రెండు(ఆంధ్ర, తెలంగాణ) ఒకటవడం కన్నా ఒకటి రెండవడం బాధాకరమే (కవిత)

కవిత్వోద్భవానికి కావలసింది మానసికమైన అశాంతి. మనస్సులో కీకారణ్యాలు విస్తరిస్తేనే కాని, కవిత్వ వ్యాఘ్రం అందులో సంచరించదు” అని నేను మునుపెప్పుడో చదివిన మాటలని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఒప్పుకోక తప్పదేమో. ప్రస్తుతం బలంగా వినిపిస్తున్న ఈ కలిసుండటం , విడిపోవటం అనే వాదనలకు నా స్పందన…

రెండు ఒకటవడం కన్నా
ఒకటి రెండవడం బాధాకరమే
కానీ…….
ప్రియా
ఒకటయ్యేపుడు పెంచుకున్న నమ్మకాల్నీ
పంచుకున్న ఆశల్నీ
ధ్వంసం చేస్తూ
ఈ రోజు భవిష్యత్తుని
నా ఒడిలోని నవజాత శిశువుగా
నువ్వెంత అభివర్ణించినా
చెరిగిన విశ్వాసాలనూ
చెదిరిన స్వప్నాలనూ
మోసుకుంటూ నీతో కలసి ఎలా నడవను?
ఐతే
ఒకటి మాత్రం నిజం
నువ్వు ఎక్కడ ఐక్యతా రాగాల్ని ఆలపించినా
నా శిధిలాలఫై నువ్వు ఎప్పటికీ కోటని నిర్మించుకోలేవు.

14 thoughts on “రెండు(ఆంధ్ర, తెలంగాణ) ఒకటవడం కన్నా ఒకటి రెండవడం బాధాకరమే (కవిత)

 1. మల్లీశ్వరి గారూ మీ కవిత అద్భుతం; ఇంత సున్నితంగా తెలంగాణా ప్రజల భావోద్వేగాన్ని వ్యక్తపరచినందుకు మిమ్మల్ని అభినందించకుండా వుండ లేక పోతున్నాను.

  నేను సమైఖ్యాంధ్ర కోరుకుంటున్నా కూడా మీరు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని గుడ్డిగా కాదన లేక నా కంట చెమ్మ చేరుతోంది.
  అయితే ఈ చెదిరిన స్వప్నాలూ చెరిగిన విశ్వాసాలు ఎవరివల్లో మీ వంటి విజ్ఞులు ఒక్క సారి ఆలోచిస్తే బావుంటుంది.

  ఆంధ్ర రాయల సీమ లోని సామాన్య జనం మనమందరం కలిసుండాలేది యే ఆర్ధిక రాజకీయ ప్రయోజనాలాసించో కాదని మీ వంటి విద్యా వేత్తలు గ్రహించాలని ఆశిస్తున్నాను. యే ఉద్యమం లో నైన నాయకులకు సామాన్యునికి గమ్యం ఎప్పుడూ ఒకటి కాదనేది చరిత్ర చెప్పిన సత్యం.

  తెలంగాణా లో నైన, తీరపుటాంధ్ర లో నైన, రాయల సీమ లో నైన సామాన్యుడి బ్రదుకేప్పుడూ గాలిలో పెట్టిన దీపం లాంటిదే నని నేను మీకు వేరుగా చెప్పనక్కర లేదు. ఒకరికి జరిగిన అన్యాయాన్ని మిగిలిన వారు గుర్తించక పోతే తమ ప్రయోజనాలకై ఇతరులకు అన్యాయం చేస్తోంటే అప్పుడు మన మనసులు వేరని ,మన నడక ఇక కలవదని మన గమ్యం ఇక మారక తప్పదని వప్పుకునే వాళ్లెందరో వున్నారు ఆంధ్ర రాయల సీమల్లో. కానీ అలా కాదే నూటికి ఎనబై శాతం సమైఖ్య వాదులు తెలంగాణ కు జరిగిన నష్టాన్ని గుర్తిస్తున్నారు, దానికి పరిశ్కారాన్నీ వెధకాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నారు .

  కనుక అందరం సమిష్టిగా పోరాడి మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని, మన ఊరిని మన ఇంటిని అభివృద్ది పధాన నడిపించుకున్దాం. ఒక్క సారి ఆలోచించండి. మీరు చెప్పిన నమ్మక ద్రోహులు తెలంగాణ లో పుట్టి పెరిగిన తెలంగాణ రాజకీయ నాయకులే కాని వేరొకరు కాదని మీరే అంటారు. ముగ్గురు ముఖ్య మంత్రుల్ని పంపిన తెలంగాణ ఇంత వెనకబాటుతనం లో ఉండటానికి కారణం ఎవరనేది అతి తేలిగ్గా అర్ధమయ్యే విషయం.
  అందుకే మీ వంటి వివేకవంతులు సమస్యని సరిగా విశ్లేషించి తెలంగాణ యువతకు సరియైన మార్గ నిర్దేశకత్వం చేస్తాని ఆశిస్తున్నాను.

  సాంబ.

 2. మీ కవిత నిజం. విడిపోవడం బాధాకరమైనా తప్పదన్నది సూటిగా వ్యక్తీకరించారు. ఇన్నాళ్ళూ గుర్తించని తెలంగాణా వెనకబాటుతనంపై ఇప్పుడు కల్సిపోయి ఏదో చేద్దామన్నది వాళ్ళని మోసపుచ్చడమే. మన ప్రాంతమే దీనికి తార్కాణం. ఎక్కడా ఒప్పుకోని థర్మల్ పవర్ స్టేషన్ లు, అణు విద్యుత్ కేంద్రాలు మన అంబలి జిల్లాలలోనే పెడతారు. ఎందుకంటే డబ్బుకు అమ్ముడుపోయే దళారీ నాయకులెక్కువ. అడగగలిగే జనం తక్కువ. ఎప్పటికైనా కళింగాంధ్రను కూడా సాధించుకోవాలి. అందుకే నేను తెలంగాణాకు మద్దతుఇస్తున్నా.

 3. సాంబశివరావు గారూ మీ వాక్య శైలి ఎదుటి వాళ్ళను ఆలోచింప చేసేలా వుంది. స్పందించినందుకు ధన్యవాదాలు .సామాన్యుడు గారూ అవును …….ఉత్తరాంధ్ర ప్రత్యేక సమస్యలపై పోరాడక తప్పదు.

 4. ” కవిత్వోద్భవానికి కావలసింది మానసికమైన అశాంతి. మనస్సులో కీకారణ్యాలు విస్తరిస్తేనే కాని, కవిత్వ వ్యాఘ్రం అందులో సంచరించదు” antoo mee bhavalaku O chakkani kavitha ga malicharu…kada!!! …”Kavitha ga mee bhavam naaku chala baga Nachhindi “.. kaani Sambasiva Rao garu cheppinattu… okkati matram Nizam Andi…”United we Stand, Divided We Fall” annaru mana peddavaru…Ex.Russia…. India oka Super Power Country ga ippudu Chaina lanti countries tho poti padu thondi. Anni pranthalu development avvali. Adi jaragalante konnitini prajalu kooda “sacrifice” cheyyalanukunta.. madam…Any way chakkani kavithani samakurchinaduku meeku na Abinandanalu.

 5. పద్మార్పిత గారూ, aagnani garu, కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు
  అనిల్ గారూ సాంబశివరావు గారి రెస్పాన్స్ లాగే మీ వ్యాఖ్య కూడా ప్రజాస్వామిక విలువల్ని ప్రతిబింబిస్తోంది.ముఖ్యంగా విషయం మీద అభిప్రాయ భేదాలెన్ని వున్నా ఒక కళా రూపాన్ని, అది కలిగించే స్పందనని గౌరవించడం ద్వారా ఒక మంచి మెసేజ్ ని ఇవ్వగలిగారు.ధన్యవాదాలు.

 6. మీ పోయెం చాలా బాగుంది. మీ బ్లాగ్‌ను ఆలస్యంగా కనుక్కున్నాను కాబట్టి, ఆలస్యంగా రియాక్ట్‌ అవుతున్నాను. దీన్ని ఏదైనా పత్రికలో పబ్లిష్‌ చేసి ఉండవలసింది. తెలంగాణావాదులే కాదు, ప్రజాస్వామికవాదులంతా కళ్లకద్దుకునే కవిత ఇది.

 7. శ్రీనివాస్ గారూ కవిత పై స్పందన చూడగానే సంతోషం కలిగింది.తెలంగాణాపై నా భావాలను చెపుతున్నాననుకున్నా గానీ అది కవిత అవుతుందనుకోలేదు.

 8. వాస్తవాన్ని చాలా బాగా చెప్పారు .ఎలుక తోలు తెచ్చి ఇసుకేసి తోమినా నలుపు నలుపే గాని తెలుపు గాదన్నట్టుగా. స్వార్థ ప్రయోజనాల వక్ర రాగాలతో సమైక్యతా గానాన్ని ఆలపిస్తే చెవుల్లో జోరీగ చొరబడినట్టు ఉంటుంది కాని మనసు గాలిలో తేలి పొదు గదండీ.

  • రామకృష్ణ గారూ,
   మీరన్న దాన్లో అభిమానం తో పాటు అతిశయోక్తి కొంచెం ఉన్నా,ఉద్యమ సందర్భం కాబట్టి
   ఉద్యమ సహానుభూతి తో బాధ్యత గా సాహిత్య సృష్టి చేయాల్సిందే…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s