కల్పనా …..ఏక్ పల్…

  ప్రియమైన కల్పనా!
 
ఎలా ఉన్నావు?మాటల్లో రాతల్లో తప్ప మనిద్దరం ఎపుడూ కలుసుకోక పోయినా అనకాపల్లికీ అమెరికాకీ ఉన్నంత దూరం మాత్రం మన మధ్య లేదనుకుంటున్నాను. నువ్వు రాసిన ఏక్ పల్ కధని నీ బ్లాగ్ లో చదివాను.
 
సాహిత్యం అనగానే ఎకోలెక్స్ వీరుల్లా కత్తి చేత పట్టి ఖండ ఖండాలుగా ఛేదించే  మా ఉత్తరాంధ్ర మౌఖిక విమర్శకులు నీ కధ చదవగానే  గుర్తొచ్చారు. ఒక్క క్షణం నేనూ ఉబలాటపడ్డాను.
 
కానీ నువ్వు మృదువుగా, హాయిగా , ఇంచగ్గా  ప్రేమ కధ కదా రాసావు ……..కత్తులకీ ప్రేమలకీ పొసగదులే….ప్రేమని ప్రేమతోనే కదా జయించాలి?అందుకే కధ చదవగానే నాకు అన్పించిన నాలుగు మాటలు ప్రేమగా చెపుతా.
 
ఒక స్వేచ్చాయుత  మానవ సంబంధం గురించి ధైర్యంగా కధ రాసినందుకు ముందుగా నీకు అభినందనలు.
 
స్వేచ్ఛాయుత ప్రేమ సంబంధంలోని స్వేఛ్చ రాహిత్యాన్ని గుర్తించి కూడా ‘ఏక్ పల్’ కే ఎందుకు విలువ ఇచ్చావు కల్పనా? ఏ మానవ సంబంధం లోనైనా ప్రేమ మౌలికమా? స్వేఛ్చ మౌలికమా? వర్తమానంలో ఆ ఒక్క క్షణం ప్రాధాన్యత దానిదే…కానీ ప్రతి క్షణానికీ ఉండే పర్యవసానాన్ని కూడా మనిషి ఉహిస్తాడు. దానికి అనుగుణంగానే భవిష్యత్తుని నిర్మించుకుంటాడు.
 
నిజమే ప్రేమ ఒక సునామీ…. చెప్పకుండానే ముంచెత్తేస్తుంది. కానీ  విచక్షణ అనేది సునామీ హెచ్చరిక కేంద్రం అనుకోకూడదా?  కనీసం మునిగి పోకుండా జాగ్రత్త పడతాం. 
 
‘ఏక్ పల్’ జీవితం ఐతే మాట్లాడక పోదును. కానీ అది కధ కదా………అనుభూతుల  గొడవ కాదు కదా……మనమేం చెపుతున్నామో   అందరూ వింటున్నారు కదా…….ప్రేమ సంబంధాల చుట్టూ ఉండే ఎన్నో డైమన్షన్స్ ని,   వాటి సంఘర్షణలని ఏం కానట్టు తోసేసి ‘ఏక్ పల్’ కే ప్రాధాన్యత నిచ్చావన్న  కినుక తో స్పందించాను తప్ప ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఏ సంబంధమైనా అది వారి సమస్య తప్ప మనకేలా? ఎవరికైనా ఏలా?
 
తన్హాయి మొదలు పెట్టినట్లున్నావు. లోటు  పూరిస్తావని  ఆశిస్తున్నాను . 
                                                                                           ప్రేమతో…….
                                                                                              మల్లీశ్వరి.

ప్రకటనలు

3 thoughts on “కల్పనా …..ఏక్ పల్…

 1. చాలా రోజుల తర్వాత ప్రేమ కథ చదివించారు. ఆ కల్హారా లోనైన సునామీకి హెచ్చరికగా మీ లేఖ బాగుంది. తన్హాయి మొదలుపెట్టడం మన చేతిలో లేనట్లే పూరించడం కూడా వుండదనుకుంటాను…

 2. సాగర్ వర్మ గారు
  నేను కల్హార ని ముంచెత్తిన సునామీ కి హెచ్చరిక గా లేఖ రాయలేదు. ఎందుకంటే ఎవరి హెచ్చరికలతో నిమిత్తం లేకుండానే సునామీలు వస్తాయి. వ్యక్తుల మధ్య నిర్నిబంధంగా ఉండాల్సిన స్వేఛ్చ మీద నాకు చాలా గౌరవం వుంది.కానీ మన స్వేఛ్చ ప్రైవసీ తో ముడిపడి ఉందా దాపరికం తో ముడి పడి ఉందా అనేది సమస్య .అది కధ లో పూర్తిగా ఎలివేట్ అవ్వలేదు.

 3. “స్వేచ్ఛాయుత ప్రేమ సంబంధంలోని స్వేఛ్చ రాహిత్యాన్ని” అని జాజిమల్లి రాసారు. స్వేచ్ఛాయుత ప్రేమ సంబంధంలో స్వేఛ్చ రాహిత్యం అంటే చాల తికమక గా వుంది. స్వేచ్ఛాయుత ప్రేమ సంబంధం అంటే సేచ్చ ఉన్నట్లా లేక లేనట్లా?

  అలాగే జాజిమల్లి గారు “స్వేఛ్చ ప్రైవసీ తో ముడిపడి ఉందా దాపరికం తో ముడి పడి ఉందా ” అనేది సమస్య అన్నారు. నాకయితే ప్రైవసీ కి దాపరికానికి ఉన్న తేడా , ఈ స్వేచ్చకి రెండింటికి ఉన్న ముడి, ప్రేమ సంబంధాన్ని ఏ విధంగా మలుపులు తిప్పుతుంది అనే విషయం చెపుతూ, వాస్తవ జీవితంలో ఇద్దరు వివాహితుల మధ్య సంబధాన్ని తప్పా ఒప్పా అని నిర్ణయించేలాగ కాకుండా ఆ ప్రేమ ని ఎలా అర్ధం చేసుకోవాలో చెపితే బాగుండేది.

  నాకనిపిస్తుంది కల్హార కి ఒక బలమైన అనుభూతి కలిగింది, ఆ అనుభూతి ఎంతకాలముంటుందో కల్హారకే తెలియదు , కాని కల్హార లో కన్విక్షన్ ఉంది. అందుకేనేమో కల్పన ఏక్ పల్ అన్నారు అనుకుంటున్నాను.

  ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనిపిస్తుంది. జీసస్ అందరినీ ప్రేమించమని చెప్పిన విషయం పసిపిల్లలకి కూడ అర్ధమవుతుంది కాని జీసస్ చుట్టూ అల్లిన తత్వం బహుశా జీసస్ కి కూడ అర్ధమవదేమో!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s