రంగనాయకమ్మ గారితో కాసేపు……….

చదవడానికి రంగనాయకమ్మగారి పుస్తకం దొరికితే గొప్ప ఇన్స్పిరేషన్ …..ఆ ఇన్స్పిరేషన్ కి కారణ మైన  ఆమె తోనే మాట్లాడే అవకాశం వస్తే …..సంవత్సరం కిందట మొదటి సారి ఆమెని కలిసాను….’మనలో మనం’రచయిత్రుల వేదిక  నిర్మాణం లోకి వెళ్ళడానికి చేస్తున్న కృషిని
చాలా శ్రద్ధగా అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు ఇచ్చారు.
రంగనాయకమ్మ గారు బైట మీటింగ్స్ కి వచ్చే సందర్భాలు చాలా  చాలా అరుదు.ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక  మే 22 న హైదరాబాద్ లోని  ప్రోగ్రెస్సివ్ మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన చర్చాగోష్టి కి ఆమె వచ్చి కీ నోట్ ప్రజెంట్ చేసారు. ఆ సందర్భంగా జంట నగరాలలోని అనేక మంది రచయిత్రులు రంగనాయకమ్మ గారితో ముఖా ముఖి లో పాల్గొన్నారు .

ఆ చర్చాగోష్టిలో ఆమెతో చర్చించిన అమూల్య దృశ్య కథనం చూడగలరుః

అనివార్యకారణాలవలన వీడియోను తొలగించడమైనది.

రంగనాయకమ్మ గారితో రెండున్నర గంటల ఇష్టా గోష్టిని యాబై నిమిషాల వీడియో గా ఎడిట్ చేసాము.పది పది నిమిషాల చొప్పున వీలు వెంబడి పోస్ట్ చేస్తాను.
ప్రకటనలు

19 thoughts on “రంగనాయకమ్మ గారితో కాసేపు……….

 1. రంగనాయకమ్మ గారిని చూడాలనీ, కలవాలనీ ఎన్నేళ్ళుగానో అనుకుంటున్నా నాకు ఇప్పటివరకూ కుదరలేదు. మా LGBT ఉద్యమం గురించి వారికి వివరించి వారి అభిప్రాయం తీసుకోవాలి.

 2. రంగనాయకమ్మ గారితో జరిగిన చర్చా కార్యక్రమాన్ని యథాతథంగా వీడియోలో చూడటం బావుంది. వీడియో చూపించాలన్న మీ ఆలోచన మంచిదే కానీ, చర్చ గురించి పూర్తిగా తెలియటానికి మరో నాలుగు వీడియో భాగాలు పెట్టేదాకా వేచిచూడాల్సివస్తోంది!
  ప్రశ్నలు అడిగినవారి పేరు ఏమిటో తెలియటం లేదు. వారి పేర్లు జోడించి, వీడియో లోని ప్రశ్నలూ జవాబులను ఈ బ్లాగులో text రూపంలో ఇస్తే బావుంటుంది! ఈ కార్యక్రమం ఎలా జరిగిందీ, సభ్యుల స్పందనలేమిటో కూడా రాయవచ్చు.

 3. వేణు గారు మీ సూచనను ఆచరణ లో పెట్టడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను సాంకేతిక పరిమితుల వల్ల ఐదు భాగాలు చెయ్యాల్సి వచ్చింది ఒకేసారి వీడియో ఇవ్వడానికి వీలుంటుందేమో తెలుసుకుంటాను

 4. వావ్. రంగనాయకమ్మ గారిని చూట్టం, మాట్లాడుతూంటే వినటం నాకు మొట్టమొదటిసారి (ఎప్పుడో ఒకసారి ఫోటో చూసా లెండి). ఆవిడ రాసిన విషవృక్షం నేను చిన్నప్పుడెప్పుడో చదివినప్పుడు విపరీతమయిన ప్రభావం చూపించింది.

  పూర్తి కాంటెక్స్ట్స్ ఉంటే బావుండు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు ఆవిడిచ్చిన ఆన్సర్స్ they are showing her in poor light. As well and wide read she is, it is difficult to comprehend such basic ignorance on some fundamental issues. I am not jumping into conclusions though .

  THANKS A LOT for your service

  KumarN

 5. బారత దేశం లో భిన్న సంస్కృతి సాంప్రదాయాలు వున్నాయని జగద్విదితం…ఆచార వ్యవహారాలూ వారి మతమునకి తగినట్లు వుంటూ తరతరాలుగా వస్తుంటాయి .మారాలి అంటూ ఒక స్త్రీ వస్త్రధారణ ని విమర్శించడం ఎంతవరకి సమంజసం …బురకాలు ధరించడం తప్పు ,జీన్స్ ప్యాంటు వేసుకోవడం తప్పు …అంటే ఎలా వుండాలని ?కొన్ని ముస్లిం దేశాల్లో మగవారు కూడా పయినుండి కింది వరకు కవర్ చేసేస్తారు తలకూడా కవర్ చేస్తారు.
  ఆ మద్య ఆసిడ్ దాడులు ఆడపిల్లల మీద జరిగినపుడు బురకాలు వేసుకుని కాలేజికి వెళ్ళడం మంచిదేమో అని పిల్లలు మాట్లాడుకోవడం విన్నాను .పూర్తిగా వస్త్రం ధరించడం తప్పుకాదు “పొదుపు”గా దరిస్తేనే తప్పు .సతి సహగమనం ,బాల్యవివాహాలు ,దేవదాసి ఆచారాలు తప్పు , స్త్రీకి హాని కాబట్టి ఇవి తప్పు అని ఖండించవచ్చు,భాల్య వివాహాలు కొన్ని ప్రాంతాల్లో ఇంకా జరుగుతూనే వున్నాయి అక్కడ మార్పు తేవాలి
  …నిండుగా దుస్తులు ధరించడం తప్పేమిటో అర్ధం కాలేదు ..అరకొర దుస్తులు ధరించే సినిమా హీరొయిన్ లలో మార్పు తెస్తే బాగుంటుందేమో .

 6. రెండో భాగంలో బురఖా పద్ధతి గురించి సీరియస్ గా చర్చ జరిగింది. చివర్లో రంగనాయకమ్మ గారి మాటలు అసంపూర్తిగా ముగిశాయి. అలా జరక్కుండా ఎడిటింగ్ లో జాగ్రత్త తీసుకునివుండాల్సింది.

  ‘నిండుగా దుస్తులు ధరించటం తప్పేమిటో అర్థం కాలేదు’ అన్నారు, Chinni తన వ్యాఖ్యలో. రంగనాయకమ్మ గారి విమర్శ- మొహం కనపడకుండా ఉండే బురఖా పద్థతి గురించి మాత్రమే! అది ‘డిగ్నిటీ’ అని భావిస్తున్నానని ఆ ముస్లిం మహిళ తన అభిప్రాయం కూడా చెప్పారు కదా? ఇది బహిరంగ సభ కాదనీ, రచయిత్రుల ‘చర్చా గోష్ఠి’ మాత్రమే అనీ గుర్తుంచుకోవాలి. సున్నిత అంశాలైనప్పటికీ ఇలాంటివాటిపై కూడా నిర్మొహమాటంగా, ప్రజాస్వామికంగా చర్చ జరగటం మంచిదే కదా?

 7. ఏ మతంలో చెప్పినట్టయినా, పురుషాధిక్యత వల్ల స్త్రీ వస్త్ర ధారణ ఒక రకంగా వుంటే, అది తప్పు. ఒకే మతానికి చెందిన ఇద్దరు స్త్రీలు బురఖా విషయంలో రెండు రకాలుగా మాట్టాడారు, చూశారా? హిందూ మతానికి చెందిన దేవుళ్ళు బహు భార్యాత్వం కలిగి వున్నప్పటికీ, ఆ దేవుళ్ళని నమ్మే మనుషులు, కొన్నాళ్ళకి అది తప్పు అని తెలుసుకుని, బైగమీ చట్టం తెచ్చుకున్నారు. మతాల్లో చెప్పినట్టు మనుషులు వుండటం లేదు ఈ రోజుల్లో ఆ మతాల్ని నమ్మినప్పటికీ. బురఖా అనేది స్త్రీ మొహం, మెడా, గట్రా కనబడకూడదని. అది తప్పు. పురుషులు కొన్ని సంస్కృతుల్లో కాళ్ళ నించీ నెత్తి వరకూ దుస్తులు ధరించినా, అది వాళ్ళ ఇష్టంతో వాళ్ళు చేసుకున్న పద్ధతి (వాళ్ళ మత సంస్కృతి ప్రకారం). వాళ్ళు కూడా బురఖా వేసుకుని మొహం దాచుకోవడం లేదు.

  జీన్సు ఫాంటూ లాంటి బట్టలు బిగుతుగా వుండి, శరీరంలోని భాగాల ఆకృతిని బహిరంగ పరుస్తాయి, మొగాళ్ళ కయినా, ఆడవాళ్ళ కయినా. అది చెత్త కాబట్టీ, అది తప్పు.

  ఆసిడ్‌ పోసే దౌర్భాగ్యుల నించీ తప్పించుకోవడానికి బురఖాలు ధరించడం పరిష్కారం కాదు. అలా తప్పుగా మాట్టాడాలంటే, ఆడవాళ్ళు బయట తిరగడం ప్రమాదం కాబట్టీ, ఇంట్లోనే వుండి, వంటలు చేసుకుంటూ, ఇల్లు సర్దుకుంటూ, ప్రమాదం లేకుండా వుండాలి అని మాట్టాడాలి. ఈ అర్థం లేని మాటలు ఎవరూ ఒప్పుకోరు.

  తప్పేమిటో, రైటేమిటో తెలుసుకునే తర్కం వుండాలి. పెట్టుబడి దారీ సజాజం ఎటువంటి సంస్కృతిని తీసుకు వస్తుందో అర్థం చేసుకోవాలి. బాగా చదవాలి విషయాలు తెలుసుకోవడం కోసం.

 8. @వేణుగారు
  ఇది బహిరంగ సభ కాకపోయినా ,రచయిత్రుల అంతర్గత ఇష్టా గోష్టి అయిన అది బహిరంగంగా పెట్టారు కాబట్టి నేను చుసిన దాని బట్టి నా సందేహం కాని నా ‘అజ్ఞానం ‘కాని వెలిబుచ్చాను .నేను చిన్నప్పుడు రంగనాయకమ్మ గారి రచనలు చదివి అడ్మిర్ చేసినదాన్నే.ఎవరైనా ఏదైనా సున్నితమైన అంశం అయిన ఈ’ సెక్యులర్’ కంట్రీలో ప్రకటించే భావస్వేచ్చ ఉందనే అంటాను.బురక తప్పు తప్పు అని నొక్కి వక్కాణించారు కాబట్టి ఎందుకు తప్పో అని నేను వెలిబుచ్చాను ,ఆ స్త్రీ దానిని గౌరవంగా బావిస్తున్నాను అని చెప్పిన అది తప్పు అంటూ అలానే ఆ మతం లో వున్నా పురుషునికి సంభందించిన నియమం కూడా తప్పు అని వ్యాఖ్యానించారు ..ప్చ్ ..
  @pAThakuDu
  చూడండి బురక వేసుకుంటే ‘రక్షణ’ దొరుకుతుంది అని అన్నది నేను కాదు , ఒక కళాశాల లో అక్కడి విద్యార్ధినులు వ్యక్తపరిచిన అభిప్రాయం అది ఉదహరించాను .వస్త్రదారణ అంటారా ,మతాచారాలు బట్టే కాక …కొన్నిప్రాంతాల బౌగోళిక పరిస్థుల బట్టి కూడా వస్త్రధారణ వుంటుంది ,చర్చించాలి అంటే ఇంకా లోతుగా వెళ్ళొచ్చు
  .
  కొంతమంది స్త్రీ వాదులు చిన్న చిన్న విషయాలు పట్టుకుని ఏ మాత్రం చెరుపు లేని వాటిని బూతద్దం లో చూపిస్తూ అస్సలు పట్టి పీడిస్తున్న అంశాలను పట్టించుకోరు ,పట్టించుకున్న అవి రాతలు సభలు సమావేశాల వరకే పరిమితం ఆచరణలో శూన్యం…ఇది నేను చూసిన ప్రపంచం .

 9. రంగనాయకమ్మ గారి పుస్తకాల్లో ఎంత క్లారిటీతో విషయం అర్థం అయ్యేలా వివరిస్తారో ఆమె మాటలు కూడా అంతే క్లారిటీ తో ఉన్నాయి.చాలా చాలా బావుంది ఇలాటి చర్చ చూడ్డం!

  చిన్ని గారూ,
  యాసిడ్ దాడి జరిగినపుడు ఇక బురఖా వేసుకుని కాలేజీకెళ్ళాల్సిందే అని పిల్లలు అనుకోడం ఒకరకమైన ఆవేదనతోనూ నిస్పృహతోనే కానీ, నిజంగా బురఖా ధరించాలని కాదు కదా!

  మీరన్నట్లు బట్టలు పొదుపుగా ధరిస్తేనే ప్రమాదం!

  మల్లీశ్వరి గారూ,అన్ని భాగాలూ ఒకేరోజు పెట్టేసే ఏర్పాటేదో చెయ్యకూడదూ!

 10. మూడో భాగంలో రంగనాయకమ్మ గారు చెప్పిందానికంటే అడిగినవారి ప్రశ్నల నిడివి ఎక్కువనిపించింది. 🙂 పైగా ప్రశ్న అడిగి, మైకు రంగనాయకమ్మ గారికి వెంటనే ఇవ్వకపోవటం వల్ల ఆమె చెప్పింది స్పష్టంగా వినిపించలేదు.

  నాలుగో భాగం దీనికంటే బెటర్ గా ఉంది.‘ఎవరి తప్పులున్నా నేను విమర్శించాను’,‘ఎవ్వర్నీ వెనకేసుకురాలేదు, ‘అంబేద్కర్ ని నేను అర్థం చేసుకున్నాను’, ‘కథలు దేనిమీద రాస్తారు, స్పందించపోతే?.. స్పందించే రాస్తున్నారు కదా!’అంటూ రంగనాయకమ్మ గారు చెప్పిన సమాధానాలు నిర్దిష్టంగా ఉన్నాయి.

  చివరి భాగం వీడియో పెట్టటంతో పాటు, ఈ కార్యక్రమంపై ‘వేదిక’ సభ్యుల అభిప్రాయాలూ, నిర్వాహకుల స్పందన కూడా ఈ బ్లాగులో రాస్తే బావుంటుంది.

 11. పింగుబ్యాకు: ’మనలో మనం’రచయిత్రుల వేదిక -చర్చాగోష్టి « పౌర స్వేచ్చ

  • శ్రీధర్ గారు అనుమతి లేకుండా రంగనాయకమ్మ గారితో చర్చా గోష్టి వీడియోని మీరు మీ వెబ్ సైట్ లో పెట్టడం నాకు అభ్యంతరకరం.వెంటనే తొలగించగలరు

 12. ఐదో భాగం కూడా బావుంది. వీడియో ఐదు భాగాలనూ తక్కువ సమయంలోనే ఇచ్చినందుకు థాంక్యూ!
  రంగనాయకమ్మ గారిని కొందరు ప్రశ్నలు అడుగుతున్నారో, తమ అభిప్రాయాలు చెపుతున్నారో అర్థం కాలేదు. ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ కాబట్టి భిన్నధోరణులు ప్రతిఫలించినట్టున్నాయి!

  • వేణుగారు అన్ని భాగాలను శ్రద్ధగా పరిశీలించి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.సుజాత గారు మీరడిగినట్లుగా అన్ని భాగాలను ఒకేసారి (ఇంచు మించు రెండు రోజుల తేడా తో )పెట్టడానికి ఎక్కువ శ్రమించిన వారు కె క్యూబ్ వర్మ గారు.ఒకో భాగానికి రెండు మూడు గంటల పైగా సమయం కేటాయించి చేసారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s