అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు అన్ని పత్రికల్లో మీ స్టేట్మెంట్లు చూసి
మీ చైతన్యమే ఇంత గొప్పగా వుంటే ఇంక ఆంధ్ర మహిళల చైతన్యం ఇంకెంత అద్భుతంగ ఉందోనని
ఒళ్ళు పులకించిందంటే నమ్మండి
అవును…….. మంత్రిణీ శిరోమణుల్లారా…. అవునవును……..
మగవారు మహిళా రిజర్వేషన్ బిల్లుకి అడ్డు పడితే
“వంట చేయం…….. తిండి పెట్టం ”
అయ్యో …మన సహాయ నిరాకరణ ఇంత వరకేనా?
అంట్లు తోమం, ఇల్లు వూడ్చం, వాళ్ళ బట్టలు వుతకం, పిల్లల్ని శ్రద్ధగా చూడం
ఇంటిని ఒంటిని తళ తళ మెరిపించం
అపుడపుడు బహుకరించే తిట్లు, వడ్డించే తన్నులు తీసుకోం
పొద్దున్న లేవగానే మంగళ సూత్రాలు కళ్ళ కద్దుకోం
వాళ్ళ అడుగు వెనక అడుగు వేసి నడవం
ఐతే అమ్మల్లారా నాకో సందేహం……..
మగవారు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సై అన్నారనుకోండి
అపుడు మనం చకా చకా వంట చేసేసి, తిండి పెట్టేసి
టకా టకా అన్ని పనులు మనమే చేసేసి అదనంగా వారి ఔదార్యానికి
మరింత వంగిపోయి వెళ్లి చట్ట సభల్లో ఒదిగి ఒదిగి కూర్చుందామా
ఢిల్లీ కి రాణి అయినా వంట గదికి సేవకురాలేనని నిరూపించుకుందామా
అమ్మల్లారా
మీ రాజకీయ సర్దుబాట్ల మాటలు మీ దగ్గరే భద్రంగా అట్టి పెట్టుకుని
మన వెన్నెముకల్నినిటారుగా నిలబెట్టే మార్గాలని గుర్తించండి
అయినా మరీ కామెడీ కాకపోతే మహిలా బిల్లును ఆమోదించేది M.P లు కదా వారి ఇల్లలో భార్యలే వంట చేస్తున్నారా లేక పనివాల్లు చేస్తున్నారా? పనివాల్లు చేస్తుంటే వండిపెట్టం అని వీరు అనేది విడ్డురంగా అనిపించట్లేదూ.
పల్లెటూర్లో మా అమ్మమ్మ గారి ఇంటిలో మగ వంట మనిషే వంట చేసేవాడు. వంట పనులు ఆడవాళు చెయ్యాలనేవాళ్ళు స్త్రీవాదులా?
ఆ మాట అన్నది గల్లా అరుణ http://thatstelugu.oneindia.in/news/2010/03/07/galla-aruna-kumari-on-women-reservations-070310.html మహిళా మంత్రులే వంటింటి కుందేళ్ళైతే సాధారణ మహిళలు ఎలా ఉంటారో.
శర్మ గారూ రిఫరెన్స్ ఇచ్చినందుకు థాంక్ యూ .ఆకాశరామన్న గారూ ఇది మంత్రుల వ్యక్తిగతమే కాదు
స్త్రీలందరి చైతన్యానికి సంబంధించింది.
‘మా కుమారి నాన వయమన్నెకీ’ వెంటాడుతున్న ప్రశ్న.. http://sahacharudu.blogspot.com/2010/03/blog-post.html
ఏదో వంట చేసుకొనే ఓపిక లేక ఆడవాళ్ళ వంట తింటున్నారు కాని వాళ్ళేదో వంటల్లో ప్రావీన్యులని కాదు.
ఏ రెస్టారెంట్లో అయిన మగాళ్ళే కదా వండి వార్చేది. “నలభీమ పాకం” అని కుడా నానుడే.
మహిళలు వంట మానేస్తే హ్యాపీగా బిర్యానీలు లాఘిన్చేస్తారు.
సో.. “అది కాదు కాని ఇంకో మాట చెప్పండి”
ఒక రచయితకి వేదిక మీద ఘనంగా సన్మానం చేస్తారు. ఆ రచయితని పొగుడుతూ గొప్పగా మాట్లాడుతారు. సన్మానం పూర్తైన తరువాత అతని రచనల గురించి పట్టించుకోరు. మహిళా దినోత్సవం కూడా ఇలాంటి తూతూ మంత్రపు తంతే. http://blogzine.sahityaavalokanam.gen.in/2010/03/blog-post_08.html
varasatva rajakeeya nayakatvam ilaage untundemo ….moththaniki chetta statementlivvadamlo magavarikemi teesipomani nirupinchukunnaru. ha.. ha..
హ హ హ భలే చెప్పారండీ….వంటిల్లు మహిళల సోంతమన్నదే చాలమంది అభిప్రాయం…..మార్పు మనలోనే రావాలి…వస్తుందని ఆశిద్దాం!
ఈ కాలంలో మగాడు కూడా వంట, ఇంటి పనులు నేర్చుకుంటున్నాడు అండి. స్త్రీలలోనే కాదు మార్పు మగాళ్ల ఆలోచనల్లో కూడా వచ్చిప్పుడే దాన్ని నిజమైన స్త్రీవాదం అంటారు అండి.