నెత్తిన కుంపటి రగల్చబోతే

సోంపేట దగ్గరలోని వూళ్ళన్నీ  తిరుగుతున్నపుడు మేం రచయితలం అనగానే చాలా మంది సోంపేట గురించి పవర్ ప్లాంట్ గురించి కధల్లో కవిత్వాల్లో రాయమని మరీ మరీ కోరారు.మా బృందం లో కవులు గాయకులూ ఉన్నారు ముఖ్యంగా ‘పినలగర్ర’ కవితా సంపుటి వేసిన ఆర్.రామకృష్ణ కవీ గాయకుడు కూడా. అతను రెండ్రోజుల వ్యవధిలో సోంపేట గురించి రాసిన గేయం అక్కడి ఉద్యమ కారులని బాగా ఆకట్టుకుంది ప్రతి వూళ్ళోనూ  ప్రజలు ఆ గేయాన్ని నెత్తిన పెట్టుకున్నారు.85 ఏళ్ల రాజవ్వ ఈ  ప్రజా ఉద్యమంలో  చాలా ఉత్సాహంగా పాల్గొంటోంది రామకృష్ణ పాట వినగానే సంబర పడి ఇలాంటి పోరు గీతాలు రాసిస్తే అందరికీ నేర్పుతామని అడిగింది.ప్రతి వూళ్ళో ఆ గేయాన్ని అనేక మార్లు పాడించడమే కాక  అందరూ నోట్ చేసుకున్నారు కూడా …..సామాన్య ప్రజల నాలుకల పై నిరంతరం కదలాడి ఉత్తేజితుల్ని చేసేదే సాహిత్యం అయితే ఇదుగో .. అద్భుత ప్రజా సాహిత్యం ఎలా ఉంటుందో ఈ గేయం లో చూడండి.

సోంపేట చూసొద్దాం రారండి
అన్నలారా ఓ అక్కలారా
ఉద్దానం కెల్లొద్దం  రారండి
..సోంపేట..
పచ్చని చేలట పండ్ల తోటలట
బీల భూములట పాలపిట్ట లట
ప్రకృతి నిత్యం పచ్చగుండగా
ముచ్చట గొలిపే చక్కని పేరు
…సోంపేట..
మూడు నదులు ఇట పారుచున్నవట
ముప్ఫై గెడ్డలు వచ్చి చేరునట
నీటి ఎద్దడి ఎరుగని భూమట
పశు పక్ష్యాదులకాలవాలమట
….సోంపేట..
ఉప్పు సముద్రం పక్కనున్నదట
మత్స్యకారులకు మంచి నేస్తమట
ఎప్పటికప్పుడు జలపుష్పాలను
ఏరుకోమని దారి సూపునట
…సోంపేట..
దూర దేశముల పక్షి రాజములు
ప్రకృతి శోభను పల్లవింపగా
ప్రతి ఏటా ఇటకొచ్చిపోవునట
పర్యాటకులకు మంచి నేస్తమట
…సోంపేట..
పెట్టుబడులను పట్టుకు తిరిగిన
విదేశి కంపెని బడాయి బాబులు
స్వదేశి దొంగల సాయం బొంది
అభివృద్ధంటూ అడుగు పెట్టిరట
…సోంపేట..
చేపల రొయ్యల చెరువులన్నరట
సాగు చేసితే లాభమన్నరట
సహజ సంపదలు కలిగిన నేలను
చౌడు భూములని చక్కబెట్టిరట
…సోంపేట..
కరెంటు కంపెని పెడతామంటూ
నెత్తిన కుంపటి రగల్చబోతే
కరకు కంపెని మా కొద్దంటూ
కస్సున లేచి బుస్సున పొంగిన
…సోంపేట..
ఉప్పు సముద్రం చచ్చుపడతది
జాలరి వలలకు జబ్బు చేస్తది
పశువులు పక్షులు పాడె కెక్కుతయి
బువ్వ పోయి మరి బూడిదొస్తది
చుట్టు పక్కల ఇరవై వూళ్ళకు
నష్టమొస్తది కంపెని వలనని
అక్కడి ప్రజలకి అర్ధమైనది
కంపెని కాదది కాల యముడని
ఒక్కటయ్యి మరి ఉప్పెన లేపిన
…సోంపేట..
ఉద్యమాలకు పురుటి గడ్డరా
ఉద్దానం కెల్లొద్దం రండి
వెల్లొద్దం రండి
పిడికెడు మట్టిని తెద్దాం రండీ
తెద్దాం రండీ
ఊరు ఊరునా చల్లుదమండి
పోరు మొక్కలు నాటుదమండి
…సోంపేట..

(ఈ గేయాన్ని నా బ్లాగ్ లో పోస్ట్ చేయడానికి అనుమతించిన మిత్రులు ఆర్.రామకృష్ణ గారికి కృతజ్ఞతలు)

ప్రకటనలు

8 thoughts on “నెత్తిన కుంపటి రగల్చబోతే

  • అఫ్సర్ గారూ,మీరన్నది నిజం…ఒక గేయం
   ఒక పూట వ్యవధిలో ఎంత మంది ప్రజలని
   కదిలించిందో స్వయంగా చూసాం.అవును …ఇదే సాహిత్యం..
   స్పందించినందుకు ధన్యవాదాలు
   మీ ప్రశంసలు రామకృష్ణ గారికి తెలియజేస్తా.

 1. ఉద్దానం ప్రాంతం బ్రిటిష్ వాళ్ల టైమ్ లో కూడా ఉద్యమాల సీమే. సోంపేట దగ్గర కట్టే థర్మల్ విద్యుత్ కేంద్రానికి భూగర్భ జలాలు వాడుతారట. ఆ ప్రాంతంలో కొబ్బరి చెట్లు భూగర్భ జలాలు ఆధారంగా పెరుగుతున్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రం భూగర్భ జలాలని తాగడంతో పాటు వాతావరణంలో వేడిని కూడా పెంచుతుంది. అప్పుడు కొబ్బరి చెట్లు చనిపోతాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s