ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం ఆచరణ లో పక్క దోవలు పట్టడం ఆపేదెట్లా

పాతిక, ముప్ఫయి సంవత్సరాల కిందటిలా సమాజం లోని వైరుధ్యాల మధ్య స్పష్టమైన విభజన రేఖను వర్తమానంలో చూడటం చాలా కష్టంగా ఉంటోంది. అస్తిత్వాలు, ఉప అస్తిత్వాల స్పృహ పెరిగిన కొద్దీ సంఘర్షణ స్వభావం సంక్లిష్టమౌతోంది. ఒక దళిత యువకునికీ,అగ్ర వర్ణపు యువతికీ మధ్య ఏర్పడే కాన్ఫ్లిక్ట్ ని పరిశీలించడానికి ఎంత సహనం,చైతన్యం కావాలి? ఇక మహిళల హక్కుల కోసం అవిశ్రాంతంగా నిబద్ధతతో పని చేస్తున్న నాయకురాలిపై ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటి కేసు నమోదు అయినపుడు చట్టం ఉపయోగాన్ని ప్రశ్నార్ధకం చేయకుండా చిక్కుముడిని సున్నితంగా ఎలా విప్పాలి?
మానవ హక్కుల వేదిక ఇటీవల ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం పని తీరు పై రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సదస్సులు చేపట్టింది. విశాఖ సదస్సులో అనేక మంది దళిత ఉద్యమకారులు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యానికి గురి చేసాయి. ఈ చట్టం వాకపల్లి గిరిజనమహిళల అత్యాచారం కేసు మొదలుకుని అనేక హింసలను ఎదుర్కొంటున్న దళితుల నిజమైన సమస్యలను పట్టించుకోలేదు గానీ ఉద్యమ కారులను అణచివేయడానికి తరచూ వినియోగింపబడుతోంది.

ఓ చిన్న ఉదాహరణ …….
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 70 వ వార్డు కార్పొరేటర్ భర్త శంకరరావు తన స్వలాభం కోసం ఆ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసుల మౌలిక సదుపాయాల కల్పనను అడ్డుకుంటున్నాడు.ఆ కాలనీ లోని దళిత బహుజనుల న్యాయమైన పోరాటాలను ‘విభజించి పాలించు’ పద్ధతి ద్వారా చీల్చి ఈశ్వరరావు ఒక దళిత నాయకుడిని ప్రలోభపెట్టి పోరాటాన్ని నీరు కార్చే ప్రయత్నాలు చేసాడు. ఓ రోజు శంకరరావుని నిలదీయడానికి ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు అతని ఇంటికి వెళ్లారు ఈ సంఘటనని ఆధారంగా చేసుకుని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం.లక్ష్మి తదితరులపై ఈశ్వరరావు చేత ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటి కేసు పెట్టించడం జరిగింది.ఎఫ్.ఐ.ఆర్.లో ఈశ్వరరావు కధనం ఇట్లా వుంది .”గొడవ జరుగుతున్న రోజు ఏదో పని మీద అటు వెళుతున్న నేను ఆగి ‘గొడవలు ఎందుకు సామరస్యంగా మాట్లాడుకోవచ్చుగా ‘అంటే…….. ఎం.లక్ష్మి నన్ను ‘మాల లం..కొడక ‘అని దుర్భాషలాడారు ” అంటూ లక్ష్మి ఒక దళితుడిని ఎట్లా అవమానించారో వివరంగా రిపోర్టులో ఈశ్వరరావు రాసాడు.
ఎఫ్.ఐ.ఆర్  చదివిన నేను లక్ష్మి వంక అపనమ్మకంగా చూసాను మహిళా ఉద్యమాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆమె సహనంగా చిరునవ్వు నవ్వుతూ “మీకు ఇంకో సంగతి చెప్పనా? అసలు సంఘటన స్థలంలో ఆ రోజు నేను లేనే లేను” అంది దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడి, అగ్ర వర్ణాల దౌర్జన్యాల నుంచి వారిని రక్షించాల్సిన ఈ గొప్ప చట్టం ఆచరణ లో పక్క దోవలు పట్టడం ద్వారా దళితులకీ ఉద్యమాలకీ మధ్య అగాధాలు సృష్టించడానికి పాలకవర్గాలకు సహకరిస్తోంది

19 thoughts on “ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం ఆచరణ లో పక్క దోవలు పట్టడం ఆపేదెట్లా

 1. @కృష్ణ: “ఈ రోజుల్లో” అంటే ఏరోజుల్లో? పరిస్థితి రూపం మారిందేగానీ వివక్ష మారలేదుగా! మీరున్న లోకం సంగతేమోగానీ మేముంటున్న భారతదేశంలో ఈ చట్టం అత్యవసరం. అమలు గురించి సమీక్ష మాత్రం చాలా అవసరం.

 2. ఇలాంటి చట్టాలు, వివక్ష అనేది తరతరాలుగా వుండిపోవడానికి, మరిచిపోయినా గుర్తుతెప్పించడానికి దోహదం చేస్తూనే వుంటాయి. ఏదో చట్టం చూపించి బ్లాక్ మెయిల్ చేసుకుని బ్రతికేద్దామనే వాళ్ళు బ్రతికున్నవరకూ ఇలాంటి చట్టాలు వుంటాయి , వాటిని సొమ్ముచేసుకునే వాళ్ళూ వుంటారు. కులం చూపి తాయిలాలు అడుక్కోవడాన్ని నిషేధించాలి.

 3. చట్టం దుర్వినియోగం అవుతున్నదన్నది నిజం శత్రువుల్ని తమ ప్రత్యర్ధులని సాదించడానికి ఈ చట్టాన్ని వుపయోగిస్తున్నారు..సాక్షాత్తు ఒకప్పటి ఎస్సి .st కమీషన్ ఛైర్మన్ నాగార్జున అనుకుంటా స్వయంగా వాపోయాడు.. ప్రతీ రోజు ఎక్కడో చోట ఈ తప్పుడు కేస్ లు తాలూకా న్యూస్ వింటున్నాం…చదూతున్నాం…..http://tatavaari.blogspot.com/2010/04/blog-post_523.html

 4. కుటుంబపరంగా స్త్రీ బలహీనమైన (ఇది నా ఉద్దెశ్యం కాదు,ప్రస్తుత పరిస్థితిలో నిజం) సాంఘికంగా,చట్టపరంగా బలవంతురాలు,చట్టాన్ని తన అవసరానికి వాడుకోగలిగితే!(సద్వినియోగమా,దుర్వినియోగమా అన్నది వేరె పరిస్థితి.)
  ఎస్సీ,ఎస్టీ వర్గాలు సామాజికంగా, ఒక్కోచొట ఆర్ధికంగా బలహీనమయినా చట్టపరంగా బలవంతులే,ఆ చట్టాలు తెలుసుకుని వాడుకోగలిగితే!(ఇక్కడ కూడా అదే ప్రశ్న సద్వినియోగమా లేక దుర్వినియోగమా అన్నది ఆ సదరు వ్యక్తి పై ఆధారపడుతుంది.)చట్టాలు ఏర్పడిన అవసరం సరైనదే అయినా వటి అమలు పై సమీక్ష చాలా అవసరం.
  (పైన ఉన్న కృష్ణ గారు ఎవరొ నాకు తెలియదు.బహుశా నేను నా పూర్తి పేరు వాడాలి మరు సారి.)

 5. అట్రాసిటీ సెక్షన్లో రిజిస్టర్ కాని ప్రతి లక్ష కేసులకూ ఒక దుర్వినియోగం కేసు ఉంటుంది. మరి మీరు దుర్వినియోగం గురించి బాధపడతారా….లేక చట్టాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదని వాపోతారా? Our priority is to implement the law in its true spirit.

  • రెంటి గురించీ బాధ పడితే తప్పేమైనా ఉందా?
   ’లక్ష’మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది ఒకటుంది మరి.

   • చదువరి గారూ,
    దుర్వినియోగం మీద బాధ ఉంటుంది కాబట్టే ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం మీద తరుచూ సమీక్షలు జరుగుతున్నాయి.ఈ చట్టం అమలు లో ఎంత కాన్ఫ్లిక్ట్ ఉందో ప్రజాస్వామిక వాది అయిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ మీద ఈ కేసు పెట్టినపుడే ప్రపంచానికి తెలిసింది.
    అయినా సరే దళితులకి రక్షణ కల్పించే ఈ చట్టం సమాజానికి చాలా అవసరం.

   • చదువరి గారు

    మీరు ఇప్పుడు రె౦టినీ గురి౦చి బాధ పడితే, లక్ష మ౦ది నిర్దోషులు శిక్షి౦చ బడతారు 🙂 ఒక దోషి రక్షి౦చ బడును 🙂

 6. మహేష్ గారూ మీ ఆవేదన వాస్తవమే
  చట్టం వుండాలా వద్దా అన్న విషయం కాదు ఇపుడు మాట్లాడాల్సింది
  ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్తలు
  దళితులకు న్యాయం చేయాల్సిన సమయంలో అత్యంత ఉదాసీనం గాను
  ఉద్యమాలకు దళితులకు మధ్య అగాధం సృష్టించడంలో క్రియాశీలం గాను
  వ్యవహరించడాన్ని బలంగా ప్రశ్నించాలి తప్ప చట్టం ఉనికినే ప్రశ్నార్ధకం
  చేయకూడదు

 7. చట్టాన్ని ఎప్పుడు తమ చేతుల్లోకి తీసుకోవాలనే సెక్షన్ ద్వారా అన్నీ దుర్వినియోగామవుతున్నాయి. అలా అయినా ఈ చట్టం లేకపోతె ఆ తిట్టు ప్రతినోటా బహిరంగంగానే వినిపిస్తుంది. ఇది చాలా వరకు ఉద్యోగ వర్గాల మధ్య దుర్వినియోగామవుతోమ్ది. ఇంకా సామాన్యులకు వారి స్థితి పట్ల అవగాహన పెరగలేదు. రాజకీయ కక్ష సాధింపులకు కూడా వాడుతున్నారు. అయినా మన పోలీసు వారు పేద దళితుదేవరైనా వచ్చి బాబు వారు నన్ను తిట్టాడు, కొట్టాడు అంటే కేసుపెట్టిన దాఖలాలు తక్కువ. శ్రీకాకుళం ఎస్.పీ.గారు తమ డి.ఐ.జీ.మీద ఇదే సెక్షన్ తో కేసు పెడితే తీవ్ర దుమారం రేగింది. ఈ విషయంలో ఆయన దీనిని ఆయుధంగా వాడుకున్నారని అంతా అంటారు.
  ఈ సెక్షన్ లపై ఇప్పుడు కేసు పెడితే డి.ఎస్.పీ స్థాయి అధికారి దర్యాప్తు చేసాక కానీ చర్యలు తీసుకోకుండా సవరించారు.
  పై విషయంలో ఆమె వామపక్ష ఉద్యమకారిణి కాబట్టి పోలీసులు వెంటనే స్పందించి వుంటారు.

 8. మా ఊర్లో అప్పల నరసమ్మ అనే ట్రాఫిక్ ఎస్.ఐ. ఉండేది. ఆమె లంచాలు వసూలు చెయ్యడంలో దిట్ట. ఆమె ఎస్.సి. కావడం వల్ల ఆట్రోసిటీ కేస్ వేస్తుందని ఆమెని ఎవరూ ఏమీ అడగలేదు. గ్రామీణ ప్రాంతాలలో దళితులపై దాడులు చేసేవాళ్ళకి ఎలాంటి శిక్షలు పడవు. పట్టణ ప్రాంతాలలో కొంత మంది రాజకీయ పలుకుబడి ఉన్న దళితులు మాత్రం వ్యక్తిగత గొడవలకి కూడా ఆట్రోసిటీ కేసులు పెడుతుంటారు.

 9. ఈ చట్టాన్ని దుర్వినియోగ పరిచేవారిలో అగ్రవర్ణాలు ఉన్నాయి. రాయల సీమకు చెందిన ఓ రెడ్డి నాయకుడు . దాదాపు వడ దళిత , గిరిజన కుటుంబాలను తన అదుపులో ఉంచుకున్నాడు.రంగారెడ్డి జిల్లాలో బాగా విలువైన భూములను వీరు ఆక్రమించుకుంటారు. ఆ భూమి సొంత దార్లు వస్తే కులం పేరుతో తిట్టాడని వీరితో కేసు పెట్టిస్తారు. నిజానికి ఆ దళిత కుటుంబాలకు ఎమీ తెలియదు . వారిని ఉపయోగించుకొని ఆ నాయకుడు భూములు ఆక్రమించుకుంటాడు. కేసు లలో ఇరుక్కున్నవారు ఏదో ఓఅక రేటు అని భుములు ఆ నాయకుడికి అమ్మేస్తారు. చట్టం ఉండాల్సిందే కానీ సమీక్ష జరగాలి

   • అది ఎప్పటి నుంచో తెలిసిన నిజమే. నేను గిరిజనుణ్ణని తెలియక నా మీద atrocity కేస్ పెడతామని బెదిరించినవాళ్ళు కూడా ఉన్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s