అనుభూతుల వనంలో వలిసె పూల వాన (కవిత)

ఈ రోజు సెలవే కదా
 సూర్యుడు హాయిగా మంచు దుప్పటి కప్పుకుని
వెచ్చగా పడుకోవచ్చుగా
ఏదో పనున్నట్లు హడావిడిగా ఆకాశ వీధిలోకి
పాక్కుంటూ వచ్చి పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు.
అంతే ….
లోయల వంపుల్లోను,చెట్ల గుబురుల్లోను
సెలయేటి అలల మీద,పిట్టల రెక్కల మీద
బంగారు మిలమిలలు

ఈ రోజు అచ్చంగా హృదయానికే అంకితం చెయ్యాలని
ఓసారి తొంగి చూడగానే
మొన్నెపుడో కురిసిన వలిసె పూల వానకి
రాలిపడ్డ అనుభూతుల గుత్తులు కనిపించాయి

పదమూడేళ్ళుగా  ఓ పసితనానికి ఆటవస్తువయి 
యవ్వన  ప్రవేశపు అలజడి తో దూరంగా
తొలగిపోతున్న కూతురిని చూసి
బెంగటిల్లె తండ్రిలా మారింది మనసు
అరకును వదిలి వచ్చేస్తుంటే

ప్రకటనలు

9 thoughts on “అనుభూతుల వనంలో వలిసె పూల వాన (కవిత)

  1. జాజిమల్లి గారూ , నమస్కారాలు.అరకు పై అభిమానంతో వ్రాసినా మీరు ఆక్కడి ప్రక్రుతి లో పరవశించిన తీరు చాల ఘనంగా తెలియ చెప్పారు. పుష్పాలు చాల బాగున్నాయి. ఇక పొతే మీ కవితలో ….
    “ఈ రోజు సెలవే కదా
    సూర్యుడు హాయిగా మంచు దుప్పటి కప్పుకుని
    వెచ్చగా పడుకోవచ్చుగా
    ఏదో పనున్నట్లు హడావిడిగా ఆకాశ వీధిలోకి
    పాక్కుంటూ వచ్చి పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు.” మహత్తరమైన భావన.అభినందనలు. యీ వాక్యంలో” ” నవ్వడమెందుకో “” అని శ్లేషగా వదిలేస్తే యింకా బాగుండేదనిపించింది.శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు

  2. మల్లిక్ గారూ ,మీ విశ్లేషణకు ధన్య వాదాలు. జాజిమల్లి గారి బ్లాగు ద్వారా పరిచయమైనందుకు సంతోషం. నా సూచనను సహృదయంతో స్వీకరించినందుకు జాజిమల్లి గారూ! మీకు ధన్యవాదాలు. మీ భావ విన్యాసం అద్భుతం. అభినందనలతో …నూతక్కి

  3. జాజిమల్లి గారూ ,శీర్షికలో “వలిసె పూలవాన” వలిసె ఆంటే నా బుర్రకు అర్ధం తట్టలా. వెలిసె/విరిసె ల లో ఏదో ఒక పదం అయి ఉంటుందని అనుకుంటున్నా .అన్యదా భావించక “వలిసె” కు అర్ధం చెప్పరూ?….నూతక్కి.

    • నూతక్కి గారూ,
      ధన్యవాదాలు.అరకువేలీ లో అక్టోబర్ నేల నుంచీ జనవరి నెలవరకు
      కొండలూ,లోయలూ ఏ పసుపు పూల దుప్పటిని కప్పుకుంటాయో
      ఆ పసుపు పూలే వలిసెపూలు…చాలా సినిమాల్లో వలిసె పూల
      తోటలు కన్పిస్తూనే వుంటాయి.

      • జాజిమల్లి గారూ నాకు తెలియని విషయం మీ ద్వారా ఈ రొజు తెలుసుకున్నాను. వీలయితె ఆపూల ఫొటోలు పోస్ట్ చేయండి.ధన్యవాదాలు…శ్రేయోభిలాషి ..నూతక్కి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s