ప్రియా….
రోజూ లాగే ఈ రోజూ నిన్నోసారి తలచుకోవడం బావుంది
అలవి కాని సౌందర్యంతో గుబాళించిపోయే
నీ బాల్యాన్ని నా ఊహల రెక్కల గుర్రం పై ఊరేగించడం బావుంది
జ్ఞానం పై గురి పెట్టిన
ముందు బెంచీ బుద్దావతారానికి
కన్ను కొట్టడం బావుంది
చిన్నపుడు ఇంట్లో చెప్పకుండా సైకిలెక్కి
పక్కూరికి పారిపోయిన నిన్ను
చెవులు మెలేసి నా ముందు నిలబెట్టించుకోవడం బావుంది
చింత బరికె తోనో, చీపురు కట్టతోనో
కందిపోయిన నీ ఒంటిని
నా చూపులతో అప్యాయంగా నిమరడం బావుంది
సంత లో తప్పి పోయి బిక్కమొహం
వేసిన బుజ్జాయిని ఓదారుస్తూ
గుండెలకు హత్తు కోవడం బావుంది
నీ బాల్యాన్ని తడుముతూ ………తడుముతూ
నేను నీ తల్లిని కావడం మరీ మరీ బావుంది
ఇంటివెనుక చిక్కుడు తీగెనె పట్టుకుని వింతలోకంలోకి ఎగబాకిన పిల్లలకథ విన్నాను. టైమ్మిషీన్లో భూతభవిష్యాలలోకి వెళ్లి జీవితాలను సవరించిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూశాను. కానీ, అవేవీ
జ్ఞాపకాన్ని పట్టుకుని స్నేహితుడి బాల్యంలోకి దిగిన మీ ఫేంటసీకి అవి సాటిరావు. రాధ యశోదగా మారిన ఊహ కదా మీది!
మీ బ్లాగు చాలా చాల బాగుంది…..చాల ఉపయొగపడె విషయాలు మీ బ్లగు లొ ఉన్నాఈ ……కవితలు చాలా చాలా భగున్నాయ్
hi malleeswari meru nakanna chinnavallu anduke peru petti pilustunna. aina ee meerulu garelu manake suma. english vadu teacherni professorni bossni kuda mr.soand so ani pilustadu.inthaki cheppochedentantante nakinthavaraku neevi rendu mudu kathalu o novel nachayi eppudu kalasina manam bagane interact avutham adee nachindi. ippudee blog maree maree nachindi…mee allari vijji lage eppudo andhra university lo 1986lo thappipoyina jagathi eemadhyane mallee 2002lo dorikindi. ippudu parvaledu kasta manishiga thirigi marindi. anduke mari mee andarni kalusthondi….idee ivaltiki na kathe ….prematho…jagathi
manasu tho matadu kovadaniki avakasam kalpinchina ee technology ki koncham krithajnathalu cheppali kadu…inka matadana vadda nee javabu meeda adhara padi untundi.eppudu ila kaburlu kaka sahithyam jeevitham gurchi kuda matadathanammayi kangaru padaku…luv j
ఓహ్!!సర్ప్రైస్!!
జగద్ధాత్రి గారూ,
తప్పకుండా మనం మాట్లాడుకుందాం…అవును జీవితాలతో పాటు సాహిత్యం గురించి కూడా…
మనందరం జీవితం లో ఎపుడో ఒకపుడు ‘తప్పిపోయిన విజ్జి’లమే అవుతాం..ఎంత తొందరగా మనల్ని
మనం దొరకబుచ్చుకుంటే అంత మంచిది.ఎనీ వే కలుస్తూ ఉందాం.
కమ్మని అమ్మతనాన్ని కవితలో వ్యక్త పరిచినందుకు కృతజ్ఞతలు అండి.