రంగనాయకమ్మ గారితో కాసేపు —3

మనలో మనం రచయిత్రుల వేదిక 2010  ఫిబ్రవరి 27 ,28  తారీకుల్లో జరిగిన విశాఖ సదస్సులో  పూర్తి స్థాయి నిర్మాణాన్ని పొంది ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’గా ఆవిర్భవించింది వేదిక తమ మొదటి పబ్లిక్ మీటింగ్ లో కీ నోట్ ప్రజెంట్ చేయడానికి రంగనాయకమ్మ గారిని పిలవడం,ఆమె వెంటనే అంగీకరించడం వేదిక లోని వారికీ బయట చాలా మంది రచయిత్రులకు ఆనందాశ్చర్యాలను కలుగ జేసింది.ఎందుకంటే ఆమె బయట సమావేశాలకు చాలా తక్కువ సార్లు మాత్రమే వస్తారు.అందుకే మేం ఈ  కార్యక్రమాన్ని నాలుగు రోజుల వ్యవధిలో హడావిడిగా ఏర్పాటు చేసినా చాలా మంది రచయిత్రులు ఆమెని కలిసి మాట్లాడటం కోసం వచ్చారు.
ఇష్టా గోష్టి ని ప్రారంభిస్తూ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యక్షురాలు చల్లపల్లి స్వరూప రాణి స్త్రీలందరి సమస్యలు ఒకటి కావనే రాజకీయ అవగాహన తో వేదిక ప్రారంభమైనదని  చెప్పారు.తర్వాత రంగనాయకమ్మ వేదిక లక్ష్యాల గురించి,అస్తిత్వ సమస్యల గురించీ మాట్లాడారు.(ప్రసంగం పూర్తి పాఠం ఆంధ్ర జ్యోతి ‘వివిధ’లో మే,31 అచ్చయింది)తర్వాతి చర్చకి  వేదిక  ప్రధాన కార్యదర్శి కాత్యాయనీ విద్మహే సమన్వయ కర్త గా వ్యవహరించారు .సంఘాల నిర్మాణం  పితృస్వామిక  స్వభావానికి లోబడి ఉంటుంది కాబట్టి సంఘాల నిర్మాణం అనవసరం అన్న విమర్శ గురించి మల్లీశ్వరి అడగ్గా ,లెస్బియనిజం గురించి ,తమదైన సంస్కృతిని నిలబెట్టుకోవడం అస్తిత్వంలో భాగమేనన్న విషయాన్ని ముదిగంటి సుజాతా రెడ్డి ప్రస్తావించారు .
సమాజం మారాలంటే ముందు మనుషులు మారాలని,విమర్శ కన్నా ముందు ఆత్మ విమర్శ అవసరమని అబ్బూరి ఛాయా దేవి చెప్పారు.ఖలీదా పర్వీన్ ముస్లిం అస్తిత్వం గురించీ బురఖ సంప్రదాయం నిల బెట్టుకోవడం గురించీ మాట్లాడగా రంగనాయకమ్మ ఇచ్చిన సమాధానం చర్చకి దారి తీయగా మరొక ముస్లిం రచయిత్రి బురఖా  గురించి ఖురాన్ లో ఏం వుంది అన్నది చెప్పారు
మార్క్సిజం ఆర్ధిక వాద ప్రభావానికి నెగెటివ్ వే లో లోనవుతోందా?అని విమల అడిగారు.’దళిత సమస్య పరిష్కారానికి …..’అన్న పుస్తకంలో  అంబేద్కర్ గురించి రంగనాయకమ్మ చేసిన విమర్శను గోగు శ్యామల ప్రశ్నించారు .రచయిత్రులు సాహిత్య సామాజిక కార్యకర్తలుగా ఉండాల్సిన అవసరం గురించి రత్నమాల అడగ్గా, పరిణామ క్రమంలో భాగంగా మార్క్సిస్ట్ ఉద్యమాలను చూడాలని తుమ్మల పద్మిని అన్నారు .మేరీ మాదిగ ఒక గేయాన్ని ఆలపించారు మొత్తం కార్యక్రమాన్ని కాత్యాయనీ విద్మహే సమీక్షించారు.(పై  ప్రశ్నలకి రంగనాయకమ్మ సమాధానాలు వీడియో లో చూడొచ్చు.)
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రచయిత్రులు :కొడవటి గంటి వరూధిని,అబ్బూరి చాయాదేవి ,డి.కామేశ్వరి,పొత్తూరి విజయలక్ష్మి,తురగ జానకీ రాణి,పోడూరి కృష్ణకుమారి,చల్లపల్లి స్వరూప రాణి,కాత్యాయనీ విద్మహే,ఆర్.శాంతసుందరి,రత్నమాల,మల్లీశ్వరి,చూపు కాత్యాయని,ఘంటసాల నిర్మల,పి.ఓ.డబ్ల్యు .సంధ్య,కె.సుభాషిణి,కుప్పిలి పద్మ,సమతా రోష్ని, తుమ్మల పద్మిని,హేమ లలిత,మేరీ మాదిగ,విమల,అరుణా,ఖలీదా పర్వీన్,వారణాసి నాగ లక్ష్మి,మొదలైన 60 మందికి పైగా రచయిత్రులు పాల్గొన్నారు.
(నా బ్లాగ్ లో ఈ వీడియో క్లిప్పింగ్స్ పోస్ట్ చేయడానికి ఓపికగా సాంకేతిక సహకారాన్ని అందించిన కె క్యూబ్ వర్మ గారికి ధన్యవాదాలు.)

అనివార్యకారణాలవలన వీడియోను తొలగించడమైనది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s