రెండు కొప్పులు ఒక చోట కలిస్తే ఏమవుతుంది? చిలికి చిలికి గాలివానవుతుంది..నివారించలేని యుద్ధమవుతుంది ..చాలా మందికి వినోద కారణమవుతుంది…మన అలవాటయిన నిర్ధారణలకి అలంబనమవుతుంది…..కానీ గత సంవత్సరం నాలుగు నెలలకు పైగా తెలుగు రచయిత్రులంతా ఈ పాత,మోటు సామెతలకి భిన్నంగా తరుచుగా కలుస్తున్నారు ….అభిప్రాయాలూ కలబోసుకుంటున్నారు సమస్య ఒక్కరిదైనా అందరు పోరాడుతున్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా ఒక నిర్మాణయుతమైన వేదికను ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పటి వరకూ ‘మనలో మనం’ రచయిత్రుల తాత్కాలిక వేదిక గా వున్న వేదిక ఫిబ్రవరి 28 తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం టి.ఎల్.ఎన్ సభా హాల్ లో జరిగిన రెండు రోజుల సదస్సులో ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ గా పూర్తి స్థాయి నిర్మాణాన్ని పొందింది.
సుమారు 100 మంది రచయిత్రుల సమక్షంలో చల్లపల్లి స్వరూపరాణి అధ్యక్షురాలిగా ,కాత్యాయనీ విద్మహే ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు . ఇంత కాలం విస్మరించబడిన స్త్రీల సాహిత్య చరిత్రని సమగ్రం చేసుకోవడం, స్త్రీల సాహిత్యాన్ని ప్రజా ఉద్యమాలతో అనుసంధానించడం లాంటి లక్ష్యాలతో వేదిక పని చేస్తుంది. పూర్తి వివరాలతో ఇంకో పోస్ట్ రాస్తాను
good ..all the best to prajaswamw rachiyitrula vedika ku.
మీ వేదిక ప్రజల మనోభావాలకు దర్పణంగా, వినూత్న కార్యక్రమాలతో, ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతు విజయవంతం కావాలని కోరుకుంటున్నా..
it could be eassy to identify if you mention names at photographs
All The Best
జాజిమల్లి గారు,
మీరు పోస్టు రాశాక దాని అడ్రస్ (URL) ఇంగ్లీషులోకి మార్చండి. ఉదాహరణకు ఇప్పుడు ఈ బ్లాగుపోస్టు అడ్రస్ URL ఇలా ఉంది:
https://jajimalli.wordpress.com/2010/03/02/%e0%b0%87%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%92%e0%b0%95-%e0%b0%9a%e0%b1%8b%e0%b0%9f-%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf/
దీని బదులు “https://jajimalli.wordpress.com/2010/03/02/manalomanam” అని ఉంటే ఎవరికైనా ఈ లంకె పంపించడానికి సులభంగా ఉంటుంది.
ఇది ఎలా చేయాలో ఇక్కడ ఉంది చదవండి: http://en.support.wordpress.com/posts/post-title-url/
దిలీప్ గారూ చాల ఉపయోగకరమైన సూచన చేసారు.థాంక్ యూ.బ్లాగ్ లో మిమ్మల్ని కలవడం
సంతోషంగా వుంది