తెలంగాణా ఉద్యమం ఫై ఉత్తరాంధ్ర బామ్మ తీర్పు

ఈ మధ్య నేను పని మీద విశాఖ కంచరపాలెం ఏరియా కి వెళ్ళాను.అక్కడ ఒక సందు చివర ఒకామె బుట్టలో జంతికలు చేగోడీలు చుప్పులు అమ్ముకుంటోంది.ఇంతలో అటువైపు వచ్చిన సమైక్యాంధ్ర ఆందోళన కారులు షాపులు మూయించడం నినాదాలు చెయ్యడం చూసి అటుగా పోతున్న నన్ను ఆపి “ఏటమ్మా? ఈలంతా ఇలగేటి గొల్లు సేస్తన్నారు?”అనడిగింది.ఇపుడు ఏ.పి. స్టేట్ లో ఎం జరుగుతోందో చెప్పాను.అపుడు…..తను తినుబండారాలు అమ్ముకునే నాలుగు వీధులు,తను నివసించే ఏరియా తప్ప మరో ప్రాంతం ఎరగని ఆ బామ్మఅంది కదా ” ఆళు….. మావు మీతోటి ఉండవని తెగేసి సేప్పేస్తంటే ఈళేటోలే వదలవంతన్నారు.ఈ బావులు సేస్తన్న పని నాకేటీ బాగా నేదు” అనేసింది మరి

……………………………………………………………………………..

16 thoughts on “తెలంగాణా ఉద్యమం ఫై ఉత్తరాంధ్ర బామ్మ తీర్పు

 1. పాపం అందుకేనేమో ఆ బామ్మ ఇంక వీధుల్లో తిరుగుతుంది, ఉద్యమం చెసేవాళ్ళూ వీధుల్లో ఉన్నారు…అలాంటి ఉద్యమాలు చేయించెవాళ్ళకేమో వీరు ఇప్పటిదాక గుర్తుకిలేరు…
  నిజం ఏమిటంటె…ఎటువైపునుంచైనా చూసినా సరే రజకీయులు మాత్రం రాజకీయం చేస్తారేకానీ ప్రజలమేలు కొరటం మాత్రం షుద్ధ అబద్ధం..
  KCR వోట్లకోసం పోరడీతె….లగడపాటి గారు వారి LANCO, LARSCO కంపనీలకి ఎమైపోతుందో అనే భయంతో బహుష పోరడుతున్నట్టున్నారు..
  ఏది ఎమైనా బామ్మ మాత్రం మళ్ళీ విధిలోనే ఉండాలి…

 2. ఎంతసేపూ ఎవడి స్వార్థం వాడు చూసుకుంటూ దేశం గుఱించి జాతి గుఱించి ఆలోచించడం మానేయడంవల్లనే ఈ దేశం 750 సంవత్సరాల పాటు పెర్షియన్ల పాలనలోకి, ఆ తరువాత 175 సంవత్సరాల పాటు బ్రిటీష్ పాలనలోకి వెళ్ళింది. అదో పెద్ద గొప్పలా చెబితే ఎలా ? ఆ ఆలోచించే కొద్దిమందిని కూడా ఆలోచించొద్దని చెబితే ఎలా ? శరీరంలో అన్ని భాగాలూ ఆలోచించలేవు. మెదడొక్కటే ఆలోచించగలదు. అదే దాని పని. అలాగే సమాజంలో సమాజం గుఱించి ఆలోచించేవాళ్ళుంటారు. వాళ్ళు సమాజశరీరానికి మెదడులాంటివాళ్ళు. వాళ్లు దేశానికి self-appointed armymen. వాళ్ళు జాతికి T-cells, ఎఱ్ఱరక్తకణాల వంటివారు. వాళ్ళలో ఆలోచించి ఆందోళనలకీ ఉద్యమాలకి సిద్ధపడేవాళ్ళూ ఉంటారు. అలాంటివాళ్లు సమాజానికి చాలా అవసరం. వాళ్ళ మూలంగానే మనం ప్రపంచంలో నానాహక్కులు గలిగి బతకగల్గుతున్నాం.

  సామాన్యమానవుడు, సామాన్యమానవుడు అని ఈ జపం భరించలేకుండా ఉన్నా. సమాజానికి సామాన్యమానవులే కాదు, అసామాన్యమానవులు కూడా అవసరమే. క్రిటికల్ మూమెంట్లు వచ్చినప్పుడు కూడా జాతి సంగతి పట్టించుకోకూడదా ?

  • ఎవడి ముక్క వాడు పీక్కుని పోతానన్నప్పుడు అలాంటి స్వార్థపూరిత డిమాండ్లకి మద్దతిస్తే, ఎవడిష్టం వాడిదని ఊరుకుంటే రాష్ట్రమే కాదు, ఆఖరికి దేశమే ఒకరోజున నామరూపాలు లేకుండా పోతుంది. ప్రజలు విషమిమ్మని అడిగితే రేషన్ షాపుల ద్వారా సప్లై చేద్దామా ? ప్రజల ఇష్టం కాదు ప్రజాస్వామ్యానికి కావాల్సినది. ప్రజల శ్రేయస్సు.

 3. కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.

 4. Sorry for changing the topic…
  మీరు పూర్తిగా ఆంధ్రంలోనో లేక తెలియని మాండలికంలో రాయకుండా నాలాంటి వారికి అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేయాలి మరి!!!

  చేగోడీలు అంటే ఒకటే వరసతో గుండ్రంగా ఉంటాయనుకుంటా… చుప్పులు మరియు జంతికలు ఎప్పుడు వినలేదు… అంటే ఏమిటో మీరు కాస్తా వివరించాలి.

  >>> ఆళు….. మావు మీతోటి ఉండవని తెగేసి సేప్పేస్తంటే ఈళేటోలే వదలవంతన్నారు.ఈ బావులు సేస్తన్న పని నాకేటీ బాగా నేదు>>>

  వాళ్ళు ….. ( మావు ?? ) మీతో ఉండమని తెగేసి చెప్పేస్తుంటే ( ఈళేటోలే ?? ) వదలవంతన్నారు ( వదలమంటున్నారు ?? ). ఈ బావులు ( బాబులు ?? ) సేస్తన్న పని నాకేటీ ( నాకైతే ?? ) బాగా నేదు ( లేదు ?? )

  Please help!

 5. >>> “మావు మీతోటి ఉండవని తెగేసి సేప్పేస్తంటే ఈళేటోలే వదలవంతన్నారు. ఈ బావులు సేస్తన్న పని నాకేటీ బాగా నేదు” <<<
  ఇందులో అర్ధం కాని దేముంది .

  " మేం మీతో (కలసి) వుండం అని (తెలంగాణా వాళ్ళు ) తెగేసి చెప్తుంటే … వీల్లేంటి (సమైక్య ఆంధ్ర అందోళన చేసే వాళ్ళు తెలంగాణాను ) వదలం అంటున్నారు . ఈ బాబులు చేస్తున్న పని నాకేమి బాగా అనిపించడం లేదు ."

  జీవిత సత్యాన్ని , న్యాయాన్ని ఒక్క ముక్క లో చెప్పింది బామ్మ .

  ఇద్దరు కలసి వుంటే సమైక్యత . ఆ ఇద్దరిలో ఒకరు మీతో కలసి వునదలెం విదిపోతాం మొర్రో అంటుంటే – ఛత్ ససేమిరా వీల్లేదు మీరు మాతో చచ్చినట్టు కలసి ఉండాల్సిందే అనడం దౌర్జన్యం అవుతుందే తప్ప "సమైక్యత " ఎట్లా అవుతుంది ? అట్లా దౌర్జన్యం చేయడం న్యాయం ఎట్లా అవుతుంది? ఇది బామ్మ మాటల సారాంశం .

  బామ్మా నీకు పాదాభి వందననాలు .

 6. ఆ బామ్మ చాల చక్కగా చెప్పింది.ఆయనెవరో దేశం ఏమయి పోతుందో అని బాగా బాధ పడుతున్నాడు.దేశం అంటే ఒక్క అయన ఏనా?తెలంగాణా చరిత్ర
  చదువు నాయనా.అరె మీరు మమ్ములను గౌరవంగా బ్రతుక నివ్వడం లేదు మా బతుకు మేము బతుకుటాము అంటే మీరు లేకుంటే మేము ఎట్లా బతుకుడు అని తెలంగాణా ప్రజల కష్టార్జితం మా జన్మ హక్కు అనడం ఏమి ప్రజాస్వామిక విలువ అవుతుంది?సామాన్యుల సంగతి గాదు అసామాన్యుల
  మాట ఏందీ అంటున్నాడు.అయ్యా మేము సామాన్యులం .ఈ దేశం లో సామాన్యులు డెబ్బయ్ శాతం ఉన్నారు.కనుక ఈ దేశం సామాన్యుల రాజ్యం కావాలని సామాన్యులంతా కోరుకుంటున్నారు.మీలాంటి అసమాన్యుఅల అభిప్రాయాలు మా సామన్యుల పయిన రుద్దవద్దని ఆ బామ్మ చెప్పింది

 7. అప్రత్యెక తెలంగాణా enduku వద్దు,సమైక్య ఆంధ్ర ఎందుకు ముద్దు?
  ప్రి ఆక్యుపేడ్ మైండ్ తో రాజకీయ నాయకులు చెప్తున్నమాయ మాటలకు మోస పోయి చరిత్ర చదువకుండా కొందరు యువకులు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
  ఫసల్ అలీ కమిషన్ తెలంగాణా రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం లోకలుపాలని చెప్పలేదన్న సంగతిని దయజేసి చదువండి .ఆనాటి
  ఆంధ్ర నాయకుల ఒత్తిడి వలన ప్రధాని నెహ్రూ సూచనలతో కొన్ని షరతులతో కూడిన ఒప్పందాల మెరకు తెలంగాణను ఆంధ్ర రాష్ట్రం లో కలిపినారు.ఆ షరతులు అమలు పరచి తెలంగాణా ప్రజల భయాలు తొలగించ వలసిన బాధ్యతను ఆంధ్ర పాలకులు పాటించలేదు .సరికదా, అవకాశం ఉన్నచోతల్లా స్వార్థ పురితంగా ఉల్లంఘించారు .ఆంధ్ర పాలకులూ తెలంగాణా ప్రజకే చ లను మోసం చేస్తునరనే విషయాన్ని గమనించి ఇక మేము మీతో వేగలేము అని ఉద్యమాలకు దిగేదాకా వ్యవహరించారు .విశాలాంధ్ర ఏర్పడ్డ మరునాటినుండే ఒప్పందాల అమలు వాయిదా పడ్డ కారణంగా గత యాబై ఏండ్ల
  నుండి పోరాటాలు సాగుతూనే ఉనాయి.కొందరు అంటున్నట్టుగా కే సి ఆర్ కొసమో చెన్న రెడ్డి కోసమో ప్రజలు ప్రాణాలు ఇవ్వడం లేదు.

  సమైక్య ఆంధ్ర ను కోరుకునే వాళ్ళు ఎవరైనా జరిగిన పొరపాట్లను వెంటనే సరిదిద్ది ఇకముందు అలాంటి పొరపాట్లు అసలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని తెలంగానీయులకు విశ్వాసం కలిగే విధంగా వ్యవహరించకుండా అదే పని గా ప్రత్యెక
  తెలంగాణా వాదాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు .ఇట్లా అయితే ఎలా సమయిక్యంగా ఉండగలుగుతాం
  సంకుచితంగా,స్వార్తపురితంగా ఆలోచించే సమూహాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఆలోచింప జేస్తూ మానావీయ విలువలను
  పెంపొందించడానికి కృషి చేస్తున్న మేధావులు,మెరుగయిన సమాజం కోసం కలలుకంటున్నఈ టెలుగు రచయితలు
  తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ధర్మ సమ్మతం అని తెలుపుతూ స్కయ్ బాబా కు ఆంధ్ర జ్యోతి లో ఇంటర్వ్యు ఇచారు.
  అది వివిధ శీర్హిక లో ప్రచురింప బడింది.
  పాణి-కర్నూల్ ,తల్లవజ్జాల పతంజలి శాస్త్రి-రాజమండ్రి, పెద్దబోట్ల సుబ్బరామయ్య -గుంటూరు,అట్టాడ అప్పల నాయుడు-శ్రీకాకుళం,జి స చలం-విజయనగరం,వి వి న మూర్తి -తూర్పు గోదావరి,సిన్గానవేని నారాయణ-అనంతపురం,స్వామీ-అనంతపురం,పాపినేని శివశంకర్ -గుంటూరు అద్దెపల్లి రామ్మోహన్ రావు -తు -గోదావరి,మంచికంటి-ప్రకాశం ,వి ప్రతిమ-నెల్లూర్
  కాట్రగడ్డ దయానంద్ -ఒంగోలు వి ఆర్ రాసాని-చిత్తూర్ వీరంతా తెలంగాణా రాష్ట్రం న్యాయమే అని అన్నారు.దేశమంతా ముక్కలు అవుతుంది అన్నదానికి ముప్పల రంగనాయకమ్మ చాల చక్కగా
  తెలంగాణది ప్రత్యెక పరిస్తిస్తి అని వివరించారు.
  న్ని రాజకీయ పార్టీలు మేము తెలంగాణకు మద్దతు ఇస్తామని తీర్మానం చేసినట్లు కేంద్రానికి పంపితేనే కదా కేంద్రం తెలంగాణకు సై అన్నది .ఇప్పుడు అంతా మాత మారుస్తున్నారు.వాళ్ళంతా తెలంగాణ పైన ఆశ వదులుకొని రేపటి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్పోటి పడుతున్నారు.తమ న్యాయమైన
  హక్కుల కోసం పోరాడుతున్న తెలంగాణ పజలకు ప్రజాస్వామిక వాదులంతా మద్దతు ఇవ్వాలి.లేదంటే భవిష్యత్తు లో కేవలం భుజ బలం ,ధన బలమే రాజ్యమేలుతుం

 8. ఉత్తరాంధ్ర బామ్మ బాగానే చెప్పింది.

  ఎంతకాలం బలవంతపు కాపురం చేస్తారు?
  ఇవ్వాళ కె సి ఆర్, రేపు కె టి ఆర్ లేదా ఇంకొకరు.

  అయితే వాళ్ళ మనోభావాలను గౌరవించమంటున్న తెలంగాణా వాదులు
  గ్రేటర్ హైదరాబాద్ ప్రజల మనోభావాలను కూడా గౌరవించవలసిన అవసరం ఉంది.

 9. తెలివైన వాళ్ళు ఎక్కువైతే వచ్చే పరిస్థితి .సామాన్యులు అంటే ఆలోచనలని ఆచరణ లో పెట్టలేనివారందరూ .విడిపోతామని అంటున్నది ఎవరు ? సామాన్యులా ? ఆలోచన కల మేధావులా ? కలసి ఉండాలని అనటము స్వార్ధం కానప్పుడు ,విదిపోతామనదము ఎవరి
  స్వార్ధము ? ఎవరైనా విడి పోతాము అంటే ముందు వద్దంటారు .తరువాత గొడవలు లేకుండా విదిపోమ్మని పెద్దవాళ్ళు చెప్తారు . ఆలోచన కల మేధావులు ,వారి మెదళ్ళతో వచ్చిన చిక్కే ఇప్పుడు జరుగుతున్నది .పాకిస్తాన్ ,ఇండియా విడి పోకముందు ఒకే జాతి
  విడి పాయిన తరువాత వేర్వేరు గా చోస్తున్నది కూడా ఈ ఆలోచనలు కల వల్లే .సామాన్యుల
  స్వార్ధం వాడికో ,వాడి కుటుంబానికో లాభం ,కాని ఆలోచన కల మేధావులని అనుకునే వాళ్ళ స్వార్ధం సృష్టిస్తోన్న హింస ఇప్పుడు చూస్తున్నాం .అతి ఆలోచన కాకుండా సింపుల్
  గా బామ్మ చెప్పిందే కరెక్ట్ .
  నేనంతే

 10. శ్రీధర్ గారూ బామ్మ మాటల్లోని న్యాయం సంస్కారం వివేకం అర్ధం చేసుకోడానికి ఈ పాటి మాండలికం మీకు అడ్డు పడిందనుకోను.తెలంగాణా మాండలికం ఎలాంటి వివక్షకు గురయిందో గ్రహించగలిగిన మీరు అదే వివక్షని మరో వెనుకబాటుకు గురైన ప్రాంతపు మాండలికం మీద ప్రయోగించడం సబబేనా?ప్రభాకర్ గారూ బామ్మ మాటల్లోని అంతరార్ధాన్నిచక్కగా పట్టుకోగలిగారు.వీరగోని గారూ మీ ఆవేదన వాస్తవం

 11. *అయ్యా మేము సామాన్యులం .ఈ దేశం లో సామాన్యులు డెబ్బయ్ శాతం ఉన్నారు.కనుక ఈ దేశం సామాన్యుల రాజ్యం కావాలని సామాన్యులంతా కోరుకుంటున్నారు.*
  అయ్యా మీరు చెప్ప్పె సామాన్యులు విడి పోతామంట్టున్నది మరింత అభివ్రుద్ది చెందటానికి కాని సామాన్యం గా బతకటానికి కాదు. అలా సామాన్యంగ బతకటం ఇష్టం లేకనే మీరు వేరు పడుతామంట్టున్నరు. ఒక రాష్ట్రాన్ని విభజించటం అసమాన్యమైన కోరిక కాదా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s