మీద చాలా విస్తృతంగా అధ్యయనం చేసారు.అభివృద్ధి నమూనా మీద చర్చకు వీలుగా ఆయన ఒక వ్యాసం రాస్తానని చెప్పారు.రెండు రోజుల్లో అది నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.

  • వ్యవసాయ భూమి సేకరణ చట్టవిరుద్దం, వ్యవసాయ భూమిని తమకి ఇష్టం వచ్చినట్టు పోరంబోకుగా చూపించి దానిని కాజెయ్యటం పెద్ద నేరం..

   తరువాత, వ్యవసాయానికి అడ్డు వచ్చే డెవలప్మెంట్ నాశనమే, అది ఏ దేశంలోనూ జరుగదు, లాభం కోసం తప్ప వేరే స్థలం లేక కాదు అక్కడ పరిశ్రమ పెట్టటం,
   భూమి ఇస్తే, సారవంతమైన భూమి లాక్కోని, కొడలు, గుట్టలు ఇస్తారు. భూమి ఇవ్వమనటం కుడా హర్షణీయం కాదు, భూమి ఇవ్వటం మానేసి డబ్బులు ఇస్తున్న కారణం కుడా అదే.

 4. ఇది నిజమేనా లేక వండి వార్చినదా?

  చచ్చిపోయిన వారు పండి జొగారావు, గణప (గోనప) క్రిష్ణమూర్తి..
  వీరిలో ఎవరి గుంరిచి మీరు రాసినది? క్రిష్ణమూరి గారి భార్య లేదు కాబట్టి, పండి జోగారావు అనుకోవాలా?
  ఇలా ఇంతటి ముఖ్యమైన పెర్లే తప్పు రాస్తే, అసలు టపా మొత్తం పై అనుమానం వస్తున్నది.

  • జోగా రావు గారి భార్య జగదాంబ గారిని స్వయంగా కలిసి మాట్లాడడం ద్వారా సేకరించిన విషయమే రాసా..” బండి ” అనే ఇంటి పేరు గల వాళ్లకి దత్తు వెళ్ళారని కొందరు అన్నారు.అధికారికంగా ”గున్నా”అనే పేరే వాడుతున్నామని ఆమె చెప్పారు.స్పందించినందుకు ధన్యవాదాలు.

 5. ధన్యవాదాలు, జవాబుకి.

  క్షమించగలరు, నా రెండో కామెంట్ కి.
  అది మీ తప్పు కాదు, వార్డ్ ప్రెస్ వారిది, నా కామెంట్ కాసేపు కనపడి ఒక అరగంట అయ్యాక మాయం అయ్యింది, అది చూసి నేను మీరు డిలీట్ చేసారెమో అని అనుకున్నాను..

  బ్లాగరే కాకుండా, వార్డ్ ప్రెస్ లొ కుడా ఇలాంటి బగ్స్ ఉండటం శొచనీయం..

 6. టైటిల్ బాగుంది.
  ఆ మాట చెప్పినామెకి ఉన్న జ్ఞానం మన రాజకీయనాయకులకి, వ్యాపారులకి ఉంటే ఇలా అడ్డగోలు సంపాదన కోసం ఎగబడరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s