గత సంవత్సర కాలంగా మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సులలో చివరిదైన ఉత్తరాంధ్ర సదస్సు 2010 ఫిబ్రవరి 27 , 28 తేదీలలో విశాఖపట్నంలో జరగనుంది. సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్ ఆంధ్రా యూనివర్సిటి,మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక సంయుక్త అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ‘ఉత్తరాంధ్ర,ఆదివాసీ స్త్రీల సాహిత్యం’ఫై చర్చ పత్ర సమర్పణలు జరుగుతాయి. అంతే కాక మనలో మనం వేదిక ఈ సదస్సు లోనే పూర్తి స్థాయి నిర్మాణాన్ని పొందనుంది.కాబట్టి తెలుగు రచయిత్రులందరూ ఈ సదస్సుకు హాజరయి స్త్రీల సాహిత్యాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాం. సదస్సుకి హాజరయ్యే రచయిత్రులందరికీ రెండురోజుల పాటు భోజన,వసతి సదుపాయాలు కల్పించబడతాయి.
ఇతర వివరాలకు నిర్వాహకులను సంప్రదించగలరు .
ఆచార్య బి.రత్నకుమారి 9866298798
మల్లీశ్వరి 9246616788
మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక