ప్రేమ కధలు చెప్పుకుందాం-నువ్వు కాళోజీనో,దాశరధినో,గద్దర్ నో అడుగుతావనుకుంటే……….హైదరాబాద్ ని అడిగావు

 ప్రేమ కధలు చెప్పుకుందాం   

ఇప్పటి వరకూ

కలసి వుంటే ఎంత సుఖము కలదో

విడిపోతే ఎంత దుఖమో

మీరు చెప్పారు……….

ఇప్పటి వరకూ

మీరెట్లా మమ్మల్ని అణచి వుంచారో

మేమెట్లా అగ్నిజ్వాలలై ఎగిసామో

మేము చెప్పాము.

ఇక అనివార్యత లోంచి పంపకాల గురించి

మాట్లాడుకునేపుడు

నువ్వు కాళోజీనో,దాశరధినో,గద్దర్ నో

అడుగుతావనుకుంటే……….

హైదరాబాద్ ని అడిగావు

నువ్వు ఇరానీ చాయ్ గురించో   హైదరాబాద్ బిర్యానీ గురించో

విచారిస్తావనుకుంటే

మా పెట్టుబడుల సంగతేంటి అన్నావ్

నీ సంగతి మా బాగా అర్ధమయ్యాక కూడా

ఒకటి చెప్పాలనిపిస్తుంది

మనమిపుడు ఎదురెదురుగా కూర్చుందాం

హృదయాలు తెరిచి ప్రేమ కధలు చెప్పుకుందాం

12 thoughts on “ప్రేమ కధలు చెప్పుకుందాం-నువ్వు కాళోజీనో,దాశరధినో,గద్దర్ నో అడుగుతావనుకుంటే……….హైదరాబాద్ ని అడిగావు

 1. ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా ప్రేమ కధే కదా.
  తాము కబ్జా చేసిన ప్రాంతం మీద తమకెంత ప్రేమ వుందో చెప్తున్నారు.
  ఎవరి ప్రేమలు వారివి.
  మీలా న్యాయంగా నిష్కల్మషంగా నిస్వార్ధంగా అందరూ ప్రేమించలేరు.
  అలా ప్రేమించాలనుకోవడం తప్పేం కాదనుకోండి.
  అదే జరిగితే ఎంత బావుంటుందో.

 2. అడగకేం. దాశరథిని రాష్ట్ర ఆస్థాన పీఠమిచ్చి గౌరవించుకున్నాం. దాశరథి రంగాచార్య వేదాలు అనువదిస్తే మా విజయవాడలో అచ్చేయించి, ఆయన పాదాలంటి నమస్కరించి, వాటిని కళ్ళకద్దుకున్నాం. గద్దర్ గజ్జ కట్టి ఆడితే మా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఎదురెళ్ళి స్వాగతం పలికి జైజైలు కొట్టాం. మీ పీవీని మా వాడనుకుని నంద్యాల నుంచి గెలిపించుకున్నాం. మాకు తిక్కన ఎంతో, పోతన అంతే. వాళ్ళు మావాళ్ళు మీకు చెందరు అని గంతులేసాకే, మీవాళ్ళు మాకొద్దు అన్నాకే విషయం పంపకాల దాకా వచ్చింది. అడుగుతాం ఇచ్చేస్తారా.

  ప్రపంచాగ్నికి సమిధనిస్తానన్న మా శ్రీశ్రీని మీరు అంధ్రోడని ముద్రలేసి వద్దనుకున్నప్పుడు, బ్రతికినంత కాలం తీరపోడి మీద కత్తి గట్టిన మీ కాళోజి మాకెందుకు.

 3. కాళోజి , డాశరథి, సినారె లను అమ్ముకానికి బేరాలకు పెట్టేనేందుకు సిద్ధపడ్డ మీ ‘ ఆత్మగౌరవానికి ‘ చేతులెత్తి నమస్కరిస్తున్నా..
  అసలిలాంటి వాళ్ళు మా తెలుగువాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుతో చచ్చి పోతున్నాము. థూ…థూ…

 4. Krishna: ఒక్క శ్రీశ్రీతో ఆగారా వీళ్ళు? వేర్పాటు వాదాన్ని ప్రాచీన కవులు, రచనల దాకా తీసుకుపోయిన నైచ్యానికి దిగజారారు కొందరు. ఆంధ్రం వేరు తెలుగు వేరు అంటూ చెప్పుకొచ్చిన ఈ తె.వాదులు ఇంకా దిగజారలేని లోతులకు ఎప్పుడో దిగజారారు.

 5. తెలంగాణా మరియు సమైక్యాంధ్ర కోరే ప్రజలు ఎవరూ ఎదుటి వారి మనుసును అర్ధం చేసుకోవటానికి ట్రై చెయ్యట్లేదు. పెట్టుబడుల గురించి మీరు చెప్తున్న మాటలు కూడ అలాంటివే. Hyderabad is the place of opportunity for every educated youth in the state. Look at it from that perspective. There is no point in getting emotional about how selfish people are!!

 6. asalu ee godavalannni endukandi papam ee blody politicians madyalo students life spoil aaipotondi ee godavalu eelage sagitey next ee pillalu em chestaru eevaru adagare ee chetta tv channels okati andarni rechagodutumadhalo me lanti vallu maa rastam… ma rastam… antu meku nijamga asahyam veyyatam leda idanta politicians drama ani telitam leda em manushuladi

 7. “ధ్రువ సారు” మంచిగనే సెప్పిండు. .ప్రేమ గుండెల్ల కెళ్ళి రావాలే. పెతి పదేల్లకో మాలి ఎవుల్లో రెచ్చ గొట్టినప్పుడల్లా రెచ్చి పోయేటి పెజలున్డంగా పెమలేడికేల్లోస్తాయ్?ఇసం నాటినంకది ఇరుగుతద?.
  http://www.nutakki.com ల డిసెంబర్ 30 2010 న పెచురించిన” దృష్టి సారించని మరో ధ్రుఃక్కోణం” పై ఒక పారి మీ సూపెయ్యిన్రి. …గిజిగాడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s